పాత్రలను రచయితలు చిత్రీకరిస్తూ తాము గిరి గీసి వున్న చోటనే కూర్చోబెడతారు. కొన్ని పాత్రలు మొదలుపెట్టే వరకే రచయిత పని. తర్వాత ఆ పాత్రలు రచయిత మాట వినవు. నేను రాసిన కథల్లో నీలవేణి పాత్ర ను నేను ఒక ఆశయానికి తగినట్లు గా చిత్రించదలిచాను. కానీ చాలాసార్లు ఆ పాత్ర ఎదురుతిరిగింది. పాత్ర స్వభావాన్ని బట్టి నేను అనుగుణంగా రాసాను. ఎడిటర్ స్థాయి లో వున్న వారికి ఆ పాత్ర నడక నచ్చలేదు. ఎందుకంటే వారు పాత్రలకు స్వేచ్ఛను ఇవ్వరు. బెత్తంతో బెదిరిస్తూ తాము అనుకున్న పరిధి లో customize చేసుకుని కుంచింపజేస్తారు. నేను కథ రాసే టప్పుడే ఎదురు తిరిగిన నీలవేణి తన పాత్రను ముక్కలు ముక్కలుగా నరికి రూపం మార్చేస్తే వూరుకుంటుందా!? సంపాదకులతో విభేదించాను. అందుకే ఆ పాత్ర నడకను పాత్ర కోరినట్టు నడిపించాను.
గొప్ప వ్యక్తిత్వం కలిగిన నీలవేణి కూడా పైకి ద్వేషిస్తూనే అంతర్లీనంగా శేఖర్ రెడ్డిని ఆరాధించింది. మనసు చంపుకోలేని బలహీనత తో అతనికి తన జీవితం లో చోటు ఇచ్చింది.
కథల్లో నవలల్లో పాత్రలు బలహీనంగా వుండకూడదు అంటే ఎట్లా!? పాత్రలను customize చేసినట్లు రూపొందించాలి కదా అనే ఆలోచన మార్చుకోవాలి. నేను రాసిన పూర్తి కథ “దీప వృక్షం “ ఈ లింక్ లో వుంది.
“స్వయంసిద్ధ” లో వున్న కథ నేను రాసిన “దీప వృక్షం “ కథ కాదు. ఆ కథ నాకు నచ్చలేదు. ఈ కథ .. ఒరిజనల్ కథ. ఆసక్తి వుంటే వినండీ.. ఈ లింక్ లో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి