27, ఆగస్టు 2022, శనివారం

ఈస్తటిక్ సెన్స్



 “ఈస్తటిక్ సెన్స్” చేతిలోకి తీసుకున్నాను. Pre Order పంపిన వారికి  24 మందికి స్వయంగా DTDC ద్వారా కొరియర్ చేసాను. ఉత్సాహంగా వుంది. ఆవిష్కరణ జరగకుండానే.. Order పెట్టిన వారికి పుస్తకాలు పంపడం. 

29 వరకూ ఈ పని చేయగలను. 30 th న USA లో అట్లాంటా కి ప్రయాణం.t

ప్రధమ పాఠకురాలు “అత్తమ్మ” 😍🙏

ఈస్తటిక్ సెన్స్  (అముద్రిత కథలు మరికొన్ని)

పేజీలు : 232

వెల: Rs/240

logili.com   మరియు హైదరాబాద్ ‘నవోదయ’ లో లభ్యం


#AstheticSense  #వనజతాతినేని #vanajatatineni


 



23, ఆగస్టు 2022, మంగళవారం

కొత్త పుస్తకం ముఖ చిత్రం








 “ఈస్తటిక్ సెన్స్” అనేది ఈ కథాసంపుటిలో ఒక కథ కు శీర్షిక మాత్రమే కాదు కథా సంపుటి పతాక శీర్షిక  మరియు కథలన్నింటికి గల విశేషణం అని నా భావన.

సౌందర్య భావం మనకు ఏది అందంగా ఉంటుందో తెలియజేసినట్లుగా, మనిషి లోని నైతిక భావం మంచి చెడులను విచక్షణా జ్ఞానంతో  గ్రహించి  పదుగురిలో మెలగడమూ, మనిషిగా మనుగడ సాగించడమే “ఈస్తటిక్ సెన్స్”

కథ ను అల్లడం కథ చెప్పడం అనేది ఒక కళ. 

ఈ కథల సౌందర్యం నాణ్యత వాటి ఆకృతి లోకి వొంపడానికి సాదృశ్యంగా మలచడానికి  నా శాయశక్తులా ప్రయత్నించాను.కొన్ని విన్నవి కొన్ని కన్నవి. కొన్ని సత్యాల్లా అనిపించే కల్పనలూ కల్పనల్లా భావించే సత్యాలు, కొన్ని ఊహలు మరికొన్ని కలలు. అన్నీ కలిపి యీ కథలు. ఈ అక్షర ప్రవాహంలో యేవి ఆల్చిప్పలు ఆణిముత్యాలు అన్నది గుర్తించగల్గినది పాఠకులే! 

నేను యీ అముద్రిత కథల ప్రచురణ గురించి నా ఆలోచనను పంచుకొన్న వెంటనే స్పందించిన 14 మంది సహ రచయితలకు వారి విశ్లేషణ కూ  గౌరవ అభివాదములు హృదయపూర్వక ధన్యవాదాలు.

పుస్తకం కొఱకు సంప్రదించండి రచయిత ను. 

    - వనజ తాతినేని. 


 ఈ చిత్ర రూప కల్పన: మాగంటి వంశీ . వారికి ధన్యవాదాలు.🙏


19, ఆగస్టు 2022, శుక్రవారం

కొత్త కథల పుస్తకం




కొత్త కథా సంపుటి తేవాలన్న ఆలోచన రెండేళ్ళుగా వుంది. అయితే… అముద్రిత కథల పుస్తకమైతే  యెలా వుంటుందని ఆలోచన రావడంతో ఆ ప్రయత్నం చేసాను. 

“ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటిలో పది అముద్రిత కథలు ఒకటి వెబ్ పత్రికల్లోను ఒకటి ప్రింట్ లోను రెండు కథలు ఫేస్ బుక్ లో పాక్షికంగానూ ప్రచురించిన కథలు. 

 ఒక రచయిత కథకు మరొక రచయిత సమీక్ష/విమర్శ/ విశ్లేషణ రాస్తే ఎలా వుంటుంది!? అన్న ఆలోచన కూడా వచ్చింది. 

ఆలోచన వచ్చినదే తడవుగా సహ రచయితలతో  నా ఆలోచనను పంచుకున్నాను. అందరూ “మంచి ప్రయోగం!! తప్పకుండా పుస్తకం తీసుకొని రండి ” అని ప్రోత్సహించారు.

“ఈస్తటిక్ సెన్స్”  కథాసంపుటి లోని ఒక్కొక్క కథకు ఒక్కో సహరచయిత యొక్క సమీక్ష/విమర్శ/ విశ్లేషణ రాసి ఇచ్చారు. .

“ఈస్తటిక్ సెన్స్”

అముద్రిత కథలు మరికొన్ని

ముందుమాట: ఎస్. నారాయణ స్వామి. (కొత్తపాళీ)

కథలను విశ్లేషించిన సహ రచయితలు… 

ఈస్తటిక్ సెన్స్ - Dr. గీతాంజలి భారతి

ఊహల మడుగు - Dr. శైలజ కాళ్ళకూరి

వాతాపి జీర్ణం - పద్మజ సూరపనేని

ఋణ బంధాలు - ఆర్.దమయంతి 

విముక్తం - పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి

ప్రేమే నేరమౌనా - రాధ మండువ

పైడి బొమ్మ - శశికళ ఓలేటి

చిట్టిగుండె - ఎమ్ ఆర్ అరుణ కుమారి

దృశ్య భూతం - వారణాసి నాగలక్ష్మి

కోకిల తల్లి - శాంతి ప్రబోధ వల్లూరి పల్లి

రెండు లక్షలు - శ్రీదేవి సోమంచి

కుబుసం- అంజని యలమంచిలి

ఔనా! - జ్వలిత దెంచనాల

చెరగని గీత - లక్ష్మి రాయవరపు

 ప్రస్తుతం ప్రచురణ దశలో వుంది. ISBN కూడా వుంది.  సెప్టెంబర్ 1వ తేదీ..2022 న విడుదల.  



- ధన్యవాదాలతో.. వనజ తాతినేని. 



8, ఆగస్టు 2022, సోమవారం

రాలుగాయి జీవితం

 చెట్టు కొమ్మన ఊగుతున్న పసి పిట్టను 

రాలి పడుతున్న ఆకు జాగ్రత్తని మందలించింది

పట్టించుకోకపోయినా విననట్టు నటించినా


రుచి మరిగిన ఏకాంతం

మనుషుల సవ్వడిని ఓర్వలేకపోతుంది జీవితానందాన్ని

నిశ్శబ్దంగా అనుభవించాలని.


బుద్ది మనసు గొడవ పడుతుంటాయి

కాల దేవత మొట్టికాయ వేస్తున్నా. 

అది మనిషికి వినోదం విలాసం 


అంతరంగమంతా ఆరని ఆవేదన

గాలిలో కనిపించని వంతెన అనుబంధాలు

మబ్బుల్లా రూపం మార్చుకుంటూ..


అహం గాయపరుస్తుంది గౌరవం భంగటిల్లుతుంది

కోట గోడలు అగడ్తలు చుట్టూరా, 

 జొరబడ లేని మనిషి తనం నేస్తం


సమాధానం చేజిక్కించుకున్న తరుణానికి

కొత్త ప్రశ్న మొలకెత్తుతుంది. ఒక స్థితి నుండి మరొక స్థితికి 

జీవితపు బాటలో 


అనుభవ జ్ఞానం యిచ్చిన ఆనందాన్నో దుఃఖాన్నో వొంపేసి

పోవడం మినహా యేమి చేయగలం? 

రానిదంతా జీర్ణమైతే చాలును


దశల వారీగా  పలకరించిపోయే నేస్తాలు రోగాలు

అవస్థ శరీరానిది  యాతన జీవితేచ్చది

కాఠిన్యం లోకానిది దయ సమవర్తి ది . 


అంతా ప్రశాంతం ఉన్నది లేనట్టు

లేనిదంతా అంతకు ముందు ఉన్నట్టు తర్వాత లేనట్టు 

అమ్మ గర్భంలో శిశువులా


లిప్తపాటు లో  జనన మరణ వలయాలు

ప్రాణికి నిత్య నూతనాలు నర్తనాలూ పరిధి లేని నటన

రంగస్థలంపై రాలుగాయి జీవితం.