బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలంతా తాము భూమి మీద కాకుండా..... ఏ స్వర్గలోకంలోనో ఆడుకుంటున్నంత సంబరంగా ఉన్నరు. అందరు ఆడబిడ్డలు అంత సంతోషంగా బతుకమ్మ ఆడుతుంటే....ఆ కాలనీలోనే ఉంటున్న పూలమ్మ మాత్రం...ఇంట్లో ఒక్కతే కుమిలికుమిలి ఏడుస్తున్నది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు.
బతుకమ్మ పండగ అంటే ఏ ఆడబిడ్డకైనా పట్టలేని సంబరం. ఎప్పుడెప్పుడు తల్లిగారింటికి పోదామా...పుట్టిన మట్టిని, తన ఊరి మనుషులను పలకరిద్దామా అని ఆరాటపడతరు. పూలమ్మ కూడా తన పుట్టింటికి పోయి బతుకమ్మ పండగ అట్లనే చేసుకోవాలని కలలు కన్నది. కానీ ఈ ఏడాది ఆ అదృష్టం దక్కలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి