తప్పిపోయిన పాట -వనజ తాతినేని
అనుకున్నవీ అనుకోనివి కలగన్నవీ కలకనవీనూ రాత్రి పగలూ పగలూ రాత్రి సంజె మసకలోనూ వేకువ జామున అల్లుకున్నవి విదిలించుకున్నవీ విదిలించేసినా అతుక్కునే వుండేవి..
అన్నీ నాతో కలసి ప్రయాణం చేస్తూ వున్నవి. నా ఊహచిత్ర పరంపర దీర్ఘకాలంగా కొనసాగుతూనే వుంది.
గుండె గదిలో కవితొకటి విరహ దీపంలా ఉద్విగ్నతతో వొణుకుతుంది.
హృదయాన అణిగిమణిగి వున్న రాగమొకటి జనియించి పెదవులపై చిగురించి పాటగా పరిమళించి.. ఏ అపరిచిత జాడనో వెతుకుతూ కొంగలా ఆకాశాన్ని ఈదుతూ నేలపై లేడిలా పరుగెడుతూ నడుస్తూ లేస్తూ
తొవ్వలో రేగిన దూగర లో కలిసిపోయింది. నా పాటని ..
ఏ పడమటి గాలి లాక్కుని పోయిందో! మీగ్గాని..
కనబడితే వెతుక్కుంటూన్నానని చెప్పరూ!?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి