"అమయ" బ్లాగర్ ... సామాన్య గారి కథ "కల్పన" కథ పై.. జరుగుతున్న వాడి, వేడి చర్చ ఇది. ఈ కథ పై.. కథా విశ్లేషణ చేసినందుకు గాను..నాకు ..ప్రధమ బహుమతి లభించింది. కథ జగత్ లో ఈ కథని.. ఈ లింక్ లో చూడండి.
అలాగే నావిశ్లేషణ ని .. ఈ లింక్ లో చూడండి.
కృష్ణ వేణి తీరం బ్లాగర్ అచంగ గూగుల్ + లో ఈ రోజు జరుగుతున్న చర్చలో సంధించిన ప్రశ్నలకి నా జవాబులు
అరుణ్ చంద్ర ఇలా అన్నారు
మగవారి యాంగిల్ నుండి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.... అతితెలివిగా భావించక మన్నించండి.
1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?
జవాబు: పూర్తి సమయం హౌస్ హస్బండ్ గా మగవారిని భరించడం చాలా కష్టం. షిప్ట్ ల ఉద్యోగాలు అయితే భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భర్త ఇంట్లో ఉండి(బయట అనవసర కాలక్షేపం చేయకుండా ) బిడ్డలని, ఇంటిని చూసుకోవాలి కదా! అది భర్తగా,తండ్రిగా భాద్యత కాదా!? ఇది ఆడువారి మనసులోని కోరిక. మరి ఇది తప్పంటారా?
2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.
జావాబు: మినహాయింపు ఉంటే అది.. సానుభూతి మాత్రమే! లేదా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ఉండటం కద్దు. ఇప్పటికాలంలో..ఆడువారిపై జరుగుతున్నలైంగిక వేదింపులు,మానసిక హింస మగవారికి ఉండవు. ఉద్యోగ భాద్యతలు.. స్త్రీ-పురుష ఇద్దరికీ సమానమే! ఆడవారికి కొంచెం వెసులుబాటు ఇస్తే తప్పు లేదు. ఇంటా-బయట చాకిరి కదా ఇప్పుడు రిజర్వేషన్ లు ఉండగా లేనిది ఇవి తప్పు కాదు. :)))))
3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?
జవాబు: నవమాసాలుమోయడం,ప్రసవవేదన శారీరక అసౌకర్యం అన్ని భరించిన భార్య అలసిపోతే..బిడ్డల పెంపకంలో.పురుషుడు సాయం చేయకపోవడం,ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు..తప్పుకోవడం తప్పు కాదా? బిడ్డల భాద్యత అతనికి లేదా?.
4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?
జవాబు: ఆడది సంపాదించి..నువ్వు సంపాదించకపోయిన పర్లేదు.నువ్వు ఇంట్లోనే ఉండి నన్ను ప్రేమించడమే పనిగా పెట్టుకో..అనరు. పని-పాటా లేకుండా బలాదూర్ గా తిరుగుతూ..వ్యసనపరుడు అయి..పైసా సంపాదనలేకున్నా అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికి వచ్చినా .. పోద్దస్తమాను కష్టపడి అయినా తను సంపాదిన్చినదానిలో..పస్తులుండి అయినా భర్తకి అట్టేపెట్టి ఓపికతో.. భర్త కి ఇంత కూడు పెట్టి..ఆయన గారి వికృత రూపాన్ని భరించేది ఆడది. ఉద్యోగం పురుష లక్షణం. గృహస్తు ధర్మం భాద్యతలు పంచుకోవడం. రెండు ఆశించడం తప్పు కాదు కదా ! .
5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!
జవాబు: ఖచ్చితంగా ఆడువారు! కానీ వారికి వంత పాడటమో..మౌనం వహించడమో..కాదు సమస్యకి పరిష్కారం..జోక్యం చేసుకుని..తప్పు ఎవరిదైనా ఖండించడం. అలాగే..కోడలికి చాలా చట్ట సంబంధమైన బలం ఉంది.అందుకే.. కొన్ని సమసిపోతాయని ఆశ. అవకాశవాదంగా మార్చుకుంటే.. దాని అంత విచారం ఇంకోటి లేదు.
6. ఆడదానికి సమస్య వచ్చినప్పుడు మొగుణ్ణి అడ్డంపెట్టుకుంటుంది మరి ఇరవైనాలుగ్గంటలూ పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంట్లొ ఉంటే మగాడికి సమస్య వచ్చినప్పుడు అతన్ని సమర్థించే వ్యక్తులు ఎక్కడనుండి వస్తారు?!
జవాబు: అతని తరపు వారు ఏమవుతారు? నిజం ని నిగ్గదీసి అడగడానికి ఎవరు లేకుండా ఉంటారా?
7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).
జవాబు: చట్టం,న్యాయం ఎవరికి చుట్టం కాదు. పోరాడటం లక్షణం.
42 కామెంట్‌లు:
వనజ గారూ,
౧. మగవారిని హౌస్ హస్బండ్‌గా ఎందుకు భరించలేరో వివరించలేదు. ఒకవేళ భార్య ఉద్యోగమూ చెయ్యాలి, ఇంటి పనీ చెయ్యాలి కానీ తాను మాత్రం ఇంటిపని చెయ్యను అని ఏ భర్త అయినా అన్నపక్షములో మాత్రమే మీరన్న విషయాలు చర్చకు వస్తాయి. కనుక నేనడిగిన ప్రశ్నకి అది సమాధానం కాదు.
౨. నేనడిగేది అదే ఆడువారికి సానుభూతీ, వెసులుబాటు ఎందుకివ్వాలి అని? పోతే, లైంగిక వేధింపులు స్రీలపై కొంచెం ఎక్కువ జరిగినా ఆ తేడాలు మరీ ఎక్కువగా ఏమీ లేవు. అమెరికాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం 41% స్త్రీలు, 32% పురుషులు తమ జీవితకాలములొ ఏదో ఒక రూపములో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే (అనిరుద్ధా దాస్, 2008, title: Sexual Harassment at Work in US, p913).
౩. నేనంటున్నది అదే ప్రసవాల తర్వాత అలసిపోయిన స్త్రీని తన రక్షణ, పోషణ బాధ్యతలను భర్తకు వదలిపెట్టమని. బిడ్డలకి స్నానాలు చేయించి ముస్తాబు చేస్తేనే వారి ఆలనా పాలనా చూసినట్టా?
౪. ఉద్యోగం పురుష లక్షణం అని మీరే తేల్చేశారు కదా. అటువంటప్పుడు ఎవరు ఉద్యోగం మానేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు స్త్రీ మానేయటంవల్ల వారి వ్యక్తిత్వానికి వచ్చిన మచ్చ ఏముంటుంది?
౫. అత్తా-ఆడపడుచుల సాధింపులకు కోడళ్ళ సాధింపులు ఏమాత్రమూ తీసిపోవు. ఎవరు బలవంతులైతే వారి పెత్తనం సాగటం అనేది మనం ఎరిగిందే. తల్లా-పెళ్ళామా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి కల్పించేదీ ఆడువారే, మగవారిపై నిందలు వేసేది ఆడువారే. ఇలాంటప్పుడు తప్పో ఒప్పో పెక్కుశాతం మగవారు ఆశ్రయించేది మౌనాన్నే. కోడలికి అత్త ముఖ్యం కాకపోవచ్చు కానీ భర్తకు అమ్మా, భార్యా ఇద్దరూ ముఖ్యమే.
౬. మగవాడికి సమస్యలు వచ్చినప్పుడు భార్యను అడ్డుపెట్టుకుంటే ఆడువారు అంగీకరిస్తారా? అటువంటప్పుడే మగవారికి సోషల్ రిలేషన్స్ అవసరమౌతాయి. మీరే అన్నారు ఆడువారికి సానుభూతి, వెసులుబాటు ఉంటాయని. అవి లేని ప్రాణి మగవాడే కదా మరి!
౭. నేనడిగిన ప్రశ్నకు ఇది సమాధానం కాదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆడ -మగ ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించాల్సిన పరిస్థితి.స్త్రీలు ఉద్యోగం చేస్తూ..మగవారు హౌస్ హస్బెండ్ గా ఉంటే మగవారిలో ఆత్మ నూన్యతా భావం పెంపొంది.. ఆ ప్రభావాన్ని భార్య పై రక రకాలుగా వెలిబుచ్చుతూ..నరక ప్రాయం చేస్తారు.అందుకే కంప్లీట్ హౌస్ హస్బెండ్ గా పురుషుడుని అంగీకరించలేరు. ఉద్యోగం,సద్యోగం కూడా పురుష లక్షణమే!
అలాగే ఆడవాళ్ళు పిల్లలు కని,పెంచే,వంట -ఇంటి పనులు మాత్రమే చేసే యంత్రాలు కాదు.వారికి వారీ అభిలషణీయం ఉన్న రంగంలో కాలూని వారికి నచ్చిన విధంలో ఉద్యోగం చేసుకునే వీలు లేదంటారా? సమాజంలో ఆమె భాగం కాదా? కుటుంబాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు స్త్రీ ఏ ఉద్యోగం మానేయకుండా.. భార్య భర్త ఇద్దరు పని విభజన చేసుకుంటే..తప్పు ఏముంది. ఆడవాళ్లే ఎందుకు ఉద్యోగం మానేయాలి అన్నది మా ప్రశ్న. ఒకవేళ మగవారికి ఉద్యోగం లేకపోయినా ఆడవారు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని మోయడం లేదా? ఆ మోయడాన్ని కించ పరచడం లేదా?
అత్త-కోడలు-కొడుకు ఒకే చూరు క్రింద ఉండాల్సిన వారు.అత్త-కోడళ్ళకి సరిపోనప్పుడు.. తప్పైనా,ఒప్పు అయినా భార్య పక్షమో,లేదా మౌనం వహించాల్సి రావడమో..సర్దుబాటు ధోరణి తప్ప వేరొకటి కాదు.ఆ సర్దుబాటు దోరణి లేకపోబట్టే..ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి చిన్న కుటుంబాలు వచ్చాయి. ఆడవాళ్ళు సహన వంతులు కాబట్టే కుటుంబం అనే రాజు గెలుస్తాడు. కోడలికి తనకి పడక పొతే.. కోడలిని వదిలేయ్..అని ఏ తల్లి చెప్పదు. పోన్లే..దూరంగా ఉండి శుభ్రంగా హాయిగా బతకండి అని చెప్పి పంపుతుంది. బట్..అది ఆడతనం.
ఆడవాళ్ళకి లభించే సానుభూతి మగవారికి లేదని,ఉండదని అనకండి. వారికి ఉంటుంది. కాకపొతే.. తక్కువ.
౬. మగవాడికి సమస్యలు వచ్చినప్పుడు భార్యను అడ్డుపెట్టుకుంటే ఆడువారు అంగీకరిస్తారా? అటువంటప్పుడే మగవారికి సోషల్ రిలేషన్స్ అవసరమౌతాయి. అని అన్నారు.
సమస్యలు వచ్చినప్పుడు ఆడవారిని ఎందుకు అడ్డు పెట్టుకోవాలి?వ్యక్తిగత సమస్యలు ఎవరి సమస్యలు వారే పరిష్క రించుకోవాలి. అదే కుటుంబం కోసం అయితే మగవారు అయినా ఆడవారు అయినా ఎదుటి వారి వ్యక్తిత్వం,అభిమానం దెబ్బ తిన నంతవరకు..కష్టసుఖాన్ని పంచుకోవాలి. భార్య భర్తల మద్య అవగాహన,పని విభజన, కుటుంబ భాద్యత పంచుకోవడం .. అన్నీ ఉండాలి. ఇద్దరు సమానం కాదా!? అంటే.. ఇప్పటికి కాదు. ఎప్పటికి కాదు అంటారు కనుకనే.. విడాకుల శాతం పెరుగుతున్నాయి. మారాల్సింది మగవారి ఆలోచనా దృక్పధం.
ఆ విషయం గురించి చర్చ జరగాలి."కల్పన" కథ తరువాత ఆలోచించాల్సిన విషయం ఇదే!
మూడు రోజులు ఇటువైపు రాకపోతే ఎన్ని చర్చలు జరిగిపోతున్నాయో! బాగుంది వాడిగా వేడిగా కానివ్వండి! నేను మాత్రం ప్రేక్షకురాలిని.
వనజ గారూ,
౧. ఆడ-మగ ఇద్దరూ పని చేస్తేనే కుటుంబం గడవదు అనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కష్టపడటంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నేను చెబుతున్నది కేవలం స్వంత గుర్తింపుకోసం పనిచేస్తాం అంటున్న ఆడువారి గుఱించి. అటువంటప్పుడు ఆ గుర్తింపేదో ఆడువారినే తెచ్చుకొమ్మని ఇంటిపని మగవారికి వదిలిపెట్టమంటున్నాను. దానికీ ఒప్పుకోకుండా ఇంటిపనీ, ఉద్యోగమూ రెండూ చెయ్యాలనటం మగవారిని బలవంతపెట్టటం కాదా?
౨. ప్రకృతి మానవజాతికి సంబంధించినంతవరకూ పిల్లల్ని కని, పెంచే బాధ్యతను స్రీపైనే పెట్టింది. ప్రకృతిని వికృతి చేద్దామని చూస్తేనే సమస్యలు. పురుషుని పాత్ర రక్షణ, పోషణ మాత్రమే. సరే పనివిభజన జరిగినంతవరకూ అసలు ఈ చర్చే అనవసరం. స్త్రీ పిల్లల పోషణ చూడటం, మగవాడు సంపాదించుకు రావటమూ పనివిభజనే!! ఎవరో ఒకరు ఉద్యోగం వదలాల్సిన పరిస్థితిలో ఎవరు వదలాలి అన్నదే చర్చకు నిలిచే విషయం.
౩. ఇక మీరు అత్తా-కోడళ్ళకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. కోడలిని వదిలించుకు రమ్మని చెప్పే తల్లులూ, తల్లిని వదలించుకురమ్మని చెప్పే కోడళ్ళూ కోకొల్లలు సమాజములో.
౪. కారణాలేవయినా సరే ఆడువారికి సమాజములో సానుభూతి, వెసులుబాట్లు ఉన్నాయని, మగవారితో పోల్చితే ఎక్కువే అని అంగీకరించారు కదా! నేను చెప్పేదీ అదే.
౫. అసలు వ్యక్తిగత సమస్య, కుటుంబ సమస్య అంటే నిర్వచించండి. దీని గురించిన వివరణ తర్వాత ఇస్తాను.
౬. మగావారు ఆడువారినిపెట్టే హింస కనబడుతుంది, సమాజం గుర్తించింది. కానీ ఆడువారు మగవారిని పెట్టే హింస కనబడదు పైగా స్వయంగా మగవారే చెప్పుకోలేరు, చెప్పుకున్నా మగవారినే సమాజం హేళనగా చూస్తుంది.
అరుణ్ ఉదాహరణకి ఇది చూడండీ! ఒక స్త్రీ ఉద్యోగస్తురాలు అయితే..ఆఫీసులో తనకి ఉన్న సమస్యని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాక కుటుంబం గురించే ఆలోచించడానికే 65 % వరకు ప్రాదాన్యతనిస్తుంది. అదే పురుషుడైతే..తన సమస్య ఇంటి వరకు లాక్కువచ్చి..ఇంట్లో అందరు..ఆ సమస్య గురించి ఆలోచించేవరకు ప్రవర్తించడం చూసాను. అలాగే.. ఒక కుటుంబంలో జ్వరంతో ఉన్న బిడ్డని పట్టించుకోకుండా పురుషుడు తన వ్యక్తిగత ఆనందం కోసం ఒక వైన్ బాటిల్ ని కొనుగోలు చేసినంత తేలికగా.. స్త్రీ ఒక బ్లౌసే పీస్ ని తన కోసం కొనుక్కో గలదా ? అక్కడ పురుషుడి వ్యక్తిగతం కి..స్త్రీ కుంటుంబ బాధ్యతకి తేడా లేదంటారా? పురుషుడు..వ్యక్తిగత ఆనందం కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. కానీ స్త్రీ తన కుటుంబం కోసం తన వ్యక్తిగతాన్ని త్యాగం చేస్తుంది.
అలా అని నేను అందరు పురుషులని ఆ జమలోకి చేర్చడం లేదు. కానీ తేడా ఉంది కదా!
ఇక పై మీ ప్రశ్నలని..గూగుల్ + లో సంధించండి.అక్కడ ఎక్కువ మంది చేత . ఎక్కువ చర్చ వస్తుంది. ఒక మంచి చర్చలో.. అందరూ సహేతుకంగా ఆలోచించే ఆస్కారం ఉంది కదా!.
ధన్యవాదములు అరుణ్...
వనజగారు,
మగ వారు పేళ్లి ఎందుకు చేసుకోవాలి? వాళ్లకి పెళ్లి చేసుకొంటే కలిగే లాభాలు ఎమీటీ? మీ అభిప్రయం చెప్పగలరా? పెళ్ళి సాకుతో మగ వారి శ్రమను సమాజం దోచుకోవటం ఎక్కువైంది. మగవారికి పిల్లలు కావాలి కనుక పెళ్ళి అవసరం అని చెప్పవద్దు. మగ వారికి పిల్లల కావాలనేది(వంశం), సమాజం రుద్దిన అభిప్రాయం. దీనిని మన పెద్దలు రామాయణం లాంటి కథల ద్వారా ప్రచారం సాగించారు.
శ్రీనివాస్ గారు..తప్పకుండా చెపుతాను. కామెంట్ రూపం లో కాదు. నా అభిప్రాయం చెప్పడానికి ఒక పోస్ట్ అవసరం . ఓకే..నా ..అండీ.
వనజ గారూ, ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ, పట్టుదల, సామర్త్యం ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే దేశం బాగు పడుతుంది. వ్యక్తిగత స్వార్ధాలతో లేదా వ్యవస్తాపరమయిన లోపాలతో ఆంక్షలు విధించుకోవడం పొరపాటు. మనకు అవసరమా అని కాక దేశానికి ఉపయోగమా అని ఆలోచించాలి.
ఆడవారు ఉద్యోగాలు చెయ్యాలా అనే ప్రశ్నకు ఇదే నా జవాబు. ఇకపోతే ఇంటిపనులు (unpaid labor) కూడా అవసరమయినవే.పనిని పనిగానే చూడాలి తప్ప ఒకటి గొప్ప మరొకటి తక్కువగా భావించరాదు. ఇద్దరూ పని చేయడం జరిగితే ఇంటా బయటా కూడా పనిని పంచుకోవడమే వివేకం.
7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).
జవాబు: చట్టం,న్యాయం ఎవరికి చుట్టం కాదు. పోరాడటం లక్షణం.
===================================
వనజామాలిగారూ,
మిగిలిన విషయాల మీద నాకంత ఆసక్తి లేదు కానీ, ఈ ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం మాత్రం తప్పని చెప్పగలను. గృహహింస చట్టం అన్నది ఒకటి వచ్చిన తరువాత, మగవారు చేసేవి మాత్రమే నేరాలయ్యాయి. ఆడవారు చేసే నేరాలకు .. మగవారికి దొరికేది సానుభూతే కానీ (కొన్ని సంధర్భాలలో అది కూడా ఉండదు) న్యాయం కాదు. కోర్టూల్లో కూడా అది చాలా సార్లు ౠజువయ్యింది.
జస్టిస్ మార్కండేయ కట్జూ.. అన్నదాని ప్రకారం (ఆయన వెటకారంగా అన్నాడో,శీరియస్ గా అన్నాడో కానీ నిజం అన్నాడు)
మీ భార్య చెప్పినట్టు మీరు వినాలి. ఆమె తల అటు తిప్పు అంటే అటు తిప్పాలి, ఇటు తిప్పు అంటే ఇటు తిప్పాలి. మనమకు వేరే దారిలేదు. మనందరం చేయాల్సింది అదే అని. కొంచెం వ్యాఖ్యాల్లో తేడా ఉండచ్చు కానీ, దాదాపు ఇదే అర్థముతో ఆయన అన్నాడు. అంతే కాదు, సదరు భర్తకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడు కూడా (అతని భార్య చాలా సంవత్సరాలుగా అతనితో విడిపోయి ఉంటోంది, అయినా సరే).
గృహహింస చట్టం గురించి నేను ఇదివరకు రాసిన ఆర్టికల్..
గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు
మగవాడు మంగలి పని చెయ్యడం అవమానం అనుకోడు, చాకలి పని చెయ్యడం అవమానం అనుకోడు కానీ ఇంటిలో బట్టలు ఉతికే పని చెయ్యడమే అవమానం అని ఎందుకు అనుకుంటాడు? ఇది స్త్రీ-పురుష సంబంధాల విషయంలో సంకుచిత నమ్మకాలకి నిదర్శనం కాదా? భార్య అంట్లు తోమితే భర్త బట్టలు ఉతకాలి, భార్య ఇల్లు చూస్తే భర్త పిల్లలని చూడాలి. ఇందులో తప్పేముంది?
సొల్లు కబుర్లు ఎందుకు? భార్య తన భర్తని కొడితే భర్త భార్యని వదిలేస్తాడు. కానీ భర్త భార్యని కొడితే భార్య తన భర్తని వదిలెయ్యడానికి అంత సులభంగా ధైర్యం చేస్తుందా? భార్యని వదిలేసిన మగవానికి నెల తిరగకముందే రెండో పెళ్ళి సంబంధం దొరుకుతుంది. భర్తని వదిలేసిన ఆడదానికి రెండో పెళ్ళి సంబంధం అంత సులభంగా దొరుకుతుందా? ఇక్కడేదో ఆడవాళ్ళు సానుభూతి సంపాదిస్తున్నారన్నట్టు మాట్లాడుతున్నారు.
లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు కాబట్టి చెపుతున్నాను. మగవాళ్ళు ఆడవాళ్ళని లైంగికంగా వేధించడం జరుగుతుంది కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని లైంగికంగా వేధించడం ఎక్కడా జరగదు. ఒకవేళ ఆడది మగవాణ్ణి లైంగికంగా వేధించడం జరిగితే మగమహారాజులు కలికాలం వచ్చేసిందంటూ ఆడవాళ్ళని తిడతారు లేదా అరిటాకు-ముల్లు సామెత చెప్పి ఆడది మగవాణ్ణి వేధించినా ఆడదే చెడుతుంది కానీ మగవాడు చెడిపోడు అని వాదిస్తారు.
సాధించి సతాయించే వారిలో ఆడ వాళ్ళూ ఉంటారు, మగ వాళ్ళూ ఉంటారు. ఆడవాళ్ళకి న్యాయం జరగాలంటే గృహహింస చట్టం లాంటి వాటిని వాడుకోవాలంటే ఇంటి గుట్టు బయట పెట్టుకోవాలి. చాలా మంది బాధితులకి అదే పెద్ద శిక్ష. ఈ చట్టాలు ఎందుకు నిజంగా పనికొస్తున్నాయో తెలియదు. కానీ ఆడవారు దీనిని ఎంత దుర్వినియోగం చేసుకోవచ్చో ఊహించేసి మగవారికి ఎంత హాని కలుగుతుందోనని భయపడిపోయి అనేక రకాలుగా ఈ చట్టం పేరు చెప్పి ఆడవారి గురించి హీనాతిహీనంగా మాట్లాడి ఆ చట్టం కానీ ఇంకే న్యాయపరమైన సాయం కానీ తీసుకోవాలంటే సాధరణ స్త్రీలు సిగ్గు పడేలా చెయ్యడానికి ఉపయోగపడుతున్నాయి. మాకొద్దీ చట్టాలు. మనుషుల్లో మానవత్వం కావాలి. మనుషుల్లా ప్రవర్తించలేని వాళ్ళతో కలిసి జీవిస్తున్నామని తెలిసినప్పుడు చప్పుడు చెయ్యకుండా పక్కకి తప్పుకుని తన జీవితం తాను జీవించగలిగి ఎవరి నుండీ ఏ సానుభూతి అక్కర్లేని ధైర్యం ఆ స్త్రీలకు కావాలి. సానుభూతి, సహాయం కావాలంటే కారణాలు చెప్పాలి. ఆకారణాలు చెప్పితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే సామెత నిజమౌతుంది ఆడైనా, మగైనా. సీతాదేవి రెండో మారు శీల పరీక్ష అడిగితే ఎందుకు భూమాత దగ్గరికెళ్ళిపోయిందో అర్థమయ్యేది కాదు. శ్రీరాముడు ఆమెని అడవులకి పంపడమే తేలికనుకున్నాడు చాకలి వాడి అన్యాయపు మాటలు అబద్ధాలు అని నిరూపించడంకంటే. అమ్మవారు రెండో సారి ఆ కష్టం అర్థమయ్యే భూదేవిని ఆశ్రయించింది. దేవుడికే తప్పలేదు. మానవమాత్రులకెంత? నిజమైన సమస్యలకి తప్పకుండా పరిష్కారముంటుంది. కొన్ని సమస్యలు సృష్టించబడినవి. వాటికి పరిష్కారం ఎలా వస్తుంది? శుభ్రంగా కసి తీర్చుకోండి ఆడవాళ్ళ మీద. నోటికొచ్చినట్లు మాట్లాడండి. చెలరేగిపొండి. ఆ శాస్తి వాళ్ళకి జరగాల్సిందే. "అర్థం చేసుకోండి" అని మొర పెట్టుకుంటున్నందుకు వాళ్ళకి ఆ శిక్ష పడాల్సిందే. మొరిగే కుక్క కరవదన్నట్లు ఊరికే హక్కులూ, స్వాతంత్ర్యాలూ అని మాటల్లో వ్రాతల్లో మాత్రమే ఘోషిస్తూ నిజ జీవితాలు చక్కబెట్టుకోలేని వాళ్ళు ఉన్నందుకు వాళ్ళను అనాల్సిందే. కానివ్వండి. నేనిక చెప్పేదీ చెప్పగలిగేదీ ఏమీ లేదు. నా పెంకు (shell) లోకి వెళ్ళి నా ప్రపంచంలో నేనుండడం తప్ప.
వనజ గారూ,
దయచేసి చర్చను పాయింట్లవారీగా కొనసాగించండి. నాకూ మీకూ తేలికగా ఉంటుంది స్పందించటానికి.
ప్రవీణ్ గారూ,
నేనడిగిన మొదటి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని తర్వాత వ్యాఖ్యానించండి. అర్థంకాకుంటే దయచేసి చర్చను పక్కదారి పట్టించకండి. అలాగే కాస్త మందిలో వ్యాఖ్యానించేటప్పుడు సొల్లు గిల్లు అనకుండా నోరు అదుపులో ఉంచుకోవటం మంచిదని నా ఉచిత సలహా! ఆడవారైనా మగవారిపైన లైంగిక వేధింపులకు గురిచెయ్యగలరు అని చాలాసార్లు నిరూపితమైనది. అలాంటిదే మచ్చుక్కి ఈ వార్తను చూడొచ్చు. http://goo.gl/k4gA2
లలిత గారూ,
ఒక్కసారి manatelugumovies.netలో జీతెలుగులో ప్రసారమయ్యే 'ఇది కథ కాదు జీవితం' అనే కార్యక్రమం ఆర్కైవ్స్ ఉంటాయి. ఒక్కసారి చూడండి. గృహహింస చట్టం ఏవిధంగా దుర్వినియోగం చెయ్యబడుతున్నదో తెలుసుకోవచ్చు. చెయ్యని నేరాలకు నెలల తరబడి జైళ్ళలో మగ్గి, ఉద్యోగాలు పోయిన మగవారి చరిత్రలు చూసి తెలుసుకోవచ్చు. నేనెక్కడా ఆడువారికి జరగాల్సిన న్యాయాన్ని నిరాకరించట్లేదు అలాగే నిరాకరించబోను. అదే సమయములో స్రీజాతి మొత్తమంతా కడిగిన ముత్యాలు, వారి కష్టాలన్నిటికీ మగజాతే కారణం అన్నట్లు మాట్లాడేవారికి కాస్త కౌంటర్ ఇచ్చానంతే.
వ్యాఖ్యాతలందరికీ,
మగవారి దౌర్భాగ్యం ఏమంటే ఇక్కడ నాకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పుకోవటం కూడా స్త్రీజాతికి అతడు చేసే అన్యాయంగానే చిత్రించబడటం. చట్టపరంగా పెరుగుతున్న చిక్కులను తప్పించుకోవటానికి మగవారు లివ్-ఇన్ రిలేషన్స్ దిశగా ఎలా ఆలోచిస్తున్నారో ఓ ఉదాహరణ ఇక్కడ (హిందీలో) చూడొచ్చు. http://www.youtube.com/watch?v=uRRdIlL6eFo
అరుణ్..
ముందుగా నేను చెప్పెదేమితీ అంటే.. మీరు..స్త్రీ విరోదిగానో..నేను స్త్రీ పక్షపాతి గానో..ఈ చర్చని మొదలెట్టలేదు.
అలాగే నేను పురుష విరోదిని కాదు.
స్త్రీల సమస్య లన్నింటికి పురుషుడే పూర్తి కారణం కాదు. అలా అని.. అహంకార పూరిత పురుష మనస్తత్వం ఆనవాలు లేకుండాను లేదు. పురుష అహంకారం తగ్గలేదు కాబట్టే.. విద్యాధికులైన స్త్రీలలో అణగి మణగి ఉండే మనస్తత్వం స్థానే ప్రశ్నించే గుణం ఉత్పన్నమైనది. అది భరించలేక పోతున్నది పురుషులు .
స్త్రీల చదువులు,వారి సేవలు కుటుంబానికే పరిమితమా? వారు సమాజంలో భాగం కదా! సమాజానికి వారి సేవలు అవసరం లేదా? పురుషుడు ఇంట్లో ఆమెకి సహకారం అందిస్తే.. పరస్పర అవగాహన తో మెలిగితే.. వివాదాలకి తావు ఎక్కడ?
ఆడవారికి పురుషులతో పాటు చదువు,ఉద్యోగం కావాలి. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండాలి. అలాగే పురుషులు కూడా స్త్రీలకి సహాయా సహకారం లని అందిస్తూ..పిల్లల పెంపకం ని,కుటుంబ భాద్యతని స్త్రీ పైనే నేట్టివేయకుండా తను పాలుపంచుకోవాలి అని నా అభిప్రాయం.
గృహ హింస చట్టం ని అవకాశ వాదంగా తీసుకునే స్త్రీలని నేను చూసాను. అది విచారకరం.
నాదొక విన్నపం. చర్చ కొనసాగించ గల్గితే సభ్యతగా, ఆరోగ్యకరంగా కొనసాగించాలని అందరికి మనవి.
వ్యాఖ్యలు చేసిన అందరికి ధన్యవాదములు. ..
lalithagగారూ,
గృహహింస చట్టాలు, 498A చాట్టాలూ ఎలా ధుర్వినియోగమవుతున్నాయో చాలా సంధర్భాలలో మీడియా లో కూడా చెప్పడం జరిగింది. పురుషులకు అన్యాయం జరుగుతోంది అంటే, స్త్రీలకు జరగలేదనో లేదా నిజంగా బాధలు పడ్డ స్త్రీలు ఆ చట్టాలను ఉపయోగించి ఉపసమనం పొందడం తప్పనో చెప్పడం కాదుకదండీ.
మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీరు పొద్దున లేచిన దగ్గరనుండి పేపరులోనో లేక ఎక్కడో ఒక చోటనో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను చూసుండడమో, చదివుండడమో జరుగుతుంటుంది. కాబట్టి, మీకు మగవారు తాము కూడా బాధలు పడుతున్నాము అని చెబితే అది కేవలం అబద్దపు ప్రచారముగానో అనిపించుండవచ్చు. కానీ, అలా బాదలు పడి, కేసుల్లో ఇరుక్కుని, ఉధ్యోగాలు పోగొట్టుకుని.. జీవచ్ఛవాల్లా బతుకుతున్న మగవారు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నారు.
మగవారివి కేవలం భయాలు కావండీ, చాలా మగాళ్ళ వ్యధాభరిత గాధలు అవి. A failed marriage is a crime for men. ఇక చట్టాలు దాదాపుగా అన్నీ స్త్రీలకే అనుకూలంగా ఉంటాయి. భరణం దగ్గరనుండి, పిల్లల సమ్రక్షణ హక్కుల వరకూ అన్నీ.
కష్టాలు ఆడవారికి వస్తే వాటిని పెద్దవి చేసి చూపడం, మగవారికి వస్తే తక్కువ చేయడం జరుగుతున్నదే. ముందుగానే చెప్పినట్టు, ఇవన్నీ మగవారు అనుభవిస్తున్నా.. స్త్రీలకు జరిగే అన్యాయాలను నేను జరగవని చెప్పడం లేదు. అలానే వారు ఆ చట్టాలను ఉపయోగించి వెలుసుబాటు పొందడాన్ని కాదనడం లేదు.
అయినా మీరు, మగవారు కేవలం ఆడవారి మీద బురద జల్లడానికే ఇలాంటివి చేస్తున్నారనుకుంటే మీ ఇష్టం.
lalithagగారూ,
గృహహింస చట్టాలు, 498A చాట్టాలూ ఎలా ధుర్వినియోగమవుతున్నాయో చాలా సంధర్భాలలో మీడియా లో కూడా చెప్పడం జరిగింది. పురుషులకు అన్యాయం జరుగుతోంది అంటే, స్త్రీలకు జరగలేదనో లేదా నిజంగా బాధలు పడ్డ స్త్రీలు ఆ చట్టాలను ఉపయోగించి ఉపసమనం పొందడం తప్పనో చెప్పడం కాదుకదండీ.
మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీరు పొద్దున లేచిన దగ్గరనుండి పేపరులోనో లేక ఎక్కడో ఒక చోటనో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను చూసుండడమో, చదివుండడమో జరుగుతుంటుంది. కాబట్టి, మీకు మగవారు తాము కూడా బాధలు పడుతున్నాము అని చెబితే అది కేవలం అబద్దపు ప్రచారముగానో అనిపించుండవచ్చు. కానీ, అలా బాదలు పడి, కేసుల్లో ఇరుక్కుని, ఉధ్యోగాలు పోగొట్టుకుని.. జీవచ్ఛవాల్లా బతుకుతున్న మగవారు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నారు.
మగవారివి కేవలం భయాలు కావండీ, చాలా మగాళ్ళ వ్యధాభరిత గాధలు అవి. A failed marriage is a crime for men. ఇక చట్టాలు దాదాపుగా అన్నీ స్త్రీలకే అనుకూలంగా ఉంటాయి. భరణం దగ్గరనుండి, పిల్లల సమ్రక్షణ హక్కుల వరకూ అన్నీ.
కష్టాలు ఆడవారికి వస్తే వాటిని పెద్దవి చేసి చూపడం, మగవారికి వస్తే తక్కువ చేయడం జరుగుతున్నదే. ముందుగానే చెప్పినట్టు, ఇవన్నీ మగవారు అనుభవిస్తున్నా.. స్త్రీలకు జరిగే అన్యాయాలను నేను జరగవని చెప్పడం లేదు. అలానే వారు ఆ చట్టాలను ఉపయోగించి వెలుసుబాటు పొందడాన్ని కాదనడం లేదు.
అయినా మీరు, మగవారు కేవలం ఆడవారి మీద బురద జల్లడానికే ఇలాంటివి చేస్తున్నారనుకుంటే మీ ఇష్టం.
వనజ గారూ,
నా వ్యాఖ్యలో ఆవేశమున్నా అచ్చ్నగ గారి సమాధానం తీవ్రతను తగ్గించింది. అందుకని మళ్ళీ వ్రాసే సాహసం చేస్తున్నాను. ప్రవాలేదనుకుంటేనే ప్రచురించండి.
అచంగ గారూ,
ఒక విషయంలో మీరూ నేనూ ఏకీభవిస్తున్నాము అనుకుంటున్నాను. అది ఈ చట్టం వద్దు అనడంలో. లేదా ఈ చట్టం అవసరమైన వారికి ఉపయోగపడే అవకాశాలు తక్కువ అనడంలో.
మీరు చెప్పే కార్యక్రమాలు చూసి నేను అర్థం చేసుకోగలిగేది ఎక్కువ ఉండకపోవచ్చు. నిజ జీవితంలో చూసిన నాటకీయత చాలు నిజమనేది అర్థం కావడం ఎంత కష్టమో తెలియడానికి. బలి పీఠం సినిమా కథ ఒక స్త్రీవాది మగవాడి వైపున ఆలోచించి వ్రాసినదే కదా. ఆ తర్వాత అతని గురించి విరుద్ధమైన విషయాలు తెలిశాయని చెప్తారు.
ఏదైనా ఒక వర్గానికి పూర్తి బలం ఇస్తే న్యాయంకన్నా అన్యాయమే ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయమూ బహుశా వనజ గారి అభిప్రాయం కూడా అనుకుంటాను. ఉదాహరణకి child abuse గురించిన చట్టాలు మన దేశంలో తెలియదు కానీ విదేశాలలో చాలా కఠినంగా ఉంటాయి. అసహాయులైన పిల్లలని కాపాడడానికి తయారైన ఆ చట్టాలు ఆ పిల్లల తెలిసీ తెలియని మాటల ఆధారంగా ఎంతో మంది తల్లి దండ్రులని ఇక్కట్ల పాలు చెయ్యడం గురించి చదివాను, విన్నాను. ఇక్కడ ఆలోచించవలసినది ఇది: మగ వాళ్ళకి చట్టం కారణంగా ఇన్ని అగచాట్లు పడే అవస్థ కలుగుతోంది అన్నప్పుడు మీరు ఎలా react అయ్యారో, తర తరాలుగా సమాజం, వగైరా వగైరా ల ఒత్తిడి వల్ల ఏర్పడిన సమస్యలకి reaction గృహ హింస నిరోధక చట్టం వంటివి. నేను justify చెయ్యట్లేదు. ఈ సందర్భంగా అసలు సమస్య గురించి ఆలోచిద్దామంటున్నాను.
నా చుట్టు ప్రక్కల నేను గమనించినంత వరకూ ఆడవాళ్ళు 'భయా పడుతుంటారు మగవాళ్ళ బెదిరింపులకి. వాళ్ళు ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలు కూడా చెయ్యరు. ఒక వేళ ఆలోచన చేసినా ఆ ఆలోచనకే దండన విధించబడుతుంది వాళ్ళకి. నాకు చాలా దగ్గరగా జరిగిన అనుభవం నన్ను భయపెడుతుంటుంది. ఆ భయం ఎందుకు అంటే ఏదైనా స్టెప్ తీసుకుంటే పిల్లలతో సహా ఎందరికి సమాధానాలు చెప్పుకోవాలో కదా అని. నిజం నిప్పులాంటిది. అది ఆ నిజం ఎవరికి చెందుతుందో వాళ్ళని కూడా దహించెయ్యగలదు. అందుకు సిధ్హపడి స్టెప్ తీసుకోవాలంటే అసాధారణ పరిస్థితులు అటు వైపు నెట్టెయ్యాలి లేదా అసాధరణ మనోధైర్యం కావాలి. స్వంతగా ఆ స్టెప్పు తీసుకోవడం ఎంత చదువుకున్న వాళ్ళకీ, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకీ కూడా అంత సులభం కాదు.
ఈ వ్యాఖ్య పూర్తి చేసే లోపే శ్రీకాంత్ గారి వ్యాఖ్య చూశాను. కానీ అంతకు ముందే క్రింది పేరా మొదలు పెట్టాను. కనుక ఆయన వ్యాఖ్యకి సమాధానం కాదు నా ఆలోచనే ఆ వైపు సాగుతోంది అని అర్థం చేసుకోగలరు. నేను పేపర్లో వార్తలకి స్పందించడం లేదు బాధితులైన మహిళల గురించైనా మగవారి గురించైనా.
ఒక పని చేద్దాం. మన చుట్టు ప్రక్కల చూద్దాం.మన చుట్టూ ఉన్న కుటుంబాలను గమనిద్దాం. ఎంత మంది ఏ విధాల సమస్యలను ఎదురుకుంతున్నారో చూద్దాం. టీవీలో కథలూ, సినిమాల్లో కథలో, పేపర్లలో వార్తలూ కొన్నాళ్ళు పక్కన పెడదాం. నాకు మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కడా ఇక్కడా చూసి ఏర్పరుచుకున్న స్టీరియో టైపు అభిప్రాయాల్ని వాళ్ళ క్లాసులో ఉన్న అమ్మాయిలు, కజిన్లను చూసి verify చేసుకోమని చెప్తుంటాను.వాళ్ళ తోటి అమ్మాయిలు తెలివైన వారని చదువులో ఇంకా అన్ని రంగాలలో ముందుంటున్నారని పిల్లాడే గమనించాడు. ఇటువంటి చట్టాల గురించి వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా నేనూ ఆలోచిస్తాను. నా పిల్లలకి ఏం విలువలు నేర్పాలి అన్నది నేను నేర్చుకోవాలి. ఆ ప్రయత్నం నేను నాకు భయం దేని గురించి అని ప్రశ్నిచుకోవడంతో మొదలు పెడుతుంటాను.
వరకట్నం విషయంలో ఆడవాళ్ళు తమకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్న వారిని ఎందుకు చేసుకోవాలనుకుంటారు అని అడుగుతుంటారు. కొన్ని మగవారి సమస్యలకు మూలాలు కూడా అటువంటి ప్రశ్నలు వేసుకుంటే తెలుస్తాయి. పరిష్కారాలు కూడా తెలియవచ్చు అనిపిస్తుంటుంది.
ఒకటి నిజమనిపిస్తుంది. పెళ్ళి అంటే ఏమిటి, ఎందుకు అనే దానికి ఒక్కొకరు ఒకో భాష్యం చెప్పుకుంటారు. అది కాక సినిమాలు ఒక భాష్యం చెప్తాయి. చట్టాలు ఒకటి.
పెళ్ళి కాకుండా కలిసి ఉండడం గురించి మగవాళ్ళు ఆలోచిస్తుంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారనే కదా అర్థం వారితో కలిసి అలా జీవించడానికి ఒప్పుకోవడానికి. వాళ్ళిద్దరూ రాజీ ఐతే ఇంక దాని గురించి ఇంకొకరు ఏం చెప్తారు అని అడగడం ఎందుకు? పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళే పెళ్ళి చేసుకుంటారు. ఈ పరిస్థితి ఇంత తేలికైనది కాదులెండి. ఎందుకంటే ఎక్కడో ఏ మూలో మనిషి (both he and she) కి తను, తన వారూ అన్న ఒక బంధం కావాలని ఉంటుంది. అది ఒక బంధంలో ఉన్న ఇద్దరికీ ఒకే సారి అనిపించకపోతేనే అదో సమస్య.
ఇలా ఇంకా వ్రాయచ్చు కానీ చెప్పిందే చెప్పడం అవుతుందేమో. ఇప్పటికి ఇంక ఆపేస్తాను. నా తీరికనంతా ఇక్కడే వాడేస్తే వేరే సరదా పనులు నిలిచిపోయే ప్రమాదముంది :) సెలవు.
అచంగ గారు, ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. "భర్తని వదిలేసే ధైర్యమే లేనివాళ్ళకి భర్త మీద 498a కేస్ పెట్టే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?" మీరు ఏకంగా విషయాన్నే పక్కదారి పట్టిస్తున్నారు. నేను పక్కదారి పట్టించడానికి ఏమి మిగిలింది?
యూట్యూబ్‌లో వరకట్న దురాచారం గురించి వీడియోలు వెతికాను. వరకట్న దురాచారం వల్ల ఎంత మంది మహిళలు బలి అవుతున్నారు అనే లెక్కలు చూపించే వీడియోల కంటే వరకట్న నిషేధ చట్టాన్ని రద్దు చెయ్యాలని చెప్పే వీడియోలే ఎక్కువ కనిపించాయి. వరకట్న నిషేధ చట్టాన్నీ, 498aనీ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఆ చట్టాలని రద్దు చెయ్యించి వరకట్నం లాంటి దురాచారాలని లీగలైజ్ చేద్దామనే వాళ్ళ ప్లాన్. దొంగతనం కేస్‌లు కూడా దుర్వినియోగమైన సందర్భాలు ఉన్నాయి. డబ్బున్నవాళ్ళ ఇళ్ళలో దొంగతనాలు జరిగితే వాళ్ళ ఇంటి చుట్టు పక్కల ఉండే పేదవాళ్ళని అనుమానించి తప్పుడు కేస్‌లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏ కేస్‌నైనా దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నప్పుడు 498a కేస్‌ని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా కొంత మంది ఉండడం సహజమే కదా. అది 498a అయితే ఏమిటి, దొంగతనమైతే ఏమిటి, రేప్ అయితే ఏమిటి, మర్డర్ అయితే ఏమిటి? అటువంటప్పుడు 498a చట్టాన్నీ & వరకట్న నిషేధ చట్టాన్నీ నిషేధించాలని మాత్రమే డిమాండ్ చెయ్యడం ఎందుకు?
అందరికీ నమస్కారం..!
అచంగగారు అడిగిన ప్రశ్నలే, నా బుర్రలో చాలాకాలం నుండీ ఉన్నాయి. అడిగిన అచంగగారికీ, పెద్దమనసుతో సమాధానమిస్తున్న వనజ వనమాలి గారికీ ధన్యవాదాలు.
ఆడవారికి (ముఖ్యంగా ఇప్పటి తరం అమ్మాయిలకి ) సానుభూతి, వెసులుబాటు ఇవ్వడం మీద నాక్కూడా అభ్యంతరాలున్నాయి. ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడని, ఓ అబ్బాయి కళాశాల నుండి బయటకి పంపించేయగలరుగానీ అదే పని ఓ అమ్మాయి చేస్తే పంపించరు. ఇంట్లోవాళ్లని పిలిచి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొమ్మని మాత్రమే చెబుతారు. అబ్బాయిలకి మాత్రం ఆ సౌలభ్యం ఉండదు. ఇలాంటివారే ఆసిడ్లు పోద్దాం, ఏక్సిడెంట్లు చేద్దాం అని అనుకుంటారు.
సరే, అదలా ఉంచితే తల్లా, పెళ్ళామా టైపు గొడవల్లో తప్పు ఎవరిదైతేవాళ్లని ఖండించాలి అంటున్నారుగానీ మగవాడి మానసిక క్షోభని మాత్రం వదిలేస్తున్నారు.
అచంగగారూ..!
//సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది//
నిజంగానా.?!?!?! లేదా “షరతులు వర్తిస్తాయి” టైపా.?
@ శ్రీనివాస్ గారు
మీరేసిన ప్రశ్నలు ప్రతీ మగాడూ తనలో తాను వేసుకోగలిగినపుడు, సమానత్వం, హక్కులూ అనే తైతక్కలాటలు తగ్గిపోతాయని నా ఉద్దేశ్యం..! కానీ.. ఆ తెగింపు/వైఖరి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ప్రవీణ్,
భర్తను వదిలేసే ధైర్యమే లేని స్త్రీకి 498Aపెట్టే ధైర్యం రానక్కర్లేదు. ఎందుకంటె, ప్రపంచములోని స్త్రీలందరూ అలా ధైర్యం లేని వారు కాదు. ముందు మీరు 19వ శతాబ్దపు భావజాలలనుండి బయటకి వచ్చి, బయట ప్రపంచాన్ని చూడడం అలవాటు చేసుకోండి.
అన్ని కేసులూ దుర్వినియోగ మవుతున్నాయి అన్నది నిజమే. కానీ వాటికి పడే శిక్ష ఎంత? కనీస సాక్షాధారాలు కూడా లేకుండా.. Non-bailable కింద అరెస్ట్ చేసేవి ఎన్ని ఉన్నాయ్?
ఒక్క మాట మీద ఎటువంటి సాక్షాధారలతో సంభందము లేకుండా, ఒక కుటుంభాన్ని (ఆడవారినీ, ముసలివారినీ, 4 నుండి 7 యేల్ల పసిపిల్లల వరకూ) అందరినీ జైల్లో తోసే కేసులు ఎన్ని ఉన్నాయ్?
నెలల తరబడి బైలుకోసం, జైల్లో వేచి చూడాల్సిన కేసులు ఎన్ని ఉన్నాయ్?
498A చట్టం టాడా, ఫోటా ల వంటిది. నిజంగా బాంబులు వేసి విధ్వంసాలు సృష్టించిన వారి కోసం ఉద్దేశించిన టాడా, ఫోటాలు మాత్రం దుర్వినియోగమవుతున్నాయని గగ్గోలు పెట్టి, దాన్ని రద్దు చేసే వరకూ నిద్రపోనీ అపర మేధావులూ, మగవారిని అదే తరహా కేసులలో పెట్టి, హింసిస్తున్నప్పుడు మాత్రం అన్నీ దుర్వినియోగమే అవుతున్నాయి కదా సన్నాయి నొక్కులు నొక్కడం వింతగానే ఉంది.(లేక అది వారి నైజములో భాగమేనా).
అన్నింటికన్నా ఘోరంగా, తప్పుడు కేసులు పెట్టినట్టు ఋజువైనా సరే, అలా తప్పుడు కేసులు పెట్టినవారి మీదా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేని కేసులు ఎన్ని ఉన్నాయ్?
ఇప్పటికైనా సరే, పురుష హక్కుల సంఘాల వాల్లు కోరుతున్నది, 498Aను రద్దుచేయమని కాదు, DV Act ను రద్దు చేయమనీ కాదు. వాటికి కొన్ని సవరణలు చేయమనీ, దుర్వినియోగం చేసిన వారిని శిక్షించమని మత్రమే. అదికూడా అర్థం చేసుకోకుండా.. మీ ధోరణిలో మీరు వెలుతుండడం మాకు కొత్త కాకపోయినా.. ఎబ్బెట్టుగానే ఉంది.
లలిత గారూ,
మీ సమయం నాకోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు. నేను మీవైపు నుండి మీరు నావైపు నుండి మరొక్కసారి ఆలోచించి చూసుకుందాం.. మన వైఖరుల్లో లోపాలు తెలుస్తాయి.
ప్రవీణ్ గారూ,
"భర్తని వదిలేసే ధైర్యమే లేనివాళ్ళకి భర్త మీద 498a కేస్ పెట్టే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?"
మీరిలా మీ సొంత హైపోథసిస్ నామీద చక్కా వేసి పోతే దాన్ని నిరూపించే బాధ్యత నాది కాదు. మీరు చేసే వ్యాఖ్యలకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత మీది. లేదూ మీరిలానే సాగిపోతానంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు. దయచేసి మరోసారి విన్నవించుకుంటున్నాను. మీరు నా ప్రశ్నలను మరోసారి చూసి అర్థం చేసుకుని వ్యాఖ్యానించండి జవాబివ్వగలను.
వామనగీత గారూ,
సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడును మానసిక హింసగానే పరిగణించాలని విస్పష్టంగా తీర్పు చెప్పింది.
స్త్రీల సమస్యల ప్రశ్న వచ్చేసరికి పురుషులకి సమస్యలు లేవా అంటూ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించింది మీరైతే నేనేదో పక్కదారి పట్టించే వాదన చేశాననడం ఎందుకు? భార్య భర్తని వేధిస్తే భర్త ఆమెని వదిలేస్తాడు. పురుషాధిక్య సమాజంలో మగవానికి అది కష్టమేమీ కాదు. భర్త తాగుబోతైనా, వ్యభిచారి అయినా భార్య భరించడం చూస్తూనే ఉన్నాం. పోటాకీ, 498aకీ మధ్య పోలిక అనవసరం. పోటా చట్టం ప్రకారం ఒకడు మావోయిస్ట్ కాకపోయినా కేవలం అనుమానంతో అతన్ని అరెస్ట్ చెయ్యొచ్చు. అది అంత పనికిమాలిన చట్టం. ఖమ్మం జిల్లాలో ఒక డాక్టర్ మావోయిస్ట్‌లకి వైద్యం చేశాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. పోటా చట్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ దగ్గరకి వెళ్ళేవాడు తాను మావోయిస్ట్‌నని చెప్పుకుని వైద్యం చెయ్యించుకోడు. ఇది అందరికీ తెలిసినదే. అందులో డాక్టర్ తప్పేమీ లేకపోయినా ఆ డాక్టర్‌ని అరెస్ట్ చేశారు. కానీ 498aలో ఇలా కేవలం అనుమానంతో అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. పోటాకీ, 498aకీ మధ్య పోలిక పెట్టడం అంటే బోడి గుండు, మోకాలు పోలికే.
కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని హైపోథీసిస్ అనరు అచంగ గారు. లింగ వివక్ష లేదనీ, ఈ రోజులలో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని వేధిస్తున్నారని వాదించేవాళ్ళే తమ వాదనకి ఆధారం చూపించాలి. కులం, కట్నం లాంటి దురాచారాలు కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుండగా అది హైపోథీసిస్ అనుకుని ఆధారాలు వెతకడం ఎందుకు?
ప్రవీన్,
పోటాకి, 498Aకి పోలిక లేదా? మీకు 498A అంటే ఏంటో తెలీదని ఈ వ్యఖ్యని బట్టి చూస్తేనే అర్థమవుతోంది.
అనుమానముతో అరెస్టు చేయడం అన్నది లేకపోయినంత మాత్రాన మిగిలిన అన్ని హంగులూ ఉన్న చట్టాలను వాటితో పోల్చకూడదంటే ఒప్పుకోవడం కష్టమే. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా, పిజ్జా ఆర్డరు ఇచ్చినట్టు, ఒక కేసు పడేయగానే ఇంటిల్లిపాదీనీ అరెస్టు చేయడం (చిన్న పిల్లలతో సహా) ఎందులో తక్కువ?
ముందు.. కాస్త దాని గురించి చదివి ఇటురండి. చట్టముగురించి తెలీకుండా ఎవరో నలుగురు స్త్రీవాదులు రాసిన 19వ శతాబ్దపు రచణలను చదివి అదే నిజమనుకొని భ్రమలో వ్యాఖ్యానించడం మానుకోండి.
498A చట్టాన్ని ఉపయోగించి, నిజంగానే నేరం చేయకపోయినా అరెస్టు చేసి జైల్లో పడేయొచ్చు. అది నాన్- బెయిలబుల్. అంటే, తిరిగి వారు బయటికి రావాలంటే.. పోలీసు స్టేషనులో ఎవరో ఒకరు జామీను ఇస్తే సరిపోదు. ఒక మెజిస్ట్రేటు దగ్గర బెయిలు కోసం అప్లికేషను పెట్టుకుని పెట్టుకుంటే వారు విచారించిన తరువాత మాత్రమే వారికి బెయిలు దొరుకుతుంది.
అది కాగ్నిజబుల్ కూడా, అంటే పోలీసులకు ఫిర్యాదు అందిన తరువాత.. వారికి వారంటు, కోర్టూ ఆర్డరూ ఏవీ అక్కరలేదు. అరెస్ట్ చేయొచ్చు. అంతే కాదు, ఈ 498A విషయాలలో అయితే కేసు అబద్దమని పోలీసులు తిరస్కరించే అవకాశాం ఉండదు. (సాధారణంగా అది జరగదు కూడా).
మనిషి ప్రాణాలు సిద్దాంతము పేరు చెప్పి తీసే మావోయిస్టుల మీదా ,తీవ్రవాదుల మీదా సానుభూతి ఉన్న మగవారి మీద లేక పోవడం విచారకరం.
ఇక్కడ ఆడవారిపై వివక్ష లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. లింగ వివక్ష, కుల వివక్ష సమాజములో వేళ్ళూనుకొని పోయిన మాట వాస్తవమే. కానీ, లింగ వివక్ష అంటే కేవలం మగవారు స్త్రీలపై చూపే వివక్ష మత్రమే అనే తప్పుడు సిద్దాంతాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు.
దాని ఆధారంగా గృహహింస నిరోధక చట్టాం లాంటి మరో డ్రకోనియన్ చట్టాన్ని రుపొందించడాన్ని ప్రశ్నిస్తున్నారు. మీకు అది అర్థం కాకపోతే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు.
ఇప్పుడే గూగుల్ ప్లస్‌లో పల్లా కొండలరావు గారి వ్యాఖ్య చదివాను. భార్య భర్తని కొడితే భార్యని వదిలేసే అవకాశం పురుషాధిక్య సమాజంలో మగవానికి ఎప్పుడూ ఉంటుంది. కనుక భార్యలు భర్తల్ని కొట్టడాన్నీ & భర్తలు భార్యల్ని కొట్టడాన్నీ ఒకేలా చూడలేము. ఈ రెండిటికీ మధ్య పోలిక పెట్టడమే బోడి గుండు - మోకాలు పోలిక అవుతుంది.
@Pravin,
భార్య భర్తని కొట్టడమే కాదు, ఒక వేల విడిపోయి వేరేగా ఉన్నా కూడా మగవారు ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో బతకాల్సిన ఖర్మ మన దేశములోనే ఉంది. జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు నా మొదటి కామెంటులో రాశాను ఒక సారి చూడండి. అందులో ఆభర్త ఎందుకు కోర్టుగుమ్మం వరకూ ఎక్కాల్సి వచ్చిందో గూగులించండి సులువుగానే దొరుకుతుంది. మీరు బోడిగుండుకూ మోకాలికీ ముడే వేసుకుంటారో తడిగుడ్డతో తడే చేశుకుంటారో అది మీ ఇష్టం, రెండు రకాల కేసులూ ఉన్నాయన్నది మాత్రం నిజం.
వామన గీత గారు. నేను మీ వ్యాఖ్య లోని ఈ భాగాన్ని "సమానత్వం, హక్కులూ అనే తైతక్కలాటలు తగ్గిపోతాయని నా ఉద్దేశ్యం..!" గర్హిస్తున్నాను.
అంటే స్త్రీలు పురుషుల కంటే దిగువ శ్రేణిలో.. సమానమైన హక్కులు లేకుండానే ఉండాలని మీ ఉద్దేశ్యమా? సమానత్వం,హక్కులు కోసం పోరాడటం అనేది మీకు తైతక్కలాటగా కనిపిస్తుందా? మీ భావజాలానికి స్త్రీ జాతి జోహార్లు చెప్పాలి.
శ్రీకాంత్, నేను అన్నది చట్టంతో పని లేకుండా భార్యలని వదిలేసే మగవాళ్ళ గురించి. విడాకులు లేకుండా భార్యలని వదిలేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మగవాడు భార్యని వదిలేసినా అతనికి రెండో పెళ్ళి సంబంధం దొరుకుతుంది. అతను విడాకులు ఇచ్చి వదిలేశాడా, విడాకులు లేకుండా వదిలేశాడా అనేది ఎవరూ చూడరు. అతను కట్నం ఎక్కువ తీసుకుంటాడా, తక్కువ తీసుకుంటారా అనేది మాత్రం చూస్తారు. భార్య భర్తని వేధిస్తే భర్తకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అతను ఆమెని వదిలేసి రెండో పెళ్ళి చేసుకుంటే అతనికి కట్నం అదనంగా వస్తుంది. ఇక్కడ మగవాడు తన హక్కులు పోగొట్టుకోవడం అనేది జరగదు.
వనజవనమాలి గారు..!
తైతక్కలాట అని అన్నది సమానత్వం , హక్కులు పేరు చెప్పి వెర్రివేషాలేస్తున్న కొత్త తరం/రకం అమ్మాయిల గురించి. ఈ విషయం ఆ వ్యాఖ్యలోనే సరిగ్గా రాసి ఉండాల్సింది. మన్నించండి.
అమ్మాయి పెళ్లికి ముందు ఎన్ని వెర్రివేషాలేసినా, పెళ్ళి తర్వాత తిన్నగా ఉంటే చాలని అనుకుంటున్నారు ఈ తరం అబ్బాయిలు. నాకు తెలిసున్నంతవరకూ ఇది ముందు తరం ఆడవాళ్ళ రాజీ ధోరణి. అది మగవారికీ, మగవారి టేకిట్ ఈజీ ధోరణి ఆడవారికీ మారుతున్నాయి. అప్పుడొచ్చేది “సమసమాజం” కాదు, “ స్త్రీఆధిపత్యసమాజం” “జంబలకిడిపంబ”కి మల్లేనే..! అలా కాక, సమానత్వం, హక్కులకోసం మగవారు వివాహ వ్యవస్థమీద, సహజీవనాలమీద వైరాగ్య/తిరుగుబాటు ధోరణిని పెంచుకుంటేగానీ, ఇప్పటి తరం అమ్మాయిలు మగవారి కష్టాలనీ, ఆశయాలనీ గుర్తించరని నా అభిప్రాయం. పైన శ్రీనివాస్ గారి ప్రశ్న/వైఖరి కి సమర్ధింపు అందుకే.
“హక్కులు” అనేవి ఈ దేశంలో నిజంగానే నవ్వులాట అయిపోయింది. హక్కులు కావాలి అని అరిచేవారు బాధ్యతగా ఉండాలి అని మాత్రం అనుకోరు. (విద్యార్థి దశల్లోనే ఇలాంటివాటికి బీజాలు పడతాయి. సంబంధం లేకపోయినా “అవినీతి” గురించి చెప్పాలనిపిస్తోంది. అణ్ణా హజారె అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మా కాలేజిలో మందలా వెళ్లినవారు, కాలేజీవారు సంవత్సరానికోసారి ఇచ్చే “కంటిజెన్సీ” కోసం దొంగబిల్లులు సమర్పించారు. అంటే, రాజకీయనాయకులు చేస్తేనే “అవినీతి” మనం చేస్తే అవినీతి కాదు..ఇది మన నిర్వచనం.) అలాగే అవతలివారిక్కూడా హక్కులు ఉంటాయనీ, ఉండాలనీ గ్రహించరు. ఇది వివక్షే కదా..! ఈ జాతి(స్త్రీ/పురుష) విముక్తి ఉద్యమాల ముఖ్యలక్షణాల్లో అది కూడా ఒకటి.
ఇహ, //స్త్రీలు పురుషుల కంటే దిగువ శ్రేణిలో// అమ్మాయిలు మమ్మల్ని దాటుకునిపోతూ ఉంటే, ఇలాంటి భావాలు పెట్టుకుంటే ఎలా బతగ్గలం..?
అమ్మాయిల తప్పుల్నే ఎత్తిచూపడంలోని ఉద్దేశ్యం, ఆడవారంతా అమాయకులు అనే పాతతరం భావనల్ని పక్కనబెడతారని. //మీ భావజాలానికి స్త్రీ జాతి జోహార్లు చెప్పాలి// ఈ స్థాయి ఖండన ఊహించలేదు.
@Pravin,
నేరాలు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కాకపోతే వచ్చిన చిక్కంతా ఆనేరానికి సరైన శిక్ష ఉందా లేదా అన్నది మాత్రమే.
భర్త భార్యను వదిలేస్తే ఆమె అతన్ని 498A ద్వారా కానీ, DV Act ద్వారా కానీ శిక్షించవచ్చు. అంతే కాదు, ఆమెకు రావాల్సిన సర్వ హక్కులు రాబట్టుకోవచ్చు. చేయాల్సింది ఆమె కేసు పెట్టడం మాత్రమే. అంతే కాదు, విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకోవడం చాలా పెద్ద నేరం.
అయినా ఆ నేరాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అమాయకులైన ఆడవారు బలవుతూనే ఉన్నారు. దీన్ని నేను కాదన్ను.
ఇక్కడ కావాల్సింది ఆ ఆడవారిలో చైతన్యం, తమకున్న హక్కుల పట్ల అవగాహన మాత్రమే. ఒక్కసారి వారు కేసు పెట్టగలిగితే చాలు, వారికి రావాల్సినవన్నీ వస్తాయి.
మరో వైపు, ఆడది మగవాన్ని వదిలేసి వెళ్ళినా ఆమెకు ఎటువంటి శిక్షా ఉండదు. ఆవిడ అలా వెలితే మగాడు విడాకులు ఇవ్వడం తప్ప, మరేమీ చేయలేడు. ఆవిడను శిక్సించడం కుదరదు. గుజరాటులో అనుకుంటా.. ఒకావిడ అలా వదిలేసి వెలితే, భర్తను విడాకులకు అప్లై చేసుకోమని సలహా ఇవ్వగలిగిందే కానీ కోర్టు ఆస్త్రీని శిక్షించలేక పోయింది. రెండింటిలో ఏది ఘోరమైనది?
అసలు శిక్షించేందుకు చట్టమే లేకపోవడామా? లేక చట్టాలున్నాయని తెలియని అమాయకత్వమా? అమాయకత్వాన్ని, కొంత మంది విఙ్ఞులు తొలగించగలరు, చట్టమే లేకపోవడాన్ని మాత్రం ఏమీ చేయలేరు.
అమ్మాయిలు చెడిపోవడంలో కూడా మగవాడితో పోటీ పడటం ని నేను గమనించాను. మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తాను. ఉన్నత వర్గంలో.. అది నాగరికత అంటారేమో! కానీ మధ్యతరగతి,పేదరిక కుటుంబాలలోని స్త్రీల కి చాలా సమస్యలు ఉన్నాయి. వరకట్నం, వ్యసనాలు కుటుంబ హింస మొదలైన వాటిని వాటిని పురుష ప్రపంచం అర్ధం చేసుకోగల్గితే బయట ప్రపంచం నుండి ఆమెకి సహాయం,సానుభూతి అందకపోయినా సరే..నెగెటివ్ గా భావించకుండా ఉంటె అదే పదివేలు.
ఇంకో విషయం ఏమంటే.. ఈ తరం అమ్మాయిలలో.. పెరుగుతున్న పెడ దోరణి ని అంగీకరించడానికి కొంతమంది స్త్రీవాదులు ఒప్పుకోరు. నేను ఆ విషయం గమనించాను. మనని పురుష ప్రపంచం విమర్శంచి.. మనని మనము విమర్శించుకుంటే విలువ ఏముంటుంది..అని ఒకరు..వ్యాఖ్యానించడం.. చూసాను.
స్త్రీలకి సమానత్వం,హక్కులు,ఉద్యోగాలు లభించినంత మాత్రాన స్త్రీ కోణం లోనుండి చూసే సమస్యలు చాలా అలాగే ఉన్నాయి. వాటిని వదిలేసి పురుషుడితో..నేను పోటీ పడతాను అంటూ.. పబ్ లకి.. వెళ్ళే సంస్కృతిని..స్వేచ్చ అంటూ తిరుగుతూ.. సామాజిక భద్రతని ఇవ్వలేని సమాజంలో మెలగాలనుకోవడం చాలా చేటు చేస్తుందని ఈ తరం అమ్మాయిలు తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది నాకు. మీ వివరణ నాకు కొంత శాంతిని కల్గించింది. ధన్యవాదములు.
లలిత గారు.. స్పందించినందులకు ధన్యవాదములు ఓపికగా అందరు వ్యాఖ్యలు చదువుతున్నాను. మీ వాదన అర్ధమైతే చాలు. అభిప్రాయాలు మారతాయని అనుకుంటున్నాను.
ముక్కూ మొహం తెలియకపోయినా, ఒక్కసారైనా కలవకపోయినా, మీ పక్కవీధి అమ్మాయి మీ మీద కెసు పెట్టి మీ బతుకు బండలు చేసే వెసులుబాటు ప్రస్తుత స్త్రీ వాద చట్టాల్లో ఉందని కొందరు గ్రహిస్తె మంచిది. ఏ స్త్రీ అయినా ఎందుకలా చేస్తుందని మొండి వాదన లాభం లేదు. Its called Murphy's law. డబ్బు కోసం కావొచ్చు, పక్క వాళ్ళ సలహా మీదొ బలవంతం మీదో కావొచ్చు లేదా మీ మీదున్న అజ్ఞాత ప్రేమతో కావొచ్చు.
ప్రస్తుత చట్టాల ప్రకారం..గంటకి పదివేలు వసూలుచేసే హై క్లాస్ వేశ్యకైనా ఏ రకమైన శిక్షా లెదు. చట్టం ద్రుష్టిలో ఆమె విధి వంచిత! మహా అయితే ఓ వారం ఘనత వహించిన స్త్రీ జనోధరణ సంస్థలో కుట్టు పని నేర్చుకోని(!) మళ్ళీ బైటకొచ్చి తన పని తను చేసుకోవచ్చు. కానీ, వంద రూపాయలకు ఆమెకు కస్టమర్ని మోసుకొచ్చే ఆటో డ్రైవర్, రిక్షావాలా లాంటి అభాగ్యుల్ని మాత్రం నిరభ్యంతరంగా జైల్లో పెట్టొచ్చు. స్త్రీ నిరభ్యరంతరంగా వివాహంలోనించి అలా నడుచుకుంటూ (సినెమాలో చూపెట్టినట్టుగా కట్టుబట్టలతో కాదు...కనీసం అవ్వైనా మిగల్చకుండా) వెళ్ళిపోవొచ్చు. మహ అయితే పాపం మొగుడు వెధవక్కూదా కాస్తేదైనా మిగల్చమని మహారజశ్రీ కోర్టు వారు బ్రతిమిలాడుకుంటే ఇస్తే ఇవ్వొచ్చు.
స్త్రీ, వివాహ బంధంలో ఉన్నా సరే, ఎవరితో అయినా అలా వెళ్ళి పోవొచ్చు. తిరిగి రాక పోవొచ్చు. వెల్తూ వెల్తూ ఓ 498 కేసు వేసేసి నచ్చిన వాడితో మొగుడి డబ్బుల్తో హానీమూన్ ప్లాన్ చేసుకోవొచ్చు. ఆ వీడియోలు, ఫోటొలు నెట్ లో పెట్టినా మహా అయితే కోర్టు వారు దొంగ మొగుడ్ని జైల్లో పెడతారు తప్ప ఆమెకి శిక్ష లేదు.
పొర్న్ స్టార్లని లివింగ్ రూంస్ లోకి, పాపులర్ షొస్లోకి తీసుకొచ్చినా, సీతా సావిత్రుల దేశంలో ఏ మహిళా సంస్థకి పెద్దగా అభ్యంతముండదు. (పారిస్ హిల్టన్, మడొన్నాలున్న మా అమెరికాఆలో! అయితే ఊరుకోరని సగర్వంగా చెప్పగలను). పాతివ్రత్యమంటే పడేసి తన్నటానికి మాత్రం ఎల్ల వెళలా సిద్ధంగా వుంటారు.
I pity those who still believe this legal terrorism(coined by no less than the Supreme Court of India) helps family or even women.
ప్రవీణ్ గారూ,
"కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని హైపోథీసిస్ అనరు అచంగ గారు"
ఏది కళ్ళకు కనబడే నిజం?
"లింగ వివక్ష లేదనీ, ఈ రోజులలో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని వేధిస్తున్నారని వాదించేవాళ్ళే తమ వాదనకి ఆధారం చూపించాలి"
ఇక్కడ మగవారికి అనుకూలంగా మాట్లాడినవారిలో (ఇప్పటివరకూ) ఒక్కరంటే ఒక్కరైనా లింగవివక్ష లేదని అన్నారా? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళను వేధిస్తున్నారనేది ముమ్మాటికీ వాస్తవం. స్వయంగా సుప్రీం కోర్టు, బొంబాయి హైకోర్టు చెప్పిన విషయమే అది. అలాగే మగవారిని వేధించటానికి ఎన్నిరకాల అవకాశాలుండాలో అన్నీ ఉన్న చట్టం రక్షణలో ఆడువారు, అది దుర్వినియోగమైనా కనీసం ఆడవారిని మందలించే అవకాశం కూడాలేని స్వేచ్చతో మగవారున్నారనేది నిష్ఠుర సత్యం.
"కులం, కట్నం లాంటి దురాచారాలు కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుండగా అది హైపోథీసిస్ అనుకుని ఆధారాలు వెతకడం ఎందుకు?"
మీరు చెప్పిన హైపోథిసిస్ ఇదీ "భర్తని వదిలేసే ధైర్యమే లేనివాళ్ళకి భర్త మీద 498a కేస్ పెట్టే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?" అది శుద్ధఅబద్ధం. 498a దుర్వినియోగం అయిన కేసులు సవాలక్ష.
వనజ గారూ,
"అమ్మాయిలు చెడిపోవడంలో కూడా మగవాడితో పోటీ పడటం ని నేను గమనించాను"
నేను మాట్లాడుతున్నది సరిగ్గా ఈ విషయము గురించే.
"ఈ తరం అమ్మాయిలలో.. పెరుగుతున్న పెడ దోరణి ని అంగీకరించడానికి కొంతమంది స్త్రీవాదులు ఒప్పుకోరు"
ఇదే మగవారి విషయములో నేను లేవనెత్తిన ప్రశ్నలకు మూలం.
"స్త్రీలకి సమానత్వం,హక్కులు,ఉద్యోగాలు లభించినంత మాత్రాన స్త్రీ కోణం లోనుండి చూసే సమస్యలు చాలా అలాగే ఉన్నాయి"
ఈ సమస్యలు పరిష్కరించుకోవటానికి కేవలం మగవారిని తిడుతూ కూర్చోవద్దంటున్నాను.
"పురుషుడితో..నేను పోటీ పడతాను అంటూ.. పబ్ లకి.. వెళ్ళే సంస్కృతిని..స్వేచ్చ అంటూ తిరుగుతూ.."
నేను మొదటినుండీ చెబుతున్నది ఇదే... స్వేచ్ఛకి పరిమితులుంటాయని.
ఒక అన్యాయాన్ని సరిచెయ్యటానికి మరో అన్యాయాన్ని వేరొకరిపై రుద్ధుతాం అంటే అది ఎంతమాత్రం సమన్యాయం అనిపించుకోదు. ఆటవిక న్యాయం అవుతుంది. హక్కులెలా సమానం అంటున్నారో శిక్షలూ సమానంగానే ఉండాలంటున్నాను. ఒక విడాకుల కేసులో నూటుకి 90శాతం పైన పిల్లల కస్టడీ ఆడవాళ్ళకే చెందుతుంది. అలాంటి ఏకపక్ష నిర్ణయాలు వద్దు అంటున్నాను.
అచంగ గారు, భర్తని వదిలెయ్యడం చిన్న విషయమే. భర్త మీద 498a కేస్ పెట్టడం పెద్ద విషయం కనుకనే ఆ ధైర్యం చాలా మంది స్త్రీలకి లేదని అన్నాను. స్త్రీ తన భర్త మీద 498a కేస్ పెడితే భర్త ఆమెని ఇంటిలోకి రానివ్వడు. అటువంటప్పుడు భర్తని వదిలేసే ధైర్యం లేనివాళ్ళు భర్త మీద 498a కేస్ ఎలా పెడతారు? ఈ విషయం చెప్పడం హైపోథీసిస్ అనుకుంటే కళ్ళకి కనిపించే నిజాలన్నీ హైపోథీసిస్ అనుకోవాలి. అప్పుడు ఆది శంకరాచార్య మిథ్యావాదానికీ, మనకీ తేడా ఏమీ ఉండదు.
ఇందాక నేను వ్రాసిన వ్యాఖ్య మళ్ళీ చదవండి:
"భార్య భర్తని కొడితే భార్యని వదిలేసే అవకాశం పురుషాధిక్య సమాజంలో మగవానికి ఎప్పుడూ ఉంటుంది. కనుక భార్యలు భర్తల్ని కొట్టడాన్నీ & భర్తలు భార్యల్ని కొట్టడాన్నీ ఒకేలా చూడలేము. ఈ రెండిటికీ మధ్య పోలిక పెట్టడమే బోడి గుండు - మోకాలు పోలిక అవుతుంది."
కనుక భార్యలు కూడా భర్తల్ని కొడుతున్నారని చెప్పి జెండర్ ఇష్యూస్‌ని పక్కదారి పట్టించడం హాస్యాస్పదమే అవుతుంది.
ప్రవీణ్ గారు,
"భర్తని వదిలేసే ధైర్యం లేనివాళ్ళు భర్త మీద 498a కేస్ ఎలా పెడతారు?"
పాడిందే పాటరా అని అదేదో సామెత చెప్పినట్టు మీ ధోరణిలో మీరు సాగిపోవటమే తప్పించి ఎదుటివారు చెప్పే విషయాన్ని కాస్త అవలోకనం చేసుకునే అలవాటు మీకు లేనట్టుంది. 498ఎ కేసులు ఎలా పెడతారని అడగటం మీ అమాయకత్వమో లేదా అతితెలివో తప్పితే మరొకటి కాదు. అధమపక్షం కొన్ని పదుల సంఖ్యలో 498ఎ కేసులు దుర్వినియోగమైన విషయం దేశ సుప్రీం కోర్టే అంగీకరించింది. మీ అంగీకారముతో పని లేదు.
"భార్యలు భర్తల్ని కొట్టడాన్నీ & భర్తలు భార్యల్ని కొట్టడాన్నీ ఒకేలా చూడలేము."
ఎందుకో?! నేరం ఎవరు చేసినా నేరమే. అందులో ఎక్కువ తక్కువ ఉండదు. అలా ఉంచాలనుకోవటమే నయా స్రీవాదం!
ఏతావాతా కాస్త ధోరణి మార్చుకొమ్మని మరో ఉచిత సలహా. ఇక ఈ టపాకి సంబంధించి నావైపు వాదనలు/చర్చ ముగిస్తున్నాను.
వ్యాఖ్యాతలందరికీ,
అర్థవంతమైన చర్చ జరగటానికి అవకాశమిచ్చిన ప్రతీఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
నేను వ్రాసిన వ్యాఖ్యలోని కనీసం రెండు ముక్కలు గుర్తున్నా అది పాచిపళ్ళ దాసరి పాటలా అనిపించదు.
>>>>>
స్త్రీ తన భర్త మీద 498a కేస్ పెడితే భర్త ఆమెని ఇంటిలోకి రానివ్వడు. అటువంటప్పుడు భర్తని వదిలేసే ధైర్యం లేనివాళ్ళు భర్త మీద 498a కేస్ ఎలా పెడతారు?
>>>>>
498a కేస్‌లు అధమ పక్షంలో పదుల సంఖ్యలో దుర్వినియోగమయ్యాయని కోర్ట్ అంగీకరించి ఉండొచ్చు. దొంగతనం కేస్‌లు వేల సంఖ్యలో దుర్వినియోగమయ్యాయని చెప్పడానికి నేను ఆధారాలు చూపించగలను. మా మామయ్య ప్రభుత్వ అధికారి కాబట్టి అతను పని చేసిన ప్రాంతాలలోని లెక్కలు కూడా చూపించగలను. ఆకలితో దొంగతనాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, దొంగతనాలు జరిగితే ఆకలితో ఉన్నవాళ్ళని అనుమానించేవాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు. దొంగతనాల కేస్‌ల దుర్వినియోగం కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి విషయాలలో eternal flames ఆగిపోవాలనికోరుకోరు కానీ ఆడ-మగ సంబంధాల విషయానికొచ్చేసరికి ఆడవాళ్ళు 498a కేస్‌లని దుర్వినియోగం చేస్తున్నారని గగ్గోలు పెడతారు. భర్త మీద ఆధారపడాల్సిన ఆర్థిక అవసరం లేని కొంత మంది డబ్బున్న స్త్రీలు 498a కేస్‌లని దుర్వినియోగం చెయ్యగలరు. అంతమాత్రానికే 498a చట్టంలో సవరణలు చెయ్యాలనడం ఒక జోక్.
@pravin
పదుల సంఖ్యలో దుర్వినియోగమవుతున్నాయా? మీకు వివరాలు తెలీక పోతే తెలుసుకోండి లేదా ఊరకుండండి. అంతే కానీ, ఇలా తెలీని విషయాలు తెలిసినట్టు మాట్లాడకండి. మీకు నేను ఇది వరకు ఒకసారి పోస్టులో కూడా చెప్పడం జరిగింది. 498A చట్టం దుర్వినియోగం ఏ రేంజులో ఉందో. నిజానికి, దుర్వినియోగ మవుతున్నవి కాదు, సద్వినియోగ మవుతున్నవి మాత్రమే పదుల సంఖ్యలో ఉంటాయి. మిగతావి దుర్వినియోగ మవుతున్నవే.
ఇంత చెప్పిన తరువాత కూడా సవరణలు అవసరం లేదు అనడమే పెద్ద జోక్. దాన్ని మీరు చాలా సార్లు వాడేసినట్టున్నారు.
అచంగ ప్రశ్నలకి నా జవాబులు ..పోస్ట్ కి స్పందించిన అందరికి ధన్యవాదములు.
ప్రవీణ్ గారు..మీరు స్త్రీలకి సంబంధించిన సమాచారాన్ని.. ముఖ్యంగా 498a గురించి చాలా బాగా వివరంగా చెప్పారు. ధన్యవాదములు. మీరు అన్నట్లు 498a ఆర్ధిక స్తోమత ఉన్నతవర్గాలలో స్త్రీలు ,బాగా చదువుకున్న వారు మాత్రమే.. ఉపయోగించుకోవడం గమనిస్తున్నాం. మీరు,శ్రీకాంత్ గారు చేసిన చర్చవల్ల ..అచంగ అభిప్రాయాలు..వెరసీ.. చాలా స్త్రీలకి తెలిసాయి. అది కూడా చాలా అవగాహన పెరిగే విధంగా..
స్పందించిన అందరికి.. శ్రీకాంత్ గారికి,పావని గారికి,జై గారికి, వామనగీత గారికి ,అచంగ గారికి ..అందరికి ధన్యవాదములు.
ఇంతటితో..ఈ చర్చన ముగిద్దాం. వాదనలవల్ల అభిప్రాయాలు మారవు. మొండితనం,మూర్ఖత్వం బయటపడతాయి.
ఎవరు ఎవరికి శత్రువులం కాదు. అలాగే మిత్రులం కూడా కాదు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి అనుభవాలు వారివి. అందరికి మరి మరి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి