29, అక్టోబర్ 2024, మంగళవారం

ఇనబింబం చేతికందేలా

 అరె..రే… వచ్చేసినావా సామీ.. 

ఇప్పుడు దాకా యెదురుచూసినా.. ఇంకా రాలేదేమిటబ్బా.. అని. 

పొంగుమాలిన పనులేవో చెయ్యక తప్పదు కనుక.. వాట్సాప్ లో తలదూర్చినా. 

తలెత్తి చూస్తిని గందా.. నా యెత్తు చేయి యెత్తితే కాని నువ్వు ఫ్రేమ్ లో ఇరుక్కోవు. అలా ఇరకపెట్టాలంటే నా యెడమ చెయ్యి లేస్తే కదా! 

అదేదో Frozen Shoulder Pain అంట. నరకం చూపెడతా వుంది. Screen time తగ్గించండి.. చూడబాకండి అంటారు. అదిగాక ఇంకేం పని వుంది.. ఈడ. Cup లు Cup లు coffee లు తాగుడు.. స్క్రీన్ చూసుడు, కథలు చదువుడు. ఆ చదువుడు కళ్ళతోటి మనసుతోటి మెదడు తోటి గాకుండా నోటితోటి కూడా అయిపోయే..

శుభోదయం చెప్పడానికి.. ఇంతజెప్పాల్నా అమ్మి!!? సర్లే.. ఇంకాసేపు నీ పొడన కూసో.. కాస్త డి విటమిన్ వస్తదిలే అని.. 

నా కెమెరాకి అందకుండా పోయినాడు. 

అబ్బా.. ఏమి సూరప్పా.. ఇంత తొందర నీకు.. 

perfect frame కి అందకుండా పోయావు. రేపు చెబుతా నీ పని. ఐదంతస్తుల మిద్దె మీదకి పోతే అందవా యేంటి!?

అయినా నీ పని చెప్పడానికి Tripod కొంటానుండు. 😘🥰😊


దయ తలచి ఈ పొద్దు ఈమె కూడా వచ్చింది నా బాల్కనీ గార్డెన్ లోకి. 

పిల్లలు పువ్వులు పక్షులు దయతలిస్తేనే మన దరికి వస్తాయట. బుల్లి పిట్టలు బట్టలారేసే తీగె పై ఉయ్యాలలూగుతాయి తమ సంగీత కచేరి చేస్తూ. నేను కదిలానా.. శపించినట్లు భావించి ఎగిరిపోతాయి. మానవులు ప్రకృతి పాలిట శాపం కదూ!!



కామెంట్‌లు లేవు: