27, సెప్టెంబర్ 2012, గురువారం

"తన్హాయి " గురించి మరో స్పందన


ఓ.. కాంత   ఏకాంత గాధ "తన్హాయి " గురించి మరో స్పందన 

నా మిత్రురాలు ..ఇన్నాళ్ళు "తన్హాయి"  చదవలేదు . ఇప్పుడు  చదివి  తన స్పందన తెలిపారు .. 
ఆ స్పందనని ..  ఇలా  షేర్ చేసుస్తున్నాను.   ఎందుకంటే  ఈ నవలపై  చర్చ జరగాల్సి ఉంది .

వీలు వెంబడి. నా స్నేహితురాలికి నేను.. కొన్ని ప్రశ్నలకి సమాధానం  ఇవ్వాలి. మావి.పుస్తకం పై అభిప్రాయ బేధాలే లెండి  మా ఫ్రెండ్ షిప్ చెడే టట్టు  కత్తులు  కటార్లు .. పట్టుకోం... :)

యధాతదంగా ఆమె అభిప్రాయం  ఇక్కడ...

వనజ గారు,
నిన్ననే తన్హాయి నవల చదివటం పూర్తి అయ్యింది. ఈ మధ్యనే ఐపాడ్ వర్షన్ వస్తే, మీటింగ్ ల లోను, ప్రయాణం లోను, అలా , అలా చదివేసానండి. ఆ తరువాత మీ సమీక్ష చదివాను... విహంగ లో రాసినది.

నీహారిక వాదన, అందరి వాదనలు, వాటికి మీరిచ్చిన సమాధానాలు అన్నీ చదివాను.
మీరు రాసిన సమీక్ష చాలా బాగుంది. కాని నా అభిప్రాయాలు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.
First of all , అలా flight  ప్రయాణం లో పరిచయం అయ్యి పెళ్ళి అయ్యిన ఒక స్త్రీ ప్రేమలో టప్పుక్కున పడటం హాస్యాపదం.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే,ఇద్దరు ఒకరి రూపం ఒకరికి నచ్చి ముందు ఆకర్షితులయ్యారు.
 తరువాత, ఒకరి అభిరుచులు (? పుస్తక పట్టనం, భాషా పరిజ్ఞానం వగైరా, వగైరా ) కలిసి, సంభాషణ పొడిగించారు.
తరువాత తెలిసి తెలిసి ఇద్దరు ఒకరి మోజులో ఒకరు మునిగిపోయారు.
రచయిత్రి చాలా తెలివిగా వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు అన్న ఒక్క పాయింట్ మీద cash chEsukuni కల్హార ని , తన నవలని, పాఠకులు   మెచ్చుకునేలా   ఒక బుట్టలో పాడేసారు.
నాకీ నవల ఫక్తు యద్దనపూడి సులోచన రాణి రాసే చెత్త నవలలాగే అనిపించ్చింది.
మీకెందుకో కొన్ని విషయాలు చెప్పలని అనిపిస్తుంది. పెళ్ళి అయిన స్త్రీ నిజంగా ఇంకొక పురుషుని పై ఆకర్షితురాలు కాని, ప్రేమ కాని కలగాలంటే (పరాయి పురుషుడి పై) అతను ఆ స్త్రీ యొక్క గతం అన్నా కావాలి, లేదా కొన్ని సంవత్సరాల అనుబంధం అన్నా ఉండాలి.
అంటే ఒకే చోట పని చెయ్యడం కాని, ఒక కారణం కోసం తరుచుగా పని చేసేవారు కాని అలా..
అప్పుడు కూడా ఆ వివాహిత స్త్రీ కాని , పురుషుడు కాని ఆకర్షితులయ్యేది ఒకరి పద్దతి, నడవడిక, తెలివి తేటలు అలాంటివి నచ్చి...అంతే కాని flight  లో కలిసి, అంతాక్షరి పాటలు పాడుకుని, పుస్తకాలు గురించి చర్చించుకుని కాదు.
ఒక వేళ అలా నిజం గా జరిగే సంఘటనలు కనక ఉండి ఉంటే, వారిద్దరు చపల చిత్తులే అని అర్ధం నా ఉద్దెశం లో!
ఇక తరువాత రచయిత్రి రక రకలుగా వర్ణించిన కల్హార మాన్సిక సంఘర్షణ, నిజాయితి
ఇవన్ని తలచుకుంటే నవ్వొచ్చిందండి.
చైతన్య కల్హార గురించి కలలో కూడా అనుకుని ఉండడు కదా, అలా ఆఫీస్ కి వెళ్ళి, పర పురుషుడితో అది కూడా అసలు పరిచయమే లేని ఒక పరాయివాడితో తన భార్య సరస సంభాషణలు చేస్తుందని?
మరి కల్హార అలా చేసినప్పుడు, చైతన్య తను అంతక ముందు కల్హార ఏదో సేవా కార్యక్రమాలలో పాల్గొంటాను అంటే అభ్యంతరం పెడతాడు కదా, ఎక్కడ ఇంటిని నిర్లక్స్యం చేస్తుందో అని.. మరి మనిషిని అయితే పాపం అదుపులో పెట్టగలిగాడు కాని, ఆమే మనసుని అదుపులో పెట్టలేకపోయాడు కదా?
ఒక రకంగా చెప్పాలి అంటే, కల్హార పాత్ర చాలా స్వార్ధపరురాలి పాత్ర. పెళ్ళికి పూర్వం ఎంత ప్రాక్టికల్ గా డీల్ చేసిందో పెళ్ళి తరువాత కూడా అలాగే డీల్ చేసింది. కూతురు గురించి, భర్త గురించి ఎదో మహా త్యాగం చేసినట్టు రాసిందే రచయిత్రి? అది ఆమె కనీస బాధ్యత కాదా కూతురు తో, భర్త తో వివాహిత స్త్రీ లా గడపటం?
పైగా నిజాయితీగా మనసులో తను ఫీల్ అయ్యిందేదో భర్త కి చెప్పెసి, నిజాయితీ పరురాలయ్యిందా? తన మన్సులోంచి ఆ guilt  ఫీలింగ్ తప్పించుకోవడానికి చైతన్యని ఒక పావులా వాడుకుంది.
ఎంత బాధ పెట్టింది తన భర్తని? అసలు చైతన్య భార్యని ముందు ముందు మాత్రం నమ్ముతాడా?
కల్హార తను మోజుపడ్డ డాక్టర్ తో శారీరక వాంచ తీరక పోతే ఆ ప్రేమకి స్వస్తి చెపుతుందా?

చైతన్య ఇంటిలోనే కౌశిక్ కల్హార ని దగ్గరకి తీసుకుంటే ఊరుకుందే? అప్పుడు కల్హారకి ఏమీ తప్పు అనిపించలేదా? ఏమో నండి...నాకు ఏ కొసానా నచ్చలేదు ఈ నవల.

నేను పెళ్ళి అయ్యింది కనక కల్హార  ప్రేమలో పడకూడది అనటం లేదు. పెళ్ళి అయ్యిన స్త్రీలు ప్రేమలో పడరా అంటే, భేషుగ్గా పడతారు. మగవారు ఎలా అయితే అలా బయట కి వెళ్ళి, అందమయిన అమ్మయిలను చూసి మోహితులౌతారో, ఒక్కోసారి వశం తప్పుతారో, అలాగే ఆడవారు కావచ్చు..తప్పు లేదు.. కాని అందులో లోతు ఎంత? ఒక్క వారం? ఒక్క నెల? కొన్ని నెలలు? అంతే కదా? అదేదో అమర ప్రేమ లా కల్హార,కౌశిక్ ప్రేమ ను గురించి రచయిత్రి చెప్పటం హాస్యాపదం గా తోచింది...కనీసం రచయిత్రి కొన్ని సంఘటను కల్పించి, ఒకరంటే ఒకరికి, తమ జీవిత భాగస్వాముల కంటే ఎందుకు ఇష్ట పడ్డారో వివరించాల్సింది...
నా ద్రుష్టిలో ఒకరిని బాధ పెట్టే పనులు (మనలని ప్రేమించే వారిని) మనం ఎప్పుడు చెయ్యకూడదు..ఒక వేళ అలా జరిగినా, సంభాలించుకుని, తగు విధంగా మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని కౌశిక్ తో తెగతెంపులు చేసుకోవాలే కాని, ఆ విషయం భర్తతో చర్చించి, అతనికి తీరని వ్యధ కలిగించకూడదు.
నాకెందుకు ఇదంతా చెపుతున్నారు మీరు అంటే, ఊరికే చెప్పాలని అనిపించిందండి.

చలం మైదానం ఇప్పుడే చదవటం మొదలుపెట్టాను. త్వరలో మీతో ఆ పుస్తకం మీద నా అలోచనలు కూడా తెలియపరుస్తాను.

ఇదండీ ..ఆమె స్పందన,  అభిప్రాయం. "తన్హాయి " పై సమీక్ష "విహంగ " లో  లింక్ 

ఆమె  అభిప్రాయాన్ని స్వాగతిద్దాం ..  

2 వ్యాఖ్యలు:

కమనీయం చెప్పారు...చలం మైదానం నవల చదివాను.' తన్ హాయి ' నవల చదవలేదు.కాని దానిపైన వ్యాఖ్యలు,వాదాలు చదివాను.అందుచే కథ తెలిసింది.నేను స్త్రీ స్వేచ్చా స్వాతంత్ర్యాలకి వ్యతిరేకిని కాను.కాని ఇటువంటి రచనల విషయంలో ( వివాహేతర సంబంధాలు)నా నిశ్చితాభిప్రాయాన్ని తెలుపుతున్నాను.
వివాహాన్ని పవిత్రంగా భావించకపోయినా ఒక కాంట్రాక్టు గా నైనా భావించాలి.ఇద్దరు భాగస్వాములు వ్యాపార ఒడంబడిక చేసుకున్నాక మోసం చెయ్యకూడదు.కుదరకపోతే రద్దు చేసుకొని విడిపోవచ్చును.వివాహ బంధం లో కూడా అంతే.భర్త అయినా భార్య ఐనా చట్టరీత్యా విడాకులు తీసుకొని ఇంకొకరిని చేపట్ట వచ్చును.లేకపోతే సింగిల్గా ఉండి ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చును.పిల్లలు ఉంటే కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవాలి. అంతేగాని ఈ అక్రమసంబంధాలను ,స్త్రీగాని ,పురుషుడుగాని,గ్లామరైజ్ చేసి,పొగడకండి.

వనజవనమాలి చెప్పారు...

కమనీయం గారు నమస్తే! మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
రచనలని చదివి ఆస్వాదించే పాఠకుల స్పందన భిన్న అభిప్రాయాలతో కూడుకుని ఉంటుంది. ఆ అభిప్రాయాలని స్వాగతించక మానము.
అనైతికంగా ప్రవర్తించే పాత్రలని గ్లామరైజ్ చేయడం నా అభిమతం కాదు. నా దృష్టిలో "తన్హాయి" లో కల్హార పాత్ర విజ్ఞత తో వ్యవహరించిన నిజాయితీ కల్గిన పాత్ర.
నేను నా అభిప్రాయం ని గౌరవిన్చుకున్నట్లే.. నా స్నేహితురాలి అభిప్రాయాన్ని గౌరవించాను. కనుకనే ఆమె అభిప్రాయాన్ని..పోస్ట్ చేసాను. "తన్హాయి" నవలపై నిజానికి మా ఇద్దరివి.. భిన్నాభి ప్రాయాలు.

నిజ జీవితాల్లో అందరూ క్లీన్ చిట్స్ ఉండరు. బలహీనతలు, క్షణికమైన వ్యామోహాలు స్త్రీ పురుషులకి ఇద్దరికీ సమానమే! విచక్షణతో.. మెలగాలి అన్నదానికే నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తాను.నిజానికి "తన్హాయి" లో ముగింపున చెప్పబడింది కూడా అదే!!