తన కోసం తను బ్రతికిన క్షణాలు ఏవి తనకి మిగిలేలా ఉంచని కుటుంబం పట్ల, జీవితం పట్ల .వైరాగ్యం కల్గింది.
ఎక్కడ పని అక్కడే ! వంట ఇంట్లో శుభ్రం చేయని గిన్నెలు, బార్దేడు పొద్దెక్కినా శుభ్రం చేయని ఇల్లు, కుర్చీలో లుంగలు చుట్టి విసిరివేయబడ్డ ఉతికిన బట్టలు తనలో పెరిగిపోతున్న బద్ధకం కి గుర్తులు మాత్రమే కాదు..జీవితాన్ని జీవించడం పట్ల ఉన్న అనాసక్త కి కారణం కూడానేమో! ఎంతసేపని పుస్తకాలు చదువుతూ,టీ .వీ చూస్తూ, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకు బలవంతంగా ఈడుస్తూ గడపడం?
తనకి శరీరానికి కాదు అనారోగ్యం మనసుకి. కూడా.. మనసుకి ఉన్న అనారోగ్యం వదిలితే తప్ప తనలో ఉత్సాహం రాదు అనుకుంది పద్మ.
పైన మీరు చదివిన భాగం అంతా.. ఓ..కథ లో భాగం.
ఆ కథ పేరు "జీవితేచ్చ "
3 కామెంట్లు:
బావుంది
Nijame! Avvani choosi nerchukovaalsindi ento undi. Manchi sandesam....chaalaa baagundi vanaja garu.
కూడలి లో లేక పోవటం వలన మీ బ్లాగు నా దృష్టికి రాలేదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో అగ్రగామి ఐన కూడలి లో మీ బ్లాగు కలపగలరు. మీ బ్లాగు లో వచ్చే కొత్త టపాలు ఎక్కువమంది పాఠకుల దృష్టికి రాగలవు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి