25, ఫిబ్రవరి 2012, శనివారం

గెలుపు రహదారి
నీ కోసం చూసే క్షణాలు బరువుగా కదులుతూ..యుగాలని పిస్తుంటే
నీతో ఉన్న కొన్నిగంటలు క్షణాలులా కరిగిపోతుంటాయి
నీవు దూరమైన తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత పరచుకోవడం
దుర్లభం కనుక అసలు నేను నిన్ను కలవాలని అనుకోవడం
వద్దని   నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..
జీవనంలో జీవశ్చవంలా మారానో..? 
ఏమైనా నీ పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
గెలుపు రహదారి మొదట్లో ఆగి చూస్తుంది...
          

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Good

సుభ/subha చెప్పారు...

Nice One!

శ్రీలలిత చెప్పారు...

"గెలుపు రహదారి మొదట్లో ఆగి చూస్తుంది..."
చాలా బాగా చెప్పారు..