20, జూన్ 2013, గురువారం

స్వాతి వాళ్ళ అమ్మ "సారంగ " లో

స్వాతి వాళ్ళ అమ్మ  "సారంగ " లో

   నేను వ్రాసే కథలు ఎప్పుడూ  వాస్తవిక జీవితాల్లో నుంచే  పుడతాయి.  స్త్రీలకి పునర్వివాహం లో ఉండే కష్ట నష్టాలు గురించి ఒక కథ వ్రాసాను . ఆ కథ   ఈ లింక్ లో "స్వాతి వాళ్ళ అమ్మ " కథ
 ఈ కథ వారం వారం మనని పలకరించే  వెబ్ మాగజైన్  "సారంగ " లో  పాఠకులకి చేరువలో ఉంది

కథని చదివి మీ ఆలోచనలని అభిప్రాయాన్ని పంచుకోండి .

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కధ చదివేను. బాఉంది

శశి కళ చెప్పారు...

akka link ivvaledhu.malla vetiki chaduvuthanu.congrats

అజ్ఞాత చెప్పారు...

బాగా రాసారండీ. స్వాతి పాత్రలోని ఆవేదనని చక్కగా చెప్పారు. ఈ మధ్యనే పునర్వివాహం చేసుకున్న నా స్నేహితుడొకరు ఆమెని చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు.కాకపోతే ఆమెదీ ద్వితీయ వివాహమే కానీ పిల్లలు లేరు. అతనికి పన్నెండేళ్ళ అబ్బాయి. పిల్లలున్న వ్యక్తిని చేసుకోవడం ఇష్టం లేక వెదికి మరీ పిల్లలు లేని ఆమెని చేసుకున్నాడు. అందరూ మంచి వాళ్ళేనని చెప్పలేము కదా.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, కథ చదివాను. మీదైన శైలిలో, చక్కటి కథనం తో ఎంతో బాగా రాసారు.
1. మోహన కృష్ణ మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిసి,అతనిని తన తల్లితో వివాహం జరిపించాలని ఎలా అనుకుంది?
2. స్వాతి వాళ్ళ అమ్మగారికి " ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే ధైర్యం రాదు" అని స్వాతి చెపుతుంది కథలో...సమాజం కోసం కలిసి బతకడం తప్ప వేరే దారి లేదు అని ఆ పాత్ర ద్వారా ఎందుకు చెప్పించారు?

ఒంటరిగా బ్రతకడం స్వాతి వాళ్ళ అమ్మగారికి కొత్తేమి కాదు.ఆర్ధిక స్వాతంత్రం కూడా ఉంది . అవిడకు మోహన కృష్ణ ద్వారా సంతానం లేదు. అయినా సమాజం , బంధువర్గానికి భయపడి జీవితాతంతం నరకం అనుభవించాలా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ ..కథ నచ్చినందుకు ధన్యవాదములు .

@శశికళ గారు ..కథ లింక్ పొస్ట్ లో ఉంది . "స్వాతి వాళ్ళ అమ్మ" అన్న చోటున నొక్కి చూడండి.ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు మీ ఇంకో వ్యాఖ్యకి మెయిల్ ఇచ్చాను చూడండి . చాలా సంతోషం

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల "శ్రీ " గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు .

స్వాతి వాళ్ళ అమ్మ "ఆర్ధిక స్వేచ్చ కల్గిన, ఎన్నో ఏళ్ళ పాటు ఒంటరితనం అనుభవించిన స్త్రీ మూర్తి. ఆమెకి దైర్యం అన్నీ ఎక్కువే! కానీ ఈ పునర్వివాహం ద్వారా ఆమె చుట్టూ అల్లుకున్న కొన్ని బంధాలని :(సంకెల్లని ) ఆమె చుట్టూ అనేక బాధ్యతలు ఉన్నాయి . స్వాతి వాళ్ళ నాయనమ్మ. ఆమె భర్త తల్లి ,ఇంకా ఆస్తి పరమైన విషయాలు, బంధు వర్గం నుండి ఎదుర్కునే అనేక ప్రశ్నలు, వీటన్నింటికన్నా సమాజం చేసే వ్యాఖ్యలని ఆమె భరించలేదు. ఆమెని మోసగత్తె గా, డబ్బు కోసం అతనిని వివాహమాడి తర్వాత విడిపోయిందనే అపవాదులు ఆమె భరించలేక మౌనంగా భరిస్తుంది జీవితాంతం వరకు. అదే విషయాన్ని కథలో స్వాతి తో చెప్పించాను. మరొకసారి చదవండి.

ఇది స్వాతి వాళ్ళ అమ్మ కథ మాత్రమే కాదు . చాలా మంది స్త్రీ మూర్తుల వ్యద. తెంపరితనం.సమాజం సూటిపోటి మాటలు భరించలేక అలా భరిస్తూనే ఉంటారు. అంతే !

"సారంగ" లో కే గీత గారి వ్యాఖ్య చూడండి 100%నిజం

శ్రీలలిత చెప్పారు...


కథ బాగుందండీ. కొన్ని కొన్నిసార్లు మనం తెలిసీ తప్పు చేస్తుంటాం. ఇక్కడ స్వాతి వాళ్ళ అమ్మ అదే చేసింది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకి కారణాలు చెప్పలేము. స్వాతి వాళ్ల అమ్మకి పెళ్ళి చేయ్యాలనుకున్నా, ఆవిడ పెళ్ళి చేసుకున్నా తప్పు పట్టదగ్గది ఏమీ లేదు. అందరి జీవితాలూ ఇలాగే ఉంటాయని కాదు కానీ కొందరి జీవితాలు ఇలాగ కూడా ఉంటాయని చెప్పడం. అందుకోసం మీరు చెప్పిన నేపధ్యం సరిగ్గా అమరింది. ముఖ్యమైనది తండ్రి స్వాతికి "స్వాతి" అని పేరు పెట్టడం. అలా ఎందుకు పెట్టాడో చెప్పడం. మిగిలిన విషయాలకన్న స్వాతికి ఆ పేరు నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఎక్కువై ఈ పని చేసిందనుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన విషయాలకి బాధపడడంలోనూ తప్పు లేదు. ఎటొచ్చీ మీరు స్వాతిని అమెరికాలో ఉన్నట్టు ఎందుకు చెప్పారో కాని దాని వల్ల కథకి బలం వచ్చినట్టు ఏమీలేదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ లలిత గారు .. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు
స్వాతి అమెరికాలో ఎందుకు ఉంచారు అంటె అది కథలో భాగమే! పునర్వివాహాలు సర్వసాధారణం అయిన ఆ సంస్కృతీ లో బ్రతుకున్న మన వారికి అక్కడ వారిని చూసినంత సాధారణంగా మనవారిని చూడలేరన్నది ఒక కారణం అక్కడ వారు ఎలా ఉన్నా సరే మన సంస్కృ తి సంప్రదాయం అలాగే బతికి ఉండాలన్నట్టు మాట్లాడతారు మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది ప్రపంచంలో మనం భాగం అనుకునేటట్లు లేరు. తల్లి కి పునర్వివాహం జరిగింది పిల్ల తండ్రి ఇప్పుడు తండ్రిగా చెప్పబడుతున్న అతను అసలు తండ్రి కాదని తెలిసి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సంబంధం వద్దనుకున్న వారు ఉన్నారు వారు అమెరికా దేశం లోనే నివశిస్తున్నారు ఇలాంటివన్నీ నాగరికత ముసుగు వేసుకున్న మనుషులని మనకి పట్టి ఇస్తాయి (ఇది ఈ కథలో భాగం కాదు ..ఒక అనుభం మాత్రమే )
కథలో స్వాతి అన్నయ్యలిద్దరూ ( అమెరికా లో నివాసం ) ఆమెకి అమెరికా సంబంధమే కుదిర్చారు అన్నది కథలో చదవడం మీకు గుర్తు ఉన్నట్లు లేదు మంచి సంబంధం అంటే అమెరికా లో ఉద్యోగం చేస్తున్న వరుడే అని ఈ దేశం లో ఉన్న 50%మందికి ఉన్న నమ్మకం అంటే మీరు నమ్మాలి మరి
ఇకపోతే పునర్వివాహాలు మంచివా- చెడ్డవా ? అనే చర్చ పెట్టగల్గినంత సహృదయులు మనకి ఉన్నారంటారా ? వివాహాలు,పునర్వివాహాలు , చదువులు, ఉద్యోగాలు మన భారతీయ స్త్రీలని చెడగొట్టాయని కన్నె పిల్లలా !వారెక్కడ ? అని వ్యాఖ్యానించే సభ్య సమాజంలో ఇక్కడ స్త్రీలు ఆవేదన చెందుతుంటే పునర్వివాహాల గురించి మాట్లాడటానికి వేదికలా? సంఘ సంస్కర్తలని తలచుకుని వారికి మనం నివాళులు అందిస్తున్నామా ? ఎద్దేవా చేస్తున్నామా ? ఇలాంటి ప్రశ్నలకి మీకు జవాబు లభిస్తే ఈ కథకి వేదిక ఇక్కడె అయి ఉండేదేమో ! నేను కూడా చెప్పలేను
ఇది స్వాతి చెప్పిన అమ్మ కథ . స్వాతి అమెరికా లోనే ఉన్నది .. అది నా కత కావచ్చు వాస్తవం కావచ్చు ఇంతకన్నా వివరణ ఇవ్వడం బాగోదేమో!

Unknown చెప్పారు...

వనజ గారు కథ చాలా బావుందండీ ! నేనెప్పుడూ మీ బ్లాగ్ చదువుతుంటాను.

ఈ కథ లో స్వాతి పునర్వివాహం చేసుకున్న వారి సమస్యలు, చెప్పిన మాటలు లో ప్రతి అక్షరం నా జీవితంలో జరిగినవే, ప్రేమించి వేరేమతానికి చెందినా వ్యక్తిని వివాహం చేసుకుని ఒక బిడ్డకి తల్లి అయి అనేక కష్టాలు పడ్డాను బిడ్డని కూడా వదిలేసి రావాల్సి వచ్చింది . గత ఆరేళ్ళుగా నా ఇంట్లో మళ్ళీ పెళ్ళి చేస్తామంటూ నెలకొక సంబంధం తెస్తారు వయసు 60 -45 మధ్య ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు . పెల్లైయిన పిల్లలు ఉంటారు నా బిడ్డతో సంబంధం లేకుండా చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి రెండో భార్యగా ఇంటికే అంకితం అయ్యేందుకు సిద్దమైతే నాకు వెంటనే పెళ్ళైపోతుంది మా వాళ్లకి నా బరువుతీరుతుంది నా వయసు 34. నాలాంటి వాళ్ళు ఎదుర్కునే మాటలని ఈ కథలో అక్షరం అక్షరంలో నింపారు నాలాంటివాళ్ళు చెప్పుకోలేని బాధని స్వాతితో చెప్పించారు .కథ చదివి నాకు దుఃఖం వచ్చింది స్వాతి చెప్పింది నిజం . ఎవరూ బలవంతంగా వివాహం చేసుకోమని ఒత్తిడి పెట్టకూడదు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లే. మగవాళ్ళ ఆలోచనలు మారాలి. స్త్రీల సమస్యలని ఆలోచనల్ని చెప్పే కథలు మీరు మరిన్ని వ్రాయాలి . కృతజ్ఞతలు . పేరు చెప్పలేని అనామిక.