భార్య అయిన పాపానికి బిడ్డలైన పాపానికి ఒక మగవాడి లైంగిక,వికృత,ద్రోహ,నేర,మోస ప్రవృత్తులకి భార్య,పిల్లలు తలదించుకోవలసి రావడం, లేదా "అయ్యో ,పాపం " అన్న ఇతరుల జాలి,సానుభూతిని భరించాల్సి రావడం నిజంగా విషాదకరం. లోకానికి కనబడకుండా దాక్కోవడం మరింత నరకం. ఇటీవల కాలంలో కొందరు రచయితల దిగజారుడు తనానికి ఆ రచయితలే పూర్తిగా భాధ్యులు అయినప్పటికీ సంబంధం ఉన్నా లేకపోయినా భార్యా పిల్లలుగా వారి దిగాజారుడుతనాన్ని మోసిన (మోస్తున్న) వారిని పలకరించాలన్నా, ఇంతకుముందులా వారితో అలవాటైన సంభాషణ నెరపాలన్నాజంకు,సంకోచంతో సతమవుతున్నాను.
ఎక్కడుంది లోపం? యుగయుగాల బానిసత్వంలోనా ? వ్యక్తిని వ్యక్తిగా గుర్తించే అవకాశం లేకనా ..!? ఈ వారసత్వపు సంకెళ్ళు ఎన్నాళ్ళు !?
అమ్మలూ,బిడ్డలూ ..అందుకే ఫలానా వారి భార్య నని, బిడ్డలలని పరిచయం చేసుకుని మురిసిపోకండి. వారి గొప్పలని అపాందించుకున్నప్పుడూ,వారి కీర్తి కిరీటాలని మోసినట్లూ,వారి వారి దిగజారుడు తనాన్ని మోయాల్సిరావడం ఆత్మహత్యా సదృశ్యమే కదా మరి. ఉత్థాన-పతనాల బాధలేల మనకి !?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి