10, సెప్టెంబర్ 2012, సోమవారం

మనుషుల్లో సున్నితత్వం చచ్చిపోతుందా?


నేను నిన్ననే మా ప్రక్కింటి ఆమె చెప్పిన సంగతి విని వణికిపోయాను.

అసలు సంగతి ఏమిటంటే..

మా ప్రక్కింటి ఆమె అన్నయ్య భార్యకి ఈ మధ్య ఒక ఆపరేషన్ జరిగింది. అసహజంగా పెరిగిన కణితి కాబట్టి బయాప్సి తీసి పరీక్ష కోసం ముంబై పంపారు.

ఎలా ఉన్నారు..మీ వదిన అని మా ప్రక్కింటి ఆమెని పరామర్శించాను.

ఎలా ఉండటం ఏమిటండి..? ఆపరేషన్ చేసిన ప్లేస్ లో వేసిన బాన్దేజ్ ని పీకి పడేసి.. కుట్లు తెగి ఆ ప్రాంతం అంతా రక్తం కారేటట్లు బాదుకుంది వళ్ళంతా రక్తం ధారలై పారుతుంది అంది. .

వింటున్న నాకు గగుర్పాటు.కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకుని వణికి పోయాను.

విషయం ఏమంటే..తండ్రి ని భర్త అవమానకరంగా మాట్లాడినందుకు ఆమె అలా ప్రవర్తించింది అంట.

వెంటనే ఇంట్లో అందరు మందలించి ..మళ్ళీ ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించారు.బయప్సి రిపోర్ట్ లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాధమిక దశలో ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది.

ఇప్పుడు ఆమె కి ట్రీట్మెంట్ ప్రారంభం కావాల్సి ఉంది.

కాని ఆమె ట్రీట్మెంట్ వద్దని మొండి పట్టు పడుతున్నారు.

ఆమెకి ఇద్దరు పిల్లలు. వారి బాగోగులు సంగతి గురించి, అనారోగ్యం గురించి ఆలోచించే స్థితి ఆమెకి లేనట్లు ఉంది. ఎందుకో బ్లాకు మెయిల్ చేస్తున్నట్లు ఉంది

స్త్రీ లో ఉన్న సున్నితత్వాన్ని కూడా మరచిపోయి ఆమె విపరీతంగా ప్రవర్తించే తీరు కి ఆమె మానసిక స్థితే కారణం కావచ్చు అనిపించింది.

నాకు రెండు రోజులు ఆవిషయం తలచుకుని నిద్రపట్టలేదు అంటే నమ్మండి.

ఆమెకి మంచి కౌన్సిలింగ్ అవసరం అనిపించింది.

నిత్యం మనం చాలా విషయాలకి ఫీల్ అవుతూ ఉంటాం. ఇతరుల మాట తీరు,లేదా ఇతరుల ప్రవర్తన ద్వారా మనకి బాధ కల్గుతుంది. అంతా మాత్రం చేత మనని మనం హింసించుకుంటూ,ఇతరులని హింసిస్తూ.. లేదా.. మన అసహనాలని అకారణంగా ఇతరులపై ప్రదర్శించడం వల్ల వారిని బాధకి గురి చేస్తాం.

పువ్వులని చూసి,పసి పిల్లల నవ్వులని చూసి కూడా స్పందించడం చేతకాని వారిని మన మధ్య చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కల్గుతుంది.

అలాగే భూతదయ లేకుండా,స్పందన లేకుండా.. చదువుల ఖార్ఖానాకి మనం పిల్లల్ని తరలిస్తున్నాం. వారిలో స్పందనలు కరువైపోతున్నాయి.

నట్టింట్లో హింసని ఆదరించి చూస్తున్నాం. నడి రోడ్డుపై నెత్తురు కారుతున్నా..స్పందించకుండా ముఖం ప్రక్కకు తిప్పుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం.

ఆఖరికి ఎవరిని వారు హింసించుకుని.. నేను ఇలా ప్రవర్తిస్తాను అంటే భయం వేయడం లేదు.

యాసిడ్ దాడులు చేసేవాళ్ళు, లైంగిక క్రూర హింస తో బాధించేవాళ్ళు , హత్యలు చేసే ఆడవాళ్ళు, కాసులకోసం ప్రాణాలు తీసేవాళ్ళు.. ఇలా చాలా మంది చూస్తున్న రోజులివి.


హింస పెరిగిపోయి సున్నితత్వం తరిగిపోతున్న ఈ కాలంలో ఎవరైనా ఉదార వాదులు వీధి వీధికి మానసిక వైద్యశాలలు,కౌన్సిలింగ్ కేంద్రాలు పెట్టి మంచి మాటలు చెపితే బావుండును అనుకున్నాను.
ఎవరైనా అలాంటి కేంద్రం పెడితే స్వచ్చందంగా నా వంతు గా రోజుకొక మూడు గంటలు పనిచేసే తీరిక నాకు ఉంది


14 వ్యాఖ్యలు:

skvramesh చెప్పారు...

మనుషులు sense and sensitivity కోల్పోయి జీవిస్తున్నారు. కొని తెచ్చుకున్న ఒత్తిళ్ళతో అసహజ ఆలోచనలతో మానసిక రోగులౌతున్నారు. సహజంగా సున్నితంగా స్పందిచగలిగితే జీవితాలెంత అందంగా సాగిపోతాయో కదా

oddula ravisekhar చెప్పారు...

మంచి టాపిక్ పోస్ట్ చేసారు.ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నిరోధ దినం.అలాగే మీరు చెప్పినట్లు సున్నితత్వం కనుమరుగుతున్న కాలం.మీరన్నట్లు సలహా కేంద్రాలు అవసరమని నా బ్లాగులో కూడా ఈ రోజు వ్రాసాను.

Meraj Fathima చెప్పారు...

వనజా, మీరు ఎంచుకున్న ఈ టాపిక్ చాలా పెద్దది సముద్రం కన్నా పెద్దది.
ముఖ్యంగా స్త్రీలలోనే సున్నితం నశించటం గమనార్హం . అయితే దానికి ఎన్నో మానసిక వత్తుడులు కారణం కావచ్చు.
మీరు సూచించిన ఇంకో విషయం పిల్లల విషయం ఇది అక్షరాలా నిజం, పిల్లలని మనమే అలా తయారు చేస్తున్నాము సందేహం లేదు.
చిన్నపుడు క్రైం కథలు చదివితే ఇలాంటివి అస్సలు జరుగుతాయా అనుకొనే వాళ్ళం. చందమామ కథలని ఎలా వదిలేసామో..మనశాంతి నీ వదిలేసాము.
వనజా.. ఇలాంటివి తీసుకొనే మీరే ఇంకొంచం విసిదంగా రాయండి.....మెరాజ్

రాజ్ కుమార్ చెప్పారు...

:((((( హ్మ్మ్...
ఆమె ఆరోగ్యం బాగోలేని పరిస్థితులలో, ఆమెకు బాధ కలిగించేలా మాట్లాడటం భర్త తప్పు..ఆ స్తితిలో ఆవిడ కోపాన్నీ చూపించుకోడానికి వేరే ఆప్శన్ కనిపించి ఉండదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయతే ఆవిడ చేత అలా ప్రవర్తింపచేసినట్టుంది.. విచారించాల్సిన విషయం అండీ.
సున్నితత్వం చూపిస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నారూ, మరీ ఓవర్ చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు... ;( ;(

సుభ/subha చెప్పారు...

రాజ్ కుమార్ గారి మాటే నా మాటాను..
మంచి టపాలు పెడుతుంటారండీ మీరు అందర్నీ ఆలోచింపచేసేలా..

అజ్ఞాత చెప్పారు...

ఒక చిన్న సవరణ సున్నితత్వం చచ్చిపోతోందా?, తగ్గిపోతోందా కాదండీ

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి సబ్జెక్ట్ పైన రాసారు. కొందరు అంతేనండీ! వారిని ఎవ్వరూ మార్చలేరు. ఇలాంటి వాళ్ళకి పువ్వులు, పసిపిల్లల నవ్వులే కాదు కోయిల పాట కూడా విషాదంగా అనిపిస్తుంది.

జలతారువెన్నెల చెప్పారు...

నిజమే నండి.. కాని ఆవిడ అంతలా చేసిందంటే బలమైన కారణం కూడా ఉండి ఉంటుందని నా నమ్మకం. మీరు ఎన్నుకునే టాపిక్స్ మీ టపాలు రాయడానికి చాలా బాగుంటాయి వనజగారు.

వనజవనమాలి చెప్పారు...

svk రమేష్ గారు.. సున్నితత్వం కోల్పోయి బ్రతకడం కాదండీ హింసా ప్రవ్రుత్తి పెరిగి పోతున్నందుకు భయపడుతున్నాం,బాధపదుతున్నాం. అందుకే విచారం. మీ స్పందనకి ధన్యవాదములు.
@రవిశేఖర్ గారు.. మీరు అన్ని విషయాల పై విశిదంగా వ్రాస్తున్నారు. మీకే ధన్యవాదములు చెప్పాలి. కళ్ళ ముందు జరిగే కొన్ని సంఘటనలు చూసి నా స్పందన ఇలా వ్రాస్తూ ఉంటానది. థాంక్ యు సర్!
@ మేరాజ్.. మీరన్నది నిజం. రక రకాల దృశ్య వాతావరణం మనసులపై ప్రభావం చూపుతుంది కదా!
పోస్ట్ మేచినందుకు థాంక్ యు వెరీమచ్!

వనజవనమాలి చెప్పారు...

రాజ్ కుమార్..మీ స్పందనకి థాంక్ యు! మీ అభిప్రాయంతో.. నేను ఏకీభవిస్తాను. రకరకాల ప్రవ్రుట్టులకి స్పందించి..

కనుదోయి చెరువై.. రెప్పని దాటనివ్వని కన్నీటి చుక్కలెన్నో!
మౌనంగా,మూగగా వైదొలుగుతున్న సమయాలు ఎన్నెన్నో!

థాంక్ యు రాజ్ కుమార్.

@ సుభ ..బాగున్నారా.. మీ పోస్ట్లు మిస్ అవుతున్నాను. మిస్ చేస్తున్నాను కూడా.. సిస్టం అంటుకుంటే ఇంట్లో ఊరుకోవడం లేదు. ఇక్కడే నా ఉత్షాహం దాగి ఉందని చెపితే వినిపించుకోరు.
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే మాస్టారు.. మీ సవరణకి ధన్యవాదములు. సరిచేసాను. మీరు చెప్పినది వంద శాతం నిజం. థాంక్ యు మాస్టారు.
@ కాయల నాగేంద్ర గారు.. బాగున్నారండీ!
మీ స్పందనకి ధన్యవాదములు.మీరు చెప్పినది నిజమే నండీ!
@జలతారు వెన్నెల.. ఒక కోణం నుండి ఆలోచించకూడదు. మీరు చెప్పినది.. నిజమే!
కానీ అంత సున్నితత్వం నశించిపోయి..తనని తానూ హిన్సించుకోవడం భయం కల్గిస్తుంది. మనిషి ఎటువైపు నీ ప్రయాణం అనిపిస్తుంది. థాంక్ యు వెరీ మచ్!
మీ పోస్ట్లు రావడంలేదు. ఎందుకని.. ? వ్రాయండి.. వ్రాయండి..

అజ్ఞాత చెప్పారు...

రోజంతా పనికిమాలిన డైలీ సీరియళ్ళు చూడడంవల్లే స్త్రీలు సున్నితత్వాన్ని మరిచిపోతున్నారనిపిస్తుంది.

వనజవనమాలి చెప్పారు...

bonagiri గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీ స్పందనకి ధన్యవాదములు...

సామాన్య చెప్పారు...

మేరాజ్ ఫాతిమా గారన్నట్లు విషయానికి ఇంకో వైపూ ఉండొచ్చు .కానీ సంద్రభ రహిత ప్రవర్తనలో సున్నిత రాహిత్యమూ మొండితనమే ఎకువ కనిపిస్తుంది.మీ సహృదయత బాగుంది .మీఋ ఎల్ల వేళలా ఇట్లాగే నిష్కల్మషంగా అందరికీ సహాయం చేయగలిగెట్లు వుండాలని నా కోరిక