ఈ వేళ మనసేమీ బాగోలేదు.. త్వరత్వరగా రోజుని ముందుకు జరిపేయ్..
అయ్యో ! అప్పుడే ..ఇంత సమయం గడిచిపోయిందా..కాస్త నెమ్మదిగా వెళ్ళకూడదా !
కాస్త కాలాన్ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే బాగుండును,దాచుకుని వాడుకోవచ్చు
అనుకునే నాలాంటి అమాయక మానవమాతృలకి ..
చిన్నదైన చిన్నమెదడు చెప్పిన విధం ఇట్టిది .. కావున ఒక్క క్షణమాగి చదివి తరించండని విన్నపాలు.
పరుగులే పరుగులు ..
కాలం నీ యింటి పాడి ఆవుకాదు
గుదికొయ్యకి కట్టేసుకోను
కాలం నీవెక్కి పరుగుతీసే అశ్వం కాదు
కళ్ళెం వేయయటకు
వలవేసి పట్టుటకు కాలమేమి చేప కాదు
కాలాన్ని బంధించుట సాధ్యమా .........
సూర్యచంద్రుల రథమునెక్కి
కాలంతో పరుగులు దీయటం తప్ప.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి