6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

"మంజీరమైనాను నీ పాటలో.."మంజీరమైనాను నీ పాటలో..

మందారమైనాను..నీ తోటలో.."చరణం వినిపిస్తుంది

మగత నిద్రలో మరో లోకంలో సంచరిస్తున్న మాధవ్ .. ఉలికిపడి మేలుకున్నాడు. ఎక్కడనుండో వినవస్తున్న పాటని వినడానికి హృదయం రిక్కించి మరీ వెతుక్కుంటున్నాడు. పాట అయిపొయింది కానీ ఎక్కడ నుండి పాట  విన వస్తుందో తెలియ రాలేదు ..

ఇంటి  చుట్టూ వెలిసిన భవన సముదాయాలలో నుండి ఆ పాట విన వచ్చిందని అర్ధమయింది అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ పాట వినే వారి ఆచూకి కనుక్కోవడం చాలా కష్టమని తెలుసు . తల త్రిప్పి ప్రక్కనే నిద్రిస్తున్న భార్యని చూసాడు. పగలంతా పనులతో అలసిపోయి ఉందేమో ఆదమరచి నిద్ర పోతున్న ఆమెకేసి చూస్తే  వాత్సల్యం.. కల్గింది . ప్రేమగా ఆమె తలపై చేయి వేసి మృదువుగా నిమిరాడు . ఆ సున్నితమైన స్పర్శకే ఆమె కదిలింది నిద్రలోనే మాధవ్ చేతిని తీసుకుని చెంపకి భుజానికి మధ్య ఆనించుకుని మాధవ్ పడుకున్న వైపుకి తిరిగి పడుకుంది .. స్పర్శ  ఇచ్చిన నిశ్చింత, ప్రేమ ఇచ్చిన భద్రత ప్రపంచంలో ఏది కూడా ఇవ్వలేదేమో.. !  తన చేయి విడవకుండా పట్టుకున్న  ఆమెనే చూస్తూ పడుకుని  ఆ గదిలోనుండి బయటకి రాలేని మాధవ్ మదిలో కొద్ది సేపటి క్రింద విన్న పాటే మెదులుతుంది .

ఒక మది గాయం గేయమై ఆవేదనతో.. ఆలపించే వేళ..
ఆ "వేదన " వినడం కూడా.. మధురమైన వేదనే!
ఒకోసారి తనది కాని వేదన కూడా తనదిగా అనుభవిస్తూ ఉంటాడతను .
ఆ పాట విని విని ఆ పాటకి  వీరాభిభిమాని అయిన మాధవ్ ఆ పాట  విన్న ప్రతి సారి  గాడమైన వేదనని రోజుల తరబడి..అనుభవిస్తూ..అందులో లీనమైపోతాడు.
ఒక రకమైన మౌనం ఆవహించి ఎవరు పలకరించినా అయోమయమైన స్థితిలో సమాధానాలు ఇస్తూ ఉండటం జరుగుతుంటుంది .

అవన్నీ గుర్తించే  సునిశిత దృష్టి , తీరిక  కూడా లేని సత్య .. మాధవ్ మౌనం కి ఆర్ధిక ఇబ్బందులు వల్ల కాబోలు పాపం  ఎప్పుడూ ఆయన అలా  ఆలోచిస్తూ ఉంటారనుకుంటుంది .

తనలో వేదనని తానూ తప్ప మరొకరికి పంచడం ఇష్టం లేని మాధవ్  కొంత నిర్లిప్తత తో ఉంటాడు కాని, తన భాద్యతని ఏ మాత్రం మర్చిపోడు, అసలు నిర్లక్ష్యం చేయడు. భార్యని, పిల్లలని అపురూపంగా చూసుకుంటూనే ఉంటాడు . కళ్ళు మూసుకుని తన గురించి తానే విశ్లేషించుకుంటున్న మాధవ్ కనుల నుండి ఒక కన్నీటి చుక్క బయటకి వద్దామా వద్దా అన్నట్టు ఆగిపోయింది .

అంతలోనే మళ్ళీ ఇందాక విన్న పాటే గాలి అలలతో మోసుకొస్తుంది ... ఈ పాటని ఎవరో తనకిలాగానే ఇష్టపడేవారైతేనే  పదే  పదే రీ ప్లే చేసుకుని వింటారనుకోగానే చప్పున మంచం పై నుండి లేచి కూర్చున్నాడు. భార్య నుండి చేయి విడిపించుకుని కిటికీ వద్దకి వచ్చి నిలబడ్డాడు . దోమతెరలు అమర్చి ఉండటం వల్ల కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి  కిటికిలో నుండి బయటకి చూసాడు తమ ఇంటి ఖాళీ  స్థలం కి ఆన్చి కట్టబడిన అయిదంతస్తుల భవనం లో నుండి ఆ పాట వినబడుతుందని గుర్తించాడు . అలాగే ఆ పాట వింటూ నిలబడి పోయాడు.

 మౌన స్వరాల ఈ పంజరాన   కలిసాను కడలేని స్వప్నాలలో ,విధినటనాలలో, ఋతుపవనాలలోఎన్నాళ్ళుఈవేదన .. ? ఎన్నాళ్ళువేదన?

మాధవ్ తనని తానూ ప్రశించుకున్నట్టు ఉంది

ఇది నా జీవితాలాపన..   ప్రియ దేవాతాన్వేషణ ... ఏమైనదో, ఎట దాగున్నదో, ఎన్నాళ్ళు ఈ వేదన   ఎన్నాళ్ళు ఈ వేదన ?

తనని తానూ ప్రశ్నించుకుంటూ..  మది గాయాలుగా మధు  గేయాలుగా మార్చుకుంటూనే  ఉన్నాను కదా ! ఈ పాటలో లాగానే అనుకున్నాడు.  అంతలోనే పాట ఆగిపోయింది

అతని మనసులో పీఠం వేసుకుని ఉన్న  రాధ కళ్ళలోకి ప్రాకింది.  ఆమె గురించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగా  .. మంద్రంగా మువ్వల చప్పుడు అతని చెవులని తాకింది . ఆ చప్పుడు కాళ్ళకి ధరించే మువ్వల పట్టీల సవ్వడి .. మాధవ్ బాషలో చెప్పాలంటే మంజీర నాదం . కానీ అతనికి వినవచ్చే చప్పుడు నడుస్తున్నప్పుడు వినిపించే శభ్డం తాలూకూ లా అనిపించలేదు ఎవరో.. మువ్వల పట్టీని చేత పట్టుకుని పైకి  ఎగురవేస్తూ  క్రింద చేతులలో అందుకుంటూ ఆ రవళులని ఎంతో ఇష్టంగా వింటున్నట్లు అనిపించింది . అలా చాలా సేపు  వినబడుతూనే ఉన్నాయి
ఆ రవళులు వినపడెంత  వరకు ఉండి తర్వాత వచ్చి మంచంపై పడుకున్నాడు .

"ఏమిటండీ! నిద్ర రావడం లేదా ? చైతూ చదువు గురించేనా ఆలోచిస్తున్నారు? ఎంత ప్రాప్తమో  అంతే దక్కుతుంది . మీరు ఆలోచిస్తే మాత్రం వాడికి బాగా చదువు వస్తుందా, ఏమిటీ ? వచ్చి పడుకోండి .. ఆ కళ్ళ క్రింద చారలు చూడండి మీ ఆలోచనలకి గుర్తుగా ఎలా పెరుగుతున్నాయో.. అంటూ కోప్పడింది సత్య .

ఏమి మాట్లాడకుండా కనులు మూసుకున్న అతనిని చూస్తూ.. " ఎంత అందమైన కనుదోయి .. ఈ కళ్ళే కదూ పెళ్ళి చూపులలో తన కళ్ళతో కలసి తనకి గాలం వేసింది .." అనుకుంది సత్య . అమ్మాయి పుడితే బావుండును .. మీ పోలిక వస్తే భర్త నాట్యం   నేర్పించవచ్చు "  హావభావాలు బాగా పలుకుతాయి " అనేది .  అలాంటి కళ్ళలో ఏదో నిరాశ తారట్లాడుతూ ఉందని ఆమె ఎన్నడూ గుర్తించలేదు. కూడా!

కనులైతే మూసుకున్నాడు కాని మాధవ్ మనసు మెలుకువగా ఉంది .. ఆ మెలుకువలో ఓ.ఇరవయ్యి ఏళ్ల జ్ఞాపకం దాగుంది .

రాధ .అందమైన అమ్మాయి అనేకంటే చాలా చురుకైన అమ్మాయి . నాజూకు తనం కన్నా మెత్తని స్వభావామెలో కనబడేవి.  ఏదో తెలియని ఆకర్షణ... . ఆమె వైపు లాగేస్తూ ఉండేది . పరిచయస్తుల అమ్మాయి . తను సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ అదే వూర్లో ఉంటున్న అన్నయ్య వాళ్ళింట్లో ఉండేవాడు . డ్యూటీ లేనప్పుడు పగలు పడుకుని  నిద్ర పోతూ ఉంటే   తన నిద్రని చెదగోడుతూ వరండాలో కూర్చుని సందడి సందడి చేస్తున్న వారిని మందలించాలని కోపంగా వెళ్ళిన మాధవ్ ఆమెని చూసి టక్కున ఆగిపోయాడు.

ఇదిగో.. మాధవ్ నేను ఎప్పుడూ నీతో చేపుట్టూ ఉంటానే ..,"రాధ" అని .. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అంటూ పరిచయం చేసింది . ఒక సారి ఆమె వైపు చూసి  లోపలికి వచ్చేసాడు . ఆమెకి వదినతో సహవాసం.  ఎప్పుడూ పాటలు పాడుకుంటూ ఉండేది , ఎన్నెన్నో పాటలు పెదవులపైనే ఉండేవి .. ఎప్పుడైనా ఇంటికి వస్తే  మాధవ్ తో మాట్లాడితే ఆ మాటల్లో పాటల ప్రస్తావనే ఎక్కువగా ఉండేది. పాటంటే ఆమెకి అంత ఇష్టం . తనతో ఎప్పుడూ దేబ్బలాడుతూ ఉండేది, అనాలనుకున్న మాట టక్కున అనేసి వెళ్ళిపోయేది . అమ్మో.. ! ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి.  కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా ఇబ్బందే అనుకుంటూ నవ్వుకుంటూ ఉండే వాడు.  వదిన ప్రసవించడానికి వెళ్ళినప్పుడు కూడా  బిడియం లేకుండా ఆమె  తమ ఇంటికి వస్తూనే ఉండేది . అప్పుడప్పుడూ అనిపించేది .. తనని చూసే  ఆ చూపులు, తన కళ్ళతో కళ్ళు కలసి నప్పుడు కనబడే వెలుగులు , తను నవ్వితే కలిగే  సిగ్గుదొంతరలు అన్నీ తన  కోసమే అన్నట్లు ఉండేవి అనుకునే వాడు మాధవ్ .

 ఆరు నెలల తర్వాత వదిన పుట్టింటి నుండి బాబుని ఎత్తుకుని వచ్చింది . బాబుని పెంచడంలో సాయం చేస్తున్నట్లు , బాబుని ముద్దు చేస్తూ రాధ ఎక్కువగా తమ ఇంట్లోనే ఉండేది . రాదని చూస్తుంటే మాధవ్ కి చాలా ఇష్టంగా ఉండేది తన మనసులో మాటని చెప్పాలనుకుంటే  చుట్టుప్రక్కల ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం వల్ల  వీలయ్యేది కాదు  అలా ఆర్నెల్లు గడచిపోయాయి  బాబుకి  ఆర్నెల్లు వచ్చాయి . అన్న ప్రాసన కొండ మీద ఉన్న లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చేయాలనుకున్నారు . అక్కడికి రాధ వస్తుందని మాధవ్ కి తెలుసు .  తన ప్రేమ ప్రకటించడానికి అదే అనువైన సమయనుకున్నాడు .

అతని మనసులో అందమైన దృశ్యం మెదలాడుతూ ఉంది . తమకి  ఏ మాత్రం పరిచయం లేని మనుషుల మధ్య .. ఎదురుగా కృష్ణా నది.. నదిలో నుండి గుడికి వెళ్ళే మెట్లు .. ఆ మెట్లపై నడుస్తూ .. ఎవరూ లేకుండా చూసి రాధ ని తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేయాలని రిహార్సల్స్ వేసుకుంటూ ఉన్నాడు...

అతను అనుకున్నట్లు గానే .. రాధ అక్కడికి వచ్చింది .. ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు . అన్నప్రాసన కార్యక్రమం ముగిసేదాకా ఓపికగా వేచి చూసాడు . అందరూ భోజనాలకి కూర్చోగానే రాధ ప్రక్కకి వెళ్లి .." అలా కాసేపు నది వైపు వెళ్లోద్దాం రాకూడదూ " అన్నాడు . "మొహం చూడు మొహం!  వెళదాం రాకూడదు అని దీర్గం తీయకపోతే వెళదాం అని అడగవచ్చుగా ? అందుకు కూడా దైర్యం లేని మాధవా ! ఏమి మాటలు చెపుతావ్ ఈ రాధతో " అని వెక్కిరించింది .
"నీకు పిలవడానికి భయం కాని నాకు రావడానికి ఏం భయం వస్తాను పద ..." అంటూ చెప్పి .. "అక్కా నది దాకా వెళ్లి వచ్చి భోజనం చేస్తాను. మీరందరూ  భోజనం చేసేయండి అంటూ .. చెప్పేసి వచ్చేసింది ..

 ఇద్దరూ కలసి మెట్లు దిగుతూ నది వైపుకి వచ్చారు . కొన్నాళ క్రితం అక్కడ జరిగిన సినిమా షూటింగ్ గురించి ముచ్చటించుకుంటూ నీళ్ళతో ఆడుకుంటూ కాసేపు కాలం గడిపారు . అక్కడి నుండి చూస్తే  గుడి గోపురం కనబడుతూ ఉంది ..

ఆ దృశ్యం చూపుతూ .. బాగుంది కదూ ! అడిగాడు . తలూపి ఇంకా ఇంకా .. అని అడిగింది రాధ . మాధవ్ మనసు ఆమెకి తెలుసు . "అంతకన్నా  మన ప్రేమ కూడా బావుంటుంది . నువ్వు సంతకం చేస్తే ! అని చెప్పాడు . "అబ్బ.. ఆశ ! .. నీ మొహం  చూడు !  ప్రేమ కాదు ఏమి కాదు . మా ఇంట్లో తెలిస్తే  నన్ను నిన్ను ఇద్దరినీ కాళ్ళు విరక్కోడతారు " అని బెదిరించింది . అది కాదు రాధా అంటూ వివరించి చెప్పబోయాడు" ఏం  కాదు" అని కొట్టి పారేసింది . అతని మోహంలో నిరాశ . ఆమెకది  ఆట.  మాధవ్ కి ఇప్పుడప్పుడే అంగీకారం చెప్పకూడదు . కొన్నాళ్ళు ఉడికించాలి అనుకుంది. ఆ మాటలు లోలోపల దాచేసుకుని ..ఇలా అంది

ఓస్ .. ఈ విషయం  చెప్పదానికేనా ఇక్కడి దాకా రమ్మన్నావ్ ! అక్కడే అడిగితే  చెప్పెసేదానిని కదా ! అనవసరంగా ఇంత  దూరం నడిపించావు. అంటూ గుడి వైపు వెళ్ళడానికి దారి తీసింది .

రాధ వెనుకనే మాధవ్. సగం మెట్లెక్కి వచ్చాక వెనుదిరిగి చూసింది . రాధ వైపే చూస్తూ .. మెట్ల వంక చూసుకోకుండా పడిపోబోతున్న మాధవ్ ని గబా గబా మెట్లు దిగి పట్టుకోబోయింది . మాధవ్ పడకుండా నిలద్రోక్కుకుని ఆమెని చూసి నవ్వేసాడు . "నేను పడిపోతే నీకెందుకు ?" అన్నాడతను . నువ్వు ఎప్పుడో పడ్డావని నాకు తెలుసులే ! చెప్పింది . ఇప్పుడే పెళ్లి చేసేసుకుందామా..  అడిగాడు "వద్దు " అలాంటి వన్నీ ఇప్పుడు ఆలొచించకు. నన్ను  కాస్త  ఆలోచించుకోనివ్వు ప్లీజ్ " అంది.  ఇక్కడ కొంచెం సేపు కూర్చుందామా ? అడిగాడు . ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే  మా నాన్నతో చెపితే ప్రమాదం .. పద అక్కడ కూర్చుందాం అని దూరంగా ఉన్న బండ వైపు చూపించింది .

ఇద్దరూ  ఏమి మాట్లాడుకోకుండానే రక రకాల ఆలోచనలతో నడుస్తూ అక్కడికి చేరుకున్నారు. మాధవ్ మనసులో ఏదో తెలియని గుబులు.  కులం,ఆస్తి ,హోదాలలో ఇద్దరికీ చాలా తారతమ్యం ఉంది . పైగా అప్పటికే రాధ కి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు . ఆ పరిస్థితులలో రాధ ఒప్పుకుంటుందా? ఆని ఆలోచిస్తున్నాడు మాధవ్ .

రాధ  కూడా ఏమి మాట్లాడటం లేదు   గుడి దగ్గర నుండి చాలా దూరంగా వచ్చేసారు అక్కడ నది ఒడ్డున ఉన్న బండ పైకి చేరుకున్నారు ఇద్దరూ .

రాధా ! ఒకసారి నదిలోకి వెళదాం రా.. అన్నాడు  మాధవ్ .. ఎందుకు? ప్రశ్నార్ధకంగా చూసింది . ఆమె చూపులని పట్టించుకోకుండా .. ఆమె చేయి పట్టుకుని నీళ్ళ వద్దకి  తీసుకు వెళ్లి .. ఆమెని ఒడ్డునే ఉన్న ఒక చిన్న బండపై నిలబెట్టాడు .  తానూ ఏం  జేసినా సరే కదలకుండా అలా నిలబడే ఉండమని ఆజ్ఞాపించాడు . రాధ మాధవ్ వంక అనుమానంగా చూసింది . మాధవ్ మాత్రం  నీటి వద్దకి వెళ్లి దోసిలి తో నీళ్ళని తెచ్చి బండపై నిలబడిన ఆమె పాదాల పై   పొసాడు . అయ్యో ! ఇదేంటి మాధవ్ ! నా కాళ్ళు కడుగుతున్నావ్ ! నాకు ఇది ఇష్టం లేదు.   మీరు మగవాళ్ళు  అలా చేయవచ్చా ? అని అడుగుతూ వెనుకకి అడుగులు వేసింది . ఆమెని మాట్లాడవద్దని పెదాలపై చూపుడు వేలుంచి సంజ్ఞ తో వారించి అలా మూడు సార్లు దోసిలితో నీళ్ళు తెచ్చి ఆమె పాదాలని అభిషేకించాడు . " ఆ కృష్ణమ్మ నీళ్ళతో ఈ రాధమ్మ  కి అభిషేకం చేయమని ఈ మాధవ్ కి .ఆ లక్ష్మి నరసింహుడే ఆజ్ఞాపించాడు . నేను కాదు ఈ పని చేసింది అంటూ .. చల్లగా, అల్లరిగా నవ్వాడు .

 ఫాంట్  జేబులో నుండి రుమాలు తీసి రాధ సుకుమారమైన లేత తమలపాకుల ల్లాంటి పాదాలని తుడిచాడు . ఆతను  ఆ పనులు చేస్తున్నంత సేపు ఆమె అభ్యంతరం చెపుతూనే ఉంది . ఆ తర్వాత్ మాధవ్ షర్ట్ పాకెట్ లో నుండి ఒక పొట్లం తీసి గులాబీ రంగు కాగితం విప్పాడు. అందులోనుండి ఒక వస్తువుని తీసి రాధ కళ్ళ ముందు ఊపాడు . సన్నగా మృదువుగా మ్రోగుతున్న కాలి గజ్జెల వైపు ఆశ్చర్యంగా చూసింది . " ఇవి ముత్యాల ముగ్గు పట్టీలు అంట. షాపతను చెప్పాడు . ఈ పట్టీలు నీ కోసం తెచ్చాను కాదనకూడదు రాధా .. ప్లీజ్ "  మాధవ్ అభ్యర్ధన కి ఆమె కరిగిపోయింది . చిన్నగా నవ్వింది .

మాధవ్  రాధ ప్రక్కనే కూర్చుని ఆమె  పాదాలని ఒడిలోకి తీసుకుని ఇంత  అందమైన పాదాలకి గజ్జెలు లేక ఎంత బోసిగా ఉంటాయో తెలుసా!  చురుకుగా కదిలే నీ పాదాలు చూసినప్పుడల్లా  నాకు  లోలోపల ఏదో తెలియని అలజడి . అది మనసు పొరలలో నుండి తెరలు తెరలుగా ..ఈ నది అలలుగా వినబడుతూ ఉంటుంది .. ఇప్పుడు ఈ మువ్వల సవ్వడితో నువ్వు నడుస్తూ ఉంటే  మంద్రంగా ప్రవహించే ఈ కృష్ణమ్మ పరవళ్ళు త్రోక్కుతున్నట్లు ఉంటుంది నా  ప్రేమకి గుర్తుగా  ఎప్పుడూ నువ్వు వీటిని ధరించే ఉండాలి ! సరేనా ? చెప్పాడు .

రాధ ఏమి  మాట్లాడలేదు అమ్మ ఎప్పుడు కాళ్ళకి పట్టెలు పెట్టుకోమన్నా ఇష్టం లేదని తిరస్కరించేది . ఇప్పుడు కొత్తగా ఈ పట్టీలు పెట్టుకుంటే అమ్మకి అనుమానం రాదూ ! తన ఫ్రెండ్  వద్దన్నా వినకుండా బలవంతంగా పెట్టిందని అబద్దం చెప్పాలి కాబోలని  ఆలోచిస్తూ ఉంది .

రాధ చేయి పట్టుకుని లేవదీసి ఇక వెళ్ళిపోదాం పద . మన గురించి గుడిలో వాళ్ళందరూ ఎదురు చూస్తారు అని చెప్పాడు .

రాధ  కట్టుకున్న పట్టు పరికిణీ కొంచెం పైకి పట్టుకుని గుడి మెట్లు ఎక్కుతూ తన కాళ్ళకి మాధవ్  పెట్టిన పట్టీల నుండి వినబడు తున్న శబ్దానికి వింతగా చూసుకుంటూ ఉంటే  

మాధవ్ మనసు నిండా వింత అనుభూతులు ..  ప్రియురాలి  అందెల  సడిలో హృదయ లయలు ఉంటాయన్నట్టు .. అతనికి ఎంతో  ఇష్టమైన పాట లోలా

"మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు..
 కన్నులు పలికే కలికితనంలో.. చూపున సంద్యా ..రాగాలు
అంగ అంగమున అందచందములు ..
వంపు వంపున హంపి శిల్పములు..
ఎదుటే.. నిలిచిన చాలు.. ఆరారు కాలాలు.". 

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం .. అనుకుంటూ ఉన్నాడు . 

ఇది జరిగిన వారం  రోజుల లోపలే .రాధకి  పెళ్లి నిశ్చయం అయిపొయింది . ఇంట్లో వారికి ఎదురు సమాధానం చెప్పే దైర్యం, మాధవ్ గురించి చెప్పి  ఇంట్లో వాళ్ళని ఒప్పించే విధం తెలియక .. పెదవి విప్పకుండానే, పదం పాడ కుండానే పధం కదపకుండానే, మాధవ్ కి  మళ్ళీ కనబడకుండానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది రాధ

మాధవ్ మనసులో ఎంతో  వేదన ఎవరికీ చెప్పని వేదన . అతని వదిన అన్నీ గ్రహించి రెండు మూడు సార్లు అడిగింది మాధవ్ ఏమిటి అలా ఉంటున్నావ్ !అని . 

ఏం  లేదు ..బాగానే  ఉన్నానే! అని అతని సమాధానం 

 రాధ పెళ్ళయ్యాక భర్త తో కలసి మాధవ్ ఇంటికి వచ్చింది . అతి మాములుగా వారిని పలకరిస్తూనే ఆమె పాదాల వైపు చూసాడు . అక్కడ తను ఆమెకి కానుకగా ఇచ్చిన మువ్వల పట్టీలు  ఉండాల్సిన చోటున పాదాలు  బోసిగా దర్శనం ఇచ్చాయి . 

అతని మనసు అంతులేని వేదనకి గురైంది . ఇంకెప్పుడూ ఎవరిని ప్రేమించకూడదు . ఇదే మొదటి ప్రేమ ఆఖరి ప్రేమ అనుకున్నాడు. అనుకున్నంత తేలికగా "రాద"  మర్చిపోలేక అక్కడి నుండి ట్రాన్సఫర్  చేయించుకుని వెళ్ళిపోయాడు .  కానీ ఎప్పుడూ   ఎవరైనా  కాళ్ళకి పెట్టుకున్న పట్టేల నుండి మువ్వల శబ్దం విన్నప్పుడుల్లా  గంభీరంగా మారిపోయేవాడు ఈ  చిరు మువ్వల సందడితో  నా మదిలోకి నడచి రావాల్సిన రాధ వేరొకరి జీవితంలోకి వెళ్ళి పోయి తన మనసుని శూన్యం చేసింది ...నేను నా ప్రియ దేవతని ఎక్కడని అన్వేషించను వేరొకరి జీవితంలోకి ఒదిగిపోయిన రాధ ని   అలజడికి గురి చేసి నా ప్రేమని వ్యక్తపరచడం కన్నా  ఈ వేదన భరించడమే  సరియింది . నా ప్రేమని నేనాలపించడమే మంచిది .అది  నా జీవితాలాపన గా తిష్ట  వేసుకున్నా సరే! అనుకుంటూ .. అలరించే సినిమా పాటలలోని భావానికి తన జీవిత సత్యాలని జతచేర్చుకుని వేదనలో మునిగిపోతూ ఉన్నాడు . ఆ వేదన ఎంత తీయనో . కాని అనుభవిస్తే  తెలియదు అనుకుంటాడు .ఇలా జ్ఞాపాకాలను గుర్తు చేసుకుంటూ .. 

తానూ ఇష్టపడే  ఈ పాటంటే  రాధ కి మాత్రమే  తెలుసు ... అంటే ఈ పాట  వింటున్నది .రాధ కాదు కదా ! అని అనుమాన పడ్డాడు . 

రేపుదయం లేవగానే ఆ ప్లాట్  లోకి ఎవరొచ్చారో గమనించాలి అనుకున్నాడు . 

తెల్లవారింది . ప్లాట్లలో ఉన్న ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు ,, అందరిని గమనిస్తూ ఉన్నాడు . ఎవరూ రాధలా ఉన్న వ్యక్తీ అతనికి కనబడలేదు , నిరాశ ముంచుకొచ్చింది .నీరసంగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు . సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ  ప్రక్కనే వెలిసిన భవన సముదాయం వైపు చూస్తూనే ఉన్నాడు . రాధ లాగానే ఉన్న అమ్మాయిని వెనుక కూర్చోబెట్టుకుని టూ  వీలరు పై ఇరవై  ఏళ్ళనాడు ఉన్న చురుకుదనంతోనే రోడ్డుపై దూసుకు వెళుతున్న "రాధ" ని చూసాడు . మాధవ్ కి చాలా సంతోషం, ఇంకాసేపటికే రెండు సంచీలతో నిండుగా  సామాను తీసుకుని లోపలి వెళుతున్న రాదని చూసాడు . తను నడుపుతున్న బండిని కంట్రోల్ చేస్తూ ఒక కాలు క్రిందకి పెట్టినప్పుడు ఊపిరి తీసుకోవడం  కూడా మర్చిపోయి ఆమె కాలి వైపే చూసాడు . అప్పుడూ ..బొసిగానే  కనపడింది ఆమె పాదం . 

 "ఈ ఆడవాళ్ళు రాతి బండలు మగవారి హృదయాలతో ఆడుకుంటారు క్షణంలో ప్రేమించిన వారిని మర్చిపోయి ఇంకకరితో జీవితం గడిపేస్తారు ." అంటూ ఉండే ఫ్రెండ్ శేఖర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ . నిజమేనేమో! అనుకుంటూ లోపలి నడిచాడు. మనిషి జీవితంలో అనేకానేక సమస్యలు ఎలాగో ఉంటూనే ఉంటాయి . చాలా విషయాలకి బండబారిపోతూనే ఉంటాము . జీవితంలో చిన్న చిన్న అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలు తో కాస్త ఆనందంగా ఉండటంలో తప్పేమీ ఉంటుందో! "రాధ" కనీసం అలా కూడా నన్ను గుర్తు పెట్టుకోలేదేమో! నేను చాలా దురదృష్ట వంతుడిని.. అనుకున్నాడు మాధవ్ .  

 చాలా సేపు రాధ గురించి ఆలోచిస్తూ .. ఎవరికైనా  మదిలో దాగిన రహస్యాలు అనేకం ఉంటాయి. అవన్నీ జీవిత భాగ స్వామ్యికి తెలిస్తే వారికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అవన్నీ తెలియడం అనవసరమనిపించింది కాబట్టే  సత్యకి ఎప్పుడూ రాధ గురించి చెప్పనే లేదు. లేకుంటే ఆమె ముందు  మరొక రకంగా సానుభూతి పొందాల్సి వచ్చేదేమో . అని కూడా అనుకున్నాడు

ఆ రోజు రాత్రి పొద్దు పోయాక పై ప్లాట్ లో నుండి అదే పాట .. వినబడుతూ ఉంది . చాలా అసహనంగా ఫీలయ్యాడు మాధవ్ . అశాంతి తో కదలసాగాడు . 

మరుసటి రోజు ఆఫీసుకి వెళ్ళబోతూ .. కేర్ టేకర్  భార్య  పార్కింగ్ ప్లేస్ లో నుండి బండి తీస్తున్న రాదని పలకరిస్తూ .. "అమ్మగారు .. మీరు  కాళ్ళ గొలుసు వేసుకోలేదు ఎందుకని?  అలా వేసుకోకుండా ఉండకూడదమ్మా !  అందమైన కాళ్ళకి గొలుసులు వేసుకోవాలి . వేసుకోకపోతే మగవాళ్ళ కాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళకి  తేడా లేదంటారు అని అనడం వినబడింది . ఆ మాటలకి రాధ నవ్వేసింది 

"మమ్మీకి కాళ్ళ పట్టీలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఒకే ఒకసారి ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే పెట్టుకుందట . అదే రోజు .. ఒక కాలి పట్టీ జారిపోయిందట . ఇక అంతే ! అమ్మేప్పుడూ .. మువ్వలు పెట్టుకొనే లేదు .. మా డాడీ కూడా నువ్వన్నట్టే అంటారు కాని అమ్మ వినదు. పైగా అప్పుడు తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ని  సెంటిమెంటల్ పూల్ లా ఇప్పటికి భద్రంగా దాచుకుంది ..  ప్రాణంలా చూసుకుంటుంది " అని చెప్పింది నవ్వుతూ ..రాధ కూతురు. 

ఆ మాటలు వింటున్న మాధవ్ కి ..  చాలా సంతోషం. తనని ఇప్పుడు చూస్తే రాధ ఎలా ఫీల్ అవుతుందో! అసలు తన ఇల్లు ఇక్కడే అని ఆమెకి తెలుసా? వాళ్ళు   ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయ్యిందో! కేర్ టేకర్  భార్య మాటలు చూస్తుంటే వాళ్ళు ఈ ప్లాట్ లో ఉండటం మొదలెట్టి చాన్నాళ్ళు అవుతున్నట్లుగా ఉన్నాయనుకున్నాడు . 

అంతరంగం ఒక మాట చెప్పింది  "ఒరేయ్ బుద్దూ ! పట్టీలు బహుమతిగా ఇచ్చిన అబ్బాయిని ఏ అమ్మాయి అయినా  జీవితంలో మర్చిపోతుందా !? . (అరె బుద్దూ !  పాయల్ దియా ఉస్  లడకే కో  జిందగీ మే ఓ  కభి 
బూల్ నహీ సక్తి  )  మాధవ్ పెదవులపై పై .. దరహాసం తళుక్కుమంది. 

అతని హృదయం కనబడని మంజీరనాదాన్ని శ్రావ్యంగా వింటుంది .. 

ఆ రోజు రాత్రి పొద్దుపోయాక  అతనికిష్టమైన పాట  వినబడుతూనే ఉంది .. 

"మంజీరమైనాను నీ పాటలో..
మందారమైనాను..నీ తోటలో...

వేదనలోనే ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు మాధవ్(తొల వలపులు ఎవరికైనా మధురాతి మధురమే కదా !  ఆ కోణంలో రెండు పాటల చుట్టూ అల్లిన కథ )
ఈ కథలో ఉదహరించిన రెండు పాటలు లింక్ లు ఇవిగోండి ..
ఇది నా జీవితాలాపన
నీ చరణం కమలం మృదులం

15 వ్యాఖ్యలు:

Dantuluri Kishore Varma చెప్పారు...

చాలా బాగుంది!

Ramani Rachapudi చెప్పారు...

simply superb

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా బాగుందండి వనజ గారు.

Niru చెప్పారు...

"మీ పోలిక వస్తే భర్త నాట్యం నేర్పించవచ్చు " హావభావాలు బాగా పలుకుతాయి " ---భర్త నాట్యం !!!!! అర్దం కావటానికి రెండు నిముషాలు పట్టింది..

"ఈ ఆడవాళ్ళు రాతి బండలు మగవారి హృదయాలతో ఆడుకుంటారు క్షణంలో ప్రేమించిన వారిని మర్చిపోయి ఇంకకరితో జీవితం గడిపేస్తారు ." అంటూ ఉండే ఫ్రెండ్ శేఖర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ . నిజమేనేమో! అనుకుంటూ లోపలి నడిచాడు"---మాధవ్ రాధ వల్ల పెళ్ళి చేసుకోకుండా,పిల్లలని కనకుండ లేడుకదండి,,అలా అనుకోటానికి....తప్పులెన్నాలని కాదుగాని, ఆ line చదివాక అలా అనిపించింది...మిగత కధ నడిపిన విధానం బాగుంది.....

అనూ చెప్పారు...

Very nice....remembered few lost memories...

nagarani yerra చెప్పారు...

బావుందండీ కథ చాలా సున్నితంగా .

Sharma చెప్పారు...

తొలి అన్నది ఎంత మధురమో ( అందుబాటులో వున్నా , ఎడబాటులో వున్నా ) . బరత నాట్యం చాలా బాగుంటుంది , భర్త నాట్యం ఒక రకం గా బాధాకరమైనదే ( నాట్యాచార్యులు కాకుంటే ) .

మీ రెండు పాటల కధ అల్లిక చదవగానే నాకూ రెండు పాటలు గుర్తుకొచ్చాయి . 1 . అనుకున్నదొకటి అయిందొకటి , బోల్తా కొట్టిందిలో బుల్ బుల్ పిట్ట " . 2 . అనుకున్నామని జరగవు అన్నీ , అనొకోలేదని ఆగవు కొన్ని " .

సాహితి చెప్పారు...

వినాయక చవితి శుభాకాంక్షలు
http://brundavanam.org/publications.html

Vanaja Tatineni చెప్పారు...

Dantuluri kishore Varma గారు ధన్యవాదములు

Ramani Rachapudi గారు ..థాంక్ యూ సో మచ్ అండీ ! బావున్నారా?

Vanaja Tatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. థాంక్ యూ ! నల్ల పూసి పోయారు ? మీ కోసం కాఫీ రెడీగా ఉంది ..:)

Vanaja Tatineni చెప్పారు...

Niru గారు థాంక్ యూ ! మీరు చెప్పిన భాగం మాధవ్ భార్య అన్న మాటలు .. మళ్ళీ ఒకసారి చూడరా..please!!

Vanaja Tatineni చెప్పారు...

అనూ గారు.. థాంక్ you సో మచ్. మీరన్నట్లే కొంతమంది చెప్పారు :)

Vanaja Tatineni చెప్పారు...

నాగ రాణి గారు థాంక్ యూ !సున్నితంగా ఉందని చెప్పినందుకు సంతోషం.

Vanaja Tatineni చెప్పారు...

Sharma గారు ధన్యవాదములు. మీ తరంకి చెందిన ఆ పాటలు గుర్తుకొచ్చాయి.. అంతే! :)

Vanaja Tatineni చెప్పారు...

సాహితి గారు ధన్యవాదములు.