22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నవలా పఠనం

ఈ రోజు బుక్స్ షాపు కి వెళ్లి కొని నవలలు కొని తెచ్చుకున్నాను.

అవన్నీ చదివే వరకు కాస్త ఈ బ్లాగ్ కి ( కొన్ని బ్లాగ్స్ చదవడానికి, నేను  వ్రాయడానికి ) విరామం  ఇవ్వాలి అనుకున్నాను.

ఈ మధ్య పేస్ బుక్ లో కూడా తెగ తారట్లాడుతూ ఉన్నాను. కొద్ది రోజులు మరో ప్రపంచంలో మసిలి రావాలని ఉవ్విళ్ళూరుతూ ..  లీవ్ లెటర్ కి అప్లై చేసినట్లు ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

లీవ్ శాంక్షన్ చేసేసాం వెళ్ళమ్మా ..వెళ్ళు  అనుకుంటారు అని తెలుసు. :)

వెళ్ళే ముందు ఓ ముక్క  చెప్పి పోదామని .  ఆ ముక్క ఏమంటే .. నవల  అంటే ఏమిటి  అని.

చాలా మందికి తెలుసు . అయినా నాకు తెలుసు అని చెప్పి  పోవడం  ఎందుకంటే  ఏక బిగిన పది నవలలు చదవాలని కంకణం కట్టుకున్నాను

నవల అంటే .. ఏమిటి  అసలు నవల అనే ఎందుకు అనాలి ? అన్న ఆసక్తి కలిగి తెలుసుకున్న విషయం ఇది.

నవల అనే పదం "నావెల్ " అనే ఇంగ్లీష్ పదం నుండి పుట్టింది అంట, నూతనత్వం కల్గి ఉన్నది అని అర్ధం.

తెలుగులో మొదటి నవల నరహరి గోపాల కృష్ణమ శెట్టి "శ్రీ రంగరాజ చరిత్ర" అనే నవల రంచించారు. (1872)
తర్వాత కందుకూరి వీరేశ లింగం పంతులు గారు "రాజశేఖర చరిత్ర " అనే నవల రంచించారు. వారు దానిని  "వచన ప్రబంధం " అన్నారు

నవలని తోలి రోజులలో  "ఆఖ్యాయిక , ఉపన్యాసం ,కాదంబరి " అని వ్యవహరించే వారట.

మొట్ట మొదట "నవల " అని నామకరణం చేసిన వారు.. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు.

ఆఖరికి 1896 లో వచన రచనకి నవల అనే పేరు స్థిర పడింది .

మన  తెలుగు నవలలో పేరెన్నిక గల నవల "మాలపల్లి " గొప్ప సంచలనం కల్గించింది అని చెపుతారు. ఆ నవలా రచయిత ఉన్నవ లక్ష్మి నారాయణ . . జీవితాన్ని కథా వస్తువుగా స్వీకరించి కల్పనలతో,ఊహా శక్తి తో .. వ్రాసుకుంటూ పోయే పెద్ద రచనే నవల.

మన  తెలుగు లో  పేరెన్నిక  గల ఒక వంద నవలలు అయినా  చదివి బాగా బాగా ఆకళింపు చేసుకోవాలనే నా ఆశ.

శత వసంత సాహితీ మంజీరాలు పేరిట ఆకాశ వాణి  విజయవాడ కేంద్రం ప్రసారం చేసినప్పుడు  విని అమిత ఆసక్తి  తో  చాలా నవలలు  చదివాను.

మళ్ళీ ఇప్పుడు మొదలెట్టాను   ఈ నవలా పఠనం



అన్నట్లు ఇంకో విషయం ఏమంటే  కడప ఆకాశవాణి  కేంద్రం సత్యం శంకరమంచి "అమరావతి కథలు" ప్రసారం చేస్తుంది .ప్రతి సోమవారం ఉదయం ప్రసారాలలో " క్రాంతి  రేఖలు " అనే   కార్యక్రమం లో .  ఆసక్తి కల్గిన మిత్రులు అక్కడ ట్యూన్ చేసి వినవచ్చు.

నవలా పఠనమ్ లో  మునిగి తేలుతూ అప్పుడప్పుడు తిరిగి చూడాలనిపించే  ఈ అష్టమ వ్యసనం  నన్ను వదలకుంటే  నేను మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవుతానేమో ... చెప్పలేను కూడా .  :)

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


ఏ ప్రపంచమేగినా, ఏ పుస్తక లోకం లో కాలిడినా,
మరువకండీ తెలుగు బ్లాగు భారతి ని !

ఆల్ ది బెష్టు!

(రాసేవాళ్ళు ఎక్కువ చదవ కూడదండీ ! చాలా ఎక్కువ చదవ మాకండేం మరి ! ఆ తరువాయి మీ స్వంత శైలి గాయబ్ అవుతుందని పేరొందిన రచయిత్రి ఉవాచ!)

చీర్స్
జిలేబి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
మీరు తెచ్చుకున్న నవల్స్ అన్నీ చదివేస్తూ మధ్యలో మాకు కూడా వాటి విశేషాలు చెప్పయ్యండి..
నవలా పరిచయం కోసం ఎదురుచూస్తుంటాము..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జిలీబీ గారు.. మీ అమూల్య సలహాకి మనసారా ధన్యవాదములు. రాసే వాళ్ళు చదవడం మొదలెదితే మరి కొందరి రచయితల ప్రభావం పడుతుంది అన్నది నిజమ్. అంతగా మమేకమై చదవను లెండి . లైన్ అండ్ లెంగ్త్ పాటిస్తాను. అయినా తిరిగే కాలు తిట్టే నొరు..ఊరుకొదు అని సామెత. బ్లాగ్ లో ప్రత్యక్షం అవుతానేమో!

అంతా జిలేబీయం మహిమ. చీర్స్. !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు.. నా మనసులో మెదిలే విషయాలు భలే క్యాచ్ చెస్తారు. అలాగె.. అలాగే!! థాంక్ యు సో మచ్!