29, జనవరి 2012, ఆదివారం

చాందిని రాత్ మే

చాందిని   రాత్ మే  ఏక్ బార్    తుజే  

నాకు  చాలా చాలా ఇష్టమైన ఈ పాట " దిల్ ఏ నాదాన్"   చిత్రం లో పాట.

ఈ చిత్రంకి   " ఖయ్యాం"  సంగీత దర్శకత్వం వహించారు.  సంగీతం ఎంత అధ్బుతంగా ఉంటుందో..సాహిత్యం అంతకన్నా బాగుంటుంది. గజల్ తో పోల్చ తగ్గ సాహిత్యం. అందుకే ఈ పాటని తెనుగీకరించ సాహసం చేసాను. ఎక్కడైనా తప్పులు ఉంటే మన్నించాలి. కొన్ని ఉర్దూ పదాలు ఉండటం మూలంగా అనువాదం అంత సులభంగా లేదు కూడా. 

పాటని వింటూ సాహిత్యం గమనించండి. చాలా మంచి పాట .

 వెన్నెల రాత్రిలో ఒకసారి నేను నిన్ను చూసాను.
నన్ను నేను తరచుకుంటూ..లోలోపల సిగ్గుపడుతూ..
వెన్నెల రాత్రిలో నేను నిన్ను చూసాను..
అంటుంది ఆమె.

నీలాకాశంలో  ఎక్కడో   ఉన్న ఊయలలో 
ఏడు రంగుల ఇంద్రధనస్సు ఊయల లో
అద్భుతమైన అందం అలలు అలలుగా ప్రసరిస్తూ ఉంటే  
నన్ను నేను తరచుకుంటూ నన్ను చూసి నేనే సిగుపడుతూ..
వెన్నెల రాత్రిలో.. నేను నిన్నూ చూసాను..
అంటున్నాడు అతను.

సెలయేటి తీరం వద్ద మేల్కొంటునటువంటి ఏవేవో ఊహలలో 
అందమైన నవ్వుని చిందించే..మోమును
నా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో 
ఒక వర్ణ రంజితమైన గజల్ ని ఆలపిస్తూ ఉండగా..
పూలు కురుస్తూ ఉండగా,ప్రేమ ప్రజ్వల్లిల్లుతూ ఉండగా.. 
ఓ.. వెన్నెల రాత్రిలో నిన్ను  ఒక సారి చూసాను..  
అని ఆమె  చెపుతూ ఉండగా.. 

ఇప్పుడు అతని మనసులో మాట ఎలా ఉందంటే...
విడివడి పరచుకున్న..సువాసనలు వెదజల్లే కురులు 
ఆ సువాసన గాలిలో కలసి కరిగి పోయింది. 
నా ప్రతి శ్వాస ని ప్రోత్శాహిస్తూ..
నన్ను నేను తరచుకుంటూ..నాలో నేను సిగ్గుపడుతూ.. 
ఒక వెన్నెల రాత్రిలో నిన్ను నేను చూసాను...
 అంటున్నాడు.

నీవు ముఖం   మీది ముఖం వంచావు. 
నేను నా ముఖాన్ని చేతుల్లో దాచాను 
 సిగ్గుతోను,గాబరాపడుతూను..  
పూలు కురుస్తూ ఉండగా..ప్రేమ ప్రజ్వ ల్లిల్లుతూ ఉండగా 
వెన్నెల రాత్రిలో నేను నిన్ను చూసాను. ..
అంది ఆమె.             lyrics: naqsh layal puri
music:khayyaam

chaandani raat me, ek baar tujhe dekhaa hai Kud pe itaraate hue, Kud se sharmaate hue chaandani raat me ... nile ambar pe kahin jhule me saat rango ke hasin jhule me naaz-o-adaaz se laharaate hue Kud pe itaraate hue, Kud se sharmaate hue ek baar tujhe dekhaa hai ... jaagati thi leke saahil pe kahi leke haatho me koi saaz-e-hasi ek rangi Gazal gaate hue phul barasaate hue, pyaar chhalakaate hue ek baar tujhe dekhaa hai ... khulake bikhare jo mahakate gesu ghul ga_i jaise havaa me Kushabu meri har saans to mahakaate hue Kud pe itaraate hue, Kud se sharmaate hue ek baar tujhe dekhaa hai ... tune chahare pe jhukaayaa chaharaa maine haatho se chhupaayaa chaharaa laaj se sharm se ghabaraate hue phul barasaate hue, pyaar chhalakaate hue ek baar tujhe dekhaa hai ...

అందమైన అపురూప సౌందర్య రాశి జయప్రద ని ఈ చిత్రంలో చూసిన వారు ఎవరు మర్చి పోలేరు.
రొమాంటి రాజేష్ ఖన్నా పాటలలో..ఈ పాట టాప్ హిట్ సాంగ్.

ప్రేమికుల భావనలో.. ఓ..సుమధుర భావ పరంపర.
పండు వెన్నెల, సెలయేరు,పూలు,ప్రేమ.. అన్నీ వారి కోసమే..వారి మాటా పాటలోనే.

కిశోర్ కుమార్ & లతాజీ..యుగళ గీతాలలో ప్రసిద్ది చెందిన గీతం.

ఎన్ని సార్లు ఈ పాట విన్నా.. ఓ.. అందమైన భావం ని జత చేసి కొంగ్రోత్తగా అనిపిస్తూ ఉంటుంది. 
అందుకే ఈ పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట.
   

2 వ్యాఖ్యలు:

హితైషి చెప్పారు...

మీ బ్లాగ్ లో ఎప్పటి నుండో నేను చూడాలి అనుకున్న పాట.

మీనింగ్ చాలా బాగుంది.

వ్యాఖ్యలని అనుమతించే నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం.

ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

వైష్ణవి..పాట నచ్చినందుకు ధన్యవాదములు.

ఇలా మంచి పాటల కి వ్యాఖ్యానం మీరు వ్రాసి అందించాలని నా అభిలాష.