బ్ల్లాగ్ మిత్రులకి నమస్తే ! అందరూ బావున్నారా అండీ !?
అడివరకటి లా రోజూ పొస్ట్ వ్రాయాలనే ఉత్సాహం తగ్గక పోయినా ..ఓ ..నిరాసక్తత అలముకుంది. అందుకని ఎక్కువ బ్లాగులు చదివే పనిలోనే ఉన్నాను.
ఏదైనా తక్కువ వ్రాసే పని లోనే ఉన్నాను కదా! !
ముఖ్యంగా నేను వ్రాసిన పోస్ట్ లలో నేను వ్యాసాలూ మాత్రమే చక్కగా వ్రాయగల్గాను. ఒక కథ, లేదా కవిత తో అందరిని మెప్పించడం కూడా చాలా కష్టం కూడా . కానీ నేను కథలు వ్రాయడానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను.
నేను వ్రాసిన కథలు ఏ పత్రికలకో పంపి ఒక అర్ధ సంవత్సరం పాటు ఎదురుచూస్తూ అసహనంగా ఉండటం నా వల్ల కాదు. అందుకే వ్రాసిన వెంటనే ఠపీ మని బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .
ఆ కథలపై స్పందన సరిగా రాకున్నా సరే .. ఏదో నా తృప్తి :)
ఈ వారంలో ఒక చిత్రమైన సంగతి గమనించాను . " రాయికి నోరొస్తే !? " కథ పోస్ట్ చేసిన తర్వాత నాలుగు రోజులకి ఈ రోజు గమనిస్తే .. ఆ కథ కి 1549 వీక్షణలు వచ్చాయి
అలాగే అప్పుడెప్పుడో వ్రాసిన కథ "జాతర " కి 831 వీక్షణలు ఉన్నాయి ఈ కథని Ashburn Virginia లో రోజు ఒకరు చదువుతున్నట్లు గమనించాను
బ్లాగులలో వ్రాసిన కథలకి ఎవరు ఎప్పుడూ వారి వారి కథలకి లభించిన స్పందనలని చెప్పినట్లు నేను గమనించలేదు
ఈ బ్లాగ్ లో ఉన్న కథలని చాలా మంది చదువుతున్నట్లు నేను గమనిస్తున్నాను . కథ గ్రూప్ లో కూడా బ్లాగ్ కథలని పరిచయం చేస్తున్నారు
నాకు ఒక ఆలోచన తోస్తుంది . ఈ బ్లాగ్ లలో ఈ 2013 లో వ్రాసిన కథలలో ఒక పది లేదా పదిహేను కథలని ఉత్తమమైనవి ఎంపిక చేయించి "బ్లాగ్ కథలు " అనే కథా సంపుటి వేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది
ఈ ఆలోచన ఎలా ఉంది అంటారు !? ఆసక్తి కల్గిన వారందరూ ఒకసారి కూడి సమాలోచన చేద్దాం .
పత్రికల వారికి పంపి ప్రచురింప బడలేదు ఆన్న బాధ ని ప్రక్కకి పెట్టేసి మన మన బ్లాగ్ ల లోనే కథలు వ్రాసుకుందాం . ఔత్సాహిక రచయితలూ అందరూ .. మంచి మంచి ఇతివృత్తాలతో కథ వ్రాయడం మొదలెట్టండి .
అవకాశాన్ని బట్టి అచ్చు లోనూ ..లేదా డిజిటల్ ప్రచురణ లోను "బాగు కథలు " ని పరిచయం చేద్దాం
నా ఈ ఆలోచన చెప్పగానే ఓ.. సాహితీ సంస్థ వారు ఉత్తమ కథలకి మూడింటికి బహుమతులు ఇద్దాం .అని సంతోషంగా ప్రకటించేశారు
ఇంతకూ ముందు "కె ఎన్ మల్లీశ్వరి గారి బ్లాగ్ కథ ల సంపుటి " అలాగే కల్పన రెంటాల గారు బ్లాగ్ లో సీరియల్ గా వ్రాసిన "తన్హాయి " నవలగా రావడం చూసాం కదా!
వర్ధమాన రచయిత,రచయిత్రులందరూ కలసి మనం కూడా ఒక ప్రయోగం చేద్దాం .. ! పోయేది ఏముంది .. ఒక ప్రయత్నం విజయవంతం లేదా అపజయం .. అంతే కదా !
ఆసక్తి కల్గిన వారు మీ మీ స్పందనల్ని వ్యాఖ్య ల రూపంలో తెలియజేయండి..సూచనలకి ఆహ్వానం పలుకుతూ

18 కామెంట్‌లు:
మంచి ఆలోచన. బాగున్నది. ప్రింట్ వెయ్యటం తలకాయనెప్పి పెట్టుకోకుండా ఆ కథలన్నీ కూడ ఒక పి డి ఎఫ్ చేసి వ్రాసినవారి బ్లాగుల్లో డౌన్లోడ్ కి లింక్ ఇస్తే చదువుకునేవాళ్ళు డౌన్లోడ్ చేసుకు చదువుకుంటారు.
మీ బ్లాగుకు వచ్చి వ్యాఖ్య వ్రాయటం నాకు ఇదే మొదటిసారి (అనుకుంటాను). వ్యాఖ్యలు వ్రాద్దామనుకునే వారికి సరిపొయ్యే మంచి సలహాలు ఇచ్చారు బాగున్నది. సద్విమర్శ అని ఉండాలి, సద్విమర్ష కాదు.
మంచి ఆలోచన. ముందుకు సాగండి.
>కథ పోస్ట్ చేసిన తర్వాత నాలుగు రోజులకి ఈ రోజు గమనిస్తే .. ఆ కథ కి 1549 వీక్షణలు వచ్చాయి
బ్రహ్మాండం. మీ కథలు చదివే పాఠకులు బోలెడు మంది ఉన్నారన్నమాట. అదృష్టవంతులు. ఇంకా బోలెడు మంచి మంచి కథలు మీరు వ్రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
పదిమందీ మెచ్చటం అంటే మాటలు కాదు! మనలో మనమాట. "పాహి రామప్రభో" శీర్షీకను నేనూ రాములవారూ తప్ప మరెవరూ చదవటం లేదు! బ్లాగులు చదివే వారిలో యెవరికీ నా పద్యాలు నచ్చుతున్నట్లు లేదు మరి. చాలా పద్యాలకు పాఠకుల సంఖ్య 2 లేదా 3కు మించటం లేదు.)
మంచి ప్రయత్నమే కాక ప్రొత్సాహకరంగాను ఉన్నది ఈ ఆలోచన .
కబుర్లు చెప్పడం అలవాటయ్యింది. కధ చెప్పగలనా? అనుమానం.
మంచి ఆలోచన.. కానివ్వండి..
మీ ప్రయత్నం ముందుకు సాగాలని ఆశిస్తున్నాను . మీ"రాయికి నోరొస్తే"చదివాను .బాగుంది . అతడి లాంటి విద్య ఉన్న వింత పశువులు ఇంకా ఉన్నారా?అని బాధ కలిగింది .
Good idea. I agree with sivaramaprasad garu's suggestion.
SIVARAMAPRASAD KAPPAGA గారు.మీ సూచన బావుందండీ ! మీరన్నట్లు ముద్రణ తలనొప్పి వ్యవహారమే ! కానీ పుస్తకప్రియులకి చేరువచేద్దామని ఒక ఆలొచన.
మీ స్పందనకి ధన్యవాదములు
శ్యామలీయం గారు నమస్కారం . మీ స్పందనకి ధన్యవాదములు .
కాలప్రవాహాన్ని ఎదుర్కొని "పాహి రామ ప్రభూ " చిరస్థాయి ఉంటుంది మీ శ్రమ మీ అభిలషణీయం గొప్పవి. కాకపొతే నాలాంటి వారికి పద్యం మీద ద్రష్టి నిలవదు అదే కారణం అనుకుంటాను
మీరు కూడా మిగతా విషయాలపై వ్రాస్తూ ఉండండి
Sharma గారు ధన్యవాదములు . మీరు కూడా విరివిగా కథలు వ్రాయండి
కష్టే ఫలే మాస్టారూ కబుర్లు చెప్పెవాళ్ళే కథలు బాగా చెపుతారండి . ప్రయత్నం చేయండీ . ధన్యవాదములు
జ్యోతి గారు . ధన్యవాదములు మీరు కథలు వ్రాయాలి మరి
నాగరాణి గారు ధన్యవాదములు.
అనూ గారు ధన్యవాదములు. మీ స్పందన చాలా సంతోషం
i am new .I like
your idea
brahmammeka.
చాలా మంచి ఐడియా! ఈ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి - ఆల్ ది వెరీ బెస్ట్!
brahmeswara rao Meka & kishor varma gaaru ..ధన్యవాదములు
mee alochana bagundi...munduku saagandi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి