9, సెప్టెంబర్ 2012, ఆదివారం

బైటింగ్ Vs ఫైటింగ్

ఓ..వర్షం కురసిన రాత్రి లాగా..
ఓ..పవర్ లేని రాత్రి..
రాత్రుళ్ళు పవర్ లేని రోజులు ఎక్కడ లెండి..అనుకుంటున్నారా? చెప్ప పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు పవర్ కట్ అవడం మన రాష్ట్ర ప్రత్యేకత.
ఈ పవర్ కట్ వల్ల మన బ్లాగర్లకి తీరని అన్యాయం జరుగుతుంది. తోటి బ్లాగర్లు వ్రాసిన మంచి మంచి విషయాలు చదివేది ఎప్పుడు? కామెంట్స్ పెట్టేది ఎప్పుడు? మనం పోస్ట్ వ్రాసేది ఎప్పుడు?
రాత్రుళ్ళు పవర్ కట్ వల్ల నిద్రలేని రాత్రుళ్ళు,అనారోగ్యాలు.. ముఖ్యంగా చెప్పాలంటే ...
నిశి రాత్రి దోమల మేళం..
ఎంత బాధగా చెపుతున్నానో..తెలుసా? మొన్నీ మధ్య యేనా..దోమ కాటు వల్ల హాస్పిటల్ పాలయి వచ్చాను.అయినా ఈ కీటక జాతికి కనికరం లేదు.
నిద్ర లేని రాత్రులని మిగిల్చే "పవర్" వారికి ఈ జనం మీద అంత కన్నా కనికరం లేదు.
ఇక విసిగించను.. ఇక విసిగించను.. అన్నాను కదా..!అసలు విషయంలోకి వచ్చేస్తాను.
పవర్ కట్ వల్ల అలవాటుగా బిల బిల లాడుతూ బయటకొచ్చాం. ఇంతలో టపా టపా శబ్దం.
ఏమిటా అనుకోలేదు. ఎందుకంటే అలవాటే కదా!
దోమల దాడి మొదలయింది.
రా..రా.. దోమ రారా..
రోగ అభివృద్ధి కారక రా రా.. దోమ రా రా..
శత కోటి కాటు కారకా రా..రా.. పరిశుభ్ర ఆవాస చోర
నా చేతిలో చావ రా రా.. నిన్నే చంపే ఈ వేళ
నా దోమ తెరనడుగు ఈ మంత్ర దండమును అడుగు... అని ఓ..పేరడీ పాట పాడుకున్నాం.
ఇంతలో..
మీ వూళ్ళో ఉన్నా.. మీ వాడలో ఉన్నా.. మీ మ్ ఇంటి ముందర ఉన్నా. మీ నట్టింట్లో ఉన్నా.
నువ్వో,నేనో..తాడో పేడో తేల్చుకుందాం.. అని దోమ మమ్ము పలకరించింది.
బాబోయి..సంగీతమే వినిపిస్తాయి అనుకుంటే.. ఇప్పుడు.. ఏకంగా డైలాగ్స్ కూడా చెపుతున్నాయి.. అని అనుకుని..
కాటు వేయడానికి దోమలు రక్షించుకోవడానికి మేము..పోరాటం కొనసాగిస్తుండగా..ఓ..రెండు గంటల తర్వాత..
వస్తున్నా..వస్తున్నా.. మీ కోసం వస్తున్నా..మీలోన దాగిఉన్న కోపాన్ని చల్లార్చ వస్తున్నా..
అంటూ పవర్ వచ్చింది.
అమ్మయ్య అనుకుంటూ..నెట్ ప్రొటక్షన్ లోకి చేరుకున్నాం. ఉష మలయ మరుతాన్ని ఆస్వాదిస్తూ.. మగతలో మరో లోకంలో ..విహరించడానికి ఉపక్రమించాం
(ఇవి దైనందిన బాధాభాగాలు.పంచుకుంటూ విచారంతో..)


దోమల నివారణకి ఇంటి ఆవరణలో ఈ మొక్క పెంచవచ్చునట
ఈ లింక్ లో ఈ మొక్క గురించి తెలుసుకోండి.

4 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

విజయవాడ లో కూడా దోమల బెడద!
ఒకప్పుడు హైదరాబాద్ లోనే ఉంది అనుకున్నానే!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

దోమల బైటింగ్,మీ ఫైటింగ్ బాగున్నాయండీ...
ఈగ సాంగ్ లాగా మీ దోమ పారడీ సాంగ్ కూడా బాగుంది :)

అజ్ఞాత చెప్పారు...

:) మాకేనేమో అనుకున్నా! మీకూ ఇంతేనా? అహహహ!!! :)

సామాన్య చెప్పారు...

మీ పేరడీ పాట చాలా బాగుంది .:))