17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శిక్షా ఓ హెచ్చరిక

ఉరిశిక్షలు అత్యాచారాలని నిలుపు చేస్తాయా..?  ఇంకా జరుగుతూనే ఉన్నాయి .  అంటూ క్రొత్తగా కొందరు ఉరి శిక్షల్ని వ్యతిరేకిస్తూ ..నిరసన తెలియజేస్తున్నారు. డిల్లీ లో జరిగిన రేప్ నిందితులకి  శిక్ష అమలుపరచడాన్ని నేను హర్షిస్తాను . ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చేయాలంటే  అందుకు మనం ఏంచేయాలి ..  అందరికి భాద్యత ఉంది కదా .. !.

అత్యాచారాల భారతం .. లో ఎవరి తప్పు ఎంత ? సినిమాలు,మీడియా or అతి తేలికగా లభిస్తున్న దృశ్య మాధ్యమ అశ్లీల చిత్రాలు

వీటి నిరోధం కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ? సామాన్యుడికి అనేక సందేహాలు. సామాజిక అవగాహన పేరిట మీడియా అత్యాచారాల నిరోదానికి దోహదం చేస్తుందా ? ఇంకా ప్రేరేపిస్తుందా?

ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని పంచుకోండి ..

అలాగే నా బ్లాగ్ లో అదివరకు పోస్ట్ చేసిన  ఈ పోస్ట్ చూడండి .


http://vanajavanamali.blogspot.in/2011/06/blog-post_17.html





నేరం ఎవరు చేసినా శిక్షించడంలో జాలి,సానుభూతి ఉండకూడదు . క్షమించడం అంత తేలిక కాదు . నేర నిరోదానికి  శిక్షా   ఓ  హెచ్చరిక కూడా ..  

12 కామెంట్‌లు:

Bhardwaj Velamakanni చెప్పారు...

హత్యానేరానికి శిక్షను కఠినతరం చెయ్యకుండా అత్యాచారానికి ఉరిశిక్షవేస్తే ఏమవుతుందో తెలిసిందేగా?

1. అత్యాచారం చేసి వదిలేస్తే ఉరి
2. అత్యాచారం చేసి చంపేస్తే 14 సంవత్సరాల జైలు .. (Or even less if the behavior in jail is good)

పై రెండిటిలో నెరస్తుడు మొగ్గు చూపేది దేనికి?

నష్టం ఎవరికి?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భరద్వాజ్ గారు నేరస్తుడు రెండవదానికే మొగ్గు చూపుతాడు .అందులో సందేహమే లేదు . కానీ అన్ని చోట్లా అత్యాచారం చేసి చంపడంలేడుగా ..

నిజానికి రెండు నేరాలకి ఉరి శిక్ష సరియినది అవ్వాలి. ప్రాణ భయం అయినా మాన భయం అయినా అతివకి తీరని అన్యాయమే కదా !

మీ స్పందనకి ధన్యవాదములు .

అజ్ఞాత చెప్పారు...

No other option. They must be hanged.

అజ్ఞాత చెప్పారు...

మన దేశం లో ఉన్నన్ని చట్టాలు అందులో లొసుగులు మరే దేశం లోనూ ఉండవండి. చట్టం అమలు జరిగి నేరస్థుడికి శిక్ష పడే కాలానికి ఎవరికి ఇది గుర్తూ ఉండదు. ఆతరవాత ఏం జరుతుందో మనకు సజీవ సాక్షాలూ ఉన్నాయి.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఉరి అనాగరికమని నేనూ భావిస్తాను. కానీ ఇక్కడ నేరస్థులు చేసిన నేరం అత్యంగ కృరమైనది. కొందరు ఏమని వాదిస్తున్నారంటే ఆ నేరస్థులు ఎంతో పేదరికం నుంచి, అత్యంత దారుణమైన జీవన నేపధ్యాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ సామాజిక నేపధ్యాల దృష్ట్యా, జాలి తలిచి వదిలేయాలని వాదిస్తున్నారు. ఇది ఎంత వింతగా తోస్తోందో నాకు.

సామాజిక రుగ్మతలు సమాజంలో ప్రతి చోటా ఉంటాయి.ఇలా వాదించే వారు ఆ రుగ్మతలను రూపు మాపే దిశగానో, వారితో కాసేపు కూచుని మాట్లాడే దిశగానో పని చేస్తారా అంటే.. అహ.. ఎక్కడా? సోషల్ నెట్ వర్కుల్లో ఉపన్యాసాలకే టైము సరి పోదాయె

ఎంతటి ఘోరమైన పరిస్థితుల నుంచి వచ్చిన వారికైనా శారీరకంగా తనను హింసిస్తే ఎంత బాధ కల్గుతుందో అవతలి వారికీ అంతే బాధ కలుగుతుందన్న కామన్ సెన్స్ ఉండదా?

మర్మాంగంలో చేతులు, ఇనప రాడ్లు పెట్టి పేగులు చితికి పోయేలా హింసించడం, కాళ్ళు చేతులు విరిచేయడం, మనుషులు చేసే పనా? నిజమే... మనుషులు చేసే పనే లెండి

కౄర మృగాలైతే ప్రమాదం వస్తేనో ఆహారం కోసమో తప్ప దాడి చేయవు. వీళ్ళను మృగాలతో కూడా పోల్చకూడదు.


సమాజంలో రుగ్మతలకు మందు వేయాలి సరే! మరీ పూర్తిగా బాగు చేయలేని విధంగా కుళ్ళి పోతే? శస్త్ర చికిత్స చేసి ఆ భాగాన్ని తీసి పారేయాలి..

వాళ్ళు నేరం చేసిన తీరు చూస్తే వాళ్ళను పధ్నాలుగేళ్ళు కాదు 140 ఏళ్ళు జైల్లో ఉన్నా పశ్చాత్తాప పడరు.

అమెరికాలో అయితే నేర తీవ్రతను బట్టి 200 ఏళ్ళు, 300 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు. అంటే అన్నేళ్ళు వాళ్ళు బతుకుతారా లేదా అని కాక నేర తీవ్రతను ఆ శిక్ష ప్రతిఫలిస్తుంది. ఇక జీవితాంతం జైల్లోనే వాళ్ళు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఏమిటో మాస్టారూ .. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది మన ఈ పయనాలు ఎక్కడికో అర్ధం కాకుండా ఉన్నాయి.
ప్రతి ఇల్లు సంస్కారవంత మైన బడి కావాలి . ఇలా అనుకోవడం తేలికే! కానీ ఆచరణ ఎంతో కష్టం .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుజాత గారు మీ స్పందన బావుంది .నిజంగా రెండు వందలు ఏళ్ళు శిక్ష కూడా తక్కువే! అంత కసి ఉండాలి . థాంక్ యూ సో మచ్.

శ్యామలీయం చెప్పారు...

శ్రీవెలమకన్ని భరద్వాజ్‌గారి అభిప్రాయం‌ ప్రకారం
1. అత్యాచారం చేసి వదిలేస్తే ఉరి
2. అత్యాచారం చేసి చంపేస్తే 14 సంవత్సరాల జైలు .
కాని ఇది సరి కాదు.

అత్యాచారం చేసినా ఉరిశిక్ష రూఢికాదు. అత్యాచారం+హత్య ఐనా ఉరిశిక్ష రూఢికాదు. మన దేశం చట్టం ప్రకారం ఉరిశిక్ష అనేదానికి అవకాశం ఉన్న సందర్భాల్లో మాత్రమే మరియు నేరం జరిగిన తీరు అత్యంత అరుదైన విధంగా ఉంటే మాత్రమే ఉరిశిక్ష పడుతుంది.

అలాగే‌ భరద్వాజ్‌గారు భవిస్తున్నట్లు యావజ్జీవకారాగారవాసశిక్ష అంటే 14 ఏళ్ళకు పరిమితమైన కారాగారవాసశిక్ష కాదని సుప్రీంకోర్టు వారు నిష్కర్ష చేసారు. అలా 14 ఏళ్ళన్నది అపోహ మాత్రమే. యవజ్జీవం అటే అక్షరాలా యావజ్జీవమే.

ఐతే సత్ప్రవర్తన మిషమీద దారుణ నేరాలు చేసినవారిని వదిలేసే పొరపాటు సంప్రదాయానికి రాజకీయులే కారణం. నిజంగా.

నాగరాజ్ చెప్పారు...

నిజంగా మీరు చాలా మంచి ఇష్యూని, అందరి హృదయాల్ని కలచివేస్తున్న అంశాన్ని చర్చకు పెట్టారు. థాంక్యూ. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి: కఠిన శిక్షలు విధించడం. రెండోది: ఈ అత్యాచారాలకు కారణమవుతున్న కారణాలను తొలగించడం.

మొదటిది: అత్యాచారాలకు పాల్పడిన వాళ్లు ఎంతటివారైనా సరే వారికి కఠిన శిక్షలు తప్పక విధించాల్సిందే. ఇలాంటి శిక్షలు ఉంటేనే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లు కాస్తైనా భయపడతారు. లేదంటే, ఏం చేసినా, ఏమీ అవదులే అనే ధోరణితో సమాజంలో ఇలాంటి కిరాతకాలు మరింత పెరుగుతాయి. చాలాకాలంగా మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గడచిన ఆరు దశాబ్దాలలో కోర్టుల్లో జాప్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం లాంటి వాటి వల్ల లక్షల కేసులు పెండింగులో ఉండగా, ఎందరో అనేక నేరాలకు పాల్పడి కూడా ఎలాంటి శిక్షలు పడకుండానే యధేచ్చగా బయట తిరుగుతున్నవారు, అలాంటి నేర చరితులే మన ఖర్మకొద్దీ ఎన్నికల్లో కూడా గెలిచి మనల్నే పరిపాలించే హోదాలో కూడా ఎందరో ఘనులున్నారన్నది మీడియా రిపోర్ట్స్. నరేంద్ర మోడీ కేబినెట్ లో కూడా సగానికిపైగా సభ్యులపై అత్యాచార కేసులు నమోదై ఉన్నాయని ఆ మధ్య చాలా వార్తలొచ్చాయంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా.. ఏ అన్యాయానికి, ఆకృత్యానికి పాల్పడ్డా, మనదగ్గర చట్టాల్ని, కోర్టుల్ని కూడా మేనేజ్ చేసి బయటకొచ్చేయొచ్చన్న దాకా వచ్చింది పరిస్థితి. ఎంత దారుణమైన విషయమిది. సో, అలాంటి దుస్థితి నుండి బయటపడాలన్నా, ఏదైనా నేరం చేయాలనుకునేవాడు భయపడాలన్నా కఠిన శిక్షలు తప్పనిసరి. అలాగే, ఇలాంటి అత్యాచారాలపై కూడా అడ్డదిడ్డంగా, అమానవీయంగా కామెంట్ చేసే రాజకీయ నాయకుల్ని, ఆశారాం బాపూ లాంటి మృగాల్ని, వాళ్ల తరపున పిచ్చిగా వాదించే లాయర్లు రాం జెఠ్మలాని లాంటి పశువుల్ని కూడా ఉరి తీసేలా చట్ట సవరణలు జరిగితే మరింత బెటర్.

రెండోది: ప్రధానంగా ఈ అత్యాచారాలకు కారణాలు... a. సినిమా, మీడియాలో పెరుగుతున్న అశ్లీలత, అసభ్యత, హింస b. లిక్కర్, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా లభించడం c. ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ.
ఈ మూడింటిలో కూడా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుంది. సెన్సార్ బోర్డులెప్పుడో నిర్వీర్యమైపోయాయి. ప్రాపర్ చెక్ లేదు, పాడూ లేదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో 90 శాతం అశ్లీలత, హింస మాత్రమే ఉంటున్నాయి. ఇక ప్రభుత్వమే వేలం వేసి మరీ లిక్కర్ సరఫరా చేస్తోంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలే మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారట. ఇక తాజాగా ఇంటర్నెట్ పోర్నోగ్రఫీకి చిన్న పిల్లలు కూడా అఫెక్ట్ అవుతున్నారు. పోర్నోగ్రఫీకి గేట్ వేస్ దగ్గరే చెక్ పెట్టొచ్చు కదా అని సుప్రీంకోర్టు అడిగితే అది చాలాకష్టం (చాలా దేశాలు ఇప్పటికే నిషేదించాయి) అని చెప్పారట మన కేంద్రప్రభుత్వ దరిద్రులు. అశ్లీల సినిమాలు, లిక్కర్, మాదక ద్రవ్యాలు, పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా యువతీయువకుల్లో నీతి నైతిక విలువల్ని పతనం చేసి బీస్ట్లీ ఇంస్టింక్ట్స్ ను రెచ్చగొట్టేవే. మన పాలకులకు మాత్రం వాటి వ్యాపారాలు మాత్రమే కావాలి, సామాన్య మనుషులు, మానవత్వం మంటగలిసి పోయినా సరే.

అందుకే ముందుగా అత్యాచారాలకు కారణమయ్యే వాతావరణాన్ని ముందుగా తొలగించాలి, ఆ తర్వాత ఒకవేళ అప్పటికీ అలాంటి కేసులు నమోదైతే తప్పనిసరిగా కఠిన శిక్షలు కూడా ఉండి తీరాలి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగరాజ్ గారు ..మీరు అత్యంత శ్రద్ధతో మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా అందించారు . మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను . నేను ఈ పోస్ట్ లో షేర్ చేసిన పోస్ట్ నేను చాలా కాలం క్రితం వ్రాసినది. అందరూ చదివేసినదే! నేను ఒకటి అనుకుంటాను . ఏదైనా మంచి సంస్కారం ఇంటి నుండే మొదలవాలి.అందుకే నియంత్రణ మన ఇంటి నుండే అవసరం. అలాగే బాహ్య ప్రపంచం నుండి ఎదురయ్యే అనేక విషయాల నుండి దృష్టిని మరల్చడం కష్టం కాబట్టి వాటి పై నియంత్రణ చాలా అవసరం అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం కావాలి. అలాంటి అవగాహన్ కోసం ప్రయన్తించాలి కాబట్టి ఈ పోస్ట్ .

మీరు అందించిన వ్యాఖ్యని నేను facebook లో షేర్ చేసాను . ఎక్కువ మందిని ఆలోచింపజేసే ఉద్దేశ్యంలో భాగం ఇది . మీ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు మీ వివరణకి మరీ మరీ ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Anu గారు .. థాంక్ యూ !