28, జులై 2011, గురువారం

పేస్ బుక్ లో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారు.

ఈ రోజు నుండి పేస్ బుక్ లో.. మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్  గారు ..మనకి కనబడబోతున్నారట.  ఒకే ఒక్కడు స్తాయిలో..కాకుండా పెద్ద మార్పు ఆశిస్తూ.. ఎల్లప్పుడు  ప్రజలకి సన్నిహితంగా  ఉంటూ..ప్రజా సమస్యలని..ఎక్కువుగా తెలుసుకుంటూ..సరి అయిన రీతిలో..సమస్యలని త్వరిత  గతిన .పరిష్కరించాలనుకోవడం..మంచి పరిణామం కదండీ! అందుకు వారికి అభినందనలు చెబుతూ.. స్వాగతిద్దాం. 
 కొంత మంది చూడండీ..పేస్ బుక్ లో.. సొల్లు కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏముంది అని..కామెంట్ చేసేవారికి..ఇది..ఒక సరి అయిన జవాబే కదా!? 
నేను మన ముఖ్యమంత్రి గారికి.. ఒక సమస్య చెప్పదలచానండీ!!
మన రాష్ట్రం లో రేబిస్ టీకాల కొరత ఏమో కాని.. మా ఇంటి ముందు వీధి కుక్క ప్రసవ వేదన పడుతుంది.చూడలేక పోతున్నాను. తగినన్ని పశు వైద్యశాలలు స్తాపించి.. జంతువులకి..సరి అయిన వైద్య సదుపాయం కల్పించే  చర్యలు చేపట్టాలి.అల్లాగే మేము  తాగే నీళ్ళలో..చిల్లగింజ వేసుకోకుండా తాగడం ఎలా? అని అడగాలి... అలా అడగడం తప్పంటారా? .. వర్ధిల్లాలి..అధునాతన ముఖ్యమంత్రి  గారు. జై..ఆంద్ర ప్రదేశ్.!!సర్వేజనా సమస్యారహిత భవంతు..  రేడియో మిర్చి వార్తా సౌజన్యం తో.. ఈ విషయం పంచుకుంటూ.. 

7 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఆరోగ్యశ్రీలో జరుగుతోన్న అవినీతి గురుంచి ఆ మహానుభవునికి రెండుమూడు మెయిల్స్ పంపాను. మెయిల్స్‌కే సమాధానం చెప్పనివాడు ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పెట్టి ఏమి పొడుస్తాడు?

buddhamurali చెప్పారు...

మీ పద్ధతేమి బాగా లేదండి. తెలంగాణా, సిమాంద్ర ఉద్యమాలతో అసలే ఆయన్ని ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. నేను ఒకరిని ఉన్నాను అని చెప్పడానికి ఆయన తంటాలు పడుతుంటే ఆయనకు సమశ్యలు చెప్పి బాధ పెట్టడం భావ్యమా ? ఆయన యెంత గోప్పవరో, ప్రజలకు చేరువగా ఎలా ఉంటారో పేస్ బుక్ లో చూసి , చదివి తరించండి అంతే కానీ సమస్యలు చెప్పా వద్దు ........ బాగా చెప్పానా కిరణ్ కుమార్ గారు

అజ్ఞాత చెప్పారు...

వనజ గారూ,
వారి ఉద్దేశ్యాన్ని స్వాగతిద్దాం అయితే ఆచరణసాధ్యం కాదేమో అనిపిస్తోంది.

ఆత్రేయ చెప్పారు...

మీరు చెప్పాక ఫసుబూక్ ఎకౌంటు క్రియేట్ చేస్కొని మరీ ఆయనకి హాయ్ & విషెస్ కొట్టాను. ఎంతైనా యంగెస్ట్ సీయం & మన యూత్ ...!!

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు అది కిరణ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ కాదండి . ఏదో పొరపాటు జరిగిందట. ఇప్పుడే తెలిసింది . చాలా రోజుల నుండి ఎవరో కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అని రెండు పేస్ బుక్ వి నిర్వహిస్తుంటే పెద్దలకు తెలియలేదు. ఇంత అద్భుతంగా ఉందండి మన పాలకుల తీరు , అధికారుల నిర్వాకం

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రవీణ్ గారు.. స్పందించినందుకు ధన్యవాదములు..అండీ!

బుద్ధా మురళి గారు.. ప్రజలు గొర్రెల మంద అని అంటూ ఉంటారు. ఇప్పుడు..ప్రభుత్వ యంత్రాంగం కూడా గొర్రెల మందే అన్నమాట...హతోస్మి! నేను చెప్పాలనుకున్న సమస్య లు ఆయనకి చేరే మార్గం ఇక ఇక కనపడధన్నమాట :-)))))))

ఆత్రేయ గారు.. మీ హాయ్ ..మీ విషెస్ వెనక్కి తీసుకోక తప్పదు.. డమ్మీ సి.ఏం..అంట ..అండి..యంగ్ యూత్ కలలు కల్లలాయే!:-))))

శశి కళ చెప్పారు...

నెను కూడా ఉదయం న్యూస్ చూసి మీ లాగె అనుకున్నాను అండి.అందరం సమస్య లు అడిగితె
పరారె.....పరారె....అయిపోతారెమొ.