ఈ వ్యాఖ్య ||బ్లాగాడిస్తా|| రవి గారి బ్లాగ్ లో ఇతరులు వెలిబుచ్చిన సందేహం మరియు.. ఒక చిన్న ముచ్చట గురించి. ఠపా కి విరుద్దమైన వ్యాఖ్య అవుతుందేమో అన్న అనుమానం తో.. వ్యాఖ్య నా బ్లాగ్ లోనే పోస్ట్ చేసుకుంటూ..
కమ్మర కట్ట ..అంటే .. జీడిబిళ్ళలు లాంటిందే..! బెల్లం బాగా ముదురు పాకం రానిచ్చి అందులో పుట్నాలు పప్పు (చెనా దాల్) ని బరకగా పట్టి అందులో కలిపి ఉండలు చుడతారు. అవి చాలా గట్టిగా ఉంటాయి. ఒక కమ్మర కట్ట ఇస్తే చాలు! రెండు గంటలు వరకు పిల్లలు ఏమి అడగరు. అలాంటి వంటకం అది. చాలా రుచిగా ఉంటుంది.
కోస్తా జిల్లాలలో జీడి ఉండలని నువ్వుపప్పు వేసి చేస్తే.. నెల్లూరు, రాయలసీమ ప్రాంతంలో పుట్నాల పప్పు,కొబ్బరి లతో ఎక్కువ చేస్తారు. కమ్మర కట్ట లో బెల్లం పాళ్ళు ఎక్కువ. ఎందుకో కమ్మర కట్ట చూడటానికి కాఫీ పొడి రంగులో ఉంటుంది. ముదురు పాకం కాబట్టి..అలా రంగు మారిపోతుంది.
రవి గారు ..మొన్ననే (సండే ) నేను అనంతపురం వచ్చాను. నీళ్ళు లేని పెన్నమ్మని చూసాను. పెన్నఅహోబిలం వెళ్లి అక్కడ తుంగభద్ర గలగలలు విని పులకించి పోయాను. చాలా బావుందండి.కొంత నచ్చనిది అపరిశుభ్రం కూడా. .
పెన్న అహోబిలం విశేషాలు గురించి మరో పోస్ట్ లో వ్రాస్తాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి