11, జులై 2011, సోమవారం

ప్రకటనల హోరు ..అందమైన రంగుల ప్యాకింగ్ వల

ఒరేయ్!మా ఆవిడ జుట్టు చూస్తే భయము వేస్తున్నది రా! అన్నాడు తన స్నేహితుడితో ఒకతను. "అదేమిటిరా.. అ జుత్తు చూసే కదా ముచ్చ్హట పడి మనువాడావ్?" అన్నాడు స్నేహితుడు.

అధి ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ వార్నియర్ అనే షామ్పు వాడుతుంది . సరసంలో యెప్పుడైనా జడ నా మెడకి చుట్టుకుందా !? నా మెడకి ఉరి అవుతుందని భయం  అన్నాడు.  

జుట్టుకొసలు పట్టి అమాంతం  లారీని లాగుతుంటే  భయం  వేయదా చెప్పండి  మరి.?
పాపం  అమాయకుడు అనుకున్నాడతని  స్నేహితుడు.


మామయ్య గారు! మీ అమ్మాయి రొజు వంట మాడ్చి మసి చేస్తుంది.అందం తప్ప ఏమి లేని మీ అమ్మాయి నాకొద్దు  తీసుకుపోండి అన్నాడు అల్లుడు కోపంగా.. 

బాబ్బాబు..చచ్చి నీకడుపున పుడతాను జీవితాంతం సరిపడ ఓడోనిల్ ఖర్చు భరించుకుంటాను కాదనకు .బాబు అని బతిమలాడుకుంటున్నాడు మామగారు.

ఆడపిల్ల్లకి పని పాట రాకపోయినా ఇప్పుడు యెంత సౌలభ్యమో కదా?


ప్రత్యాన్మయాలు వెతుక్కోనక్కర లేకుండా..మార్కెట్  లో మన కోసం బొలెడు యేర్పాట్లని చేసేసి పెట్టెసిన వారికి..ఎప్పటికి రుణపడి ఉంటాము కదా!


ఒక లైవ్ ప్రోగ్రాం లో.. ఒక బ్యూటిషియన్ ని ఒక కాలర్ అడుగుతుంది.ఇలా.."మేడం!నేను ఒక సోప్ వాడుతున్నాను. ప్రపంచం అంతా మీ చుట్టు అంటారు కానీ మా పక్కింటి ముసలాయన కూడా నా వైపు కన్నేత్తి చూడటం లేదు.ఏం చేయాలి చెప్పండి.? అంటుంది. 


ఉద్యోగానికి వెళ్ళే ఓ ఆధునిక అమ్మ ఓ.. కొబ్బరి నూనె ఉంటే చాలు అంతా తనే చూసుకుంటుంది అంటుంది.ఇక పిల్లలకి సంరక్షణ కోసం అమ్మలు అవసరం లేదు అన్నమాట.కొన్ని వస్తువులు ఉంటే చాలు.


ఓ పరిమళం సొకితే చాలు.ఓ అమ్మాయి వెంట అబ్బాయిలు..పదికి తక్కువ కాకుండా వెంట బడతారు. కస్తూరి మౄగం వెంట ఆడ జింకలు పడినట్లు.వావి వరుస లేకుండా ఉచ్చనీచాలు మరచి పరుగుతీయడంని మనం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం.


ఇప్పుడు తేలిసి ఉంటుంది..నేను ఏం చెపుతున్నానో.


వార్తలు తర్వాత నేను ఎక్కువగా చూసేది..నన్ను ఆకర్షించేవి.. ప్రకటనలే!


ప్రకటనలని నేను చాలా ..శ్రద్దగా చూస్థూఉంటాను.కొన్ని ప్రకటనలు..చాలా ఆసక్తికరంగా ఉంటాయి.



మనం నిత్యం చూస్తున్న వ్యాపార ప్రకటనల్లొ ఉన్న అసత్య ప్రేలాపనలని చూడండీ!

ఒక అమ్మాయి శరీరపు కాంతి ముందు బంగారం కూడా దిగదుడుపే అంట. అంటే బంగారం విలువ సబ్బు ధరకి పడిపొతుందా ఏమిటి? అలా ఉన్నా బాగుండును.. బొలెడంత బంగారం కొనే బదులు అమ్మాయికి సబ్బులే జీవితాంతం కొని ఇవ్వడం తేలిక అనుకుంది..అమాయకురాలైన ఓ..తల్లి.


వినియోగదారుణ్ణి అందమైన అసంబద్దమైన ప్రకటనల వలవేసి మోసగించడం అనేది.. వ్యాపార సంస్థలకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ప్రకటనల మాయాజాలంలో వినియోగదారుడు నిత్యం మోసపోతూనే ఉన్నాడు. 


రూపాయి విలువ చేసే షాంపు సాచే కి..సరాసరి కోట్ల రూపాయలు ప్రకటనలకి వెచ్చించి అమ్మకాలు పెంచుకుని నాణ్యతా ప్రమాణాలు తగ్గించి..అందులొ లాభాలు దండుకుంటున్నారు.


ఏ వస్తువుకైన గుండు సూది మొదలుకుని విమాన సంస్థ వరకు అన్నింటికి ప్రచారం అవసరం అయిన రొజులు ఇవి.
వ్యాపర ప్రకటన్ల లో కూడా సౄజనాత్మకత ఉన్న ప్రకటనలు ఉన్నాయి. మరీ అతిశయోక్తంగా ఉన్న ప్రకటనలు చూస్తే విసుగు పుట్టి అసలు ఆ వస్తువులె కొనడం మానేస్తారని తెలియక ఒకరిని చూసి ఇంకొకరు హోరాహోరీగ చానల్స్ పుణ్యమా అని చూసే కళ్ళకి కనికట్టు కడుతున్నారు.


ఒక ప్రకటన ప్రభావం వీక్షకులపై చాలా ప్రభావం చూపుతుంది.షాపింగ్ కి వెల్లినప్పుడు అవసరం ఉన్నా లేకపొయినా అనాలోచితంగా..కొనుక్కుని ఆనక తీరిగ్గా కూర్చుని..దిగులు పడే సందర్భాలు ఉంటాయి.చాలా సైలెంట్గా కొన్ని ప్రకటనలు మనపై ప్రభావం చూపదం వల్ల.. మనం ఆ బ్రాండ్ తప్ప ఇంకేది కొనడానికి ఇష్టపుట్టనంతగా .. నియంత్రించబడతాము.

కొన్ని సెకనల కాలంలో.. ప్రకటనలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపొతాయి.ఓకొసారి ఏది కొనాలో తెలియని అయోమయంతో సతమతమవుతు ఉంటాము. 

హెల్థ్ కేర్ పేరిట,శరీర సంరక్షణ పెరిట మద్య తరగతి ప్రజల జీవన విదానం పై.. ప్రభావం చూపుతూ..ఆర్దికంగా కుదేలు చేస్తున్నాయి.వస్తువుల ధర పెంచాలనుకున్నప్పుడల్లా.. ఒక ఉచిత బహుమతిని అంటగట్టి వస్తువు రేటు పెంచేసి తర్వాత వస్తువు రేటుని పిక్స్డ్ చేసి వినియోదారులని. నిలువునా ముంచేయడం మోసగించడం వ్యాపార సంస్తలు చెస్తున్న పని. యెవరి వల్ల అయితే సంస్తలు మనుగడ సాగిస్తున్నాయో ఆ వినియోగదారుణ్ణి మోసగించడానికి..క్షణ క్షణం ఆలోచిస్తూ ఉంటాయి సంస్థలు. వ్యాపార ప్రకటనలలో సౄజనాత్మకత ఉంటే చాలదు వస్తువు నాణ్యత,విశ్వసనీయత కూడ అవసరం అప్పుడే ప్రకటన ధీర్ఘ కాలం ప్రభావం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.


అందమైన రంగుల ప్యాకింగ్ వల లో చిక్కుకున్న వినియోగదారులు నిత్యావసర వస్తువుల కొనుగోలులో..ధరల పెరుగుదలలో తడిచి బతుకు భారమై అత్తెసరు జీవనం సాగుస్తుంటే వందల కొట్ల లాభాలతో..బహుళ అంతస్తుల భవనాలలో నివసిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలొ చేరి మనకు గర్వకారణం అవుతున్నారు.

ప్రకటనల కోసం ఇప్పుడు అన్ని చోట్లు అనుకూలమే! నాలుగు రోడ్ల కూడలి మొదలుకుని.విమానంల సీట్ల పైన కూడా ప్రకటనల మయమే!


ప్రతిది ఎగ్జిబిషనైజ్ ఐపోయింది.వస్తువినియోగంలో వస్తువ్యామోహంలో అనుబందాలు కూడా పలచనబడిపోతున్నాయి.మెటీరీలిస్టులుగా మారిపోతున్నారు. వస్తు వ్యామోహంలొ..ఇంట్లో అనవసరమైన చెత్త కూడా పేరుకుపోతుంది.


కాలక్షేపపు షాపింగ్ చేసే వారికైతే పర్లేదు కానీ..సామాన్య ప్రజానికం కి..ప్రకటనల ప్రభావం వల్ల చాలా నష్టం.ఒకటికి పదిసార్లు ఆలొచి0చుకుని నాణ్యత చూసుకుని కొనుక్కోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మనశ్శాంతి మిగులుతుంది.


ఇప్పుడైతే మొబైల్ కి మించిన ప్రకటనా స్థలం లేదు వివిద వ్యాపర సంస్థలకి మన నంబర్లని అమ్ముకుని సొమ్ము చేసుకొవడం దగ్గర నుండి మన సహన్న్ని పరిక్షిస్తూ నిత్యం ఎన్నో ప్రకటనలు. తల తీసుకు వెళ్ళి రోట్లో పెట్టినట్లే!


ఏమంటారు? మీరు ప్రకటనల మోజులొ పడకండి. మీ అనుభవాలు పంచుకోండి.


ఆన్ లైన్ షాపింగ్ల లోను.. చాలా మోసాలు.ఇక చానల్స్ లోనైతే గంటల తరబడి ప్రకటనల మయం.బలహీనతల మీద సొమ్ము చేసుకుంటూ. జాతి రాళ్ళు,దిష్టి యంత్రాలు, సురక్షా కవచాలు,ఆయుర్వేద మందులు..కావేవి ప్రకటనలకి అనర్హం. ఇలాటి వాటి బారిన పడకుండా ప్రకటనలని చూసి నవ్వుకుందాం. సరేనా?

6 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

చాల బావుంది మీరు చెప్పింది నిజం . మనం అయితే చూసి వదిలేస్తాం కాని పిల్లలు ఆ ప్రకటనలు చూసి ప్రతిది కావాలి అంటారు అది ప్రమాదం .

ahmisaran చెప్పారు...

టింగ్ టాంగ్!!
లిపిలేనిభాష బ్లాగ్ చదవండి
మంచి సంస్కారవంత మైన బ్లాగ్ !!
మర్చిపోకండి మంచి సంస్కారవంతమైన బ్లాగ్ లిపిలేనిభాష బ్లాగ్ !!
టింగ్ టాంగ్!!
www.lipilenibhasha.blogspot.com

:P:P:P:P:P

అజ్ఞాత చెప్పారు...

వ్యాపార ప్రకటనలు.. వాటి సృజనాత్మకతకి , కొన్ని హాయిగా నవ్వుకోటానికి (ఫెవికోల్ , సెంటర్ ఫ్రెష్ లాంటి ఆడ్స్) బాగుంటాయి కాని... వాటిని factual గా చూసేపుడు జాగర్త గా ఉండాలి.. ఆసక్తి గొలిపే టాపిక్ పై రాసారు.. అభినందనలు.
రామకృష్ణ

మురళి చెప్పారు...

నేను గమనించిన మరో విషయం కొబ్బరి నూనె మొదలు కారు వరకూ ప్రతి ప్రకటనా చిన్న పిల్లల్ని టార్గెట్ చేసేదిగా ఉండడం.. ఇప్పటి తల్లిదండ్రులెలాగూ పిల్లల మాట కాదనే పరిస్థితిలో లేరు కాబట్టి పిల్లల్ని టార్గెట్ చేయడమే సులువనుకుంటున్నారేమో.. మంచి టపా..

rajiv raghav చెప్పారు...

ప్రస్తుత వ్యాపార ప్రకటనల గురించి చాలా బాగా రాసారు...
మనకు ఏమి కావాలన్న దాని మీద సృష్టట ఉంటే సమస్యలుండవు....

Unknown చెప్పారు...

బాగా రాసారు. ఎన్ని సార్లు రాసినా సరిపోదు ఈ విషయం గురించి.. మురళిగారన్నట్టు పిల్లలే వినియోగ దారులు.. నేను కూడా ఈ విషయం మీద గతంలో ఒక సారి రాసాను.. వీలున్నప్పుడు చూడండి.
http://praseeda.wordpress.com/2010/05/04/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%85%E0%B0%B8%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%A6/