13, ఫిబ్రవరి 2012, సోమవారం

రోజా పూలు

ఎవరు ఎవరికి ఏ పూలు అయినా పెట్టవచ్చేమో! లేదా  ఇవ్వ వచ్చేమో కానీ అమ్మాయి..అబ్బాయి ఇచ్చుకునేవి  పుచ్చుకునేవి  మాత్రం..   రోజా పూలు ... 

మొదటి రోజు .. స్నేహం గా నవ్వి.. స్వచ్చమైన స్నేహంకి గుర్తుగా


                                 
రెండవరోజు.. నువ్వు నాకు నచ్చావ్.. అంటూ.. 


                                                
మూడవరోజు.. పెరుగుతున్న స్నేహానికి చిహ్నంగా.. 


నాలగవరోజు.. గాఢమైన ప్రేమ కి గుర్తుగా.. 


అయిదవ రోజు.. కలసిన మసులకి వేదికగా.. 


ఆరవ రోజు నిరసన తెలుపుకుంటూ..


ఏడవ రోజు.. మళ్ళీ  ప్రెష్ గులాబీ పూసింది.. చివరిగా.. ఓ..జోక్.. నవ్వాలి మరి. 

భార్య: ఏమండీ!! నాకు రోజా పూలు అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా!?. 

నేను  అడగ కుండానే ఈ  వాలెంటైన్స్ డే కి నాకు కానుకగా.. రోజాలు ఇస్తారనుకున్నాను. అంది నిష్టూరంగా.. 

భర్త: ఒసేయ్ పిచ్చి మొహమా!  రక రకాల గులాబీలు ఇచ్చి ఇచ్చి విరక్తి కలిగిందే!  నీకు రోజాలు వద్దు కానీ.."సరోజా" ని ఇస్తాను అన్నాడట. 

భార్య: సరోజా.. ఆమె ఎవరు..అంది

భర్త: ఆమె కాదు.. మనకి పుట్టబోయే  అమ్మాయి..అన్నాడంట.


5 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

చివరి జోక్ బాగుంది అండి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విడిపోదామనుకున్నప్పుడు ఏ పూలు ఇస్తారో?

జయ చెప్పారు...

అన్నిపూలు ఒక్క చోట. సేకరణ ఎంతో బాగుంది వనజ గారు. మీకు యెల్లో పూలు నేనిస్తున్నా తీసేసుకోండి.
సుబ్రహ్మణ్యం గారు నిరసనకు ఉన్నాయికదండి నల్ల పూలు ద.హా.

కాయల నాగేంద్ర చెప్పారు...

ప్రేమ చిహ్నాలు గులాబీలన్ని బాగున్నాయండి!
కొసమెరుపుగా జోక్ చాలా నచ్చింది.

వనజవనమాలి చెప్పారు...

బాలు.. జోక్ నచ్చిందా!? థాంక్ యు!
@బులుసు గారు.. నిరసన తెలపడం అంటే విడిపోవడమే నండీ! మీకు సందేహమా? :)))))) ధన్యవాదములు
@ జయ గారు.. సో..స్వీట్.. థాంక్ యూ!
@ నాగేంద్ర గారు.. థాంక్ యు..వేరి మచ్. ఏదో.. కాస్త నవ్వించే ప్రయత్నం చేసానన్నమాట.