4, ఫిబ్రవరి 2013, సోమవారం

కొన్ని నిజాలు మాట్లాడుకుందాం - ఆలోచనలు మార్చుకుందాం.


కొన్ని నిజాలు మాట్లాడుకుందాం  - ఆలోచనలు మార్చుకుందాం.

స్త్రీ ఎదిగింది ఎక్కడ  ఎదగనిచ్చేది ఎక్కడ ? అని ఒక ప్రశ్న వేస్తే.. కొందరి స్త్రీల  (బ్లాగర్ ల )మనసులో మాట  ఈపోస్ట్ . 

అదొక కార్పోరేట్ సంస్థ ఆడ మగ సమానస్థాయి లో వాళ్ళ వాళ్ళ పనులలో తలమునకలై ఉన్నారు.  వారు చేస్తున్న పనుల మధ్యలో ఏదైనా సమస్య తలెత్తినా..సలహా కావాలన్నా   ప్రక్కనే పని చేసుకుంటున్న తోటి ఉద్యోగిని అడిగి తెలుసుకోవడం పురుష ఉద్యోగికి మొహమాటం మాత్రమే  కాదు నామోషి తనం కూడా. మగవాడిని నాకన్నా వారికి ఎక్కువేం తెలుసు? ఒకవేళ ఒకో విషయంలో తెలిసినట్లు ఉన్నా స్త్రీ ఎప్పుడూ కూడా ద్వితీయ శ్రేణికి చెందినదే ! నేను ఇప్పుడు నా సందేహంని నివృత్తి  చేసుకోవాడానికి మాట సాయం అడిగినా లోకువ అయిపోతాననుకుంటాడు ( ఈ విషయం పురుషులందరికీ వర్తించక పోవచ్చు )

ఇది చాలా మంది పురుష ఉద్యోగులలో ఉన్న అపోహ. వారికి  తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్నా, అస్పష్టంగా తోస్తున్న విషయాలపై  అవగాహన పెంచుకోవాలనుకున్నా పురుషుల ద్వారానే తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు తప్ప స్త్రీల సాయం తీసుకోరు. అలాగే స్త్రీలలో ఉన్న ప్రతిభని,శక్తి సామర్ధ్యాలని ఒప్పుకోవడానికి అయిష్టం కూడా. ఇది అసత్యం అని చాలా మంది పురుషులు అభ్యంతరం తెలిపినా సరే ఇదే నిజం !  

మనం సాధించిన అభివృద్దిలో స్త్రీల వ్యక్తి గత అభివృద్ధి శూన్యం.  చదువులు చదువుకుంటున్నారు.., ఉద్యోగం చేసుకుంటున్నారు.,పురుషులతో సమానంగా కొంతవరకైనా రాణిస్తున్నారు. కానీ స్త్రీల పట్ల పురుషులకి ఉన్న భావ జాలం ని మార్చలేక పోతున్నామనేది కఠోర సత్యం.    

మనిషి  మనసుకి ముఖం  అద్దం  లాంటిది అంటూ ఉంటారు. కానీ ఇతరుల మనసులో ఏముందో తెలుసు కోవడం కష్టం కూడా.  మనిషి లో  బాహ్యంగా కనిపించే మనిషికి అంతర్లీనంగా ఉండే మనిషి తత్వానికి పొంతనే ఉండదు. సమాజంలో అందరికి సౌమ్యుడిగా  కనబడే వ్యక్తి  ఇంట్లో అతి క్రూరత్వం ప్రదర్శిస్తాడు. అది అతని కుటుంబం కి మాత్రమే.తెలుసు.  మునుముందు కాలంలో అది ఇల్లు కానీయండి, ఆఫీస్ కానీయండి..ఎక్కడైనా సరే ..సంకుచిత మనస్తత్వాల మధ్య  అనుమానపు చూపులు ఎదుర్కుంటూ.. అపనమ్మకం నీడన బితుకు బితుకు మంటూ బ్రతికే రోజులు రానున్నాయేమో ! 

ఒక స్త్రీ ఉద్యోగిని గా మారి  బయట ప్రపంచంలోకి కాలు పెడితే లైంగిక నిబద్దత లేని వ్యక్తిగా  జమకట్టడం ఇప్పటికి ఉంది.  అలా చెప్పుకోవడం చాలా సిగ్గుపడే  విషయం కూడా. ఒక స్త్రీ యొక్క స్వేచ్చని, అభిరుచులని, అవసరాల కోసం ఉద్యోగం చేయవలసి రావడంని సానుకూల దోరణిలో అర్ధం చేసుకోవడం మానేసి చదువుల పేరిట,ఉద్యోగాల పేరిట బయట తిరుగుతూ విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారనే ఆలోచనలు చేయడం సబబు కాదు. 
ఇలాంటి అనారోగ్య ఆలోచనలు చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తూ.. ఆడపిల్లలని,తల్లులని,ఆఖరికి వ్రుద్దురాళ్ళు  అయిన బామ్మలని కూడా వ్యాఖ్యానించడానికి నోటిని తాటి మట్టల్లా వాడుతున్నారు. ఒకప్పుడు రాజకీయరంగంలో ఉన్న మహిళలని, కొన్ని వృత్తులలో  ఉన్న వారిని ,  సేవారంగంలో పనిచేసే స్త్రీలని, క్రీడాకారిణి  లను  శీలసంపద లేని వారిగా జమ కట్టేవారు.ఇప్పుడు చూస్తే ఏ ఒక్కరిని వదలడం లేదు. ఆఖరికి ఏడేళ్ళ పిల్లలని కూడా.  

 కొందరి మగవారి కాలక్షేపపు కబుర్లలో మహిళల లైంగిక నిబద్దత గురించే మాట్లాడాలా? వాళ్లతో కలసి శరీరాలు పంచుకునే పురుషుడు మాత్రం శీలం కోల్పోడా? శీలం అనే విషయం కి వచ్చేటప్పటికి ఆడ-మగ తేడాలు ఎందుకుండాలి? మానవ ప్రవర్తనలో సెక్స్ కి   మహత్తర శక్తి ఉందని ప్రాయిడ్ గుర్తించారు. లైంగిక అంశాల గురించి పిల్లలకు చెప్పలేకపోవడం తో పాటు  లొపభూయిష్టమైన విద్య కారణంగానే పిల్లలులో ఆసక్తి పెరిగి  అశ్లీల సాహిత్యం చదవడం తో మొదలై నలుగురు కూర్చుని స్త్రీల పై అవాకులు చవాకులు పేలడం, అకృత్యాలకి  పాల్బడటం , తమ మనసులోని వికృతాన్ని  కుమ్మరించడం, ఇంట్లోను బయట ఉన్న స్త్రీల పట్ల చులకన భావం ప్రదర్శించడం లాంటి చేస్తుంటారు. ఇలాంటివి మాట్లాడుకోవడం విన్న మరి కొందరు పురుషులు కూడా ఇలాంటి మాటలకి వెరచి తమ కుటుంబ స్త్రీలని బయటకి పంపడానికి  వెనుకాడతారు. అప్పుడు సమాజం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనం లోకి పయనించక తప్పదు  అనిపిస్తుంది. 

చాలా విషయాలలో  మనం నాగరికులం అయిపోయినట్లు భావిస్తాం. మన ఆలోచనలు నాగరికంగా మారనంత కాలం మనం సాధించుకున్నది శూన్యం.    

ఇటీవల కాలంలో బయటపడిన  పురుషుల  ఆలోచనా దోరణి గమనిస్తే.. ఆడపిల్లల్ని చదువులకి బయటకి పంపగలరా !? ఎక్కడో..ఎప్పుడో ఇలాంటివి కొందరి దృష్టికి వస్తూ ఉంటాయి. పురుషులందరికీ ఇలాంటి ఆలోచనా దోరణి ఉంటే ఎంత ప్రమాదకరం . ?ఒళ్ళు  ఒణికిస్తుంది.  ఒకే కప్పు క్రింద జీవితాంతం గడపాల్సిన భార్య భర్త ల మధ్య ఇలాంటి అపనమ్మకాలు వేళ్ళూను కుంటే !? ఇప్పటికే వివాహ బంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఆడపిల్లలకి  తగిన భద్రతా లేదు. ఇక ఇలాంటి ఆలోచనా దోరణి ప్రభలితే ఎంత కష్టం.?  

అంతెందుకు ? ఒక తండ్రి తన కూతురిని,ఒక అన్న తన చెల్లెల్ని అనుమానంగా చూడటం మొదలెడితే..ఆడపిల్లకి అంతకన్నా అవమానం ఏముంది?బాల్య వివాహాలే శరణ్యం అని తీర్మానించడం  ఏ మాత్రం  గొప్పా కాదు. కులం పేరిట,మతం పేరిట కూడా స్త్రీల పై అనుచిత  వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నారు. ఇలా మాట్లాడుతుండే  వారు వారి ఆలోచనా విధానాన్ని తప్పక  మార్చుకోవాలి. టాయ్ లెట్స్ గోడలపై అసహ్యకర వ్రాతలు వ్రాయడం లాగా  తమ వాచాలతతో స్త్రీల గురించి అసహ్య కరంగా మాట్లాడటం మానుకోవాలి  లేదంటే టాయ్ లెట్స్ కన్నా అసహ్యంగా మీ మనసులు ఉన్నాయి అని అమ్మాయిలూ చెపుతారు. కనీసం భర్తగా కాదు బాయ్ ప్రెండ్ గా కూడా అంగీకరించలేని రోజులు వస్తాయి. 

స్త్రీలైనా,పురుషులయినా అసహ్యకరంగా మాట్లాడుకోవడం గమనిస్తే అలాంటి మాటలు,ఆలోచనా విధానం తప్పని చెప్పడం అత్యవసరం కూడా.    

43 వ్యాఖ్యలు:

శశి కళ చెప్పారు...

నిజం చెప్పావు అక్క.నిజంగా ఉక్కు మహిళవు.
పాపం అవమానం తో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు దిక్కు...నాలిక ఉంది కదా అని మాట్లాడతమేనా?

kri చెప్పారు...

ధైర్యంగా రాసేరు వనజగారూ, ఈ మధ్య జరుగుతున్న సంఘటనలూ సంభాషణలూ చదువుతుంటే వీళ్ళు అసలు చదువుకున్నవాళ్ళేనా అన్న అనుమానం వస్తోంది.
క్రిష్ణవేణి

Mauli చెప్పారు...

మొదటి సారి చక్కని homework చేసి వ్రాసిన టపా ఇది అని నాకనిపిస్తుంది అండీ.రెండు సమస్యల మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతం గా ఆవిష్కరించారు. ఇంకా అసలైన ప్రశ్నలను సూటిగా సంధించారు. ఇలానే కొనసాగించండి.

కాని వ్రాస్తే సరిపోతుందా? సమాధానం రాబట్టండి (ఇక్కడే అని కాదు )

Mauli చెప్పారు...

@ శశి కళ

Who will commit suicide???

హితైషి చెప్పారు...

మీ ఛురకత్తి తన పదును మరోసారి రుజువుచేసుకుంది.శీర్షిక బావుంది. విషయం మరీ.... బావుంది. ఆలోచనలలో మార్పు రావాలన్నారు. బాగు బాగు. సాధ్యం అయ్యేనా... వేచి చూడాలి. మహిళ గురించి తక్కువగా మాట్లాడాలంటే.. భయపడే రోజులు రావాలి. అంతకన్నా ముఖ్యం స్త్రీ పట్ల గౌరవం పెరగాలి.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

స్త్రీ పురుషుల ఆలోచనా విధానంలోనే మార్పు రావాల్సిన అవసరముంది. ఇది కుటుంబం నుండి మొదలై సమాజంలో ప్రతిఫలిస్తేనే కదా వచ్చేది. బాగా చెప్పారు వనజవనమాలి గారు..

RAJ A చెప్పారు...

చాలా బాగా విశ్లేషించి వ్రాశారు.. మీకు అభినందనలు. నిజమే! ప్రస్తుత వాతావరణం అలా అయ్యింది. ఒకప్పుడు చదూకోని అనాగరికుల నుండే ప్రమాదం అనుకున్నాము. ఇప్పుడు చదువుకున్న అనాగరికుల వద్ద నుండి కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది.

Green Star చెప్పారు...

చాలా చక్కటి టప రాసారు. అభినందనలు.

జ్యోతిర్మయి చెప్పారు...

నాకింత మంది అమ్మాయిలతో సంబంధం వుంది అని టివిలో ప్రముఖులు చెప్తుంటే మనం హాయిగా నవ్వేసుకుని పక్కకెళ్ళి పోతాం. ఆడవారి శీలాల గురించి మాత్రం అసభ్యంగా మాట్లాడతాం. ఏమిటో ఈ తేడాలు.

raf raafsun చెప్పారు...

Nice post.....Bold but Real...Keep it up sister..

Palla Kondala Rao చెప్పారు...

మంచి పోస్టు.

మొత్తం సమాజంలో భావజాలధోరణి మారాలి. ఆత్మహత్యల ధోరణినుండి ఆత్మవిశ్వాసం పెంచుకునే ధోరణి పెరగాలి. పోరాడే స్పూర్తి పెంచుకోవాలి.

స్త్రీలలో కూడా తాము అబలలమనే ఆలోచన మారాలి. ధైర్యం పెరగాలి. ఓ మహిళ పిల్లలను పెంచాల్సి వచ్చినప్పుడు ఆడపిల్లలను తక్కువజేసి పెంచడం అడుగడుగునా భావాలలో అణగి ఉండాలి, అణకువగా ఉండాలి అంటూ అమ్మాయిలకు మాత్రమే నేర్పే ధొరణిలో చైతన్యం పెరగాలి. ఆ మార్పు కుటుంబం నుండి కూడా పెరగాలి. ప్రస్తుతానికి కొంత మార్పు ఉంది. ఇది ఇంకా పెరగాలి.

ఈ సమస్య స్త్రీ పురుషుల మధ్య వ్యతిరేక సమస్య కాదు. భావజాలంలో ఆధిపత్య పైత్యం మారాలి. పురుషాధిక్య సమాజంలో పురుషుడి ఆధిపత్య ధోరణిని స్త్రీలు సమర్ధించడం, అదే అణకువగా పెంచడం అనేది కూడా మారాలి. ఆ చైతన్యం స్త్రీలలో పెరగాలి.

స్త్రీ - పురుషులు సమానులే అన్న భావజాలం ఇద్దరిలో పెరగాలి. పురుషాధిక్య భావజాలాన్ని తగ్గించేందుకు స్త్రీ-పురుషులు అంతా కలసే పోరాడాలి. భావజాలంలో చైతన్యం పెంచేందుకు కృషిచేస్తున్న మీలాంటి వారి సంఖ్య మహిళలో పెరగాలి.

అభినందనలు వనజ గారు.

అజ్ఞాత చెప్పారు...

కొందరి మగవారి" కాలక్షేపపు కబుర్ల "లో మహిళల లైంగిక నిబద్దత గురించే మాట్లాడాలా?
వనజగారు,
ఉతికి పారేశారు, నన్ను కూడా ఉతికేశారా? :)

గోదారి సుధీర చెప్పారు...

'' శీలం అనే విషయం కి వచ్చేటప్పటికి ఆడ-మగ తేడాలు ఎందుకుండాలి?''
నిజమే కదా !తేడా ఎందుకో ?బహుశా మగ వాళ్లకి శీలం మొదటి నుండీ ఉండదనా ?పోస్ట్ చాలా బాగుంది .ఎల్లప్పటి మీ పోస్టుల్లానే .

Jai Gottimukkala చెప్పారు...

మీ ఆవేశం అర్ధవంతంగా ఉంది. చక్కటి టపా రాసినందుకు అభినందనలు.

రాజి చెప్పారు...

"స్త్రీలైనా,పురుషులయినా అసహ్యకరంగా మాట్లాడుకోవడం గమనిస్తే అలాంటి మాటలు,ఆలోచనా విధానం తప్పని చెప్పడం అత్యవసరం కూడా..." మంచి విషయమండీ..

ఆడవాళ్ళైనా మగ వాళ్ళైనా మాట్లాడే మాటలు కానీ చేతలు కానీ ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదేమో..

ప్రవీణ చెప్పారు...

సోషల్ నెట్వర్కింగ్లో స్త్రీలపై అసభ్య కామేట్లు చూసాక షాకింగ్ అనిపించింది. ఇలా ఆలోచించే వారు కుడా వున్నారా అనే విబ్రాంతి కలిగింది.

మీరన్నట్టు ఒక మనిషి మంచితనం బయటపడేది ఇంట్లోనే.

ఈ రోజుల్లో సోషల్ నెట్వర్కింగ్ వచ్చాక మనసులోని ముసుగులు బయటపడుతున్నాయి. అతి ప్రమాదకరమైన విషయం ఇది.

మంచి టపా వనజ గారు

అజ్ఞాత చెప్పారు...

hmmm...

anrd చెప్పారు...* వనజ గారు ! నిజమేనండి. .శీలం విషయంలో ఆడ-మగ తేడాలు ఉండకూడదు. నైతికవిలువలు అనేవి ఇద్దరికి ఉండాలి.
* నేను స్త్రీనే. స్త్రీల సమస్యల పట్ల నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది.
* అయితే స్త్రీల పట్ల చులకన భావం కలగటానికి కొందరు స్త్రీలు కూడా కారణమేమో అనిపిస్తుంది.
* అసభ్యంగా దుస్తులు వేసుకు తిరిగే కొందరు ఆడవాళ్ళని చూస్తే చులకన భావమే కలుగుతుంది కదా !
* పార్కుల్లో కొందరు స్త్రీపురుషులు అసభ్యంగా ప్రవర్తించటం చూస్తున్నాం కదా ! .
* వివాహం అయి పిల్లలున్న కొందరు స్త్రీలు, పురుషులు కూడా జీవితభాగస్వామికి అన్యాయం చేసి ఇంకొక వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి కొందరు స్త్రీల వల్ల తోటి స్త్రీలకు అన్యాయం జరుగుతోంది.
* మీడియా ద్వారా ఎన్నో అసభ్యకరమైన ప్రోగ్రాంస్ ప్రసారమవుతున్నాయి. వీటన్నింటిని ఎవరాపగలరు ?
* క్రైం న్యూస్ చూస్తే నైతికపరంగా సమాజం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు.
* మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుంది. ఆలోచనల్లో మార్పు రావాలంటే తల్లితండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే చక్కటి నైతికవిలువలను నేర్పించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది.
* స్త్రీలు పురుషులు ఒకరితో ఒకరు పోటీ పడకుండా అందరూ ఆలోచించి సమాజంలో నైతికవిలువలను పెంచుకుంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది అని నాకు అనిపిస్తోందండి.

వనజవనమాలి చెప్పారు...

శశి కళ గారు.. .. స్త్రీల గురించి నీచంగా మాట్లాడుకునే వారిని మనం నోరు మూయించగలం .కానీ వారి ఆలోచనలు ఉన్నాయి చూడండీ.. అవి చాలా భయంకరమైనవి. వారి కుటుంబాల లోని స్త్రీలే ఆ ఆలోచనలకి గురి కాబడతారు. మీరన్నట్లు అవమాన భారంతో.. ఆత్మ హత్య ప్రయత్నం చేసినవారిని నేను ఎరుగుదును. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

కృష్ణవేణి చారి గారు.. ధైర్యం అని కాదు కాని ఎవరో ఒకరు ఖండించాలి తమదాక వస్తేనే కాని అని ఊరుకుంటే దుష్ట ఆలోచనలు వ్యాప్తి చెందుతాయి. అనుమాన బీజాలు వేస్తాయి. కొందరి వలన అందరూ బాధపడటం సమంజసం కాదు కదా ! స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

మౌళి గారు.. స్త్రీలపై అక్కసుతోను,కాలక్షేపం కోసం,వ్యాఖ్యానం చేసేవారిని,ఉద్దేశ్య పూర్వకంగా బురద జల్లె వారిని, స్వంత ఆస్తిగా పరిగణించి అవమానంగా అమానుషంగా తిట్టిపోసేవారు.. ఈ సమాజంలో కోకొల్లలు.విషపు ఆలోచనలు వల్ల నష్టం జరిగేది వ్యక్తులకన్నా సమాజానికే ఎక్కువ.

ఈ విషయం గురించి కొంత మంది తో నేను మాటల సందర్భంలో ప్రస్తావించినప్పుడు అందరూ వ్యతిరేకత తెలిపారు. అలాగే ఆవేదన వెలిబుచ్చారు. మన ఇంట్లో నలుగురైదుగురు స్త్రీలు ఉంటె వాళ్ళని కదిపి చూస్తే అందరూ.. ఇలాంటి వ్యాఖ్యానాల పట్ల నిరసన తెలియజేసినవారే!

మనం స్త్రీ-పురుష వ్యత్యాసాలు ,భావజాలాలు గురించి మాట్లాడుకున్నా కూడా .. స్త్రీ జాతి పై ప్రదర్శిస్తున్న వాచాలత ని గర్హించాల్సిందే! మీరైనా ,నేనైనా ఎవరైనా ఖండించాల్సిందే! అప్పుడే దైర్యంగా బయట ప్రపంచంలో తిరిగే స్వేచ్చ ని కాపాడుకున్నవారు అవుతారు..మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

హితైషి.. ఈ మధ్య నా ప్రతి పోస్ట్ పోస్ట్ విపరీతంగా నచ్చుతుంది.:) ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

కె.క్యూబ్ వర్మ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. పాలు త్రాగే దూడలకు చిక్కం కట్టి మట్టి తినకుండా నియంత్రిస్తారు. ఈ మనుషులని నీచ వ్యాఖ్యానం చేయకుండా ఎలా నియంత్రిన్చాలండీ! ? ఆ ఆవేదనలో నుండే ఈపోస్ట్.

వనజవనమాలి చెప్పారు...

రాజ్ గారు.. సంస్కారం విషయంలో చదువుకున్న వారు,చదువుకొని వారు అంటూ తేడాలు చూపలేమంది. అపనమ్మకం,ఎక్కడో ఉన్న అనుమానపు బీజాలు వల్ల అలా నోటి దురద తీర్చుకుంటారు. వారిని హర్షించాలెం కదా! సాధ్యమైనంత వరకు ఖండించి సంస్కారంగా మెలగమని చెపుదాం. ఇది దృష్టికి వచ్చిన అందరి భాద్యత. స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

Green Star gaaru.. Thank you so much.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.శతాభ్దాలుగా పేరుకుపోయిన భావజాలాన్నిమనం మార్చలేము. అసలు నన్నడిగితే పురుషుల వికృతాలని భరించడానికే వేశ్యా వాటికలు ఏర్పడ్డాయి.కులాంగానలని గృహ నిర్భందంలో ఉంచి విచ్చలవిడి శృంగారాన్ని గొప్ప అర్హతగా చెప్పుకునే దురంహాకార పురుషులు అడ్డు,హద్దు అదుపు లేకుండా నోరుపారేసుకోవడంని ఎప్పుడో వ్యతిరేకించి ఉంటె.. ఈ ర్రోజు ఇలాంటి వాచాలత ని మనం విని ఉండేవారిమి కాదేమో! బహు భార్యత్వం, అడల్టారీ ఇలా వేళ్ళూను కునేయే కాదు. కొందరి చెత్త నోర్లు వాగుతూనే ఉండేవి కాదు.
మన ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు..ఉంటారు..అని ఆలోచించే వారు కదా!

వనజవనమాలి చెప్పారు...

raf rafsun Bhai .. Thank you very much.

వనజవనమాలి చెప్పారు...

Palla Kondalarao gaaru Thank you so much.

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ! అయ్యయ్యో! మీ కాలక్షేపపు కబుర్లు గురించి అంత మాట అనగలనా!? ఉతికిపారేసినట్లు అనిపిస్తే నేను పాస్ అయినట్లే! ధన్యవాదములు.మాస్టారూ!

వనజవనమాలి చెప్పారు...

సామాన్య గారు..మీ స్పందనకి ధన్యవాదములు. స్త్రీ-పురుషుల మధ్య లైంగిక నిబద్దత గురించి..నైతిక విలువలు గురించి, వ్యత్యాసాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే శీలం అంటూ స్త్రీలని అవమానించే పురుషులని వారి వారి ప్రవర్తనను కూడా తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటాను.

జలతారువెన్నెల చెప్పారు...

చాలా చక్కటి టపా.. ఆలశ్యం గా చూసాను.

వనజవనమాలి చెప్పారు...

జై..గొట్టిముక్కల గారు.. థాంక్ యు సోమచ్.

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు.. వ్యక్తిగత ఆలోచనలని బహిర్గతం చేయడం..సమాజంలో స్త్రీ లందరికి వర్తింపజేయడం ని ఎవరు సహించలేరు . ఏ విషయమైనా అందరికి ఆపాదించడం ని మనం ఒప్పుకోగలమా!? అలాంటి వారి ఆలోచనలు మారాలి.అని కోరుకుందాం.
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

ప్రవీణ గారు.. మనం గమనించిన విషయాలని ఖండించడం, వీలయితే నలుగురి దృష్టికి తేవడం వలన కొన్ని జాడ్యాలని మరింత వేళ్ళూను కోకుండా చేయగలం అనడానికి ఇదే ఉదాహరణ.

మీ స్పందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

పురాణపండ ఫణి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. కొన్నిటిని చూస్తూ..కొన్నింటిని భరిస్తూ,కొన్నిటిని భరిస్తూ సాగుతున్నాం. అంతే. ఆలోచనా విధానం మారాలి అని కోరుకుంటున్నాం.

వనజవనమాలి చెప్పారు...

అనురాధ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

మీ వ్యాఖ్య లో ఈ భాగం అందరికి మంచి చేస్తుందని నేను నమ్ముతున్నాను .అందరూ కృషి చేయాల్సింది..అందు కోసమే!


మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుంది. ఆలోచనల్లో మార్పు రావాలంటే తల్లితండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే చక్కటి నైతికవిలువలను నేర్పించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది.
* స్త్రీలు పురుషులు ఒకరితో ఒకరు పోటీ పడకుండా అందరూ ఆలోచించి సమాజంలో నైతికవిలువలను పెంచుకుంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది

ఇది..నిజం . ధన్యవాదములు.

Mauli చెప్పారు...

@. స్త్రీలపై అక్కసుతోను,కాలక్షేపం కోసం,వ్యాఖ్యానం చేసేవారిని,ఉద్దేశ్య పూర్వకంగా బురద జల్లె వారిని, స్వంత ఆస్తిగా పరిగణించి అవమానంగా అమానుషంగా తిట్టిపోసేవారు.. ఈ సమాజంలో కోకొల్లలు


ardham kaaledu, vivaristaaraa? meeru ye sandarbam ki ee samaadhaanam iste, ade vivarinchagalaru.


@
మనం స్త్రీ-పురుష వ్యత్యాసాలు ,భావజాలాలు గురించి మాట్లాడుకున్నా కూడా .. స్త్రీ జాతి పై ప్రదర్శిస్తున్న వాచాలత ని గర్హించాల్సిందే! మీరైనా ,నేనైనా ఎవరైనా ఖండించాల్సిందే! &*****అప్పుడే దైర్యంగా బయట ప్రపంచంలో తిరిగే స్వేచ్చ ని కాపాడుకున్నవారు అవుతారు.****

ippudu maatram swechcha ledaa? valla maatalaki swechchaki sambandham undaa?

-----------------
chivaragaa, akkada facebook matlaadina vaare ee tapaaki vahchci mee tapaaki support istaaru (istunnaaru), appudu tappu vaallalo undaa?

anrd చెప్పారు...

వనజ గారు, నా అభిప్రాయాలు కొన్ని మీకు నచ్చకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే నా అభిప్రాయాల గురించి మరికొంత వివరిస్తానండి.
మాకు తెలిసిన ఒక కుటుంబంలోని భర్తకు ఇంకో స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. వారి పిల్లలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లి చనిపోవటం వల్ల పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. . ఇందులో పురుషుల తప్పు కూడా ఉంది. భార్యను మోసం చేసిన పురుషులు కూడా మోసగాళ్ళే.
అయితే ఒక స్త్రీ సాటి స్త్రీ జీవితాన్ని పాడుచేయకూడదు కదా ! ఇలాంటి గొడవలతో విడాకులు తీసుకుని చెల్లాచెదురైన మరికొన్ని కుటుంబాలను చూశాను.
ఇవన్నీ నేనేమీ కొత్తగా కల్పించి చెప్పటం లేదండి. వార్తలు చూస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి.
సాటి స్త్రీల నుంచి కష్టాలు పడుతున్న స్త్రీలు చాలా మందే ఉన్నారు. అత్తల వల్ల బాధలు పడుతున్న కోడళ్ళు, కోడళ్ళ వల్ల బాధలు పడుతున్న అత్తలు ఉన్నారు.
నాకు స్త్రీలంటే ఎంతో గౌరవం. అయితే తప్పుగా ప్రవర్తిస్తున్న కొందరు స్త్రీల ప్రవర్తన గురించి మాట్లాడితే అది మొత్తం స్త్రీలందరి పట్లా చెడ్డగా మాట్లాడుతున్నట్లు కొందరు భావిస్తున్నారు.
చక్కటి ప్రవర్తన గల స్త్రీలు ఎందరో ఉన్నారు. వారు అందరూ గౌరవనీయులే.

వనజవనమాలి చెప్పారు...

మౌళి గారు..నా కామెంట్ కి మళ్ళీ వివరణ ఇవ్వాలంటే ఒక పోస్ట్ అవుతుంది. అయినా మరింత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.

1. స్త్రీ జాతి ముపటి కంటే ఎక్కువగా గత కాలంతో పోల్చు కుంటే మరింత ఎక్కువగా పురుషులతో పోటీ పడటం ని కొందరు పురుషులు భరించలేకపోతున్నారు. అక్కసుతో.. అకారణంగా నిందిస్తూ ఉంటారు. స్త్రీలని ఏ విధంగా వ్యాఖ్యానిస్తే వారిని బాధపెట్ట వచ్చునో..వారికి తెలుసు.

2.కాలక్షేపపు కబుర్లులో.. రాజకీయ రంగం,సినిమా రంగం లో మహిళ లని కించపరుస్తూ మాట్లాడటం మొదలై కాస్త ఆదునికంగా అలంకరించుకుని బయటకి వెళ్ళే ఉద్యోగిని లని గురించి కూడా మాట్లాడటం మొదలెడతారు.

3.ఇక ఎవరిపైనా అయినా కన్నేసి వారు వారికి అనుకూలంగా మారకపోతే.. ఆ అక్కసుతో..ఉద్దేశ్యపూర్వకంగా మహిళ ని కించ పరుస్తూ నలుగురిలో వక్రీకరిస్తూ కావాలని దుష్ప్రచారం చేస్తారు.అందువల్ల వాళ్ళు వికృత ఆనందం పొందుతారు. .

4 అలాగే పురుషులు తమ క్రింద పనిచేచేసే మహిళలని (గ్రామీణ ప్రాంతాలలో నేను స్వయంగా చూసాను) అవమానకరంగా మాట్లాడుతూ, జుట్టు పట్టుకుని కొడుతూ..అశ్లీల పదజాలంతో తిడుతూ వారి పై ఆధిపత్యం చెలాయిస్తారు.

ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళే స్త్రీలని మానసికంగా భాదించే వారుగా ఉన్నారు అనడానికి ఎట్టి సందేహం లేదు.

ఇవన్నీ తరతరాలుగా పేరుకుపోయిన పురుష అహంకారం కాదంటారా? చదువులెందుకు? ఉద్యోగాలు ఎందుకు ? పోటీ పడటం ఎందుకు ? ఇవేగా అభ్యంతరాలు.

పురుషులతో పోటీ పడకుండా వానాకాలం చదువులు చదివి జీవితాంతం గానుగెద్దు చాకిరి చేస్తూ పురుషుడు ఏం చేసినా ప్రశ్నించకుండా నాలుగు గోడల మధ్య భరించేడిగా ఉండాలని కోరిక. (ఆ కోరిక అందరికి ఉండకపోవచ్చు.అందరి పురుషులని అలా జమ కట్టడం లేదు కూడా)


స్త్రీలని శీలం విషయం లో అభిశసించి ఉక్కుపాదంతో అణచి వేస్తే వాళ్ళు స్వేచ్చగా చడువుకోగాలరా? ఉద్యోగాలు చేయగలరా? కొందరి భావజాలం అందరికి జాడ్యం లాగా అలుముకుంటే ఆడపిల్లు చడువుకోగాలరా.. ఉద్యోగాలు చేసుకోగలరా?

అలాంటి ఆలోచనలు ప్రమాదకరం కాదంటారా? సోషల్ నెట్వర్కింగ్లో స్త్రీలపై అసభ్య కామెంట్స్ ఒక పార్శం మాత్రమె! సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి.

వాటి గురించి మాట్లాడుకోవాలి. మౌళి గారు.

ఈ వివరణ మీకు నచ్చిందనే భావిస్తాను. అస్పష్టంగా అనిపిస్తే మన్నించండి.

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

అనురాధ గారు.. మీ వ్యాఖ్య నాకు నచ్చకపోవడం కాదండీ! మీరు చెప్పినది నిజం. స్త్రీ పురుషులు ఇరువురి భాగస్వామ్యం లేకుండా జీవిత భాగ స్వామ్యికి మోసం,ద్రోహం లాంటివి జరగవు. స్త్రీ పురుషుల ఇరువురి భాద్యత ఉంది.అలాంటప్పుడు.. పురుషులు పవిత్రులని,స్త్రీలు మాత్రమె నైతిక నిబద్దత కోల్పోయారని ఆరోపించే భావజాలాన్ని నిరశించాలని చెప్పాను.అంతే!

ఇంకా ఇంకా స్త్రీలని చిన్న చూపు చూసే వారిని అసహ్యకరంగా మాటాడే వారి గురించి మాత్రమే ఈ పోస్ట్. ఎందుకు మాట్లాడుతున్నారు..అనే దానికి కారణాలు ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు.(మౌళి గారికి ఇచ్చిన వివరణ లో తప్ప)

దయచేసి మీ కామెంట్ నచ్చలేదని నొచ్చుకోకండి.

Mauli చెప్పారు...

vanaja gaaru,

meeru inkoka post veyyoddu, yenta pedda samaadhaanam ayinaa ikkade vraayadam manchidi. nijaaniki nenu oka pedda vyaakhya vraayadaaniki badulu rendu chinna prasnalu vesaanu.

mee samaadhaanaalu nachchadam, nachchakapovadam ane prasna raakoodadu. anta teliggaa samaadhaanaalu dorikite, inni virudda bahipraayaalu undavu ani meeru ardham chesikonte chaalu.


@స్త్రీలని ఏ విధంగా వ్యాఖ్యానిస్తే వారిని బాధపెట్ట వచ్చునో..వారికి తెలుసు.

appudu streelaki teliyaalsindi enti?


@కాలక్షేపపు కబుర్లులో.. రాజకీయ రంగం,సినిమా రంగం లో మహిళ లని కించపరుస్తూ మాట్లాడటం మొదలై కాస్త ఆదునికంగా అలంకరించుకుని బయటకి వెళ్ళే ఉద్యోగిని లని గురించి కూడా మాట్లాడటం మొదలెడతారు.

valla kaalakshepam sangati tarvaata, ade kaalakshepam ikkada blaagullo koodaa chala mandi mahilalu chestaaru. maga vaaru matlaadinanduvalla nijangaa pramaadam yemi ledu. kaani aa bhaavaalu aadavaallani yenduku nadipinchaali???


@.ఇక ఎవరిపైనా అయినా కన్నేసి వారు వారికి అనుకూలంగా మారకపోతే.. ఆ అక్కసుతో..ఉద్దేశ్యపూర్వకంగా మహిళ ని కించ పరుస్తూ నలుగురిలో వక్రీకరిస్తూ కావాలని దుష్ప్రచారం చేస్తారు.అందువల్ల వాళ్ళు వికృత ఆనందం పొందుతారు. .

meerannadi nijame ayite, modata vaallakaa avakaasam yelaa vastunnadi. inkoka mahila baadhituraaliki saayam cheyyadyu ane nammakam vallaki kalipinchinadi yevaru?


@అలాగే పురుషులు తమ క్రింద పనిచేచేసే మహిళలని (గ్రామీణ ప్రాంతాలలో నేను స్వయంగా చూసాను) అవమానకరంగా మాట్లాడుతూ, జుట్టు పట్టుకుని కొడుతూ..అశ్లీల పదజాలంతో తిడుతూ వారి పై ఆధిపత్యం చెలాయిస్తారు.

inkoka mahila baadhituraaliki saayam cheyyadyu ane nammakam vallaki kalipinchinadi yevaru?


@ఇవన్నీ తరతరాలుగా పేరుకుపోయిన పురుష అహంకారం కాదంటారా?

kaadantaanu, modata streela madhya sarayina avagaahana ledu.deeniki purushulu elaa kaaranam avutaaru?


@పురుషులతో పోటీ పడకుండా వానాకాలం చదువులు చదివి జీవితాంతం గానుగెద్దు చాకిరి చేస్తూ పురుషుడు ఏం చేసినా ప్రశ్నించకుండా నాలుగు గోడల మధ్య భరించేడిగా ఉండాలని కోరిక

vaalla korika yedayite manakenduku???? manaki antu oka korika unte vaallu yem chesinaa anna maata aadu.

ante idedo chinna vishayam ani cheppadam ledu, vaalla bhartalani meeru maarchaalane koodaa kaadu.
ippudu inko padimandi mahilala maddatu undi kaabatte, chalaa mandiki taadepallini samardhinchaalani unnaa jadisi normusukuni unnaaru. duradrushta vasaattu aa padimandi mahilallo okkaru koodaa blaagulaku sambandhinchina vaaru kaadu. blaagulo alaanti vaaru okkaru unnaa paristhiti ikkadi daakaa raadu annadi meeru ardham chesikovaalsina nijam.


@స్త్రీలని శీలం విషయం లో అభిశసించి ఉక్కుపాదంతో అణచి వేస్తే వాళ్ళు స్వేచ్చగా చడువుకోగాలరా? ఉద్యోగాలు చేయగలరా? కొందరి భావజాలం అందరికి జాడ్యం లాగా అలుముకుంటే ఆడపిల్లు చడువుకోగాలరా.. ఉద్యోగాలు చేసుకోగలరా?

ivannee bhrama lu, online lo koodaa purushulaku nachchinatlu gaa undaalani tapinchipovadam streelu prayatninchadam choostaamu.
okallu ananavasaram ledu, streelu mundu aa jaadyaanni vadilinchukoni, prakkavaari ki ardham ayyetlu cheppaali.

@అలాంటి ఆలోచనలు ప్రమాదకరం కాదంటారా? సోషల్ నెట్వర్కింగ్లో స్త్రీలపై అసభ్య కామెంట్స్ ఒక పార్శం మాత్రమె! సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి.

vaariu alaa aalochinche swechcha istunnadi streelE.

samaajam lo unnavannee vaalla maatallo unnaayi :)

inkaa blaagullo unnavanne vaalla maatallo unnaayi, kaani ikkada manam choostunna chaalaa mandilo vaaru okariddaru maatrame..mari charcha vaariddari gurinchi maatrame enduku modalayyindi?

Note: telugu lo vraayananduku manninchaali. inkaa mimmalni vyaktigatam gaa prasnistunnatlu teesikovaddu.

meeru vraasina tapaaki, vyaakhyaata laki meerichche samaadhaanam laki poortigaa tedaa vundi chalaa chotla. meeru gamaninchi undaru. manam kevalam streelam maatrame ane nissahaayata meeto alaanti samaadhaanaalu cheppistu unte, ika anta kashta padi vraasina tapaa nishprayojanam avvagaladu.

వనజవనమాలి చెప్పారు...

మౌళి గారు.. స్త్రీలు చాలా తెలుసుకోవాలి. కొందరి వ్యాఖ్యానాలని పరిగణ లోకి తీసుకోకుండా.. తమకి కావాల్సింది ఏమిటో తెలుసుకుని.. స్త్ర్రీలు అందరు ఎందుకు విమర్శించబడుతున్నారో.. తెలుసుకుంటూ..
తమలో లోపాలు, శక్తిసామర్ధ్యాలు అన్నీ తెలుసుకుంటూ తప్పిదాలు ఉంటె సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను.

ఈ పోస్ట్ ద్వారా నేను వెలిబుచ్చిన ఆకాంక్ష కూడా ఇదే!

మీ వివరణకి ,నిశిత పరిశీలనకి ధన్యవాదములు.