16, జూన్ 2013, ఆదివారం

ఎవరూ...చెప్పరు !

స్త్రీలు మాత్రమే సున్నిత మనస్కులా? పురుషుడి ప్రేమ దక్కకపోతే ఆత్మహత్య చేసుకునే పిరికి వాళ్ళా ?

 కాలం ఏదైనా .. ఎన్ని విద్యలు నేర్చినా  స్త్రీల  యొక్క బలహీన స్వభావం బట్టబయలు అవుతూనే ఉంది వాళ్ళు కోల్పోయిన జీవితం, మోసపూరితమైన మాటలవల్ల,వ్యక్తీ గత బలహీనల వల్ల,ఆశించిన జీవితం లభించక పోవడం వల్ల  ప్రేమ రాహిత్యం తో బాధపడుతూ .. ఆత్మా హత్యలు చేసుకుంటున్నాం అని చెప్పి మరీ చేస్తున్నారు

జియా ఖాన్ మరణం  మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది రక రకాల కథనాలు ఆఖరిన ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం  చదివి  భాదపడని వారు అంటూ ఎవరూ ఉండరేమో ! స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ నిరూపించింది అంటున్నారు కొందరు.

 సెలబ్రిటీల సంగతి ప్రక్కన పెట్టి  మన చుట్టూరా  చూసినా  అవే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

చాలా మందికి ప్రేమ అనేది ఒక ఆట అయిపొయింది. ఒక దశకి చేరుకునేవరకే వారి కబుర్లు,  తర్వాత నిజస్వరూపాలు బయటపడటం  చంపడం  లేదా చావడం ఇవే కనబడుతున్నాయి

కీర్తి కండూతి కోసం ప్రాకులాడేది కొందరైతే, అవకాశాల కోసం అమ్ముడు పోయేవాళ్ళు కొందరు . ఎక్కడ చూసినా డబ్బు  డబ్బు . డబ్బు కి ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోయింది  నమ్మక ద్రోహం ఎక్కువైపోయింది. ప్రేమించిన వారిని సరిగా అంచనా వేయలేక సర్వం కోల్పోయి మనసు విప్పి చెప్పుకునే వాళ్ళు లేక , ఉన్నా వారికి చెప్పుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు.

స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ మాత్రమే కాదు చాలా మంది పురుషులు బలహీన మనస్కులే అని  నేను కొన్ని విషయాలు విని, చూసి రూడీ చేసుకున్నాను

కొన్నాళ్ళ క్రితమే ఒక యువకుడు అతి సన్నిహితంగా మెలిగే తన గర్ల్ ఫ్రెండ్ తనని అర్ధం చేసుకోవడం లేదని విలాసాల కోసం తనని విపరీతంగా వాడుకుని తన దగ్గర డబ్బులేక అప్పులు పాలై ఉన్నప్పుడు తన మొహం వంక కూడా చూడకుండా, కనీసం పోన్ లో కూడా దొరక్కుండా ,ముఖా ముఖి  కలసినప్పుడు  చీత్కరించుకుందని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు . స్త్రీలు మాత్రమే  కాదు పురుషులు కూడా బలహీన మనస్కులే ! అని

నిన్నటికి నిన్న ఒక మంచి విషయం విన్నాను . మా సమీపంలో ఉన్న వివాహ వేదిక పై ఒక వివాహం జరగవలసి ఉంది.క్రైస్థవ మతాచారం ప్రకారం పెళ్లి జరగవలసిన కొద్ది నిమిషాల ముందు ఆ పెళ్లిని ..ఒక యువతి వచ్చి అడ్డుకుంది. ఆమెని ప్రేమించి మోసం చేసి ఆమెకి తెలియకుండా వేరొకరిని వివాహం చేసుకోబోతున్న యువకుడిని బందుమిత్రుల సమక్షంలోనే నిలదీసి ఆ పెళ్లిని అడ్డుకుంది

మళ్ళీ ఆమె ప్రేమించిన యువకుడితో ఆమెకి వివాహం అవుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. కనీసం తనకి అన్యాయం జరిగిందని తెలుసుకున్నప్పుడు ప్రశ్నించడం కూడా చేయకుండా మౌనంగా భరించి తర్వాత వేదన చెంది,చీత్కరించుకుని, మరి కొన్నాళ్ళకి  జరిగిన దాన్ని మర్చి పోయి,మర్చిపోలేకపోతే బాధ పడి ఆత్మ హత్య చేసుకోవడం అలవాటైపోతుంది .

ఇంత పిరికితనం ని  మోస్తూ మా ఖర్మ అని సరిపెట్టుకునే వాళ్ళని చూసి జాలి పడాలనుకుంటాను నేను.
ఇప్పటి కాలంలో కన్నా ఇంతకూ ముందు తరాలలో వారు స్త్రీలు చాలా దైర్యంగా ఉండేవారు . చెట్టంత మగాడు పోయినా, వదిలేసి పోయినా   ఒంటరి స్త్రీలు పిల్లలని పెట్టుకుని దైర్యంగా  బ్రతికేవారు. జీవితం జీవించడం కోసమే అన్నట్టు ఇంటింటా బాల్య వితంతువులు గుండ్రాయి లాగా బ్రతికేవారు తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం తక్కువని  వింటూ ఉంటాం

అసలు బ్రతకడానికంటే  చావడానికంటే ఎక్కువ దైర్యం కావాలి కూడా!  బ్రితికేవాడు నిత్యం చస్తూ ఉంటాడు

మనదేశం లో ఐ ఐ టి లలో ప్రవేశం కోసం జరిగే అర్హత పరీక్షల ఫలితాలని ఇంకా ఇతర ఫలితాల ని సునిశితంగా పరిశీ లించి  చూస్తే   ప్రధమ స్థానాలలో అత్యుత్తమ రాంక్లు   సాధించిన వాళ్ళలో .. మగ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎంత బాగా చదివినా పరీక్ష సమయంలో ఆడపిల్లలు   విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు వారు మగపిల్లలతో పోటీ పడలేరు అందుకనే మేము ఆడపిల్లలు  అత్యుత్తమ రాంక్లు తెచ్చుకుంటారని  ఆశించం అని ఒక కార్పోరేట్ విద్యాసంస్థల డైరెక్టర్  అన్నారు.

స్త్రీలలో మానసిక వత్తిడి ని అధిగమించడం, ఆశాభంగం కలగితే  పాజిటివ్ గా తీసుకోగల్గడం  సమర్ధవంతంగా  ఎదుర్కోవడం లాంటి విషయాలలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది .అందరు ఒకేలా ఉండరు ఒకేలా ప్రతిస్పందించరు   వ్యక్తికీ వ్యక్తికీ సామర్ధ్యం విషయంలో తేడా ఎలాగు ఉండనే ఉంటుంది . కానీ జీవితం మాత్రం  అందరికి ఒకటే !   జీవించడం అందరికి ఒకటే! ఆర్టిస్టిక్ గా జీవించగలగడం గొప్ప కళ .. ఆ కళ ని అందరూ నేర్చుకోవాలి. వ్యాధులు,బాధలు ,ఆశాభంగాలు అందరికి ఉండేవే! అవి ఉన్నాయని చచ్చిపోతే ఈ అసుపత్రులు అన్నీ ఏమైపోవాలి ,  సుఖం ఒకటే ఉంటే  బోర్ కొట్టి చచ్చి పోవాలనిపిస్తుంది. ఆశాభంగాలు లేకపోతే ...   సరదాగా చందమామని చేతి వేలుపై నిలబెడదామా.. అని పాటలు ఎవరు పాడుకుంటారు చెప్పండి ?

జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా ..
ఉండటం .. అవసరం కదా ! ..
ఇదే  సత్యం ..శివం.. సుందరం  

అని ఎవరూ చెప్పరు .. ఎవరికీ వారే నేర్చుకోవాలి . . 



22 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒక మంచి టపా రాసారు. బలహీన మనస్కులు మగవారిలోనూ, ఆడవారిలోనూ వున్నారు కానీ మగవారు బయటపడి కొత్త జీవితాన్ని వెంఠనే ప్రారంభించగలుగుతున్నారు. ఆడవారూ బాధపడీ, బాధపడీ ఆ తరువాత బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు... struggling to live life with "life".

rajasekhar Dasari చెప్పారు...

స్త్రీ అయినా పురుషుడు అయినా మొదట మనము మనుష్యులము . మానవులుగా ప్రతీ ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి . ఆత్మహత్య అనేది ఇక నాకు భవిష్యత్ లేదు అనే ఊహతో జరిగే తాత్కాలిక ఆవేశం . ఆ క్షణికొద్రేక సమయములో ఎవరైనా మాట సహాయము చేయగలిగితే అతను బ్రతుకుతాడు /ఆమె బ్రతుకుతుంది .

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాశారు. ఆత్మహత్య ఘోరం. డబ్బు కోసం ఆడ, మగ యువత ప్రేమ అని వేస్తున్న చిల్లర వేషాలు చూసి అసహ్యం వేస్తోంది.

పల్లా కొండల రావు చెప్పారు...

good one.

అంతా పోయినా భవిషత్తు మిగిలే ఉంటుంది. స్త్రీయా? పురుషుడా? అని కాకుండా పెరిగిన పరిస్తితులు - సమాజ పరిస్తితులను బట్టి ఆత్మ స్థైర్యం అలవడుతుంది. గతంలో ఉన్న మానవ సంబంధాలిప్పుడు లేవు కనుక గతంలోలా మొండిగా(?) బ్రతకలేక పోతున్నారనేది నిజం.

బ్రతకడం వేరు - జీవించడం వేరు. జీవితమంటేనే పోరాటం. ఆ పోరాటం కష్టాలతోనే కానక్కర్లేదు. మరింత మెరుగైన విషయాలకొసం ఈ ప్రకృతిని వాడుకోవడానికి - మరింత మెరుగ్గా ఈ ప్రకృతిని కాపాడడానికి - మరింత మెరుగ్గా మానవ సంబంధాలను మెరుగుపరచడానికీ జీవితం సార్ధకంగా చేసుకోవాలి.

కష్టం వచ్చినప్పుడు చెప్పుకునే 'ఆత్మీయత' - కస్టంలో ఉన్నవారికి 'నేనున్నాను' అనే భరోసానివ్వగలిగే వ్యక్తిత్వాలు ఈ సమాజం లో పెరిగినప్పుడు, ఈ సమాజమే ఆ విధమైన సంస్కృతిలోకి మారినప్పుడు ఈ ఆత్మహత్యలు ఉండవు.

ఆత్మహత్యని 'నేరం' అనడం కంటే 'ఘోరం' అనడం కరెక్టని నా అభిప్రాయం. ఆత్మహత్యల పట్ల జాలిపడడం కంటే ఆ పరిస్తితులున్న సమాజం లో మార్పుకోసం పోరాడడమే చేయాల్సిందని నా అభిప్రాయం.

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి పోస్ట్. జీవితాన్ని ఎదిరించలేక చనిపోవాలనుకునే పిరికివాళ్ళకి కునువిప్పు కలిగించేలా వుంది. ఎవరైనా కానీ బ్రతికి సాధించాలి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాలా బాగా వ్రాసారు. ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.

ranivani చెప్పారు...

చాలా బాగా వ్రాసారండీ!ఆఖరి పేరా, మొక్కతో పోల్చి చూపడం నాకు బాగా నచ్చింది .

చెప్పాలంటే...... చెప్పారు...

విశ్లేషనాత్మకంగా వుంది మీ టపా ఆలోచనాత్మకంగా ఉంది. చాలా చక్కని టపా వనజ గారు

అజ్ఞాత చెప్పారు...

నాకు చిత్రంగా అనిపిస్తోంది, కానీ తప్పదు ఇలా కూడా రాయాల్సి వస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటున్నానంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ జాతి వాల్లంతా బలహీనులు అని కొంత మంది అన్నారు. దానికి ప్రతిగా మీరు ఇలా రాయక తప్పింది కాదు. ఆత్మహత్యలు అనేవి చాలా మంది చాలా కారణాలతో చేసుకుంటున్నారు. ఓవరాల్ గా పరిశిలిస్తే, స్త్రీలకన్నా పురుషులే ఎక్కువ (దాదాపుగా రెట్టింపు) ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంత మాత్రం చేత అందరూ బలహీనులు అనుకోవడం నాకెందుకో నచ్చడం లేదు. ఎందుకంటే, అలా ఆత్మహత్యలు చేసుకోకుండా నిల దొక్కుకొని, జీవితాన్ని తీర్చి దిద్దుకున్న వారిలో స్త్రీలూ ఉన్నారు, పురుషులూ ఉన్నారు. వారిని చూపించి ఇరువురూ స్ట్రాంగే అనుకోవచ్చు కదా? ఎందుకు మనం నెగిటివ్ సైడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది? స్త్రీ మానసికంగా బలవంతురాలు, పురుషుడితో పోలిస్తే అనే మాట చాలా చోట్ల విన్నాను. సో-కాల్డ్ శాస్త్రీయ పరిశోధనలతో సహా. ఈ అంశాన్ని అందరూ పదే పదే గ్లోరిఫై చేయడం జరిగింది. స్త్రీని పొగడాలంటే అందరూ వాడే మాట... శారీకంగా బలహీనురాలే అయినప్పటీ మానసికంగా చాలా బలమైనది అని. ఇప్పటి వరకూ అన్ని రకాల సాహిత్యాలలో నేను ఈ వ్యాక్యాన్నే ఎక్కువ చదివాను. బహుషా కొంత మంది దానికి ప్రతిగా జియా ఖాన్ ఆత్మహత్యను చూపి స్త్రీలు బలహీనురాల్లు అని నిరూపించదలిచారేమో. ఇలా ఒకరి మీద ఒకరం దాడులు చేసుకుంటున్నామేమో అని నాకనిపిస్తోంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ గారు మీ స్పనందనకి ధన్యవాదములు
బలహీన మనస్కులు స్త్రీ-పురుషులిరువురిలోను ఉన్నారు. ఎవరు ఎక్కువ ఉన్నారు అని చెప్పదమ్ కాదు ఈ పొస్ట్ ఉద్దేశ్యం .. డిప్రెషన్ లోకి జారి పోయి ఆత్మహత్యా ప్రయత్నం వైపుకు మళ్ళకుండా జీవితాన్ని సాధించుకోవాలి అని చెప్పడమే ఈ పొస్ట్ .థాంక్యూ సో మచ్!

Unknown చెప్పారు...

మంచి ఆలోచింపదగ్గ పోస్ట్.
ప్రకృతి సహజంగా అన్ని జీవ రాశులలోనూ మగ జీవి శారీరకంగా బలిష్టమైనదే. మనసుపరంగా మగా ఆడా ఇద్దరూ ఒకటే. మగవాళ్ళచేతిలో మోసపోయిన ఆడవాళ్ళాలానే ఆడవాళ్ళ చేతుల్లో మోసపోయిన మగవారూ ఉన్నారీ లోకంలో. చావలేక బ్రతికో, బ్రతకలేక చావో, ఏదైనా మనసుకి మాత్రం బేధం లేదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజశేఖర్ గారు మీ మాట నిజం. క్షణ కాలం ఆత్మహత్య చేసుకోవడం ని వాయిదా వేసుకోగల్గితే జీవితమే మారవచ్చు అన్నది నిజం . థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ .. మీరు అన్నది నిజం . వ్యాఖ్యకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొందలరావు పల్లా గారు మీ విలువైన వ్యాఖ్యకి ధన్యవాదములు

మీ మాటలతో ఏకీభవిస్తున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారు నమస్తే! బావున్నారా..సర్ ?

మీ వ్యాఖ్యకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగరాణి ఎర్రా గారు ..మీ ప్రశంసకి ధన్యవాదములు. ఆ మొక్క ఎంత మొండిదో కదండి. అందుకే అలా.. థాంక్యూ సో మచ్!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీకాంత్ గారు చాలా చాలా కాలం తర్వాత నా పొస్ట్ పై మీ అభిప్రాయానికి ధన్యవాదములు. మీరు చెప్పినది ౧౦౦% నిజం మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. మీరు ఏ అభిప్రాయమ్ వ్యక్తం చెప్పారో..నెను ఆ విషయాన్నే చెప్పడానికి ప్రయట్నించాను థాంక్యూ సో మచ్.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, నాకీ టపా చాలా నచ్చింది. "స్త్రీలలో మానసిక వత్తిడి ని అధిగమించడం, ఆశాభంగం కలగితే పాజిటివ్ గా తీసుకోగల్గడం సమర్ధవంతంగా ఎదుర్కోవడం లాంటి విషయాలలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది" అక్షరాలా నిజం. వనజ గారు, నాకీ టపా చాలా నచ్చింది. "స్త్రీలలో మానసిక వత్తిడి ని అధిగమించడం, ఆశాభంగం కలగితే పాజిటివ్ గా తీసుకోగల్గడం సమర్ధవంతంగా ఎదుర్కోవడం లాంటి విషయాలలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది" అక్షరాలా నిజం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని ఆస గారు .. మీ వ్యాఖ్య ఆలొచింపజేసింది.
మీరన్నది నిజం. బాధని అనుభవించదం లొ స్రీ-పురుష బేధం లేదు. మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల "శ్రీ" గారు ఈ పోస్ట్ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు. ఎలా ఉన్నారు? మీరు అసలు ఏమి వ్రాయడం లేదు.అలవాటు గా కళ్ళు వెతుకుతున్నాయి.:)