6, జనవరి 2012, శుక్రవారం

పోర్టబిలిటి విజయమో..వీర గర్వమో!

మొబైల్ పోన్ నెంబర్  పోర్టబిలిటి ... ఓడిన  నా పోరాట  పటిమ   

నేను దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం హచ్..నుండి ఒక మొబైల్ కనెక్షన్ తీసుకున్నాను నాకు అంతా ఫ్యాన్సీ నెంబర్ల అభిరుచి. ఆ నెంబర్ పోస్ట్ పెయిడ్  అయితేనే ఇస్తానని.. నెట్ వర్క్ వాళ్ళు కండీషన్ పెట్టారు. సరే ఆ నంబర్   కావాలంటే..  రోట్లో తల పెట్టక తప్పదు. పెట్టాక రోకళ్ల దెబ్బలు తినక తప్పదు.

కనెక్షన్ తీసుకున్న ఓ..నాలుగేళ్ళు..వేలల్లోనే బిల్లులు చెల్లించి ఉంటాను.  ఎందుకంటె.. మా వర్కర్స్ ఇంటి నుండి ఓ..మిస్ కాల్ వచ్చేది. వాళ్ళు వెంటనే ..ఇంటికి పోన్ చేసుకుంటాం మేడం అనే వాళ్ళు.. మన వర్కర్సే కదా.. పోన్లే పాపం అని ఇచ్చేదాన్ని. నెల తిరిగి వచ్చేసరికి బిల్లు చూస్తే  కళ్ళముందు.. పట్ట పగలు నక్షత్రాలే  ఈస్టమన్ కలర్లో కనిపించేయి. అయినా తాగినోడు  తాళ్ళ పన్ను   కట్టక వేరొకరు ఎందుకు కడతారు చెప్పండి.? మొహం మాడ్చుకుని కట్టేసి బిల్ కట్టేసినాక హచ్ వాడు చెప్పే థాంక్స్ కి ఏడ్వలేక ఓ..వెర్రి నవ్వు నవ్వి బయట పడేదాన్ని.

పనిలో పని ఒకోసారి మెసేజెస్ చార్జ్ కూడా విపరీతంగా ఉండేది. అంతగా.. ఎస్ ఎమ్మెస్ లు చేసేదాన్ని. సరే...  హోం ,పైనాన్స్ శాఖలు రెండూ నావే  కాబట్టి.. వేరొకరితో తిట్ల దండకం,చీవాట్ల వడ్డింపులు ఉండేవి కాదు.  అలా హచ్ వాడిని నా నుండే.. లక్షాదికారిని చేసాక..కాస్త జ్ఞానం తెచ్చుకుని..నేనే లక్షణంగా లక్షాధి కారిగా మెలగాలని నా పోన్ కి బిల్ కట్టడం మానేస్తే.. నెలలో ఓ..పదిరోజులు.. బారింగ్లో పెట్టి.. (పెట్టించుకుని ) తీరిగ్గా బిల్ కట్టాక అవుట్ గోయింగ్ పర్మిషన్ ఇచ్చే టట్లు..తెలివిగా నడుచుకుని..వర్కర్స్ కి ద్రోహం చేసేదాన్ని. అలా నాలుగేళ్ళు గడిచి పోయాయి.

ఇంతలో..ఇల్లు షిఫ్ట్ అయ్యాం. ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ . ఒక్క పాయింట్ అయినా   సిగ్నల్ వస్తే ఒట్టు.  పోన్ అసలు మొగేదే కాదు..ఒకవేళ మ్రోగినా.. వీది గేట్ వరకు వెళితే కానీ మాట్లాడను వీలు ఉండేది కాదు. నాకు ఈ బజారు పోన్ వద్దురా బాబు అంటే..మా అబ్బాయి వినేవాడు కాదు..అమ్మో పాన్సీ నెంబర్ పొతే దొరకదు ..అనేవాడు. సరే ఏదో ఒకటి లే..చావనీ అనుకుని..ప్లాన్ తక్కువలోకి మారి..వేరే నెట్వర్క్ పోన్ తీసుకుని అది వాడుతున్నాను. ఇంతలోకి
నెంబర్ పోర్టబిలిటి  ఆశ రేపి  ఓ..సంవత్సరం..ఆటలాడుకున్నాడు. ఆశగా చూసి   చూసి  అంతా బ్రాంతి ఏనా.. అని పాటలు పాడుకునే అ..శుభ తరుణాన.. పోర్ట బిలిటి..సౌలభ్యం  వస్తునదని ప్రకటన వచ్చి రాగానే.. వోడా..పోన్ ఆఫీసుకి వెళ్లి నెంబర్ మార్చుకోవచ్చు అనుకుని తెగ సంతోష పడి పోయాను.

ఏ మాట కామాట చెప్పుకోవాలి. వోడా పోన్ వాళ్ళు   వొడ  అన్న పేరే కానీ మరీ డీప్ ప్రయ్ చేయరులే అనుకునే దాన్ని.  కానీ తర్వాత తెలిసింది కారు చవకగా లభించే సదుపాయాలూ ఇతర నెట్ వర్క్ ల లో  ఉన్నాయి అని. కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్ వదలలేను. ఇలా రోజులు గడుస్తున్నాయి.  ఎట్టకేలకు.. పోర్ట బిలిటీ  నా పాలిట వరమై వచ్చింది.  పోర్టింగ్ నెంబర్ తీసుకోవడం  వోడా  పీడా వదిలించుకోవాలని ప్రయత్నించడం,  వాడు ఏదో సాకు చెప్పడం ఇలా ఓడా స్టోర్స్ చుట్టూ తిరగడం.. మొదలెట్టి  దాదాపు ఏడాది కావస్తుంది. అయినా వాడు నాకు విముక్తి ఇవ్వడు. మీరు  సరి అయిన కారణాలు చూపక పోవడం   వల్ల.. మీ నెంబర్ మార్పు సాధ్యపడదు. అని ఆ కంప్యూటర్ వాయిస్ రికార్డ్  అమ్మణ్ణి నన్ను వాయిస్తుంది.

ఇక వారి సేవలు మనలని మురిపించే విధం నానా రకములు.  పోస్ట్ పైడ్ కి వచ్చే.. ప్రింటెడ్ బిల్లు పంపడం మానేసి రోజుకొక పది మెసేజ్ లతో..బిల్ కట్టాలని గుర్తు చేసే సౌకర్యం ... ఉన్నది . ఇక బిల్ కట్టేస్తాము.ఏదైనాఅవసరం అయితే కస్టమర్   కేర్  ఉండనే ఉంది.  నెట్ వర్క్ వారి సేవలు యెంత   దయగలవి అనుకుంటాను.  అదేమిటో మన అవసరాలని మనం చెప్పా కుండానే గుర్తిన్చేసి..  ప్రొద్దున్నే సుప్రభాతం నుండి..రాత్రి పూట శుభ రాత్రి కూడా చెప్పకుండా  మనని  నాన్ స్టాప్ గా   దిల్ కుషి గా ఉంచే ఎన్నో   సేవల్ దొరుకుతుంటే.. ఇంట్లో..పెళ్ళాం బిడ్డ,అమ్మ అయ్యా ఊసేం ఎత్తకుండా రోజులకి రోజులు డోల్లించే యవచ్చు ..అనుకున్నాడట నాలాటి వెర్రి వెంగళప్ప.
 
కానీ నా నంబర్ ని ఇతర నెట్ వర్క్ లకి మార్చుకోనీయకుండా  ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అలుపెరగక..నేను  పోర్టింగ్ కోడ్ తీసుకోవడం .. నేను పోర్టింగ్ ప్రాసెస్ ని మొదలెట్టడం.. జరుగుతూనే ఉన్నాయి. ఇలా నాలుగు సార్లు వివిధ కారణాలు చెపుతూ  మార్చడం సాధ్యపడని చెప్పకుండానే.. చెపుతూ సహన్నాన్ని పరిక్శిస్తున్నారు.
ఇక ఈ సారి నేను ఉపెక్షించ దలచుకోలేదు. కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళా లనుకున్కుని ..  సిగ్నల్ ప్రాబ్లం గురించి  తెలియజేస్తూ..నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లు.. వారితో.. ఒక ఆఫీషియల్ స్టాంప్ వేయించుకోవడం చాలా కష్టమై పోయింది. అలాగే..నేను పోర్టింగ్ కి ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఏయే కారణాలు వల్ల వాళ్ళు నెంబర్ మార్పిడిని తిరిగి అడ్డుకున్తున్నారో.. అన్నిటిని ఉదాహరిస్తూ.. నేను కట్టిన బిల్లుల వివరాలన్నీ పొందు పరుస్తూ.. మళ్లి ఒక రిక్వెస్ట్ ని స్వయంగా ఇచ్చాను. ఈ సారి తప్పకుండా అయిపోతుంది మేడం..అంటూ..సన్నాయి నొక్కులు నొక్కి.. ప్లాస్టిక్ నవ్వులు పంచి పంపింది  అక్కడున్న ఒక సేవా భామిని.  మళ్ళీ పోర్టింగ్ గడువు ముగిసి పోయింది. నా నెంబర్ నెట్ వర్క్ మారనూ లేదు. నేను వోడాలో వడలా  వేగడం మాన లేదు. అసలు విషయం ఆరా తీద్దును   కదా.. ఏ నెట్ వర్క్ కూడా ప్యాన్సీ నెంబర్ ని  వదులుకోవడం లేదు. పోర్టింగ్ కి అనుమతి ఇవ్వడం లేదు. ఒక ఆలోచన వచ్చి  ఇలా ట్రై చేస్తే!!! కన్స్యూమర్ కోర్ట్ ... ఉందిగా..అని ఆలోచన వచ్చింది.

అదేమిటో..మా విజయవాడలో.. ఉన్న వినియోగ దారుల సేవా కేంద్రం వారు ఇచ్చిన నంబర్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది.. కానీ ఎవరు..అందుబాటులో ఉండరు. ఇంకా నేను ఏం చేయుదును? నా ఫ్యాన్సీ నంబర్ పిచ్చి కాదు కానీ.. ఎనిమిదేళ్లుగా అందరికి అలవాటైన నంబర్.. మా  కస్టమర్స్ అందరికి అలవాటైన నంబర్.. నేను వదల వీలుపడదు. కారణం ఏమనగా.. నెంబర్ పోర్ట బిలిటి అనేది  ఫ్యాన్సీ నంబర్స్ కాని వాళ్ళకి త్వరితంగా అవుతుంది. నా నంబర్ లాటి నంబర్ కి మాత్రం సాధ్యపడదు.  చచ్చినట్లు..వారి ఇనుప కబంధపు హస్తముల మద్య చిక్కుకుని విల విలలాదాల్సిందే! లేదా..కసిదీరా విసిరి కొట్టాల్సిందే   తప్ప వేరొక ప్రత్యాన్మయం కాన రాదు. రాదు. రాదు అని తీర్మానించుకుని.. :)))))))) తో..  పోన్ వచ్చింది. మరి   నేను మాట్లాడాలి కదా అనుకుని వీది లోకి పరిగెడుతూ.. ఛీ.. పాడు  మొబైల్ పోను - పాడు  జన్మ ..అని తిట్టుకుంటూ.. పోర్ట బిలిటి విజయమో..వీర గర్వమో! టెస్ట్ లు పెట్టుకుంటూనే ఉన్నాను.

ఎవరైనా సలహా చెపితే..  ఆ సలహా వర్కవుట్ అయితే నా తదనంతరం నా ఫ్యాన్సీ నెంబర్ మీకు ఇవ్వగలన ని  హామీ పత్రం రాసి ఇస్తానని మనవి చేస్తూ..  వోడా పై నేను చేసిన పోరాటంలో గెలిచి   నా మొహాన ఓ..విజయ గర్వం నాట్యమాడే దృశ్యం ఊహించుకుంటూ..   (కల లో అయినా ) నిద్ర వస్తుంది..ఫ్రెండ్స్.. శుభరాత్రి..

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ ఫాన్సీ నెంబరు పిచ్చిని క్షమించాలి,ఈమాటంటున్నందుకు,వాడు కేష్ చేసుకుంటూన్నాడు. వొక్క వెర్రి బి.యెస్.న్.ల్ తప్పించి మరెవరూ చేయటం లేదు. మీరు విరుగుడు అడిగారు కనక, ట్రాయ్ కి రాయండి. ప్రభుత్వం వీళ్ళకి వత్తాసు పలుకుతుంది. దోచుకుంటున్నారు, ప్రజలని.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలి .. గారు.. మీ సూచన నచ్చింది. నేను బి.ఎస్.యెన్ ఎల్ నెట్వర్క్ కే పోర్టింగ్ పెట్టానండి. పాపం వాళ్ళు విసిగి పోయారు.. ట్రాయ్ కి వ్రాస్తాను. అలాగే కన్స్యూమర్ కోర్ట్ ద్వారా కూడా పోరాడతాను. నంబర్ మాత్రం వదులుకోను. ధన్యవాదములు.

SRAVAN BABU చెప్పారు...

వనజవనమాలిగారూ, మీ సమస్యకు సంబంధించి complaint చేయడానికి ట్రాయ్ వారు ఇచ్చిన లింకులు ఇక్కడ ఇస్తున్నాను.

http://www.trai.gov.in/serviceproviderslist.asp

http://www.trai.gov.in/sp/list_of_CC_NO_AA-Vodafone.pdf

హైదరాబాద్ లోని నోడల్ ఆఫీసర్, appallate authority వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేయండి, స్పందించకపోతే కంప్లెయింట్ రాసి నాకు పంపండి(నేను హైదరాబాద్ లోనే ఉంటాను). నేను ఆ చిరునామాలోని ఆఫీసుకు వెళ్ళి వారిని కలిసి మాట్లాడతాను.

All the best.

Shabbu చెప్పారు...

చదవడం మొదలెట్టగానే రోట్లో తల అనగానే నాకు నేను చాలా........ నవ్వుకున్నా.... అన్ కంట్రోల్డ్ నా వల్ల కాలేదు. చాలా థ్యాంక్స్ నన్ను కాసేపు నవించినందుకు.


ఈ వోడాఫోన్ బాగోతాలు ఇంతింతగాదయా,,,, అందకే నేనిప్పటికి BSNL..... ఈ సందర్బంగా నేనొక విషయం చెప్తా నాకు కొంచెం బాధకలిగించినది. ఈ మధ్యే గత 8 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఫ్యాన్సీ నెంబర్ Airtel 666 ని మిస్సయ్యా,,,,,,

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

తేజస్వి గారు మంచి సమాచారం అందించినందులకు ధన్యవాదములు. మీరు ఇచ్చిన సమాచారం చాలా వరకు ఉపయోగ పడుతుంది. ధన్యవాదములు.
@ షబ్బు..హాయిగా నవ్వుకున్నావన్న మాట. థాంక్ యు! ఎయిర్ టెల్ పోయిందా? అయ్యో! :(((((

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

hyderabad lo unna mobile network lo airtel okate best.. cast ekkuva offers takkuvaa ayina paravaledhu gaani airtel vadatame nayam..
anni mobile networks vaadi chivaraku airtel lo fix ayipoyanu

network change kaavali anukunna vaaraki naa tarupuna aitel best

Praveen Mandangi చెప్పారు...

ఇంటర్నెట్ విషయానికొస్తే సెల్‌ఫోన్‌కి టాటా డొకోమో కనెక్షన్ తీసుకోవడం మేలు. అది చాలా వేగంగా పని చేస్తుంది. నేను నా ఫోన్ కొన్నది శ్రీకాకుళంలోనే అయినా ఫొటాన్ సిమ్ కొన్నది హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో & శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నెట్ చాలా వేగంగా పని చేసింది కానీ ఖమ్మం జిల్లాలోని కొన్ని చోట్ల నెట్ పని చెయ్యలేదు. టాటా డొకోమోకి మారుమూల ప్రాంతాలలో టవర్లు ఉండవు.

PALERU చెప్పారు...

వనజ దీది,

దీక్షితులు తాత ఒక టపా రాసారు మీ లాంటి వారి మీద...." http://kastephale.wordpress.com/2012/01/04/
ఎంటండి " మా విజయవాడ" అంటున్నారు .....కోనేసారా......పడమట లో నా ఫ్లాట్ ఉంది అది కుడా కబ్జా చేసేసారా...:):)
నా సలహా( ఫీజు లేకుండా) వోడాఫోన్ నుండి ఎయిర్ టెల్ కి మారడానికి
సింపుల్ ....మీ వోడా నెంబర్ నాకు ఇచి నా ఎయిర్ టెల్ మీరు తీసుకోండి...చూసారా ఎంత ఈజీ నో :):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బాలు.. థాంక్ యు. ఏ నెట్వర్క్ అయితే ఏముంది.. బిల్ వదిలించుకోవడానికి..అనుకుంటాను.ఈ సారి మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాను.
@ ప్రవీణ్ గారు.. మీ సలహాకి థాంక్స్ అండీ!!!

@రాఫ్సున్ బాయీ.. నమ్మకం మూడనమ్మకం కాకుండా ఉంటె బాగుంటుంది కదా.. కొన్ని చూసేవారికి చాదస్తం లా కనబడతాయి. ఎవరి ఇష్టం వారిది కదా!. మీరు చెప్పింది.. ఈ విషయమేనా.. ఈ విషయం కాకుంటే..నాకు..విషయం చెబుతూ..మెయిల్ చేయండి. నా దేశం,నా వూరు..నా ఇల్లు ఎప్పుడు వ్యక్తికీ గర్వకారణం. మా విజయవాడ అన్నాను. మా అంటే.. అందరు ఉన్నారనేగా అర్ధం.మీరు కూడా ఉన్నారులెండి. మన విజయవాడ ..సరేనా!