హాయ్ ఫ్రెండ్స్ !..
కీ బోర్డ్ పై టక టక లాడించి చాలా రోజులైంది. వ్రాసే మూడ్ లేక గతంలో వ్రాసినవి పోస్ట్ చేస్తూ వచ్చాను
ఎందుకో.. హఠాత్తుగా ఆలోచనలు స్తంభించి పోయాయి. రోజులు కూడా ఆనాసక్తంగా మారి పోయాయి. మీరు గమనించారో లేదో.. బ్లాగ్ లలో కూడా మంచి పోస్ట్స్ ,కామెంట్స్ తగ్గిపోయాయి. న్యూ ఇయర్ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది అనుకున్నాను అందరి సంగతి ఏమో కానీ .. నాకై నేనే నిరాశ గా ఉన్నాను.
గత సంవత్సరం తో పోలిస్తే .. ఈ సంవత్సరం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు భయం కల్గిస్తున్నాయి. ఆడపిల్లలకి భద్రత లేదు, ఈ దేశంలో మన ఉనికి ఏమిటి అని ఉలికిపడాల్సి వస్తుంది. డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచం.కాస్తంత మనసు లేదు కూసింత శాంతి లేదు. అంతా పరుగులాట.అలసి అలసి పోతూ..
జరుగుతున్న కొన్ని సంఘటనల పట్ల ఆలోచించడానికి కూడా మెదడు మొద్దు బారిపోయింది.
నాకైతే ఇప్పుడు ఎలా ఉంది అంటే.. పాట వినాలని లేదు,కవిత్వం చదవాలని లేదు.పూబంతుల చెంత గడపాలని లేదు.తెలిమంచులో తుమ్ముతూ అందమైన ముగ్గులు వేయాలని లేదు..వంట చేయడం మహా బోర్..తినడం..అంటే.. ఇంకా విరక్తి.
"ఈ బాధామయ గాధాలయ ప్రపంచం నుండి పారిపోయి.. అమ్మ ఒడిలో తలదాచుకుని ఆదమరచి నిదురపోవాలని ఉంది."
"బాల్యంలోకి పరుగులు తీసి.. అమాయకమైన మనసుతో..రంగు రంగుల పెన్సిళ్ల తో.. అస్పష్టమైన ఆలోచనలని బొమ్మలాగా గీసి చూసుకుంటూ.. సరిగ్గా రాలేదని కాగితాల పై అలగాలని ఉంది".
"తొణికిస లాడుతున్న చెరువులో దిగి హాయిగా జలకాలాడాలని ఉంది".
"వాగు ఒడ్డున పిచ్చిక గూళ్ళు కట్టుకుని హాయిగా ఆటలాడుకోవాలని ఉంది"
ఆరుబయట నులక మంచం పై పడుకుని నక్షత్రాలు లెక్కబెట్టాలని... ఎవరికీ వినబడకుండా చల్లని వెన్నెలని పంచె చంద్రుడితో.. ఊసులు చెప్పాలని ఉంది.
ఇవన్నీ తలబోస్తూ.. నేను ఇంకా చిన్న బొప్పినా ..అలా ఉండే అదృష్టం దక్కడానికి ..అనుకుంటూ.. నన్ను నేను చూసుకుందామని నిలువుటద్దం ముందు నిలబడ్డాను.
అద్దం ఎప్పుడూ..నిజమే చెపుతుంది. అక్కడక్కడ తెల్లబడుతున్న జుట్టు. 45 ఏళ్ళు నిండ బోతున్న నేను. మనసు చూస్తే బాల్యంలోకి పరుగులు తీస్తుంది.బాల్యం మరొకమారు కావాలంటుంది. చవిచూసిన ఈ అనుభవాల లోకం నుండి దూరంగా పారిపోవాలని అంటుంది.
నిజంగా అద్దం నిజమే చెపుతుంది కదా! మనమే అద్దం అబద్దం చెపుతుందని మనని మనం మోసం చేసుకుంటాం కదా! అందుకే అద్దానికి తెర కట్టేసి.. నన్ను నేను చూసుకోకుండా జాగ్రత్త పడి బయటకి వచ్చి .."గుండెల నిండా గాలి పీల్చుకున్నాను."
జీవించడం ఎలాగో.. ప్రతి శ్వాస కి జీవించడం ఎలాగో వెతుకుతున్నాను.! వెతుకు తున్నాను!!. వెతుకుతున్నాను.!!!
నాలో నన్నే వెతుకుతున్నాను.
రేపటికైనా దారి దొరుకుతుందని వెదుకుతున్నాను. ఈ వెదుకులాట ఆగేనా!?
(నన్ను నేను తరచి చూసుకునే కొన్ని సమయాలలో .. ఇలా..)

2 కామెంట్లు:
నిజం నిష్టురంగానే ఉంటుంది కదండీ! బాల్యంలోకి పరిగెడదాం, ఊహలలోనైనా.
"వనజవనమాలి" గారూ..
మీ వెదుకులాట ఫలించాలని,మీ చిన్ని చిన్ని ఆశలన్నీ తప్పకుండా తీరాలని కోరుకుంటున్నాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి