13, జనవరి 2012, శుక్రవారం

బ్లాగర్ల సమావేశం-అనుభూతి పుష్ప గుచ్చం

గత ఆదివారం జరిగిన బ్లాగర్ ల సమావేశం (అనకూడదేమో..పట్టుమని పది మంది బ్లాగర్ లు కూడా హాజరు కాలేదు).. కబుర్లు పంచుకుంటానని..మిత్రులకి.. వాగ్దానం ఇచ్చాను.

ఆ విశేషాలు పంచుకోవడం బాగా ఆలస్యం అయింది ఎందుకంటే.. నా కన్నా పూర్తి సమయాన్ని..కేటాయించి..తగిన సహకారం అందించిన..ఆత్రేయ గారు (లిపి లేని బాష బ్లాగ్) వారు..సభ ఆద్యంతం జరిగిన విశేషాలలో..స్వయంగా పాల్గొన్నారు కాబట్టి వారు విశేషాలని బాగా చెప్పగలరు కాబట్టి వారి  బ్లాగ్ లో..చూసిన తర్వాత వ్రాద్దామని ..ఉపేక్షించాను. సడి  చప్పుడు లేకుండా.. వారి శైలిలో.. టపా పేలింది.. ఇంకా కబుర్లు ఏముంటాయి అనుకోకండి..

ముందుగా నేను చెప్పేది ఏమిటంటే.. విజయవాడలో..ఆదివారం వస్తుందంటే చాలు.. సభలు,సమావేశాలు,పుస్తకావిష్కరణలు తెగ జరుగుతుంటాయి. ఒకోసారి ఎటు వెళ్ళాలో అర్ధం కాక ..తేల్చుకోలేక.. శుభ్రంగా తిని..పట్టపగలే  దుప్పటి ముసుగు పెట్టేసే ముందు.. ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు. అలాటి..టైట్ షెడ్యూల్ లో... ఆత్రేయ గారి చెప్పిన కబురుకి..నేను తెగ ఆలోచించాను. అలాగే బ్లాగరుల సమావేశం కి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అనుకోండి.

ఉదయమే..తొమ్మిది గంటలకి.. మా ఎక్స్ రే సర్వ సభ్య సమావేశం జరుగుతున్నదని సమాచారం. గత ఏడాది కూడా.. మానేసి ఏదో కుంటి సాకు చెప్పాను. ఈ సంవత్సరం కుదిరేలా లేదు అనుకుని.. ముందు ఆ సమావేశంకి హాజరై.. మధ్యలో.. ఒకసారి ఆత్రేయ గారికి పోనే చేసాను.. నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. సమయ పాలన పాటించ నందుకు క్షమించేయాలి అని హామీ ఒకటి ముందస్తుగా తీసుకుని..కాస్త టెన్షన్ నుండి బయట పడ్డాను.
మా ఎక్సరే..ఉపాద్యక్షులలో ఒకరు   అయిన మోహన్ రామ్ ప్రసాద్ గారు (అక్షర మోహనం బ్లాగ్ ),64 కళలు వెబ్ పత్రిక కళాసాగర్ గారు లేక మా సభ కొంచెం బోసియినా..నేను సరి పెట్టుకున్నాను. వారు..మరో వేదికలో ఉన్నారు కదా..అని.

ఎట్టకేలకు.. మా ఎక్స్ రే ..కిరణాల నుండి తప్పించుకుని.. 12 .30 కి..సభా స్థలం చేరుకున్నాం.
సభలోకి అడుగు పెడుతూనే..నలుదిక్కులా.. కళ్ళ తో చెరిగేశాను.మహిళా బ్లాగర్ లు యెంత మంది ఉన్నారా..అని. ఒకే ఒక్కరు కనబడ్డారు. ఉష..అని లోలోపలే నిట్టూర్చి.. పురుష ప్రపంచం వైపు చూసాను. అందరు చాలా ఆసక్తిగా.. రెహ్మాన్ షేక్ గారు చెప్పే విషయాలలో..లీనమై పోయి..ఉన్నారు.


నేను అందులో..మమేకమైపోయి..కొన్ని సందేహాలు అడిగి మరీ తెలుసుకుని..కూసింత..కంప్యూటర్ జ్ఞానం..పెంపొందించు కున్నాను అనుకుంటున్నాను.

వింటూనే ,కావాల్సిన సమాచారం నోట్స్ రాసుకుంటూనే..    ఎవరు ఎవరయి  ఉంటారా..అని ఆలోచిస్తున్నాను. నేను వచ్చే టప్పటికి పరిచయ కార్యక్రమాలు అయిపోవడంతో.. భలే ఇబ్బంది పడ్డాను. మీరు ఎవరు ? ఎక్కడి నుండి వచ్చారు? మీ బ్లాగ్ పేరు ఏమిటి..అని అడగడం ఇబ్బంది అనిపించింది.

బులుసు గార్ని గుర్తు పట్టేశాను. దూరంగా అటువైపు కూర్చుని..గోదావరి జిల్లా వారికి-గుంటూరు   జిల్లా   వారికి గల వైరిని మాటల్లో..పంచుకుంటున్నారు. మధ్యలో.. నేను జోక్యం చేసుకుని.. ఏముందండీ.. కొబ్బరి +యందు మిరప కాయ కలిపి పచ్చడి చేసేద్దాం అండీ.. . మంచి రుచికరం అయిన పచ్చడి తయారు అన్నాను. మధ్యలో ఉన్న విజయవాడ వారిని.. పచ్చడి చేస్తారు..ఇద్దరు కలసి..అన్నారు..నవ్వులాట ..శ్రీకాంత్ గారు.  అప్పటికి వారు నాకు ఎవరో తెలియదు.


అలాగే..సందట్లో సడి చప్పుడు లేకుండా.. సంప్రదాయమైన తీరులో ఉన్న కుర్రాడు..ఫోటో లు తీసుకుంటున్నాడు. అతని పేరు అడిగి తెలుసుకున్నాను. "కౌటిల్య"..నాకు చాలా ముచ్చటేసింది. విశ్వనాధ కౌటిల్యం,పాకవేదం మర్చి పొతే కదా!


అలాగే నవ్వులాట శ్రీకాంత్ ..గారు.. బులుసు గారు,సునీత , కళాసాగర్,రామ్మోహన్ గారు,ఆత్రేయ గారు.. పద్మావతి శర్మ గారు..వీళ్ళు మన బ్లాగర్ లు.


ముఖ్యఘట్టం నిర్వహించిన రెహ్మాన్ షేక్ గారిని చూసి ఆశ్చర్య పోయాను,చిన్న వయసులో.. మన తెలుగు భాష అభ్యున్నతికి ఇలా కృషి చేయడం చాలా గర్వం కలిగించింది. వారికి ధన్యవాదములు.  ఈ సారి సభలు నిర్వహించడానికి..నేను నా వంతు కృషి చేస్తాను అని.. బ్లాగ్ ముఖంగా విన్నమిస్తున్నాను.
నేను అయితే.. విజయవాడలోను,ఆ దరి దాపులా దాదాపు నాకు తెలిసిన వరకు ఓ..నలబై మంది బ్లాగర్ లు ఉన్నారు. వారికి కనీస ఆసక్తి లేక పోవడం కించిత్ బాధ అనిపించింది. అలాగే..మరి కొందరు ఉత్షాహంగా పాల్గొనడం ఆనందం కలిగించింది.


నేను బ్లాగర్ల సమావేశం అనగానే చాలా ఊహించుకున్నాను. స్త్రీ బ్లాగర్ లు అందరు తప్పకుండా వస్తారని..వారితో.. చక్కగా.. బ్లాగ్ ముచ్చట్లు చెప్పుకోవాలని..ఇంకా.. కొన్ని విషయాలు పంచుకోవాలని ( రహస్యం ..వచ్చే బ్లాగర్ ల సమావేశం వరకు దాచి పెడతాను) ఎంతగా అనుకున్నానో!


నేను తోడుగా పిలుచుకుని వచ్చిన పద్మావతి శర్మ గారు,సునీత గారు తప్ప ఎవరు..రాలేదు.


ఈ సారి సమావేశం కి..ఎక్కువ మంది హాజరు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

నా మెయిల్  ఐ .డి. ఆత్రేయ గారి వద్ద లభ్యం . కావాల్సిన వారు తీసుకుని నాతొ  ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నా.. కార్యాచరణ కార్యక్రమం గురించి కూడా..మాట్లాడవచ్చు.


ఈ సారి సమయం తీసుకుని.. బ్లాగర్ల సమావేశం విజయవంతం చేసి.. తెలుగు భాష వ్యాప్తికి ఉడతాభక్తి సాయం చేయడానికి కంకణం కట్టుకుందాం.


మరొక మనవి..ఇక్కడ గొప్ప బ్లాగర్ లు,చిన్న బ్లాగర్లు అని తేడా వద్దు. అందరు బ్లాగర్ లమే కదా! మంచి పోస్ట్ లతో.. ఆలోచనాత్మకంగా.. సహేతుకంగా మన భావాలని పంచుకుంటూ.. ఆత్మీయంగా ఉందాము.
కొంత మంది..బ్లాగర్లని అయినా కలసిన నా అనుభూతుల పుష్ప గుచ్చం ..ఇది.

అందరం కలసి ఉన్న సమయం తక్కువైనా..అది మర్చిపోలేనిది. .. ఈ పోస్ట్ చూస్తున్న బ్లాగ్ మిత్రు లందరికి.. ఈ బ్లాగ్ముఖంగా..ధన్యవాదములు.


14 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

మీ పుష్పగుచ్ఛం గుబాళిస్తోందండీ..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆలస్యం గా వచ్చినా, సమావేశ విశేషాలు బాగా చెప్పారు. సంతోషం.

అజ్ఞాత చెప్పారు...

ఇలా అందరూ కలవటం బాగుందండీ.

Hima bindu చెప్పారు...

"నేను బ్లాగర్ల సమావేశం అనగానే చాలా ఊహించుకున్నాన స్త్రీ బ్లాగర్ లు అందరు తప్పకుండా వస్తారని..వారితో.. చక్కగా.. బ్లాగ్ ముచ్చట్లు చెప్పుకోవాలని..ఇంకా.. కొన్ని విషయాలు పంచుకోవాలని ( రహస్యం ..వచ్చే బ్లాగర్ ల సమావేశం వరకు దాచి పెడతాను) ఎంతగా అనుకున్నానో!"
అయితే మీ విశేషాలు వినడానికి నెక్స్ట్ మీటింగ్ కి వస్తామండీ :-)సమావేశం అయ్యాక తెలిసిందండీ విజయవాడ బ్లాగర్లు అంత కలసినట్లు .గతం లో నేను కూడా కొల్లూరి గారి ఆహ్వానం మేర ఎక్స్-రే సమావేశాలకు వచ్చాను.ఎక్కడో అక్కడ కలసే వుంటాము అనుకుంటాను

y.v.ramana చెప్పారు...

విశేషాలు చక్కగా రాశారు.
కానీ.. ఎక్స్ రే సమావేశాలేంటి?
అర్ధం కాలేదండి.

అజ్ఞాత చెప్పారు...

మేమెప్పుడు పెట్టుకుంటామో. బాగున్నాయ్ సంగతులు.

durgeswara చెప్పారు...

బాగుంది . మీసమాచారం. వద్దామనుకున్నా వీలుకాలేదు యాగంగూర్చి జరుగుతున్న సమావేశాలతో

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి..గారు..ధన్యవాదములు.
@ బులుసు.గారు.. చాలా సంతోషం సర్..ధన్యావాదములు.
@రామ కృష్ణ గారు.. ధన్యవాదము..అండీ..మీ ప్రాంరం వారు అందరూ కూడా..అలాగే ప్రయత్నం చేయండి.బాగుంటుంది !!
@ చిన్ని గారు.. నిజంగానే మీరు వస్తారని ఎడుచూసాను.ఈ సారి తప్పక రండీ!!! మనం ఎపుడైనా కలిసే ఉంటాం లెండి.
ధన్యవాదములు.
@ రమణ డాక్టర్ గారు.. చాలా సంతోషం ..అండీ..ధన్యవాదములు. ఎక్స్ రే అంటే.. సాహిత్యం పట్ల మంచి కమిట్మెంట్ ఉన్న సంస్థ.
@ కష్టే ఫలే గారు ..త్వరలో..ఏర్పాటు చేయండి. వీలయితే మేము వస్తాం.
@ దుర్గేశ్వర గారు.. మళ్ళీ మళ్ళీ ఇలాటి సమావేశాలు జరుగు తుంటాయి కదా! ఈ సారి తప్పకుండా రండి. ధన్యవాదములు.

శశి కళ చెప్పారు...

asalu chinna, pedda yenduku?andaram mana hrudayam loni maatalu panchukuntunnamu antegaa....manchi vishayaalu andinchaaru..thnx

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సమావేశ విశేషాలు బాగా రాశారు. ఎక్కువమంది బ్లాగర్లు రాకపోవడం బాధాకరమే. వచ్చేసారికైనా ఆ ప్రాంతంలో ఉన్న బ్లాగర్లు ఎక్కువమంది వస్తారని ఆశిస్తున్నాను.

రహ్మాన్ గురించి మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు :-)

Raj చెప్పారు...

మీవల్ల అలాంటి సమావేశం ఒకటి విజయవాడ లో జరిగింది అని తెలుసుకోన్నాను. అలాగే సమావేశ వివరాలూ తెలుసుకున్నాను. జంకు లేకుండా అలాంటి సమావేశాలకి హాజరు అవటం చాలా సంతోషకర విషయం.

Kalasagar చెప్పారు...

వనజ గారూ...
విజయవాడ బ్లాగర్ల సమావేశం గురించి బానే రాసారు, కాని సమావేసానికి 20 మంది వచ్చారు. వారిలో 15 మంది బ్లాగర్లున్నారు.
కళాసాగర్
ఎడిటర్, 64 కళలు డాట్కాం

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

బ్లాగర్ల సమావేశం వివరాలు బాగున్నాయి.నేను డిసెంబర్ 10,2011 hyderaabaad బ్లాగర్ల సమావేశం లో పాల్గొన్నాను.మీరు ఈ సారి ఎప్పుడు నిర్వహించినా వస్తాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదములు ..రవి శేఖర్ గారు. ఈ సారి బ్లాగర్స్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తెలియపరుస్తాము.