ఈ పాట పరిచయానికి ముందు .. క్రిందటి పోస్ట్ "ఓ .. గీతం వెనుక " తర్వాత ఈ వివరణ. నచ్చిన పాట పరిచయం .
చాలా కాలం తర్వాత ఓ పాట నన్ను బ్లాగ్ లో ఓ పోస్ట్ వ్రాయించింది ఆ పాట ఎప్పుడూ వింటూ ఉంటాను . ఎందుకో ఈ రోజు ఆ పాట వింటూంటే .. చూస్తూంటే భావేద్వేగంతో కదిలిపోయాను . ప్రతి గీత రచన వెనుక ఆ కవి భావేద్వేగం ఉండకపోవచ్చు . ఆతను సాధారణంగానే వ్రాసి ఉండవచ్చును. కానీ తెరపై ఆ గీతం కథకి సంబంధించినదయి .. చూస్తున్న ప్రేక్షకుడిని కదిలిస్తుందన్నది నిజం . ఈ పాట చూస్తున్నప్పుడూ నేను అలాగే ఫీల్ అయ్యాను . కన్నులు చెమర్చాయి . పాటలో నటుడి నటన నభూతో న భవిష్యత్.
ఆ పాటకి ముందు సభని ఉద్దేశించి .. ఈ మాటలు ఉంటాయి . (అది ప్రసంగం కాదు అతని దృష్టిలో )
నేను ఒక నాయకుడు , రాజకీయవేత్త, సమాజ సేవకుడు ని కాదు ఇతరుల నుండి పేరు పొందటం కోసం ఈ టికెట్ కొనడడానికి. నాకు నా ప్రతిభా పాటవాలని ,నా గొప్పలు మీ మీద రుద్దబడ తాయని, చప్పట్లతో స్వాగతిస్తారని .పూల మాలతో అలంకరిస్తారని తెలిస్తే బహుశా నేనెప్పటికీ ఇక్కడికి వచ్చేవాడిని కాదు .
ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కడుపు నింపుతాడు అంటే అతడు తన భాధ్యత నిలబెట్టు కుంటున్నట్టు. అది ఇతరులపై దయ చూపడం కాదు. నేను ఈ (అనాధ పిల్లలకి) నిరాశ్రయులకి కొంచెం ఇచ్చానంటే అది నా వారి కోసం, నా సోదరుల కోసం ఇచ్చినట్లు. ఎందుకంటే నేను కూడా వీరిలాగే ఒక నిరాశ్రయుడినే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ఒడి లేదు , నాన్న నీడ లేదు ,పుట్ పాత్ ఒడి, ఆకలి పేదరికమే తోడు నాకు.
నా ఒంటరితనం , తన్నులు ,సమాజం నుండి చీత్కారాలు , ప్రజల తిట్లు . ఇలాంటి స్థితిలో నా బాధని పంచుకునే వారు ఒకరు దొరికారు . వారికి నా పరిస్థితి మీద జాలి కల్గింది . ప్రేమతో వారు నా తలపై చేయి వేసారు . నేను ఏడుస్తూ ఉండిపోయాను. వారు పాట పాడి నా గాయ పడిన హృదయానికి మందు పూసారు . ఆ (ఓదార్పు ) మందు ప్రభావం వల్ల బతికి ఉన్నాను . లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని . ఆ పాట .. ఆ పాట గాయపడిన నా హృదయాంతరాలలో ఇంకా వినిపిస్తూనే ఉంది . మరచి పోలేదు నేను.
నేనెప్పుడూ ఆ పాటని గల్లీలోనూ , చౌరస్తాలలోనూ పాడనూ లేదు . కానీ అప్పుడప్పుడూ నేను పోగొట్టుకున్న, నా బాధని పంచుకున్న వారు గుర్తు వచ్చినప్పుడు , జీవితం పట్ల విరక్తి కల్గినప్పుడూ అప్పుడప్పుడూ (కూనిరాగం ) పాడు కుంటాను . ఈ రోజు నేను అదే పాట మీరు అనుమతి ఇ చ్చినట్లయితే . మీ ముందు.ఉంచుతాను .. .
మళ్ళీ ఇక్కడ విషయం ఆపేసి బ్లాగర్ ని మీ ముందుకు వచ్చేసానండోయ్! ఇక్కడి దాకా వ్రాశానా ! ఇక్కడ ఒక చిలిపి ఆలోచన వచ్చింది . ఈ సంభాషణ ఏ పాటకి ముందు ఉందొ ఏ చిత్రం లో ఉందొ .. ఊహించండి ..
ఇది ఒక హిందీ చిత్రంలో పాట . (క్లూ .. ఇంత వరకే )
*********************
రెండో భాగంగా పాట పరిచయం
నా కెంతో ఇష్టమైన "muqaddar ka sikandar " చిత్రంలో ఓ .సాతిరే పాట
కళ్యాణ్ జీ - ఆనంద్ జీ స్వరకల్పన అమితాబ్ నటన ..పోటాపోటీగా ఉంటాయి . పదే పదే వెంటాడక మానదు
ఈ పాట స్వరకల్పన పై ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా ఉంది .
"నజరత్ పతే ఆలీఖాన్ " దాతా పియా లిల్లహ్ కరమ్ ఆజ్ కర్దే .. ట్యూన్ ఆధారంగా స్వరకల్పన చేసారని ..
అనంత సంగీతసృష్టిలో అనేకానేక స్వరాలూ కలగాపులగం కాకమానవు. కొంతమంది సృజనని అనుసృజని చేసి అంతకన్నా మంచి సంగీతాన్ని అందించిన తీరు జనులకి హర్షణీయమే కదా, ఎందుకు ఈ వివాదాలు అనిపించింది
ఏది ఏమైనా పండిత పామరులని రంజింపజేసే సంగీతంకి అందరం బానిసలమే కదా !
ఈ పాట వింటున్నప్పుడు .. కిషోర్ కుమార్ గళం భావాలు ఒలికించిన తీరు కి " ఫిదా " అయిపోయాను
అంజాన్ గీత రచన గొప్పదనం తెలియాలంటే మూలమైన హిందీ లోనే ఆ పాట సాహిత్యాన్ని ఆస్వాదించడం మంచిది . అంత మధురం గా ఉంటుంది .
ఇక ఈ పాట సాహిత్యం ని ఆంద్రీకరించే ప్రయత్నం ఇది ..
ఓ సహచరీ (చెలియా)… నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?
పూవుల్లో, మొగ్గల్లో, స్వప్నవీధుల్లో..
నీవు లేకుండా ఎక్కడా ఏమీ లేదు
నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?
ఓ సహచరీ (చెలియా)… నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?
ప్రతి గుండె చప్పుడు లో నీ దాహం ఉంది
ప్రతి శ్వాసలో నీ పరిమళమే నిండి ఉంది
ఈ భువి నుండి ఆ ఆకాశం వరకు
నా చూపుల్లో (వీక్షణ లో ) నీవు మాత్రమే ఉన్నావు
ఈ ప్రేమ ( పగిలిపోకూడదు) భగ్నమవరాదు
నువ్వు నా పై అలగ కూడదు
ఎప్పటికీ మన కలయిక విడిపోకూడదు
నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా
ఓ సహచరీ (చెలియా)… నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?.
నీవు లేని ఎన్నో రాత్రులు వైరాగ్యంతోనూ
నీవు లేని పగటి సమయాలలో సంచారినై ,
నా జీవితం మండుతున్న కొలిమి
నా కలలన్నీ కృశించిపోతున్నాయి
నీవు లేని నా జీవితం, నేను లేని నీ జీవితం,
జీవితమే కాదు
నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?.
ఓ సహచరీ (చెలియా)…నీవు లేకుండా ఈ జీవించడం జీవించడమేనా?.
ओ साथी रे -
Movie/Album: मुक़द्दर का सिकंदर (1978)
Music By: कल्याणजी आनंदजी
Lyrics By: अनजान
Performed By: किशोर कुमार
ओ साथी रे, तेरे बिना भी क्या जीना
फूलों में कलियों में, सपनों की गलियों में
तेरे बिना कुछ कहीं ना
तेरे बिना भी क्या जीना
जाने कैसे अनजाने ही, आन बसा कोई प्यासे मन में
अपना सब कुछ खो बैठे हैं, पागल मन के पागलपन में
दिल के अफसाने, मैं जानूँ तू जाने, और ये जाने कोई ना
तेरे बिना भी क्या जीना...
हर धड़कन में प्यास है तेरी, साँसों में तेरी खुश्बू है
इस धरती से उस अम्बर तक, मेरी नज़र में तू ही तू है
प्यार ये टूटे ना तू मुझसे रूठे ना, साथ ये छूटे कभी ना
तेरे बिना भी क्या जीना...
तुझ बिन जोगन मेरी रातें, तुझ बिन मेरे दिन बंजारे
मेरा जीवन जलती धूनी, बुझे-बुझे मेरे सपने सारे
तेरे बिना मेरी, मेरे बिना तेरी, ये जिंदगी जिंदगी ना
तेरे बिना भी क्या जीना...