22, ఫిబ్రవరి 2012, బుధవారం

అందమైన పాట - అమ్మ లాలిపాట


ఉదయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు చెప్పుల జతల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. బంధువులు అందరు వెళ్లిపోయినట్లు ఉన్నారు. "అమ్మయ్య" అని అనుకున్నాడు. అలా అని ఉదయ్ చుట్టపక్కాలంటే ముఖం చాటేసే బాపతు కాదు. బంధువులంటే   అభిమానం,పెద్దలంటే గౌరవం,అతిధి దేవుల పట్ల విపరీతమైన శ్రద్ద ఉన్నవాడు. అమ్మయ్య !అని ఎందుకు అనుకున్నాడు అంటే.. ":తనకి చీటికి మాటికి సెలవు పెట్టడానికి వీలు లేని ఉద్యోగం. ఒక వేళ  సెలవు పెట్టినా రోజులో సగ భాగం ఫోన్ కాల్స్ అటెండ్ అవడానికి,మెయిల్స్ ద్వారా ఆన్సర్ చెయ్యడానికో..ప్రాముఖ్యం ఇచ్చే మొహమాటస్తుడు.

తప్పని సరి కాదు కానీ చాలా ముఖ్యంగా..,శ్రద్దగా  తన వారిని చూసుకోవడానికి ఒక వారం సెలవు పెట్టి ఆ రోజే ఆఫీసులో పునర్దర్శనం  ఇచ్చాడు. ఆ సెలవు పెట్టడానికి కారణం ఏమనగా.."అమ్మ కడుపులో చల్లగా ఇంకో నెలపాటు ఉండాల్సిన చిన్ని కన్నయ్య " అప్పుడే ఈ లోకంలోని అందాలని చూడాలనుకుని..త్వర త్వరగా.. అరుదెంచాడు. వస్తూ వస్తూ..వాళ్ళ అమ్మని కాస్త బాగానే బాధపెట్టాడు. ఇక వాళ్ళ నాన్నకైతే ఒకటే సంతోషం. వాళ్ళ అమ్మ - నాన్న పుట్టేది అమ్మాయా-అబ్బాయా!? ఏం పేరు పెట్టాలి అనేది కూడా నిర్ణయించేసుకుని..స్వాగతం పలుకుతూ ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. 

చిన్ని కన్నయ్య అమ్మకి  ఏమో..తమ పనులు అన్నీ తామే స్వయంగా చేసుకోవాలని,వీలైనంతవరకు ఇతరలుకు ఇబ్బంది కల్గించ కూడదనుకుని .. తోలి కాన్పు సంప్రాదాయం కోసమైనా వాళ్ళ పుట్టింటికి వెళ్లక పోవడం వల్ల చిన్ని కన్నయ్య పుట్టిన శుభ సందర్భంగా వారి ఇంటికి  ముచ్చటగా ఒక ముప్పై మంది వరకు బంధువులు విచ్చేసినారు. వారికి ఆ మహా నగరంలో అన్నీ సమయానికి అందుతూ సకల మర్యాదలు అందుతున్నాయో..లేదో అని చిన్ని కన్నయ్య నాన్న ఉదయ్ కి దిగులు.అదన్నమాట సంగతి.

ఓ..వారం రోజుల పాటు హాస్పిటల్ చుట్టూ తిరగడం చిన్ని కన్నయ్య ముందుగా పుట్టడం వల్ల తనని ఇంక్యుబేటర్ లో ఉంచడం,వాళ్ళ అమ్మ కి సిజేరియన్  వల్ల తనని జాగ్రత్తగా చూసుకోవడం ఇవే సరిపోయింది. ఇక అతిధి మర్యాదల లోపం జరిగితే బాగోదని అతని ఉద్దేశ్యం కూడా.


ఉదయ్ తన షూ విప్పి స్టాండ్ లో సర్ది శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని   ఇంట్లోకి అడుగుపెడుతూనే.. మన బుల్లి హీరో చిన్ని కన్నయ్య కోసం వెదికాడు.  ఆయన గారేమో.. అమ్మ కడుపులో ఉన్నంత భద్రంగా ఆ రోజే కట్టిన చీర ఉయ్యాలలో..హాయిగా నిద్రపోతున్నాడు.

 "నిద్ర పోతున్నాడా?"అని అడిగి..ఆసేపు అలా చూసుకుని.. అబ్బో..! వీడు అప్పుడే వళ్ళు విరగ దీయడాలు,   ఆలోచన ముద్ర భంగిమలు,ముఖం చిట్లిన్పులు ..అన్నీ నేర్చేసుకున్నాడు అనుకున్నాడు ముచ్చటగా.పసి పిల్లలు,పువ్వులు యెంత సేపు చూసినా మొహం మొత్తవు.అలా కాసేపు చూసి ..వీడిని మంచి సంప్రదాయ పద్దతులలో..చక్కటి అభిరుచులతో..కలగలిపి..తన తాత ముత్తాతల ఒరవడిలో పెంచాలి అని మనసులో అనుకున్నాడు.

ప్రక్కనే ఉన్న బాల్కనీలో కూర్చుని వారం రోజుల నుండి తనకి వచ్చిన మెయిల్స్  చూసుకుంటూ ..  పోన్ లు చేసుకుంటూ ఓ గంట గడచి పోయింది. ఉన్నట్టు ఉండి ఒక స్వరం పాట పాడటం వినబడింది ఉదయ్ కి. శ్రద్దగా విన్నాడు.

చిన్ని కన్నయ్య   లేచి నట్లు ఉన్నాడు. లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు.వేలెడంత లేడు. ఇంట్లో ఉన్న ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకుని  సముదాయిస్తున్నా  ఏడుపు మానడం లేదు. అప్పుడు ఒక లాలి పాట పాడటం మొదలైంది.ఏ బిడియం లేకుండా  స్వేచ్చగా గొంతెత్తి పాడుతుంది ఆ గొంతు. ఉదయ్ ఆశ్చర్య పోయాడు చాలా సంతోషం వేసింది.

అతని గురించి...చెప్పాలంటే..

ఉదయ్ కి..తన మా తృ  భాష పైన మమకారం ఎక్కువ. సాహిత్యం అంటే ప్రాణం.సంగీతం వినడంపట్ల  ఆసక్తి. ఓ..నాలుగు  భాషలలోని పాటలని,సంప్రదాయ కీర్తనలని..ఆస్వాదిస్తూ.. ఉంటాడు.
అలాగే..తన భార్య అంటే అమితమైన ఇష్టం.  ఉదయ్ ని  ఓ మూడేళ్ళ పాటు గాడం గా  ప్రేమించి అతనికే  ఇల్లాలు అయిన అమ్మాయి. అన్యోన్య మైన జంట.

 ఉదయ్ కి.. తను నిత్యం ప్రాతః కాలం లోనే నిద్ర లేచి  సంప్రదాయ కీర్తనలు   వింటూ ఉండటం,సాయంత్రం ఆఫీస్   నుంచి వచ్చాక కాస్త   సేదదీరుతూ..పుస్తకాలు చదువుకుంటూ,మంచి సినిమా పాటలు వింటూ ఉండటం చాలా ఇష్టం . అప్పుడప్పుడూ.. తను కూడా శ్రావ్యంగా  పాడుకుంటూ ఉంటాడు.

అలాగే..తన అందమైన   భార్య సుమధుర స్వరం నుండి తనకి ఓ..పాట వినాలని చాలా కోరిక. పెళ్లి కాక ముందు ఓ..మూడేళ్ళు   కాలంలో..ఉషా...ఓ..పాట  పాడవా!? ప్లీజ్ అంటూ..పాడమని  వెంట  పడి అడిగేవాడు. అబ్బే!నాకసలు పాటలే రావు..మీరు పాడితే బాగుంటుంది..పాడండి..నేను వింటాను అని తప్పించుకునేది ఉష. అది పోన్ లో సంభాషణ కాబట్టి అలా తప్పించుకోవడం తో సరిపోయింది.

 ఇక పెళ్లి అయిన తర్వాత ఓ..రెండేళ్ళ నుండి..పదే పదే "ఉషా..పాట పాడవా.?.అని అడుగుతూనే ఉన్నాడు. నా పాట ఏం బాగుంటుంది చెప్పండి..?  ఏ కలకూజితం జానకమ్మ పాడితేనో, ఏ సొగసరి గొంతుక "చిత్ర"  పాడితేనో, ఏ గాన గంధర్వుడు జేసుదాస్ పాడితేనో బాగుంటుంది.అంతకన్నా .. అందరికన్నా నా ప్రియమైన శ్రీవారు ..కూనీ రాగం  తీసినా  వినసొంపుగా ఉంటుంది కానీ..అంటూ..తప్పించుకునేది.

అలా పాట పాడటం అంటే తప్పించుకునే ఉష.. ఇప్పుడు ఏ బిడియం లేకుండా స్వేచ్చగా గొంతెత్తి.. శృతి లయల రాగ,తాళాల సమన్వయము అలాటివేమి చూసుకోకుండా ఆనందంగా పాడు తుంది. "అమ్మ పాట వింటూనే చిన్ని కన్నయ్య ఏడుపు మాని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. " వడి వడిగా  వచ్చి ఆ దృశ్యాన్ని ఆనందంగా చూసాడు ఉదయ్.

ఇన్నేళ్ళు తన ముందు పాడటానికి బిడియపడే..ఉష ఇప్పుడు పాడుతుంది. అవును..తన బిడ్డ ని సముదాయిస్తూ నిద్ర పుచ్చడం కోసం పాడుతుంది.  ఆ పాట  అన్ని పాటల కన్నా ఎంతో బాగుంది

ఈ లోకాన   "ఆమ్మ  లాలి పాట కన్నా అందమైన పాట ఉందా..!? అనుకున్నాడు ఉదయ్.  ప్రేమగా, మురిపెంగా వారిద్దరిని చూసుకుంటూ.
 (ఇటీవలే పుట్టిన "మా చిన్ని కన్నయ్య " వాళ్ళ ఆమ్మ-నాన్న కబుర్లు ఇవి.)
 
         

15 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

చిన్ని కన్నయ్య ఎప్పుడూ తీయని అనుభూతే!!!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

వనజ గారూ,
అట్టే మా స్టోరీలా ఉందండీ? పేర్లుకూడా మా పేర్లకు దగ్గరగా ఉన్నవే ఎంచుకున్నారు :-)

గుండె ఇట్టే కరిగిపోయింది; మాకథను ఇంత మంచి టపాగా రాశారు. మా మీద మీకున్న వాత్సల్యానికి ఎలా ఋణం తీర్చుకోవాలో...

వనజవనమాలి చెప్పారు...

భాస్కర్ తమ్ముడూ.. మన చిన్ని కన్నయ్య కబుర్లే కదా..ఇవి. కనిపెట్టేసావు. చాలా సంతోషం. మీరందరూ.. సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. చిన్ని కన్నయ్యకి నా దీవెనలు.
@ కష్టే ఫలే గారు ..ధన్యవాదములు.

మాలా కుమార్ చెప్పారు...

అమ్మ లాలి పాట అందమైన పాట. పొస్ట్ బాగుంది .

చిన్ని కన్నయ్యకు ఆశీస్సులు .

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఎంత బాగుందో మాటలలో చెప్పలేనండీ.. ఉదయ్ ఉష అని మీరు ఎంచుకున్న పేర్లు కూడా చాలాబాగున్నాయ్.. చిన్ని కన్నయ్యకి ఆశీస్సులు..

వనజవనమాలి చెప్పారు...

మాలా కుమార్ గారు చిన్ని కన్నయ్య కి దీవెనలని వాళ్ళ నాన్న బ్లాగ్ లో ఇవ్వండి. టపా నచ్చినందుకు ధన్యవాదములు. ఈ బ్లాగ్ చూడండీ!
http://paravallu.blogspot.in/2012/02/what-to-expect.html

@ వేణు శ్రీ కాంత్ గారు.. ధన్యవాదములు. మన అందరి ఆశీస్సులు చిన్ని కన్నయ్యకి ఉండాలి.

సుభ/subha చెప్పారు...

మంచి ఇంట్రెస్ట్ గా ఉందండీ టపా..లాలి పాటంటే లాలి పాటే..అది అమ్మ పాడుతుంటే ఇంక చెప్పేదేముంది..

తెలుగు పాటలు చెప్పారు...

బుజ్జిబుజ్జి పాపాయి బుల్లిబుల్లి పాపాయి
నీ బోసినవువ్వులలో పూచే పున్నమి వెన్నేలలోయి..

ఆమ్మ పాట కన్నా అందమైన పాట మధురమైన పాట ఇంకా లేదు అండి
వనజగారు పోస్ట్ బాగుంది అండి ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"ఆమ్మ లాలి పాట కన్నా అందమైన పాట ఉందా..!?
నిజమేనండీ..

వనజవనమాలి చెప్పారు...

సుభ గారు..మీరు అమ్మ పాట అన్ని పాటలకంటే మధురం అని ఒప్పుకున్నారా!? సంతోషం.

@ బాలు.. నిజం కదా...నీకు అమ్మ పాట గుర్తుకొచ్చిందా!? సారీ బాలు..అమ్మని గుర్తు చేసాను కదూ!

@రాజీ.. మీ అమ్మ ఇప్పుడు కూడా పాడుతూనే ఉంది ఉంటారు. మీరు అమ్మ ఒడిలో పడుకుని ఆ పాట వింటూనే ఉంటారు. నాకు తెలుసు.

మీ ముగ్గురికి అమ్మ పాట నచ్చినందుకు ధన్యవాదములు.

తెలుగు పాటలు చెప్పారు...

మరచిపోతేనే కదా వనజ గారు.. నా ప్రతి అడుగులోను నావెంట ఉంది నన్ను ముందుకు నడుపుతున్నారు.. సారీ అని చెప్పకండి.. మీరు అంత నా వెంట ఉన్నారు కదా.. మీరు చెప్పినా మాటలు అన్ని గుర్తుకు ఉన్నాయి అండి..

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ లాలిపాట గురించి బాగా వ్రాశారు. చిన్ని కన్నయ్యకు ఆశీస్సులు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

మా చిన్ని కన్నయ్యకి ఆశీస్సులు అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదములు.

Manasa Chatrathi చెప్పారు...

వనజ గారూఊఊ....

ఏంటి అసలు! మనసులో మాటలు చదవగలిగిన శక్తి ఉన్నట్టే రాసేశారు...ఎంత బాగుందో, ఎంత బాగుందో!
మీ అభిమానం ప్రతి అక్షరంలోనూ కనపడింది. నాకైతే చదూతుంటే అలౌకిక ఆనందం కలిగింది. కథ, కథనం - వీటి వల్ల కాదు. అక్షరాల్లో అణువణువునా తొణికిసలాడిన ఆప్యాయత వల్ల.

భలే! చిన్ని కన్నయ్యకు హార్ధిక శుభాభినందనలు.

వనజవనమాలి చెప్పారు...

మానసా.. ఎవరిపై.. ఎప్పుడు ఎందుకు అభిమానం ఏర్పడుతుందో..చెప్పలేం కదా! అలా.. ఆ అభిమానమే.. నన్ను ఈ పోస్ట్ వ్రాయించింది. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.