5, నవంబర్ 2013, మంగళవారం

"పూదండ" లో వనజ

నా గురించి నా బ్లాగ్ లో అప్పుడప్పుడూ చెపుతూ ఉంటాను . , అలాగే కొన్ని బ్లాగ్ ఇంటర్వ్యూ లలోను వచ్చింది కదా !  క్రొత్తగా చెప్పేందుకు ఏమి లేదు

"పూదండ" అగ్రిగ్రేటర్ వారు నవంబర్ నెలలో నా పరిచయం ని అందించారు

. "పూదండ" లో  ఒదిగిన .. ఓ.. వనజ   (వనజవనమాలి)

ఇక్కడ చూసి నాలుగు అక్షింతలు వేసేయండి  :)

నా పరిచయం అందించాలనుకున్న "పూదండ " అగ్రిగ్రేటర్ వారికి  హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ ..


11 వ్యాఖ్యలు:

nagarani yerra చెప్పారు...

బాగుంది వనజ గారూ!మీ పరిచయం,అభినందనలు.

hariSbabu చెప్పారు...

పూదండలో మీ పరిచయం ఇప్పుడే చదివాను.మీ అభిప్రాయాలన్నీ మీ వ్యక్తిత్వంలో ఉన్న సాహిత్యాన్ని అంటే భావ వ్యక్తీకరణని బాద్యతాయుతంగా తీసుకునే వారని తెలిసేలా ఉన్నాయి. అయితే ఒకటి హాస్యం తక్క్కువగా ఉంటున్నది. మరీ నవ్వు పుట్టించాలని వికారంగా కాకుండా కొంచెం హాస్యం డోసు పెంచండి. వ్యాస భగవానుడూ ఆదికవి వాల్మీకి కూడా అంత గంభీరమయిన వారి కావ్యాలలో కూడా హాస్యాన్ని కూడా చొప్పించారు. ఇదివరలో ఈనాడులో ప్రమాదాలకీ చావువార్తలకీ కూడా ఛందోబధ్ధమయిన తల్కట్లతో నవ్వులపాలయినట్టుగా కాకుండా సున్నితమయిన హాస్యానికి చోటు కల్పించండి.బావుంటుంది.

Vanaja Tatineni చెప్పారు...

nagarani yerra గారు థాంక్ యూ సో మచ్

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు అలాగేనండీ! థాంక్ యూ సో మచ్.

Padmarpita చెప్పారు...

అక్షింతలు కాదండి హృదయపూర్వక అభినందనలు

hariSbabu చెప్పారు...

మీరు నాకింకో చిన్న సాయం చెయ్యాలి. మీరు మొదట్లో బ్లాగుల గురించి యేమీ తెలియదని, ఒక స్నేహితురాలు చెబితే నేర్చుకున్నానని అన్నారు. జీవితమంతా ఇలా కామెంటుతూనే బతికెయాకుడా నేను సయితం బ్లాగులోకం లోనికి సొంతటపాల్ని పక్షుల్లా యెగరేద్దామనుకుంటున్నాను. మీరు ఆ విషయాలన్నీ నాకు చెప్తారా?నాకు నేనుగా కొన్ని లింకుల్ని గూగుల్ లో కీ వర్డ్స్ తో ప్రయత్నించినా అవేవీ సరయిన చోటికి తీసుకెళ్ళలేదు. మీ వైపున కనబడే నా కామెంటులో మెయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆ సమాచారం వివరంగా నా మయిల్కి అందిస్తారా? పోస్టుల్ని ఆగ్రిగేటర్లో కలపడం కూడా చెప్పాలి.

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు .. మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకోబడం రాదనీ జోక్ చేస్తున్నారా? భలే వారండీ..!!! మీరు బ్లాగర్ గా sign in అయి ఉన్నారు ఇప్పటికే . మీరు ఒక బ్లాగర్ గానే నాకు మీరు comment ఇచ్చారు మరి. గమనించండి.

hariSbabu చెప్పారు...

జోక్ కాదు, నిజంగానే నాకు ఈ సాంకేతికమయిన విషయాలు తెలీదు. తెలిస్తే యెప్పుడో టపాలు మొదలెట్టే వాడిని కదా!కామెంటుకి ఆప్షన్స్ లో గూగుల్ ఖాతాతో వెయ్యడమే తప్పించి మిగతా సంగతులు తెలియవు.ఇప్పుడే నా పేరు హైపర్ లింక్ గా చూసి క్లిక్ చేస్తే బ్ల్గ్గెర్ చొం ప్రొఫిలె పగె ఒకటి బ్లాంక్ గా వచ్చింది.కానీ ఒక పోస్ట్ యెలా వెయ్యాలి, ఆగ్రిగేటర్ కి యెలా కలపాలి - ఇవేమీ లేవే?! అయినా అక్కదే ప్రయత్నించి చూస్తాను. మీరిచ్చిన క్లూ వల్ల పని జరిగితే మంచిదే మరి.

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు .. ఈ లింక్ లో సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది చూడండి ..

http://nerpu.com/blogging-blogger/blog-post-create-edit-publish-draft-list-search-filter.php

శశి కళ చెప్పారు...

chala chakkani vishayalu chepparu vanajakka

పల్లా కొండల రావు చెప్పారు...

మరోసారి అభినందనలు వనజ గారికి.