31, జనవరి 2013, గురువారం

కష్టాలే ఇష్టాలై..


నాకు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం అంటే చాలా ఇష్టం.
వాటిని ఉక్రోషంతో కూలదోయడం అతనికి  మరీ ఇష్టం.

అలిగిన వారిని  సముదాయించడం నాకు చాలా ఇష్టం 
అందుకే నాపై నేనే అలిగి కూర్చుండ టం మరీ ఇష్టం..

అతనికి చేసిన  వాగ్దానం ని నిలబెట్టుకోవడం కష్టం 
నాకు చేసిన వాగ్దానంకి కట్టుబడి ఉండటం ఇష్టం.

అతనికి ఎల్లప్పుడూ  సమూహం లో ఉండటం ఇష్టం 
నాకు ఒంటరితనంని  వెదుకుతూ.వెళ్ళడం .ఇంకా  ఇష్టం. 

అతనికి  ముప్పొద్దులా ఊహాలోకంలో మునిగి ఉండటం ఇష్టం.
నాకు పదుగురి హితం కోరి పనులపై మనసు పెట్టడం ఇష్టం.

నా ఇష్టాలన్నీ అతనికయిష్టాలై 
అతని ఇష్టాలన్నీ నాకు కష్టాలై...

జీవితం సాగించడం మరీ మరీ ఇష్టం. 

ఇష్టమైన దానితో కలిసి సాగడం  ఇష్టాతి ఇష్టం.


                        "జలతారు వెన్నెల"  "శ్రీ " గారి కోసం ఇష్టంగా ఈ పోస్ట్. 
తొందరగా  ఓ..పోస్ట్ తో వచ్చేయండి ప్లీజ్ ! కాఫీ చల్లారిపోతుంది మరి.

9 కామెంట్‌లు:

Raj చెప్పారు...

బాగుంది.. కవితలో మీరిద్దరి గురించి, పరస్పర విరుద్ధ భావాల తారతమ్యాల గురించీ చెప్పినా కలిసే ఉన్నట్లు చెప్పిన విధం బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

గొప్ప సత్యం. కష్టపడకుండా ఇష్టపడితె అంతా ఆనందమే.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే ..మాస్టారూ .. వ్యతిరేకమైన ఆలోచన మనసుని బలహీనపరుస్తుంది. అందుకే కాఫీ ప్రియులమైనాము . :) ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ గారు.. ఈ గొప్ప సత్యాన్ని కాఫీ త్రాగుతూ కనుకున్నానండీ. భిన్న ద్రువాల ఆకర్షణ శక్తి అది.:) థాంక్ యు సో మచ్.

శశి కళ చెప్పారు...

భలే చెప్పారు అక్క.అవును వెన్నెల గారు ,శ్రీ గారు రావాలి

హితైషి చెప్పారు...

చాలా చాలా బావుంది. కష్టాలని ఇష్టాలుగా మార్చుకోవడం మీ నుండి నేర్చుకోవాలి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మనకిష్టమైన వాళ్ళ సమక్షంలో కష్టాలు కూడా ఇష్టాలైపోతాయి కదా .. చాలా బాగుందండీ ..

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు,

నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని, ఇ-కాఫీ అందించిన మీరంటే ఇష్టం..
పోస్ట్ తో రమ్మంటే మాత్రం.... కష్టం!
కాఫీ కంటే మీరు రాసిన కవిత చదవటం ఇంకా ఇష్టం..
కాఫీ తాగొద్దు, మానెయ్యమని చెప్పేవారంటే.. అయిష్టం!
తనకి అయిష్టం అయినా రోజు ఉదయాన్నే కాఫి కలిపి నాకిచ్చే అతనంటే ఎంతో ఇష్టం...
ఇలా ఉదయాన్నే కవిత నా చేత చదివించి,కాఫీ అందించిన మీరంటే... ఇంకా ఇంకా ఇష్టం!

వనజ గారు, Thank you very much for the post! కవిత అందంగా ఉంది..
శశి గారు, బాగున్నారా?

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు,

నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని, ఇ-కాఫీ అందించిన మీరంటే ఇష్టం..
పోస్ట్ తో రమ్మంటే మాత్రం.... కష్టం!
కాఫీ కంటే మీరు రాసిన కవిత చదవటం ఇంకా ఇష్టం..
కాఫీ తాగొద్దు, మానెయ్యమని చెప్పేవారంటే.. అయిష్టం!
తనకి అయిష్టం అయినా రోజు ఉదయాన్నే కాఫి కలిపి నాకిచ్చే అతనంటే ఎంతో ఇష్టం...
ఇలా ఉదయాన్నే కవిత నా చేత చదివించి,కాఫీ అందించిన మీరంటే... ఇంకా ఇంకా ఇష్టం!

వనజ గారు, Thank you very much for the post! కవిత అందంగా ఉంది..
శశి గారు, బాగున్నారా?