ఓల్గా రచించిన "తోడు " కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.
ఓల్గా గారి ఈ కథ ఇతర భాషల్లోకి అనువదించబడింది .. రీ టోల్డ్ కథగా చెప్పబడింది .. అనేక ఆడియో కథల్లో వినిపించబడింది.
జీవిత భాగాస్వామ్యిని కోల్పోయిన ఒక స్త్రీ వేరొక పురుషుడు వారి భార్య లేదా భర్తను కోల్పోయిన తర్వాత వారి జీవన విధానాల్లో వచ్చిన మార్పులను వారు ఆ లోటును ఎలా భర్తీ చేసుకొని మనుగడ సాగించే క్రమంలో స్త్రీ పురుషుల మధ్య తేడాలను స్పష్టంగా చూపగల్గిన కథ ఇది. స్త్రీలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా వొంటరిగా జీవితాన్ని నిర్మించుకోగలరు. కానీ పురుషుడికి అది కొంత కష్ట సాధ్యం అని సున్నితంగా చెప్పిన కథ. కాదనలేని సత్యాన్ని చెప్పిన కథ.
తోడు కోల్పోయిన జీవితంలో మరింకేది లేదన్న నిసృహకు గురవకుండా వారి వారి వ్యక్తిగత ఇష్టాలను అభిరుచులను కొనసాగిస్తూ అవసరమైతే కొత్త జీవితాన్ని కోరుకుంటూ మరలా సరికొత్త జీవితాన్ని ప్రాంభించవచ్చని ఆ కథ చెబుతుంది. ఏ వయసులో నైనా మనిషికి నచ్చిన తోడు కోరుకోవడంలో తప్పులేదని చెప్పిన కథ.
సినిమా ఎలా నిర్మించారో మనకు చూసే అవకాశం లేదు కానీ .. ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది .
ఈ పాట పాడినందుకు S.జానకి గారికి నంది అవార్డ్ కూడా లభించినది అని సమాచారం ఉంది.
తోడు (1997)
సంగీతం:మంగళంపల్లి బాలమురళి కృష్ణ
గానం: ఎస్.జానకి
సాహిత్యం: డా.సి.నారాయణ రెడ్డి.
నదిలా ప్రవహించేదే జీవితం
పదమై రవళించేదే జీవితం ॥నది॥
రేయి ముసిరినా పగలు మెరిసినా
మమత పెరిగినా మనసు నలిగినా ॥నది॥
ఓటమి కలిగిందని ఆటమానుకుంటామా
ముల్లు నాటుతుందని పూలు దూయకుంటామా
॥ఓ॥
ఏటిలో దిగినపుడు ఎదురీత తప్పదు
మథనం వున్నప్పుడు ఎద కోత తప్పదు॥ఏ॥
నదిలా ప్రవహించేదే జీవితం
పదమై రవళించేదే జీవితం ॥నది॥
రేయి ముసిరినా పగలు మెరిసినా
మమత పెరిగినా మనసు నలిగినా ॥నది॥
మిణుగురు వెలుగుండదా మిడిసిపడే చీకటిలో
మబ్బు పలకరించదా మండిపడే వేసవిలో॥మి॥
చితికిన ఆశలో చిరునవ్వే ఔషదం
ముడుచుకున్న బతుకులో ముందు చూపే ఆయుధం ॥చి॥
నదిలా ప్రవహించేదే జీవితం
పదమై రవళించేదే జీవితం ॥నది॥
రేయి ముసిరినా పగలు మెరిసినా
మమత పెరిగినా మనసు నలిగినా ॥నది॥
పాటను ఈ లింక్ లో వినవచ్చు .. ఈ కథ గురించి వందేళ్ల తెలుగు కథ లో పరిచయం చేయబడింది. ఈ లింక్ లో
చూడవచ్చు.
*వివాహం ఒక సారి ధర్మం. రెండవసారి అవివేకం.మూడవ సారి ఉన్మాదం.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి