22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

విస్పోటనం

 కొందరి జీవితాలలో   చీకటి రాత్రి మొదలైన  సమయం. అందరూ  ఒక్కసారిగా ఉలికి పడ్డాము. జరిగిన సంఘటనలు  గతం ని గుర్తుకు తెస్తున్నాయి

గాయాలు మళ్ళీ రేగుతున్నాయి అప నమ్మకం నీడగా మారుతుంది


అది అకారణ  అణచివేత  చిహ్నం  కావచ్చు. అది  భయ భ్రాంతులకి గురి చేసే ఉగ్రవాదం కావచ్చు  ఏర్పాటు వాదం కావచ్చు.

ఏదైనా గర్హించవలసిన  విషయమే!  నగరంలో నే కాదు.. విస్పోటనం మనస్సులో కూడామరి కొన్ని గమనించిన విషయాలు  చూస్తే .. ఉగ్రవాదం తోనూ పోల్చ దగ్గవే!

ఎందుకో ..  కొందరి పై  అకారణ  ద్వేషాలు అంతలోనే  అవసరం కోసం నటించే స్నేహాలు

 కొందరికేమో  వెన్ను విరుపు మరి కొందరికేమో  అతి ప్రేమతో  పెద్దపీట

వడ్డించే వాడు మనవాడైతే  ఏ పంక్తిలో కూర్చుంటే ఏం లే ! అన్నట్టుగా

గురు వర్యులే  పక్షపాత వైఖరి వహించడం భారతం నాటి నుండి ఉన్నదే కదా!కిరణాలు ఎన్ని ఉన్నా.. వెలుగు  ఒకటే ! -  ఆ వెలుగులని ఆపడం సాధ్యం  అయ్యేనా !

 వెలుగులు విరజిమ్మే కవిత్వం అంతే!

 పెల్లుబికే కవనం ని,  వెల్లులికే వమనం ని ఆపడం సాధ్యం కాదు కదా!

ఒక విషయం కని, విని ..బాదా తప్త హృదయం తొ..

( ఓ మిత్రురాలికి సపోర్ట్ గా  ఈ స్పందన )3 వ్యాఖ్యలు:

భారతి చెప్పారు...

ఎందుకో .. కొందరి పై అకారణ ద్వేషాలు అంతలోనే అవసరం కోసం నటించే స్నేహాలు
కొందరికేమో వెన్ను విరుపు మరి కొందరికేమో అతి ప్రేమతో పెద్దపీట
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చుంటే ఏం లే ! అన్నట్టుగా
గురు వర్యులే పక్షపాత వైఖరి వహించడం భారతం నాటి నుండి ఉన్నదే కదా...

పెల్లుబికే కవనం ని, వెల్లులికే వమనం ని ఆపడం సాధ్యం కాదు కదా...

వనజ గారు!
ఇప్పటికి ఈ టపా ఐదుసార్లు చదివాను. ఎంత చక్కటి భావనాక్షరాలు. ఇంత చక్కగా మీ స్పందనలను ఎలా అక్షరీకరిస్తారో గానీ, ఓ వ్యాఖ్యను పెడదామంటే నా దగ్గర 'మాటలే లేవు'.

వనజవనమాలి చెప్పారు...

భారతి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.
బహుశా భావావేశం అలా వ్రాయిస్తుంది అంతే నండీ !

Meraj Fathima చెప్పారు...

వనజా, ఎదురు దెబ్బలు తగలటం అలవాటు పడిన మనస్సు చలించదు, గురువు అనేవాడికి పక్షపాత బుద్ది ఉండకూడదు. యెది యెమైనా మండే సూర్యుని అరచేతులడ్డు పెట్టి ఆర్పలేరు. దేవుని దయ ఉండాలి గానీ మానవులు యెమీ చేయలేరు, మీ ఆవేదన బాగుంది.