ఒకే ఒక జీవితం
ఈ పాట విన్నారా? పైన లింక్లో వినేయండీ .మంచు మనోజ్ చిత్రం "మిస్టర్ నోకియా ' లో పాట ఇది.
అమ్మా ! ఈ పాట విన్నావా!? బాగుంది విను అంటూ డౌన్లోడ్ లింక్ ఇచ్చాడు. మా అబ్బాయి. తన పాటల ఎంపిక ఎప్పుడూ నచ్చుతుంది నాకు.
పాట సాహిత్యం ..వింటూనే హృదయం ఆర్ద్రమైనది
సాహిత్యం చూడండీ!
ఒకే ఒక్క జీవితం
ఇది చేయి జారి పోనీయకు
మళ్లీ రాని ఈ క్షణాన్ని మట్టి పాలు కానీయకు
కష్టమనేది లేని రోజు లేదు కదా
కన్నీరు దాటుకుని సాగిపోక తప్పదు గా
అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
ఆనందం కోసం ఈ పరుగు
కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు... ఓ...ఓ......ఓ....ఓ..
నువ్వెవరో నేనెవరో
రాసిన దెవరో మన కథని
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగివేవన్నీ
ఇది మంచిదని అది చెడ్డదని
లోపాలు వేయగల వారెవరు?
అందరికి,చివరాఖరికి
తుది తీర్పు ఒక్కడే పై వాడు
అనుకున్న మేలు నీవు
అనుభవాలేగా రెండూ
దైవం చేతి బొమ్మలేగా
నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వేయకుంటే
కాలయాత్ర జరిగేనా?
నడి సంద్రమందు నిన్ను ముంచాక
ఎదురీద కుండ మునకేస్తావా?
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
ఆ దరికి చేర్చవా? ..ఓ..ఓ..ఓ...ఓ...హొ... .
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గంలో తనతో ఎవరు నడవరులే
చీకటిలో, నిశిరాతిరిలో నీ నీడ కూడా నిను వదలదులే.
నీ వారను వారంటూ లేరంటూ నిను నమ్మితే మంచిదిలే!
చితి వరకు నీతో నువ్వే నువ్వే
చివరంటూ నీతో నువ్వే నువ్వే
చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
లోకాన నమ్మకం లేదసలే
దాని పేరు మోసమై మారేనులే
వేరవరి సాయం ఎందుకులే
నిను నిన్ను నమ్ముకో..
హొ...ఓ..ఓ..ఓ.. ఓ..ఓ... ఓ..
సంగీతం యువన్ శంకర్ రాజా
ఇంతకీ ఈ పాట యూత్ నచ్చే చాన్స్ లేదని నాకు అనిపిస్తుంది. ఒరవడి మారుతుందేమో ఎదురు చూడాలి.
1 కామెంట్:
hmm gud song andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి