29, జనవరి 2012, ఆదివారం

వేటూరి జీవితం సప్త సాగర గీతం

జీవితం సప్త సాగర గీతం 

జీవితం  సప్త  సాగర  గీతం  ఈ పదంలోనే అనంతమైన అర్ధాలు ఉన్నాయి. ఎల్లలు లేని ప్రపంచంలో..సప్త సాగర తీరాలలో..ఎక్కడో ఒక చోట మన తీరం ఉండనే ఉంటుంది.ఆ తీరం లో మనం జీవన గీతం పాడుకోవడమనే  అర్ధంతో.. జీవితమే సప్త సాగర గీతం..
వెలుగు నీడల వేగం..మనని తరిమే వేగమైన కాలం..వెలుగు -చీకటే కాదు..కష్టం-సుఖం కి కూడా వర్తిస్తుంది కదా!అలా సాగనీ పయనం.కలా ఇలా  కౌగలించే చోట. కలలు వాస్తవం కూడా నిజమైన వేళలో జీవితం సప్త సాగర గీతంలా అందంగా సాగిపోతూనే  ఉంటుంది. 

ఈ పాట  కొందరి దృష్టిలో యుగళ గీతమే. కానీ అర్ధం చేసుకున్నప్పుడు వేదంలాంటి సారాన్ని  గ్రహించవచ్చు. 

"చిన్ని కృష్ణుడు" చిత్రంలో ఈ పాట ని ఆర్.డి.బర్మన్ సంగీత పరంగా.. కలకూజితం ఆశా భోంస్లే గళం పై ఉన్న అమితమైన అభిమానం దృష్ట్యా వింటున్నప్పుడు ఓ చక్కని..గీతమే.!

కానీ అతి మాములుగా వ్రాసిన ఈ పాట యొక్క పల్లవిలో  యెంత అర్ధం ఉందో! వేటూరికి అభివందనం చేయక మానం. నాకు  ఇష్టమైన ఈ పాట సాహిత్యం  ఇదుగోండి.

జీవితం సప్త సాగర గీతం 
వెలుగునీడల వేగం 
సాగనీ పయనం
కల-ఇలా కౌగలించే చోట (జీవితం)
ఏది భువనం ఏది గగనం తారా తోరణం   
ఈ చికాగో సిల్క్ టవర్  స్వర్గ సోపానం 
ఏది సత్యం ఏది స్వప్నం నిజమీ జగతిలో..
ఏది నిజమో ఏది మాయో 
తెలియనీ లోకమూ..
బ్రహ్మ మానసగీతం 
మనిషి గీసిన చిత్రం 
చేతనాత్మక శిల్పం 
మతి కృతి పల్లవించే చోట (మ) 
జీవితం సప్త సాగర గీతం 

ఆ లిబర్టీ శిల్ప శిలలో స్వేచ్చా జ్యోతులు 
ఐక్య రాజ్య  సమితిలోన కలిసే కాంతులు 
ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు 
ఈ మియామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ 
సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం 
కవులు వ్రాయని కావ్యం
కృషి-ఖుషి సంగమించే చోట (కృషి )
జీవితం సప్త సాగర గీతం..
అంటూ.. అమెరిక సంయుక్త రాష్ట్రాల అందాలని వర్ణించారు. ఎంతైనా మన యమహా  నగరి తర్వాతే అనుకోండి.

కానీ ఈ పాట వ్రాసింది   మాత్రం   యమహా నగరి కన్నా ముందు.   
 వేటూరి గారిని స్మరించుకుంటూ, అలాగే ఆర్.డి.బర్మన్ గారికి, జంధ్యాల గారికి నివాళులతో ఈ పాట పరిచయం . 

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఈ పాట నేను రోజూ వినే పాటల్లో ఒకటండి. ఈ పాటలో బాలు గారి పద ఉచ్చారణ (ఆశా గారి స్వరంతో పాటు వింటుంటే) ఎంతో స్పష్టంగా ఉంటుంది ...

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

అమరిక గా అమెరికా అందాల్ని వేటూరి వీనుల గీతాలలో రాయడం, దాని గురించి ఇవ్వాళ వారి జన్మ దినోత్సవ దినాన ప్రస్తావించడం మీరు ప్రస్తావించడం నవ్య నివాళి వేటూరి వారికి.


వేటూరికి వేయి చీర్స్ సహిత
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

good

rajachandra akkireddi చెప్పారు...

బాగుంది అండి,

వనజ వనమాలి చెప్పారు...

రామ కృష్ణ గారు..మీకు ఈ పాట నచ్చుతుందా.? గ్రేట్ అండీ!! ధన్యవాదములు.
@ వరూధిని గారు.. చీర్స్.. ధన్యవాదములు.
@ కష్టే ఫలే గారు.. ధన్యవాదములు.
@ రాజా చంద్ర గారు ధన్యవాదములు.