1, ఏప్రిల్ 2023, శనివారం

ఆనందాల హరివిల్లు

  తనవాళ్లు గుర్తొచ్చినప్పుడల్లా ఆవలితీరానికి ఈవలితీరానికి మధ్య నావికుడు లంగరు వేయడం మర్చిపోయిన  నావలా ఊగిసలాడుతూ వుంటుంది భారతికొడుకో కూతురో ఎవరో ఒకరు టికెట్ కన్ఫర్మ్ చేసేదాకా ప్రయాణం ఎటువైపో తెలియని అయోమయపు స్థితిహాల్లో ఉన్న కిటికీయే  ఆమె ప్రస్తుత ప్రపంచం

ఆ కిటికీ దగ్గర మహారాజా కుర్చీలో కూర్చుని పాల్గుణ మాసం బహుళ పక్షపు ఉదయాలలో లేతమంచు చెమ్మదనం నింపుకున్న గాలి శరీరానికి మనసుకు హాయి గొల్పుతూ ఉండగా  జేసుదాస్ మృదుమధురంగా గంభీరంగా ఆలపించిన శివానందలహరిని వినడం భారతికి ఆనందంగా వుంటుంది.  కాఫీ సేవిస్తూ లేత కెంజాయరంగు ఆకాశంలో రివ్వునసాగే పక్షులను చూస్తూ వుండటం పూల లాస్యం కనువిందు చేస్తుంటే మైమరిచిపోతుంది. వీధిలో పిల్లల అల్లరిని  కట్టడి చేసే పెద్దలసుద్దులును వింటూ నవ్వుకుంటుంది.

ఆమె దృష్టిని నిలువుగా అడ్డంగా విడదీస్తూ సిమెంట్ రోడ్డు తారురోడ్డుతాముండేది పట్టణమా లేక పల్లెటూరా అనే సందిగ్దానికి తెరపడనీయదుఅడ్డంగా ప్రయాణించే అనేక వాహనాలు నిలువుగా కనబడే గ్రామీణ జీవనం పిల్లల సందడి అన్నీ ఆమెను ఉత్సాహపరుస్తుంటాయిపగలల్లా క్షణం  తీరిక లేకుండా తిరిగే మనుషుల మధ్య బొంతలు కుట్టేవాడు ఉల్లిపాయలు అమ్మేవాడు సోఫాలు బాగుచేసేవాడు మిక్సీలు గ్యాస్ పొయ్యిలు బాగుచేసేవాడు పాత పట్టు చీరలు కొనేవాడితో పాటు పేపర్ బోయ్ పాలతనూ కూరగాయల బండి  ఆన్ లైన్ లో ఆర్డరిస్తే సరుకులు తెచ్చిచ్చే వేన్ వాడితో పాటు పాత సామాను కొనేవాడు అల్యూమినియం  సామాను అమ్మేవాళ్ళు సోది చెప్పే వాళ్ళు.. ఇలా అన్ని పిలుపులు  కులవృత్తులు కనుమరుగు కాలేదు కేవలం రూపుమార్చుకున్నాయనే  సృహను అందిస్తూ వుంటాయినిజానికి కిటికీనుండి కనబడే ప్రపంచం కొత్తగా ఆమెకు చాలా నేర్పుతుంది

హడావిడి లేని జీవితంలో   వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతిలో జీవిస్తూ పరిసరాలను వింటూ  వ్యాపకంగా అపుడొప్పుడొక ఇంటి పని చేసుకుంటూ పనిలో పనిగా  దీర్ఘ ఆలోచనలో పడుతుంది భారతి . దేనినైనా వదిలేయాల్సిన సమయం వచ్చినప్పుడు తేలిగ్గా వదిలేయాలిగట్టిగా పట్టుకుంటే  నొప్పి ఎక్కువవుతుంది అనిబంధాన్ని కూడా  కొన్నింటిని వదిలేసినంత తేలిగ్గా వదిలేయగలమా?  అందులో పిల్లలను ? అందుకే ఈ నొప్పి.  ఎక్కడో దూరంగా వాళ్ళుఇక్కడ అలమటిస్తూ పెద్దవాళ్ళుఎవరైనా అభిమానంగానో ఆప్యాయంగా పలకరిస్తున్నారన్నా భయమేస్తుందిఒంటరిగా వున్న స్త్రీలతో పరిచయాలు పెంచుకుని ఆత్మీయులుగా భ్రమింపజేస్తూ అదునుజూసి దోచుకుని నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఉదంతాలు చదివి వుందిపిల్లలకు ఇవన్నీ అర్దమవ్వక కాదుజాగ్రత్తలు చెపుతూ "తప్పదు మీరు అలాగే వుండాలిలేదా హోమ్ లో వుండాలిఅని ఎరుక పరుస్తారు అంతే కదా అనుకుని భారంగా నిట్టూర్పు విడిచి మళ్ళీ పనిలో బడుతుంది

ఆరోపణలు చేసే పని లేకుండా జీవితం గడవడం కూడా  ఒక అదృష్డమేకదా అని అనుకుంటూ స్టూల్ పై కూర్చుని  పాటలు వింటూ బట్టలుతుక్కుంటూ వుంది భారతికొత్తగావచ్చిన వాచ్మెన్ భార్య వాషింగ్ మెషిన్ లో బట్టలుతుక్కోవడం చూసి బట్టలుతికి పెడతావా అని అడగడం మానుకుందితానూ  అప్ డేట్ అవ్వాల్సిన అవసరముందని  గ్రహించింది


రిటైర్డ్ లైఫ్ లో చేయడానికి బోలెడు పనులున్నాయి. నేర్చుకోవాలనే ఆసక్తి వుంటే.

అందరూ గుర్తుచేసేది ఆధ్యాత్మిక మార్గం ఎన్నుకోమని. 

స్పిరిచ్యువాలిటీ అంటే.. కాషాయాంబరాలు ధరించి హిమాలయాలకు వెళ్ళడమో ఆశ్రమాలకు వెళ్ళడమో కాదు జీవనవిధానంలో మార్పులు చేసుకోవడం జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలో కావాల్సిన జ్ఞానాన్ని సముపార్జించడం అని. ‘ఎటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండూ మనవే.. ఎవరితో దేనితో ఎపుడు దగ్గర అవ్వాలో ఎపుడు దూరం జరగాలో అపుడలా జరగగల్గడమే స్థితప్రజ్ఞత… అనుకుంది భారతి.


జీవితమంటే మార్పు, 

జీవితమంటే సంచలనం 

జీవితమంటే పయనం 

దీనికి ఎవరూ బెదరకూడదు 

 పారిపోకూడదు -రావి శాస్త్రి  అనే రచయిత మాటలను మననం చేసుకుంది. 


తన మనుమలను మనుమరాండ్రలనూ ఇతర పిల్లల్లో చూసుకోవాలనుకుని పసి పిల్లల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఒక సహాయకురాలిని నియమించుకుంది. ఇప్పుడామె యిల్లు ఆనందాల హరివిల్లు.







కామెంట్‌లు లేవు: