10, జూన్ 2013, సోమవారం

అతడు - ఆమె - ఒక మొబైల్

చెమటలు క్రక్కుకుంటూ వంట గదిలో  పని చేసుకుంటున్న సౌమ్య ఫోన్ మ్రోగింది వీణ మ్రోగినట్లు.

 చేస్తున్న పని ఆపి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ .. పోన్ లిఫ్ట్ చేసి  వీణ మీటినట్లు .:"హలో " అంది 

"సౌమ్య  గారు నేనండి .. సుమ ని" .. అంది సుమ సౌమ్య వాళ్ళింటి పై భాగంలో అద్దెకి ఉంటారు.  పిల్లలని తీసుకుని సెలవలకని పుట్టింటికి వెళ్ళింది

"చెప్పండి  ఏమిటి విషయం ? ఎలా ఉన్నారు" అంది సుమ.
"నేను పిల్లలు బాగున్నాం  అండీ ! పిల్లల్ని తీసుకుని ఊరు వెళుతున్నాను . వారం రోజులు ట్రైనింగ్ కి వేరే  క్యాంపస్ కి వెళ్ళాలి. అత్తయ్య గారింట్లో పిల్లలని వదిలి రోజూ ట్రైనింగ్ కి వెళతాను .. మా వారికి మీరు ఒక విషయం పాస్ ఆన్ చేయాలి" అంది

"చెప్పండి .. ఏం  చెప్పాలి ??

"ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాతొ మా ఫ్రెండ్ కూడా వచ్చారు లేట్ అయిపోతుంది అని నేను హడావిడి పడుతుంటే నాకు హెల్ప్ చేస్తూ .. టేబుల్ పై ఉన్న ఫోన్ ని బేగ్ లో వేసేసింది . నేను ఇప్పుడే చూసుకున్నాను నా పోన్ ,మావారి పోన్ రెండూ ఒకే విధంగా ఉండటం మూలంగా ఎదురుగా కనిపించిన పోన్ నా పోనే అనుకుంది . మావారు పోన్ కోసం వెదుక్కుంటారేమో ..  వారి పోన్ నా దగ్గరే ఉందని కాస్త .ఆయనకీ చెప్పండి " అంది రిక్వెస్ట్ గా..

 "అలాగే నండీ!" అంటూ పోన్ పెట్టేసింది సౌమ్య

సుమ భర్తకి విషయం చెపుదామని చూస్తే ఆతను కనబడలేదు

సుమ ఆమె ఫ్రెండ్ కూడా కూడబలుక్కుని సుమ భర్త పోన్ని  కావాలనే పట్టుకుని వెళ్లి ఉంటారు అనుకుంది సౌమ్య దానికి ఒక కారణం ఉంది సుమ భర్త  చేసేది రాత్రి ఉద్యోగం. ఆమె స్కూల్ టీచర్ . ఆమె స్కూల్ కి వెళ్ళిన టైం  లో ఎక్కువసేపు పోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు  ఆ విషయాన్ని  సౌమ్య గమనించి సుమని  హెచ్చరించింది  ఆతను గంటల తరబడి మాట్లాడుతున్నాడు . మాట్లాడుతున్నప్పుడు నేను  చాలా సార్లు గమినించాను  ఖచ్చితంగా  ఎవరో స్త్రీ  తోనే మాట్లాడుతున్నారు  కాస్త జాగ్రత్త పడండి  అని చెప్పింది కూడా.


"అవునండీ నాకు చాలా అనుమానంగా ఉంది, పైగా ఆయన పోన్ ని ఎవరిని అంటు కోనివ్వరు   పిల్లలు ముట్టుకున్నా ఊరుకోరు. కొట్టెస్తారు" అని చెప్పింది  సుమ ముఖం మాడ్చుకుని.

ఆ విషయం గురుకు వచ్చిన సౌమ్య ఇక సుమ భర్త పై సి . ఐ . డి  పని మొదలపెట్టింది అనుకుంది. అనుమానం ఏర్పడినప్పుడు ఏ భార్య అయినా నిశితంగా పరిశీలించక తప్పదు కదా!

ఓ అరగంట తర్వాత వరండా లోకి వచ్చిన సౌమ్య కి మేడ పై భాగం  లో నుండి సుమ భర్త మాటలు వినబడుతున్నాయి

" నా పోన్ నా దగ్గర లేదు .. మా ఆవిడ పట్టుకెళ్ళింది. నేనిప్పుడు  ప్రక్కింటి ఆయన పోన్ తీసుకుని మాట్లాడుతున్నాను, నువ్వు నిమిషానికి ఒకసారి మెసేజ్ లు పెట్టకు నా పెళ్ళాం  చూసింది అంటే కొంప కొల్లేరు అవుతుంది .. తనకి అసలే నా  మీద అనుమానగా ఉంది .. " అంటున్నాడు.

ఈ మాటలు వింటున్న సౌమ్యకి కూలిపోతున్న ఒక కాపురం కనిపించింది. ఇంటింటా మొబైల్ ముసలం పుట్టింది
(ముందు సరదా ..తర్వాత మాటల్లో ఏదో ఆకర్షణ, తర్వాత ఓ ..వింత ప్రేమ ,  సగ భాగానికి జరిగే ద్రోహం . ఎక్కడ చూసినా ఇదే రకం ప్రేమ రోగం )4 కామెంట్‌లు:

Niru చెప్పారు...

Is this true story ?

వనజ తాతినేని చెప్పారు...

నీరూ గారు.. :) అవునండీ! ఇలాంటివి నిత్యకృత్యమై విరాజిల్లుతున్నాయి మరి.

జలతారు వెన్నెల చెప్పారు...

ఔరా! ఇదెక్కడి వైపరీత్యం అండి?

Kottapali చెప్పారు...

Interesting.
ఈ మధ్యన స్కైబాబా రాసిన కథ చదివారా? ఆంజ్యోలో వచ్చిందనుకుంటా.
I'd like to know your opinion about it.