26, జనవరి 2019, శనివారం

చిన్న కథ


పిచ్చోళ్ళు  -వనజ తాతినేని

"చరిత్రను తవ్వుకుని తరచిచూసుకుని ముందేసుకుని యిప్పుడేమి చేద్దామని " చిరాకు పడుతుంది ఆమె.
"అందరూ ఆహా, అలాగా, ఎంత అన్యాయం అంటుంటే నువ్వు ముఖం చిట్లిస్తావెందుకు?నలుగురితో నారాయణ అనక. నీకు శత్రువులు పెరుగుతున్నారు జాగ్రత్త" హెచ్చరిస్తారు సన్నిహితులు.
కొన్నాళ్ళ తర్వాత..
"నా లోపలి శత్రువుతో పోరాడటానికే సమయం చాలడం లేదు. అందుకే అపుడపుడూ బయట శత్రువులను విపరీతంగా ప్రేమిస్తుంటా. ప్రేమిస్తే ప్రశాంతంగా వుంటారు తెలుసా " అంది ఆమె జుట్టు పీక్కుంటూ
"నటించడం పాత్రల వంతు. జీవించడం మనుషుల వంతు. అదివరకటిలా నీలాగే నువ్వుండు గుర్తు పట్టడానికి వీలుగా" అన్నారు భయంగా ఆమెని ఆ స్థితిలో చూస్తున్న సన్నిహితులు
ఆమె తన చుట్టూ జుట్టు పీక్కుంటున్న వాళ్ళకు చెపుతుంది "పాపం పిచ్చోళ్ళు వాళ్ళు" అని. తర్వాత వెక్కి వెక్కి యేడ్చింది.

కామెంట్‌లు లేవు: