2, సెప్టెంబర్ 2012, ఆదివారం

ఆంధీ

పాట చంపేస్తుంది ... అంటారు కదా! అలాంటి పాట ఈ పాట.

ఈ పాట "ఆంధీ " చిత్రంలో పాట. 1975 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం నిషేధించ బడినట్లు విన్నాను.

ఈ చిత్రం శ్రీమతి ఇందిరా గాంధీ జీవిత కథని పోలి ఉంటుందని చెపుతూ ఉంటారు. నేను చిత్రం చూడలేదు కానీ "తేరే బినా జిందగీ సే కోయి " అనే పాట సురపరిచితం.

వివిధ భారతి ముంబై పుణ్యమా అని ఎప్పుడూ  వినడం అలవాటయింది.నాకు హిందీ భాష  రానప్పుడు కూడా ఎందుకో.. ఈ పాటని బాగా ఇష్ట పడేదాన్ని. ఆ పాటని పరిచయం చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని,
ఇన్నాళ్ళకి ఇలా కుదిరింది.

ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.సంజీవ్ కుమార్,సుచిత్ర సేన్..నటించిన ఈ చిత్రం సంచలనాత్మక చిత్రం అని మిత్రులొకరు చెపితే విన్నాను.

పాట సాహిత్యం"గుల్జార్"
సంగీతం " ఆర్ డీ బర్మన్"


పాట సాహిత్యం తెలుగులో...
ఆమె:
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.

ఇలా జరిగి ఉంటే బాగుండేది
నీ అడుగుజాడలనే గమ్యంగా ఎంచుకుని (ప్రయాణం చేస్తూ ) పయనిస్తూ ఎక్కడికో
దూరంగా ఎక్కడికో ..
నీ అడుగుజాడలనే గమ్యంగా ఎంచుకుని (ప్రయాణం చేస్తూ ) పయనిస్తూ ఎక్కడికో
దూరంగా ఎక్కడికో ..
నువ్వు తోడు ఉన్నట్లు అయితే గమ్యానికి ఏ లోటు ఉండేది కాదు
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
ఇరువురి మధ్యలో కొంత సంభాషణ :
సంజీవ్ కుమార్ ఇలా అంటాడు..
విను ఆరతి..ఈ పూల లతలు కనిపిస్తున్నాయే అవి నిజానికి లతలు కావు.
అరబీలో లిఖించ బడినటువంటి ఆయతులు
వీటిని ఉదయంపూటనే చూడాలి. అప్పుడే స్పష్టంగా చూడగలం.
మరొక వైపుకు చూపిస్తూ ..
ఉదయం పూట ఇక్కడ నీటితో నింపబడి ఉంటుంది. ఉదయం పూట ఈ నీటి గుమ్మటాలు .. అని ఏదో చెప్ప బోతుండగా..
ఆమె ఇలా అడ్డుకుంటుంది..
ఇవ్వన్నీ ఎందుకు చెపుతావ్? ఉదయం వేళలో నేనెక్కడ రాగలను..?
ఆమె అంతరంగం అర్ధం చేసుకున్న అతను.. మాట మారుస్తూ..
ఈ చంద్రుడు ఉన్నాడే ! దీనిని రాత్రే చూడాలి. ఉదయం పూట రాడు అంటాడు.
ఆమె: ఈ చందమామ రోజు వస్తూ ఉంటుంది అనుకుంటా..అంటుంది
అతడు: హా..కానీ మధ్యలో అమావాస్య వస్తుంది. మాములుగా అమావాస్య పదిహేను రోజులకి ఒకసారి వస్తుంది
ఈ సారి మాత్రం చాలా కాలం ఉండిపోయింది (దీర్ఘంగా)
ఆమె:తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా (అమావాస్య) ఉంది కదా!

మళ్ళీ పాటలోకి...ప్రవేశం..

ఆమె:
మనసులో అనిపిస్తుంది నీ బాహుబందాలలో తలవాల్చి (మేము)నేను ఏడుస్తూ ఉండిపోవాలని..
ఏడుస్తూ ఉండిపోవాలని...
నీ కళ్ళలో మాత్రం కన్నీటి ఛాయలే లేవు!

అతడు:
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.

నీవు కనుక చెప్పినట్లయితే .. ఈనాటి రాత్రి చంద్రుడు వెళ్లి పోడు ,
రాత్రిని ఆపు,
నీవు కనుక చెప్పినట్లయితే ఈనాటి రాత్రి చంద్రుడు వెళ్లి పోడు ,
రాత్రిని ఆపు,
రాత్రి మాట ఇది (రాత్రికి సంబంధించిన విషయం ఇది)
మిగిలిన జీవితానిది కాదు.

నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు

तेरे बिना ज़िंदगी से कोई, शिकवा, तो नहीं,
शिकवा नहीं
शिकवा नहीं, शिकवा नहीं
तेरे बिना ज़िंदगी भी लेकिन, ज़िंदगी, तो नहीं,
ज़िंदगी नहीं
ज़िंदगी नहीं, ज़िंदगी नहीं
काश ऐसा हो तेरे कदमों से, चुन के मंज़िल चले
और कहीं दूर कहीं
तुम गर साथ हो, मंज़िलों की कमी तो नहीं
तेरे बिना ज़िंदगी से कोई, शिकवा, तो नहीं, शिकवा नहीं
जी में आता है, तेरे दामन में, सर छुपा के हम
रोते रहें, रोते रहें
तेरी भी आँखों में, आँसुओं की नमी तो नहीं
तेरे बिना ज़िंदगी से कोई, शिकवा, तो नहीं,
शिकवा नहीं
तेरे बिना ज़िंदगी भी लेकिन, ज़िंदगी, तो नहीं,
ज़िंदगी नहीं
तुम जो कह दो तो आजकी रात, चांद डूबेगा नहीं,
रात को रोक लो
रात कि बात है, और ज़िंदगी बाकी तो नहीं
तेरे बिना ज़िंदगी से कोई, शिकवा, तो नहीं, शिकवा नहीं
तेरे बिना ज़िंदगी भी लेकिन, ज़िंदगी, तो नहीं,
ज़िंदगी नहीं


4 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ ...
ఈ పాట చాలా బాగుంటుందండీ..
నాకు కూడా ఇష్టమైన పాట.

Sunita Manne చెప్పారు...

పూర్తిగా కోలుకున్నారా? మరలా రాయడం మొదలెట్టారు??

Lakshmi Raghava చెప్పారు...

chala baga anipinchindi...okappudunaa nachchinadi ..ippudu vidioto saha..abhinandanalu


వనజవనమాలి చెప్పారు...

లక్ష్మి రాఘవ గారు.. అవునండీ! పాట కి మీరు అభిమాని అన్నమాట. చాలా సంతోషం. ధన్యవాదములు.
@రాజీ గారు.. పాట మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు.
@ సునీత మన్నే ..గారు. ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే.. అబద్దమే..చెపుతున్నాను.
ఇంకా..కోలుకోలేదు. కానీ.. బ్లాగ్ వ్యసనం.. ఇటువైపు లాగేస్తున్దండీ!
బాగోకపోయినా.. మన ఇష్టాలు,భావాలు షేర్ చేసుకుంటే.. అదో..తృప్తి. మానసిక బలం కూడా..
అందుకే మంచి పాట పై బడి.. షేర్ చేసాను. మంచి హిందీ పాటల అభిమానులున్న మనలాంటి వారి కోసం ఈ షేరింగ్.:) థాంక్ యు వేరి మచ్.!!