11, మార్చి 2019, సోమవారం

అభ్యుదయ భావాలు

అభ్యుదయంగా ఆలోచించడం కొందరికే పరిమితమా యేమిటి? ప్రపంచంలో అభ్యుదయంగా ఆలోచించేవారే మనుషులా? ప్రశ్నించడం చేతకాని అసహాయులలోనూ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వ్యాపారులలోనూ.. అభ్యుదయ భావాలుంటాయి. మేథావితనం ప్రదర్శిస్తూ మేమే అభ్యుదయ భావాలు కలవాళ్ళం అని అనుకుంటే వీళ్ళ అహాలని తృప్తి పరచడానికి తతిమావాళ్ళందరూ వీళ్ళు అన్నదానికంతటికీ గొర్రెల్లా తలవూపాల్సిన అవసరంలేదు. ఎవరి సొంత అభిప్రాయం వారికి వుంటుంది. ఎవరి భావప్రకటనా స్వేచ్ఛ వారికి వుంటుంది. ఎవరి రాజకీయచైతన్యం వారికి ఉంటుంది. 


నేనసలు కమ్యూనిస్ట్ ని కాదు. నా ఆలోచనలలో ఆ ఛాయలు గోచరిస్తే మాములు మనిషిగా నాకు కల్గిన భావాలే తప్ప సమాజంలో సంచరించడం వల్ల నాకు కల్గిన అనుభవాల వల్ల స్పందించడం తప్ప నేను ఏ ప్రత్యేక సాహిత్యం చదువుకోలేదు. శిక్షణా తరగతులకు హాజరై నేర్చుకున్నది కాదు. నా దృష్టికోణంతో నా పరిశీలనతో, నా దృక్ఫదాన్ని వ్యక్తీకరించడమే నా రాతలు. 


ముఖ్యంగా చెప్పేదేమిటంటే నేను కమ్యూనిస్ట్ ని కాను. మతతత్వ పార్టీలకు వత్తాసు పలికింది లేదు. కులమత ద్వేషాలు నాకు లేవు. అభిప్రాయ భేధాలు తప్ప నాకు కులమత ద్వేషాలు లేవు. అరసం విరసం ప్రరవే పివో డబ్ల్యూ రచయితల సంఘాలు గ్రూప్ లు ఎందులోనూ నేను ఇమడను. నా కథలు ఏ పత్రికలలో అయినా రావచ్చు ప్రచురణకు అర్హత కల్గి ఉంటె. నేను కమ్యూనిస్ట్ ను అని . ఆమె రాతలు అలా ఉంటాయి కానీ వాళ్ళ అబ్బాయి విదేశాల్లో ఉంటాడు అనే వ్యాఖ్యలు వద్దు.మీ మీ భావజాలాలకి చీదర పుట్టి అందుకే నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. :( :(

ఇంకొక విషయం ఏమిటంటే కమ్యూనిజం గురించి వ్యతిరేకత తెల్పడం వారిని విమర్శించడం కూడా నా అభిమతం కాదు. వారంటే కూడా నాకెలాంటి ప్రత్యేక అభిమానం కానీ ద్వేషం కానీ వ్యతిరేకత కానీ లేవు. మనిషి తనం నేను నా చిరునామా అంతే!

4 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

అసలు కమ్యూనిస్ట్ అంటే అర్ధం ఏవిటండీ ?

రాజకీయ ప్రముఖులను చూసి కమ్యూనిస్టులను ద్వేషిస్తున్నారు కానీ ఇపుడు ఇంటర్ నెట్ వాడుతున్నవారంతా కమ్యూనిష్టులే !
సోషల్ మీడియా శ్రామిక వర్గం.

కేసీఆర్, రాం గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నియంతలు.వీళ్ళు చెప్పింది మనం వినాలి కానీ మనం చెప్పేది వారు వినరు.

మిగిలినవారు ప్రజాస్వామ్యవాదులు.

700 వందల కోట్లమందిలో సగం కమ్యూనిష్టులే. ఈ కమ్యూనిష్టులలో శ్రమ మాత్రమే చేసేవారు కొందరైతే శ్రమని అమ్ముకుని డబ్బు సంపాదించేవారు కొందరు. మిమ్మల్ని ఏ కేటగిరిలో వేసారో ?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నీహారిక గారూ .. అవును ఇప్పటి రాజకీయనాయకులను చూసి కమ్యూనిస్టులను ద్వేషిస్తున్నాను. కమ్యూనిజం అంటే ఇంకా నేను బాగా అర్ధం చేసుకోగల్గాలి. నేను శ్రామిక వర్గం వైపుకి చెందినదాన్నే. నాకుటుంబం వ్యవసాయ నేపథ్యం. ఆర్ధిక నష్టాల తర్వాత భూములు అమ్ముకున్నాం.అటుపిమ్మట శ్రామికులతో కలిసి సంపద సృష్టిస్తూ వారూ నేను కూడా నేను జీవనోపాధి పొందాము. ఇప్పుడైతే మా అబ్బాయి తన నైపుణ్యాన్ని అమ్ముకుని ఆ వేతనంతో నన్ను పోషిస్తున్నాడు.నన్ను వ్యాఖ్యానించినారు నా రచనలను దృష్టిలో పెట్టుకుని. నేను అభ్యుదయవాదిని అనిపించుకోవాలంటే నా కొడుకు ఈ దేశంలోనే శ్రమ పడుతూ ఉంటే అప్పుడు నేను అభ్యుదయరచనలు చేసే అర్హత వస్తుందని వాళ్ళ ఉవాచ. శ్రమ దోపిడీ ఏ రంగంలోనైనా ఉందండీ. నా కుటుంబ నేపథ్యంగా వ్యవసాయ రంగంలో కూడా శ్రమ దోపిడీ వుంది. నేను ఒక కథ రాసాను. "కాళ్ళ చెప్పు కరుస్తాది" అని. నేను వాస్తవాలను ఎప్పుడూ కప్పిపుచ్చలేదు. నేల విడిచి సాము చేయను.వారికి నన్ను విమర్శించడానికి ఒక కారణం కావాలి అంతే!కమ్యూనిజం ప్రజలకు మంచి చేస్తుందంటే ప్రపంచమంతా కమ్యూనిస్టులు ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి కదా అంటాను నేను. మీ స్పందనకు ధన్యవాదాలు.

Zilebi చెప్పారు...నేను మనిషినర్రా క
మ్యూనిస్టును కాను! పొండ్ర ముప్పొద్దుల వి
న్నాణుల మటంచు తిరిగే
జానా బెత్తెడడిబండ జనులారా సీ !

జిలేబి

నీహారిక చెప్పారు...

>>>>కమ్యూనిజం ప్రజలకు మంచి చేస్తుందంటే ప్రపంచమంతా కమ్యూనిస్టులు ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి కదా ?>>>>

విశ్వనాధ్ వారి సినిమాలు హిట్ అవ్వలేదు అంటే విఫలమయినట్లు కాదు ఆయన చెప్పేది ప్రజలకు ఎక్కలేదు అని అర్ధం. కమ్యూనిజం గురించి ఒక బిల్ గేట్ చెప్పారనుకోండి అందరూ ఆలోచిస్తారు. నీహారిక చెపితే ఎవరు ఆలోచిస్తారు ? అందరం శ్రమ చేద్దాం... అందరం పంచుకుందాం అని అంటే జనానికి నచ్చదు. ఒకడు బద్దకస్తుడు ఉంటాడు, ఒకడు మేధావి ఉంటాడు, ఇద్దరూ కలిసి శ్రమ చేస్తే ఇద్దరూ కలిసి పంచుకుందాం అంటే గొడవలయిపోతాయి. బడుగువర్గాలెపుడూ శ్రమ చేయాలి మేధావి ఎపుడూ డబ్బు తీసుకోవాలి అనేది ప్రస్థుత వివాదానికి కారణం.శ్రమ చేసేవాడు ఆలోచించలేడు, ఆలోచించేవాడు శ్రమ చేయలేడు. శ్రమని దోచుకుంటున్నారు కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ శ్రామికులెవరూ ఏకం కాలేదు మరి ! కానీ శ్రామికుడు లేకుండా మేధావి బ్రతకలేడు, మేధావి లేకుండా శ్రామికుడికి ఉపాధి లేదు. ఎవరి వేతనం వారే నిర్ణయించుకోవాలి. శ్రామికుడికి డిమాండ్ పెరిగే రోజులు వచ్చేసాయి. శ్రమ అనేది ఇపుడు విశ్వవ్యాప్తమయిపోయింది. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వలసలు వెళ్ళారు వెళుతున్నారు. వలసవెళ్ళినవారిని హేళన చేయవలసిన అవసరమూ లేదు. ఇక్కడ ఉన్నవారిని తక్కువగా చూడనవసరమూ లేదు. ఎక్కడికి పోయినా గోరింక గూటికి చేరకుండా ఉండదు కదా ?

ఏ ఇజం లేకుండా అందరూ కలిసి పనిచేయడమే కమ్యూనిజం !