కొత్త మతం పుచ్చుకున్న వారికి గుర్తులెక్కువ..అంటారు కదా..!
ఇటీవల ఈ మాట చాలా మందిని చూస్తుంటే గుర్తుకు వస్తుంది.
మన మధ్యే మన వాళ్లలోనే చాలా మంది సరిక్రొత్తగా కనబడుతుంటే ఆశ్చర్య పోకండి..అని చెపుతున్నారు
హిందువులుగా పుట్టి..హిందూ సంస్కృతీ-సంప్రదాయాలను పాటిస్తూ.. ఈ హిందూ ధర్మం కానివ్వండి.. కొందరు చెపుతున్నట్లు హిందూ మతం కానివ్వండి.. వాళ్ళ మనసుల్లోని ఆశలకి,కోరికలకి,లేదా.. వాళ్ళ దైహిక,మానసిక అవసరాలకి తగిన విధంగా తోడ్పడటం లేదన్న కారణంగానో.. లేదా.. మానసిక దౌర్భాల్యం వల్లనో..
హిందువుల దేవుళ్ళు ఏ మాత్రం వారికి కరుణ చూపడం లేదన్న కారణం గానో..
లేదా.. కొందరి మాటల ప్రలోభాలకి..ఆకర్షితులయి.. ఆర్ధిక అవసరాలమేరకు .. మతం మార్పిడికి పాల్బడుతున్నారు.
వారు మారి నందువల్ల ఇతరులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటె..ఈ దేశంలో..మత స్వాతంత్ర్యపు హక్కు,భావ వ్యక్తీకరణ హక్కు ఎలాగు ఉండనే ఉన్నాయి.
ఈ మద్య..ఓ..సాయంత్రం మేము అంటే మా వసతి ఇంట్లో ఉన్న గృహిణు లందరూ మా వీధి వాకిట్లో.. .. నిలబడి.. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. మా హవుస్ ఓనరు గారి ని..కొంత మంది అటుగా వెళుతున్న కొందరు స్త్రీలు బాగున్నారా!? అంటూ పలకరించారు.
ఆమె వారిని గుర్తుపట్టలేదు.. కొన్ని క్షణాలు చూసి.. అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నట్లు అయి.. అరె..మీరా?అసలు నేను గుర్తు పట్టలేకపోయాను. మీరు మా మరదలి బాబాయి కూతుర్లు కదా!? అదివరకు.. ఒంటినిండా నగలు ధరించి ఇంత బొట్టు పెట్టుకుని చక్కగా ఉండేవారు కదా!? ఇప్పుడు ఏమిటి ఇలా?మతం తీసుకున్నారా..అంటూ.. మొహమాటం లేకుండా గబా గబా అడిగారు.
అవునండీ..జీసస్ ని నమ్ముకున్నాం. ఆయనని నమ్ముకున్న తర్వాతే మాకు అంతా మంచి జరిగింది..ఇప్పుడు ఆయన నీడలో..సంతోషంగా ఉన్నాం. మీరు జీసస్ ని నమ్ముకుని ఉంటె.. బాగుండేది.. అన్నారు.
బాగుండటం అంటే ఏమిటీ..అని అడిగారు మా హవుస్ ఓనర్ గారు.
రమేష్ గారిని జీసస్ తప్పకుండా కాపాడే వారు అని చెప్పారు. (మా హవుస్ ఓనర్ గారి భర్త రమేష్ గారు..జీర్ణాశాయపు కేన్సర్ తో..భాదపడి చనిపోయారు)
మా అందరికి ఆయనకీ నయం అవుతుందని ఏమాత్రం నమ్మకం లేదు.. ఆయన కండీషన్ మాకు పూర్తిగా తెలుసుకదా! అన్నయ్య కూడా.. లాభం లేదని చెప్పారు అని చెప్పారు. (మా హవుస్ ఓనర్ గారి అన్నయ్య చాలా ప్రముఖమైన డాక్టర్)
వైద్యులకే వైద్యుడు ఆయన .మీరు ఆయన ని నమ్ముకుని ఉంటె.. మీ వారికి స్వస్తత చేకూరేది. ఆయన దేవుల్లకే దేవుడు. ఏ సైతానో..మిమ్మల్ని పట్టి ఆయన వైపు నడవనీయకుండా ఆపింది..అని మాట్లాడసాగారు.
నేను వింటున్నాను తప్ప ఏం మాట్లాడలేదు. మా ఇంటి ముందు తులసి మొక్క,నా చేతిలోని..భాగవత గ్రంధం..చూసి.. నన్ను ఉద్దేశించి.. వారు మాట్లాడసాగారు..
నిజం తెలుసుకోండి.. ఆయన తప్ప వేరే దేవుడు లేదు.ఆయనని నమ్మి సంతోషంగా ఉండండి..అని చెప్పసాగారు.
మీరు ఈ నిజం తెలుసుకుని ఎన్ని యేళ్ళయ్యింది..అన్నారు..మా హవుస్ ఓనర్ గారు. రెండు ఏళ్ళు అయింది. అన్నారు. అంతకు ముందు సంతోషంగా లేరు అని అనుకుంటున్నారు..ఇక ముందు సంతోషంగా ఉంటామని అనుకుంటున్నారు.ఈ రోజు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. అందుకు కారణం మనసు.
మీరు తలపోసినట్లే మా మనసుల్లోను మా హిందూ దేవుళ్ళు కొలువై ఉండి.. సంతోషంగా ఉన్నామని చెప్పమని ..ప్రకటించమని చెప్పలేదు.
మేము ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము. మేము చేసిన పూర్వ జన్మ ఖర్మ ఫలాలని బట్టి..లేదా.. మా మానసిక స్థితిని బట్టి మా ఆలోచనల బట్టి మేము బాగున్నాం అని లేదా బాగోలేదు..అని చెపుతాం తప్ప మీరు మా మతంలోకి మారండి..మా దేవుడు బాగా చూస్తాడు అని ఎప్పుడైనా అన్య మతస్తులకి చెప్పామా? ఎందుకు అలా పడే పడే చెపుతారు.. అయినా ఆ దేవుడి బిడ్డలుగా ఉండాలని ఉంటే..ఆ మతంలో వారికే జన్మించి ఉండేవాళ్ళం.
మతం మార్పిడి చేసుకుని..మానసిక బలహీనులమై..మా మీద నమ్మకం లేకుండా బ్రతకం...అని ఘాటుగా సమాధానం చెప్పారు.
వాళ్ళు ఖంగు తిన్నారు. వింటున్న నేను వేల్దోన్ లక్ష్మి గారు ..అని అన్నాను.
వాళ్ళు ముందుకు వెళ్లి పోయారు.అందులోనుండి..ఒకావిడ సడన్గా వెనక్కి వచ్చి.. ఒక మాటండీ..అంది.
చెప్పండి ..అన్నారు..మా హవుస్ ఓనర్ గారు.
మరి మీ దేవుడు ఇతరుల ఇళ్ళల్లో పూచిన పూలు దొంగతనంగా కోసుకు వచ్చిన పూలతో..పూజలు చేయమన్నాడా? జీసస్ ..నా మనసులోకి వచ్చి ఈ మాట అడిగి రమ్మన్నాడు. అని..రివెంజ్ గా అడిగింది. వింటున్న నాకు పక్కున నవ్వు వచ్చింది. అజ్ఞానం తగలెయ్య. అనుకున్నాను.
మేము అలా కోసి పూజలు చేస్తామని చెప్పలేదే! అయినా పూలని కోసి దేవుడికి ఎవరు పెట్టి పూజిస్తారా అని పువ్వులు ఎదురు చూస్తాయట. ఆ సంగతి తెలుసా..మీకు..అని అడిగారు.
ఆవిడ ఏదేదో..మాట్లాడుతూ..నాశనం అయితేనే గాని తెలియదు అని శాపనార్ధాలు పెడుతూ వెళ్ళారు.
ఈ ధర్మ భూమిలో.. ఏ మతం ఎలా ప్రవేశించిందో..వారు ఏ కారణాల చేత ఈ దేశం లోకి అడుగు పెట్టారో..ఎందుకు మత ప్రచారాలు..చేస్తున్నారో..మత మార్పిడికి ఎందుకు పాల్బడుతున్నారో.. నిజాలు చెప్పేది ఎవరు?
ఇతర మతాల వారు వారి మతానికి ఇస్తున్న ప్రాధాన్యత హిందూ ధర్మం ఎందుకు ఇవ్వడం లేదు? నాలో ఎన్నో ప్రశ్నలు.
అయినా అన్య మతస్తులని అంట రానితనంగా చూడటం,శత్రువులగా చూడటం అనే కుసంస్కారం..నాలో పెంపొందిన్చుకోలేదు..కాబట్టి సరిపోయింది.
లేకపోతే.. ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూ ఉండాలి అనుకుంటాను.
మా పెదనాన్న గారి కుటుంబంలో..ఒక్కక్కరుగా అందరూ..క్రైస్తవ మతం లోకి మారిపోయారు. మా అక్క అయితే మా ఇంటికి వస్తే మొహం చిట్లించుకునే ఉంటుంది. మా పూజలు-పునస్కారాలు ఆమెకి నచ్చవు.
ఎప్పుడు దేవుడు ప్రార్ధనలో అలా చెప్పాడు..ఇలా చూపించాడు అని చెపుతూ ఉంటుంది. ఆమె నమ్మకాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించ నూ లేదు. బలపరచినదీ లేదు. ఆమెకి .ఆమె నమ్మకానికి విలువ ఇస్తాము. కానీ ఆమె మాకు క్రమ క్రమం గా మతం-దేవుడు పేరిట దూరం అయిపోయింది. శుభ కార్యాలలో కలవకుండా..సంతోషంలో..పాలుపంచుకోకుండా దూరంగా ఉంటుంది.
ఇక విడ్డూరం ఏమిటంటే.. మా ఇళ్ళల్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని ఆమె.. పిల్లల పెళ్ళిళ్ళు .. హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తాలు చూసి పెట్టించి జరిపించారు.అలాగే గృహ శంకుస్థాపన,గృహ ప్రవేశం అన్నీ హిందూ..సంప్రదాయమే పాటిస్తారు. (వాస్తుతో..సహా.). మేము నవ్వుకుంటాము.
ఆఖరిగా నేను ఒకటి అనుకుంటాను. ఏ మతమైనా.. మనుషులనుండి వేలివేసుకుని జీవించ మని..ఇతర మతాల వారిని చిన్న బుచ్చి మా మతమే గొప్పని చాటుకోమని చెప్పలేదు కదా! సమాజం లో బ్రతకమని చెప్పింది కానీ సమాజం ని వెలివేసి..లేదా..వారి మతం లోకి బలవంతంగా మారండని ప్రభోదాలు చేసి మార్చమని చెప్పలేదు కదా! ఒక వేళ చెప్పిందని భ్రమ పడితే ..వాళ్ళ అజ్ఞానం నశించుగాక.!!!!
ప్రేమ ,దయ,శాంతి.సౌహార్దం,పరస్పర సహకారం లేకుండా.. ఏమనిషి జీవించజాలడు. ఇవన్నీ లేకుండా.. ఏ మతం మనుగడ సాగించలేదు..
అష్టా దశ పురాణాలు,వేదాలు,ఖురాన్,బైబిల్ , ఆది గ్రంధ, దమ్మ పధం ,ఆగమం కూడా చెప్పలేదు అని చెపుతుంటే ..వింటూ ఉంటాము.
ఈ క్రొత్త మతం పుచ్చుకున్న వాళ్ళు ఏమిటో ఇలా చెప్పి ..విసిగించి వేస్తున్నారు. ఈ దేశంలో.. ప్రశాంతంగా బ్రతకనివ్వరా?
తెల్లవారేటప్పటికి.. మా ఇంటి గోడలపైనా..కరంటు స్తంభాల పైనా..నేనే దేవుడిని ఏ దేవుడు లేడు..అని ఈ ప్రకటనలు ఏమిటి ? భగవాన్.. ఈ అజ్ఞానం నుండి.. మమ్మల్ని రక్షించి.. ఇతరులకి ఇబ్బంది కల్గించా వద్దని.. చెప్పు జీసస్ .. నీవు చూపిన ప్రేమ మార్గం ఇదా? నీ పేరిట చేస్తున్న ఈ వ్యతిరేక మతభావనలని తగ్గించు..అని.మతం అనే మత్తులోనుంచి.. ఆత్మ విశ్వాసం వైపు, విజ్ఞాన కాంతులతోను ప్రశాంత మైన జీవనం వైపు అందరిని నడిపించు.. అని కోరుకుంటాను. లౌకిక రాజ్యపు పౌరురాలిగా అలా కోరుకోవడం తప్పుగా ఉంది .మైనారిటీలని బ్రతకనివ్వరు అంటారు. కొన్నేళ్ళకి.. మైనారిటీలు ఎవరో..ఏమిటో! ..
ఆ బృందా కారత్.. ఏమిటీ అలా పెద్ద బొట్టు పెట్టుకుంటారు? అది ఆమె వ్యక్తిగతమా? ఆమె భావాలు- సిద్దాంతాలు ప్రజల కోసమా? జయసుధ గారు ఏమిటి..కొన్నాళ్ళు అన్ని అలంకరణలు చేస్తారు..మళ్ళీ తీసేస్తారు? అసలు బైబిల్ లో..అలా ఉండమని ఎక్కడైనా ఉందా? అన్న సందేహాలు వస్తూ ఉంటాయి. నా ప్రశ్నలు నాలోనే ఉంటాయి. ఎవరిని అడగను కూడా..
ఈ మద్య మాకు దగ్గరలో ఉన్న ఇంజినీరింగ్ కాలేగ్ గ్రౌండ్ లో.. మత పరమైన వేడుకులను అడ్డుకున్న విద్యార్దులని చూస్తే.. ముచ్చటేసింది. ఇంకెప్పుడు..ఏ మత పరమైన కార్య క్రమాలు,వేడుకలు కూడా జరగ కుండా కూడా..అడ్డుకోండి..అని కొంత మంది పిల్లలకి చెప్పాను కూడా..
(ఇది నా పర్సనల్ బ్లాగ్ కాబట్టి ..నాలో ఉన్న ఆలోచనలు వ్రాసుకున్నాను. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కాదు. విమర్శిస్తూ కూడా వ్రాసినవి కాదు అని గమనించ మనవి)

17 కామెంట్‌లు:
Really a good article.
>> అయినా అన్య మతస్తులని అంట రానితనంగా చూడటం,శత్రువులగా చూడటం అనే కుసంస్కారం..నాలో పెంపొందిన్చుకోలేదు.
ఇది మన భారతసమజంలో అదీ హిందువుకు కష్టమైన పని.
మన భారతదేశం లో పూర్వంనుంచీ కుల ప్రాధాన్యతలెక్కువ. కులం తర్వాతే మనకు మతం. కులం మనుషులను కట్టిపడేసినట్లు ఓ దశాబ్దం దాకా ఈ మతం దగ్గరచేయలేకపోయింది. ఈ మధ్య గ్లోబలైజేషన్ పుణ్యమా అని చదువుకున్న వారిలో కుల ప్రాధాన్యతలు తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికీ మనకు కులమే ప్రధానం. మతము కంటే. అలాగే ఆచార వ్యవహారాలు కూడా కులాల వారిగా ఉంటాయి. బ్రాహ్మణుల ఆచారాలు వేరు, వైశ్యుల ఆచారాలు వేరు. అలాగే చాకలి, గొల్ల,మాల,మాదిగ, రెడ్డి,కమ్మ,కాపు ఇలా ప్రతికులానికి కొద్దో గొప్పో ఆచారాలు తేడా !!. ఈ ఆచారాలన్నింటికి మూలము హిందూ మతమైనా ( హిందూమతమనేది ఒకటి వుంటే ) ఎవరి ఆర్ధిక స్తోమతను బట్టి స్థానికీకరించుకున్న ఆచార వ్యవహారాలు ఇవి.
ఎక్కువగా ఆర్ధిక అవసరాలు తీర్చుకోడానికి మతం తీసుకుంటున్నారు. మిగతా కారణాలు చాలా వున్నాయి
అసలు హిందూ మతం లేదు. అది వొక జీవన విధానం.
Very Nice Article...
Inthakaalam ee blog ni miss aiyanu annamata..
కష్టేఫలే గారూ, ఇది అన్ని మతాలలాగా మతం,మత గ్రంధాలు ముందు పుట్టి ఆ తరువాత మనుషులు చేరిన మతం కాదు. హిందువు అనే వాడు పాటించేదల్లా హిందూమతమే. అంటే మనుషుల్లో నుంచి పుట్టిన మతం హిందూమతం. వాళ్ళు పాటించేదల్లా హిందూమతమే అని నాఅభిప్రాయం.
పనికి రాని మతం ఉన్న ఏల ? లేన ఏల ?
కాపాడని దేవుణ్ణి పట్టుకుని వేలాడ నేల?
మనిషి డైనమిక్. సో, ఆతని కృతి దేవుడూ డైనమిక్ అవటం సర్వ సహజం.
సనాతనం అడుగంటిన వేళ, బుధ్ధుడు వచ్చాడు. బౌద్ధం అడుగంటిన వేళ శంకరుడు.
ఇప్పుడు జీసస్ ని నమ్మిన వాళ్ళు, కృష్ణ తత్త్వం లో కి రావటం లేదా ? అదీ ఈ కోవలనోయిదై వుండ వచ్చు,
కాకుంటే , ఆ జీసస్ ఇహ లోక కోరిక లని సాక్షాత్కరించడం తో మనిషి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ consciousness కి తోయబడి మార్పు కోరి వుండ వచ్చు.
కాల గతి లో , ఒక పిల్ల నది వేరే మార్గం పట్టి , మళ్ళీ జీవనది ని చేరాల్సిందేమో ? ఎంత కాలమన్నది ఆ పై వాడి, ఆ యా మనుషుల ఆకళింపు బట్టి ఉంటుందేమో !
అదేమిటో ఈ దేవ దేవుడు ఎన్నటికి అర్థం కాని విష్ణు మాయ అయిపోయాడు. ఎప్పటికి తెర తీస్తాడో ?
చీర్స్
జిలేబి.
>>>>>
ఎక్కువగా ఆర్ధిక అవసరాలు తీర్చుకోడానికి మతం తీసుకుంటున్నారు. మిగతా కారణాలు చాలా వున్నాయి
>>>>>
మీరు ఆర్థికంగా ఏమీ లేని కుటుంబం నుంచి వస్తే మీకు అది తప్పనిపించదు.
వనజవనమాలి గారు బాగా రాశారు ఓసారి నాకు ఇలాంటి సంఘటనేనే ఎదురయింది . ఆఫీసులో ఉన్న సమయం లో ఒకతను ఫోన్ చేసి వాదన మొదలు పెట్టారు . ఇదే విధంగా . నేను ౪౦ ఏళ్ళ వరకు హిందువునే వాస్తవం గ్రహించి ఏడాది క్రితం మతం మారాను అన్నాడు . మతం మారడం మారకపోవడం అతని ఇష్టం కానీ మతం మారడం గొప్పవిషయం అన్నట్టు , హిందూ మతంలో ఉండడం అజ్ఞానం అన్నట్టుగా మాట్లాడ సాగాడు . ఆఫీసు కాబట్టి నెమ్మదిగానే మాట్లాడక తప్పదు ఒకే మాట చెప్పను మిరన్నట్టుగు ౪౦ ఏళ్ళ పాటు మీరు aznanamlo గడిపారు మీరు అజ్ఞానం లో ఉన్నాననే విషం ౪౦ ఏళ్ళ తరువాత కానీ అర్థం కానీ పరిస్తితిలో మిరున్నారు. కొత్త మత జ్ఞానం మీకు ఏడాదే అయింది కదా. అది అర్థం కావడానికి మీ స్తహాయి ప్రకారం ౪౦ ఏళ్ళు పడుతుందేమో తొందరేవ్న్దుకు అని చెప్పను
భాస్కర రామి రెడ్డి గారు స్పందించినందులకు ధన్యవాదములు. నిజంగా మీరన్నట్లు హిందూ గా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇతరులని ద్వేషించే స్వభావం లేదు. పంచ భూతాలని,పశుపక్ష్యాదులని ఆరాధించడం వారి అనువంశ గతమైన ఆచార వ్యవహారం. చేసే వృత్తులని బట్టి కులాలు ఏర్పాడ్డా..కాలక్రమేణా ఆధిపత్య పోరు మొదలైనా.. హిందువులు పరమత సహనం కలవారు కాబట్టే ఈ దేశంలో మత చాందసం ప్రజలకి లేదు. (రాజకీయ నాయకులు పబ్బం గడుపోకోడానికి మతం ని అడ్డు పెట్టుకుంటారు తప్ప ) మత మార్పిడి అన్నది వ్యక్తిగతమే కావచ్చు.కానీ సామాజిక స్థితి,గతులని మార్చడానికి మత మార్పిడిని ఆయుధం చేసి..ఈ దేశంలో ప్రయోగిస్తున్నప్పుడు.. మనం వ్యతిరేకించడం లేదు.(లోలోపల భాధపడుతున్నాం తప్ప) కానీ కొత్తగా మత మార్పిడి చేసుకున్న వారి ధోరణి భరించలేకపోతున్నాం..అందుకే ఇలా వెల్లడించాల్సి వచ్చింది.
@ కష్టే ఫలే గారు.. వాళ్ళు మతం అనుకుంటున్నా మన జీవన విధానాన్ని మార్చుకోమని బలహీన మనస్కుల పైనా, పేదరికపు ప్రజల పైన వలలు విసురుతున్నారు. అలాగే..కొన్ని కారణాలు వల్ల. కూడా మత మార్పిడి.అవి అందరికి తెలిసినవే! మనం ఏం చేద్దాం చెప్పండి.? ధన్యవాదములు.
@ కమల్ గారు ధన్యవాదములు. నా బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదములు.
గ్రామాలల్లో ఇది ఎక్కువగా ఉంది లాస్ట్ టైం ఎప్పుడో మా గ్రామం వెళ్ళాను రావటం కుదరక రాత్రి ఉండి పోయాను.. అప్పుడు స్టార్ట్ అయింది కథ మొత్తం.. 7 కి మైక్ స్టార్ట్ అయింది ఏమిటి పక్కన అడిగితె చెప్పారు ఎవరో పాధర్ వచ్చారు ఏదో మీటింగ్ జరుగుతుంది అని..
మైక్ కావటం వాళ్ళ పడుకొని వింట్టు వున్నాను... మాములుగా చెప్పటం స్టార్ట్ చేశారు సో హైదరాబాద్ లో ప్రతి సండే వింట్టున్నాం కదా! ఇక్కడ కూడా అలానే ఉంటది అనుకున్నాను కాని వింట్టున్న కొలది తెలుస్తుంది.. జనాలను ఒక రేంజ్ లో భయపెట్టటం స్టార్ట్ చేశారు..
మాములుగా వాళ్ళు బాగా మాట్లాడుతారు.. అలాంటిది చివరకు మా దేవుడు తప్ప మిమ్ములను ఎవరు కాపాడలేరు అని అక్కడ ఉన్న జనాలని బయపెడుతున్నారు.. గ్రామాలలో చాల మంది చదువు కోరు అలాంటి వాళ్లకి ఇలా చెప్పి భయపెట్టి మత మార్పిడి చాల జరుగుతుంది..ఆ రాత్రి అలా గడిసింది..నెక్స్ట్ డే ఉల్లోకి కి వెళ్ళాను చాల మంది మతం మారారు ఉరిలో చేర్చ్ కూడా కట్టారు .. ఏ రేంజ్ లో జరుగుతుందో అర్ధం అయింది.. ఇలా మతం మారటం వల్ల వాళ్లకు వచ్చేలాభం ఏమిటో కాని చాల వారకు భయపడి మారుతున్నారు అన్న విషయం అర్ధం అయింది.. ఇలా మతం మార్చటం వల్ల వాళ్లకి ఏమి లాభం జరుగుతుందో అర్ధం కాలేదు.. మీరు చేస్తుంది తప్పు అని నేను చెప్పటం లేదు జనాలని ఇష్టం తో మార్చండి భయపెట్టి కాదు..
డబ్బున్నవానికి ఫ్రీగా లక్ష రూపాయలు ఇచ్చినా తీసుకోడు. పేదవాడు పది వేల రూపాయల కోసం లేదా క్రైస్తవ ఆసుపత్రిలో వైద్యం కోసం మతం మార్చుకుంటాడు. అవసరం అలాంటిదైతే అక్కడ మతం మార్చుకున్నవాళ్ళని ఎలా తప్పుపడతాం?
జిలేబీ..గారు...చీర్స్!!!!నా బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదములు. మీ వ్యాఖ్య నాకు బాగా నచ్చింది. సంతోషం.:))))))))
అన్య దేశస్తులు మన సంస్కృతీ-సంప్రదాయాలు మెచ్చి అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని గ్రహించి.. జ్ఞాన రహస్యాలని తెలుసుకుంటున్నారు తప్ప ..మన ఆదాయాలలో..కొంత భాగాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళ దేశాలు వెళ్లి అక్కడ ప్రజల స్థితి గతుల ఆధారంగా వారి పై వలవేసి..మన భావనల్ని బలవంతంగా రుద్దడం లేదు. కానీ ఇక్కడ చూడండి. మన వాళ్ళే మనపై "ఏసే దేవుడు అని చెప్పి స్వారి చేయాలని చూస్తున్నారు" దానిని నేను వ్యతిరేకిస్తున్నాను.
@జ్యోతిర్మయి గారు ధన్యవాదములు. బాగున్నారా?
@ తెలుగు మీడియా గారు.. ఆర్ధిక అవసరాలు ఉన్నా మత మార్పిడి చేసుకొని వారు చాలా మంది ఉన్నారండీ. మతం మత్తు జల్లి సాయం చేయకుండా .. అదే ప్రభోదకులు మతం మారని ఇతర మతాలలోని పేదవారికి సాయం చేయమనండి. అప్పుడు వారు స్వచ్చంగా సేవ చేసిన వారు అవుతారు. పేదలని,దీనులని ఆదరించిన "అమ్మ "కూడా మతం ని ఇక్కడ వేళ్ళూనించి వెళ్ళారు. మతం మారడం అనేది వ్యక్తీ గతం. మారడం అనేదాన్ని ఇతరులకి ఆపాదించడం తప్పు అంటున్నాను నేను. ధన్యవాదములు.
బుద్ధా మురళీ గారు.. ఇలాటి వాదనలు వినలేకపోతున్నాం. పాప భీతి ఉన్నవాళ్ళు,మానసిక దౌర్భాల్యం ఉన్న వారు, పేదరికం ఉన్నవారు, ఇంకా బోధనల పట్ల ఆకర్షితులైనవారు.. ఇలా.. ఎందరో! వారిని మనం వ్యతిరేకించడం లేదు. కానీ వారు ఇతరులని ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు చేస్తూ.. చాప క్రింద నీరులా వచ్చి ఈ దేశ రూపు రేఖలని మార్చే యత్నం చేస్తున్నారు. మతం అనే అజ్ఞానం లో భావి తరాలు కొట్టుకోకుండా ఉండాలని మనం కోరుకోవడంలో తప్పు లేదు కదా..! ధన్యవాదములు.
@ ప్రవీణ్ శర్మ గారు.. మత మార్పిడి కోసం పేదవాడికి సాయం చేయడం .. జీసస్ ప్రేమ మార్గం కి విరుద్దం కదండీ.. తన మతం లోని వారిని ప్రేమించినట్లే..ఇతరులని ప్రేమించి..వైద్యం కి అయ్యే ఖర్చు ని సాయంగా అందించవచ్చు కదండీ! మధ్యలో..మత మార్పిడి ప్రక్రియ ఎందుకు..?
తెలుగు పాటలు..మీరు చెప్పినది 100 % వాస్తవం. ధన స్వామ్యం,అవినీతి,మతం మన జీవితాలని ఎక్కువగా ప్రభావితం చేసే కాలం ఎంతో దూరంలో లేదు అని అనిపిస్తుంటుంది నాకు. :((((((
నేను బైబిల్ చదివాను. అబ్రహాము యొక్క దేవుణ్ణి తప్ప వేరే ఏ దేవుణ్ణీ నమ్మకూడదు అనే మతం అది. మన ఇండియాలో మాత్రం క్రైస్తవులు అన్ని మతాలూ సమానమే అని అబద్దం చెప్పి మత మార్పిడులు చేస్తారు. అయినా పేదవాళ్ళు క్రైస్తవ మతంలోకి మారడం వాళ్ళ నిస్సహాయత మాత్రమే అవుతుంది కానీ తప్పు అవ్వదని నేను నమ్ముతాను. నేను పుట్టిపెరిగింది వైట్ కాలర్ కుటుంబంలోనే కావచ్చు కానీ గ్రామాలు తిరిగి పేదరికం ఎలా ఉంటుందో చూశాను. అందుకే గ్రామీణ ప్రజలు మతం మార్చుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. మత మార్పిడులు జరగకూడదంటే మనమే వాళ్ళకి ఉచితంగా విద్య, వైద్యం అందించడం లాంటివి చెయ్యాలి కానీ మత ధర్మం గురించి చెపితే మారకుండా ఉంటారని నేను అనుకోను.
మొదటిది - మీ అబ్బాయి ఫోటో రంగు ఇదివరకున్న పర్పుల్ కలర్ బాగుంది , ఈ గ్రే కలర్ నాకు అంత బాగాలేదు , ఇది కేవలం నా అభిప్రాయం.
మీ పోస్ట్ - చాలా చక్కగా వ్రాసారు. సాంప్రదాయక క్రైస్తవ్యము దీనిని అంగీకరించదు. భారత దేశములో క్రైస్తవ్యము ఎప్పటినుండో ఉన్నా ఈ సమస్య కొద్ది కాలము నుండే ఉన్నది. ఇవి క్రైస్తవ మతములోని కుక్క మూతి పిందేలే కాని , నిజ క్రైస్తవ్యము కాదు. క్రైస్తవులలో ఉన్న దురాచారాలను ఖండించ మని బైబిలు చెప్పుతున్నదే కాని , ఇతరమతాలను ఖండించ మని చెప్పడములేదు.
సమస్య ఏమిటంటే క్రైస్తవ్యము గురించి ఏమి తెలుసు కోవడము లేదు, చివరకు మీడియా కూడా (దొంగ) బాబాలను గూర్చి మాట్లాడుతున్నది కాని అంతకంటే భయంకరమైన క్రైస్తవ (బాబాల) గురించి మాట్లాడటము లేదు. దీనికి కారణము క్రైస్తవ్యము గురించిన అవగాహన లేకపోవడమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి