" తల్లి " ఎలా ఉంటుందో ఏడు దశాబ్ధాలకు పూర్వం వ్రాసిన కథను చదివి మీకు పరిచయం చేయబోయే ముందు నా మాట. మీరు మంచి బిడ్డలైతే మీకు ఇది వర్తించదు. ఎవరికీ వర్తించకుండా వుండాలని నా ఆశ కూడా.
ఆథునిక కాలంలో కన్నవాళ్ళను కూడా కంటినిండా చూసుకునే సమయం డబ్బు రెండూ ఖర్చు పెట్టడానికి సముఖంగా లేరు. యాంత్రికమవుతున్న జీవనవిధానంలో చుట్టపు చూపుగా అయినా ఓ రోజును ఖర్చు పెట్టగల్గినపుడు ఆ తల్లిదండ్రులు యెంత సంతోషిస్తారో అన్నది మనలో ప్రతి ఒక్కరికీ అనుభవమే కదా !
అయితే మనుషులలో సున్నితత్వం చచ్చిపోతుంది. వ్యక్తిగత అవసరాలు ఆనందాల వేటలో పడి ఇంకొకరికి కొన్ని నిమిషాల సమయం కూడా కేటాయించలేని స్వార్ధపరులైపోతున్నారు. కన్నవాళ్ళు మాత్రం కడుపు తీపితో బిడ్డల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా పోగుట్టుకుంటున్నారు. అనేక వృద్దాశ్రమాలు వారికి కేరాఫ్ అడ్రెస్ గా మిగులుతున్నాయి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పే మాటలు చెవిలో శంఖం పెట్టి చెప్పినా మరుక్షణంలో ఇంకో చెవిలోనుండి వదిలేస్తున్నారు. చాలా విషయాలు చెప్పడం కంటే బలంగా నాటుకునేటట్లు చూపించడం, చదివించడం ద్వారా మనుషుల్లో కనీస ఆలోచన కల్గించవచ్చని నాకనిపిస్తూ ఉంటుంది. హృదయానుగతమైన సంస్కారం లేనివారికి చదవడం మూలంగా సాహిత్య సంస్కారం అబ్బుతుంది కాబట్టి.. కొంచెం ఓపిక చేసుకుని .. ఈ పోస్ట్ వ్రాస్తూ ఈ ..కథను పరిచయం చేస్తున్నాను.
ఉర్దూ కథ ఇది ఇది. కథ పేరు "తల్లి " రచయిత రుకైయ్యా రీహానా. 1946 లో ఒక సంకలనంలో మొదటి ముద్రణ వచ్చింది. అనువాదం: వేమూరి ఆంజనేయశర్మ
అయితే నేను పరిచయం చేస్తున్న కథలో అతుకు బొతుకు జీవితంలో తల్లిని తాము నివసించే నగరానికి తీసుకువెళ్ళలేక తల్లిని చూడటానికి రాలేక ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఒక కొడుకు హఠాత్తుగా ఒక రోజు తల్లిని చూడటానికి వెళతాడు. తల్లి అక్కడ ఎలాంటి స్థితిలో ఉంటుంది. పండగపూట వెళ్లిన అతనికి ఎలాంటి విందు భోజనం వడ్డిస్తుంది.మూట విప్పి తాను దాచిన కానుకలను భద్రంగా కొడుకుకి అందించి తృప్తి పడి తెల్లవారేసరికి .. ఏమవుతుంది ?
కథ చదవండి.. తల్లి ఈ లింక్ లో
pic courtesy :Google Pics
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి