"సంస్కార్ " హిందీ సీరియల్ చూస్తున్నారా?
ఆ సీరియల్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక భారతీయ యువకుడు.. ఉద్యోగ రీత్యా అమెరికా కి వెళ్ళేటప్పుడు.. కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికే సన్నివేశాలు ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించిన దృశ్యాలు కంటతడి పెట్టించాయి. అలాంటి సన్నివేశాలలో నన్ను ,నా కొడుకు ని పోల్చి చూసుకున్నాను. బహుశా ఎవరికైనా అంతేనేమో కూడా!
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు,సున్నితమైన అనుబంధాలు,సంస్క్రతి-సంప్రదాయాలు అన్నీ ఎంతో ఉన్నతంగా దృశ్య మాలికలగా కదలిపోతుంటే.. మనసు కరిగి నీరైపోయింది.
అమెరికా చేరిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో ఎదురైన చేదు అనుభవాలు,పాస్పోర్ట్ , వర్క్ వీసా పోగొట్టుకుని అతను పడే అవస్థలు చూస్తుంటే.. మన బిడ్డలు ఇలాంటి అవస్థలు ఎదుర్కుంటే ..అన్న ఆలోచన వచ్చి అప్రయత్నంగా వణికిపోయాను..
వీలయితే ఈ సీరియల్ తప్పక చూడండి. colors చానల్ లో రాత్రి 09:00 to 09:30 సమయంలో ఈ సీరియల్ వస్తుంది. తిరిగి రాత్రి 12:00 to 12:30 వరకు వస్తుంది {IST )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి