కథా విశ్లేషణకి నేను ఎంపిక చేసుకున్న మరో కథ రిగ్గింగ్ - నాగసూరి వేణుగోపాల్
ఈ కథ చదవడం మొదలెట్టినప్పటి నుండి అక్షరాల వెంట ఆలోచన లేకుండా పరుగెడుతూనే ఉంటాం.
సబ్ ఎడిటర్ ఉద్యోగం అంటే మాటలా..? నానా రకాల పైత్యాలని అక్షరాలలో నింపి..పత్రికలకి గురి విసిరిన బాణాలు లాటివి కథలు. ఆ బాణం సబ్ ఎడిటర్‌కి గుచ్చుకుంటే చాలు. లక్షల మంది హృదయాలని గుచ్చేసినట్లే! కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు కుప్పల తెప్పలుగా వచ్చిపడే కథల కొండని తవ్వి మంచి కథనే ఎలుకని పట్టాలి దగ్గర మొదలెట్టిన సబ్ ఎడిటర్ స్వగతం... వింటున్నంత సేపు హాస్యం వెల్లివిరుస్తూనే ఉంది. చురుకైన చిన్నవైన సంభాషణా చాతుర్యం ఉన్న రచయిత కథ ఇది. పాఠకుల హృదయాలలో కథ తాలూకు దృశ్యం ప్రత్యక్షమవుతుంది.
ఇక కథ విషయానికి వస్తే కథల ఎంపిక చాలా విసుగు కల్గించే విషయం. లబ్ధ ప్రతిష్టుల సాదాసీదా కథల మధ్య వర్ధమాన కవుల మంచి కథలు దాక్కుని ఉంటాయి. అందుకనే అన్నీ నచ్చినా నచ్చకపోయినా చదివి తీరక తప్పని పరిస్థితుల్లో సబ్ ఎడిటర్ స్థానం బాధ్యత కల్గినది, క్లిష్ట మైనది కూడా. అలా ఓ.. సబ్ ఎడిటర్ తనలాంటి వారి ఇబ్బందులని చెపుతూ ఉండే కథ ఈ కథ.
అలాగే పేరుపొందిన రచయితల,లేదా పరపతి కల్గిన వ్యక్తులు లేదా వారి అనునూయుల రచనలని వెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నాలని పైరవీ చేసే విషయాన్ని తెలుపుతుంది. ప్రచురణ తర్వాత వారి కథల పై పాఠకుల స్పందనని తెలిపే ప్రక్రియలో ఎలాటి నీచ స్థాయిలోకి దిగజారి స్వయంగా అభిప్రాయాలని వ్రాయించుకుని వాటిని ప్రచురించమనే ఒత్తిడిని పెంచుతూ చేసే ఫోను కాల్స్ రావడం వంటి దిగజారిన చర్యలు సాహితీ వాతావరణములోనూ వేళ్ళూనుకున్న కాలుష్యాన్ని చెప్పాయి.
విశేష ఆదరణ పొందటమో,లేదా వివాదాస్పద మవడమో ద్వారా అవార్డులు,సన్మానాలుకి అర్హత లభిస్తుందేమో అనుకోవాలి. ఒక రచన స్థాయిని పాఠకుల స్పందనతో కూడిన ఉత్తరాలు తెలుపుతాయి. ఉత్తరాల ఆధారంగానే రమణయ్య లాంటి రచయితలూ మరింత గుర్తింప బడతారేమో కూడా అన్న సందేహమూ వచ్చింది.
విశేష ఆదరణ పొందటమో,లేదా వివాదాస్పద మవడమో ద్వారా అవార్డులు,సన్మానాలుకి అర్హత లభిస్తుందేమో అనుకోవాలి. ఒక రచన స్థాయిని పాఠకుల స్పందనతో కూడిన ఉత్తరాలు తెలుపుతాయి. ఉత్తరాల ఆధారంగానే రమణయ్య లాంటి రచయితలూ మరింత గుర్తింప బడతారేమో కూడా అన్న సందేహమూ వచ్చింది.
నిజానికి ఇది వాస్తవం కూడా! ఎంతో మంది ఈ కథ లోని రచయిత రమణయ్యలా పేరున్న రచయితలూ, ఆర్ధిక బలం కలిగి కథా సంకలనాలు వెలువరిన్చుకోగల్గిన వారు, సాహితీ స్రష్టలు కూడా ఇంకా ఇంకా వారి రచనలే పత్రికలలో వెలుగు చూడాలనే తాపత్రయంతో వర్ధమాన కవులకి చోటివ్వక అన్ని చోట్లా వారే దర్శనం ఇస్తారు. ఎంతో బాగా వ్రాయగల్గిన వర్ధమాన కవులు, రచయితలూ వారికి ప్రముఖ పత్రికల్లో స్థానం లభించక నిరాశ నిసృహలతో కలం మూల పడేస్తారు. వారికి కూసింత ప్రోత్శాహం కూడా లభించని స్థితిని తమ ఆధిపత్యపు చేతుల్లోకి లాక్కునే రమణయ్య లాంటి కొందరి ప్రముఖ రచయితల మనస్తత్వాన్ని, కీర్తి కండూక కాంక్షని సున్నితంగా విమర్శిస్తూ చెప్పిన ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. చదువుతున్నంత సేపు నాకు తెలిసిన కొన్ని వాస్తవ పాత్రలు, పైరవీలు. అన్నీ కళ్ళ ముందు కదలాడి నవ్వు తన్నుకు వచ్చింది.
రిగ్గింగ్ ఓట్ల బాలెట్ బాక్స్ లలోనే కాదు, సాహిత్యరంగం లోను ఉందని నిజాయితీగా చెప్పిన కథ. అందుకే నాకు నచ్చిన కథ.
3 కామెంట్లు:
వనజవనమాలి గారూ మీరు విశ్లేషించే అన్ని కధలూ బాగున్నాయండీ..
All The Best!
మీరు వ్రాసింది నిజం...రచయితలలొ కూడా అవినీతి...
చాలా చక్కని కధ...అంత కన్నా బాగ విమర్శ వ్రాసారు
వనజా దీది ,,....
మీ విశ్లేషణ చాలా బాగుంది ....ఇంకా ఇంకా రాస్తూ ఉండండి ,,,,,:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి