31, డిసెంబర్ 2024, మంగళవారం

వెదుకులాట లో

 ఇది వొక కథ

“అన్వేషి “

ఎవరు నువ్వు? 

“గుర్తించలేవా, పిచ్చిదాన్ని”

ఏమిటీ వెతుకుతున్నావ్?

“పోయిన వస్తువు ని”

విలువైనదా,రోజూ వెతుకుతున్నావ్? 

“అమూల్యం”

ఇవాళ కూడా దొరకలేదా ? 

“దొరికితే ఎందుకు వెతుకుతాను”

ఎన్నాళ్ళిలా? 

“ఓపిక నశించేంతవరకూ”

పోనీ,నన్ను సాయం చెయ్యమందువా? 

“పోగొట్టుకున్నప్పుడు నువ్వు నాతో లేవు కదా”

నేను కొనిస్తాను వచ్చెయ్యరాదూ? 

“అబ్బే అది జరగని పనిలెండి”

చీకటి పడిపోయింది మరి? 

“చీకట్లోనే పోయింది “

ఏమిటదీ? 

“నా చేతి గాజు ముక్క”

వెతుకుతున్నది గాజుముక్క కోసమా?

“అవును నా గాజులు చిట్లింది ఇక్కడే “

ఎవరు చిట్లించారు ? 

“నా మనసును దొంగిలించినవాడే” 

ఎక్కడ అతను? 

“గారడీ వాడికి చిరునామా వుండదు “

********************************

కామెంట్‌లు లేవు: