మొక్కలండీ మొక్కలు
స్నేహ మందారంతో
నది వొడ్డున వేచి చూస్తున్నానా
నువ్వు నలుగురిని పోగేసుకుని
నలుపు గురమెక్కి దండయాత్రకు దౌడు తీసావు.
నీ వొరలో ద్వేషమనే కరవాలం వున్నంతవరకూ
దాని పిడిపై నీ పిడికిలి పదేపదే బిగుసుకుంటుంది.
దాని పిడిపై నీ పిడికిలి పదేపదే బిగుసుకుంటుంది.
ప్రేమ విత్తనాలు వెదజల్లని భూమి
ఎడారి వనాలై విస్తరిల్లుతుంటుంది.
ఇసుక తుఫాను చుట్టేయక ముందే
ఒయాసిస్ లకై వెతుక్కోక ముందే
పాతుకుపోతున్న పగను పక్కన బెట్టి
ఒయాసిస్ లకై వెతుక్కోక ముందే
పాతుకుపోతున్న పగను పక్కన బెట్టి
కాసిని ఖర్జూరపు,అంజూరపు మొక్కలైనా
నాటుకుందాం రా...
కొన్నాళ్ళకి మన పిల్లల పిల్లలకైనా
తీయని ఫలాలు దక్కుతాయి.
నమ్మకంగా చెపుతున్నా..
నగుమాటు మాటలనుకోకు మిత్రమా!
తీయని ఫలాలు దక్కుతాయి.
నమ్మకంగా చెపుతున్నా..
నగుమాటు మాటలనుకోకు మిత్రమా!
Pic Courtesy Pinterest
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి