లిహాఫ్ -ఇస్మత్ చుగ్తాయ్. 1941 లో రాసిన ఈ కథ అశ్లీలంగా వుందని బ్రిటీష్ ప్రభుత్వం కేసు పెట్టింది అంట. ఈ కథ ఆంగ్లంలో అనువాదం అయి ప్రచురణ లోకి వచ్చినప్పుడు అనేకులు రచయిత్రిని దుమ్మెత్తి పోశారంట. అయినా రచయిత్రి జంకలేదు. రచయిత్రి కి అపఖ్యాతి వచ్చింది. కాలక్రమేణా ఈ కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఇంతకీ ఈ కథలో ఏముంది అంటే.. స్వలింగసంపర్కం గల ఇద్దరు స్త్రీల గురించిన కథ ను ఒక చిన్న పిల్ల తన దృష్టి కోణంలో ఉత్తమ పురుష లో చెప్పిన కథ ఇది. ఈనాటికి ఈ కథ గురించి చర్చించడానికి చాలామందికి ఇష్టం వుండదు.
ఈ కథ ఉర్దూ ఆంగ్లంలో నూ తెలుగులోనూ వుంది. తెలుగులో పి.సత్యవతి గారూ కిరణ్మయి గారూ అనువదించారు. ఇప్పుడు ఈ కథను నేను చదివి వినిపించాను. LGBTQ రైట్స్ లీగల్ అయిన మన దేశంలో కూడా ఈ కథలు అబద్దం కాదు..అసహ్యం కాదు. కథ ఎంత మార్మికత తో చెప్పారో రచయిత. అందుకోసమైనా చదవండి వినండీ. “The Quilt” అనే పేరుతో ఆంగ్లంలో “లిహాఫ్” పేరిట ఉర్దూ లో “పట్టుబొంత” పేరుతో తెలుగులో వుంది కథ.
అనువాదకులకు ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి