10, సెప్టెంబర్ 2013, మంగళవారం

నకిలీ

ఈ మధ్య సోషల్ నెట్వర్క్స్ లో  మనుషులని విభజించే వారు ఎక్కువ అయ్యారు .  వాళ్ళ సమూహాల్లోకి వేరొకరిని రానివ్వకుండా అంటరానితనం తో వెలివేసుకుని తాము మాత్రమే  గొప్ప అనుకుని డబ్బాలు కొట్టుకోవడం, వాళ్ళని వాళ్ళే పోగుడుకోవడం, పొగడడానికి నలుగురిని ప్రత్యేకంగా నియమించుకోవడం చూసాను .

కులం , మతం , జాతి, వర్ణం .. ఇవే కావాలి వీళ్ళకు. ఆ దృష్టితోనే   విమర్శ పేరుతొ చీల్చి చెండాడుతారు. అజ్నాతలగా ఉండి తామే  విజ్ఞాన సర్వస్వం  అన్నట్టు .. అజ్ఞాత కామెంట్లు, ఫేక్ ఐ డి లు .. ఛీ చీ...

మనుషులుగా పుట్టినందుకు ,కాస్త అక్షరం ముక్కలు నేర్చుకున్నందుకైనా  హుందాగా మెలిగితే బావుండును.

జీవన నేపధ్యాల పట్ల ఆసక్తి తగ్గించుకుని .. చుటూ పేక్ ల వల వేయకుండా ప్రతి విషయం  పట్ల  "అసలు  - నకలీ" అనుమానాలకి తావివ్వకుండా  ఉంటే  బావుంటుంది  అనుకుంటున్నాను .



మూలాలని కాదు  వెతకాల్సింది .. వ్యక్తిత్వ నిర్మాణాలని చూడండి ...

                                                                                     -  ఫీలింగ్స్  విత్ ..పైట్  ఫర్  రైట్





23 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...


ఏమండీ మేమేమో ఇక్కడ "అమ్మా! తల్లీ!! మీరు రాయగలరు రాయండీ, మేం చదువుతాం, కామెంటు తాం" అని బతిమాలుతుంటే, మీరేమో ఫేస్ బుక్కులని వెళితే ఎలా? అవన్నీ ఫేక్ బుక్కులండి బాబు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ ! ఎంత మాట :) :) వచ్చేస్తున్నాను.

ధన్యవాదములు

జయ చెప్పారు...

నేను కూడా బాబాయ్ గారి మాటనే సమర్ధిస్తున్నాను వనజ గారు.

SRINIVASA RAO చెప్పారు...

ఎన్ని చురకలు పెట్టినా వీరు మానరు.ఇది ఒక మానసిక జబ్బు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.. ఇప్పుడు మీ మాటే నా మాట కూడానూ ! అన్నట్టు.. మీరు FB లో కనబడలేదేమిటబబ్బా! నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి.. :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు ..చురకలదేమి ఉంది లెండి ! గునపాలు గుచ్చినా అంతే!

థాంక్ యూ సో మచ్ !

Jai Gottimukkala చెప్పారు...

వనజ గారూ, లెస్స పలికారు. బ్లాగులలో కామెంట్ మోడరేషన్ పెడితే ఈ బెడద కొంత తగ్గుతుంది. మీలాంటి పాపులర్ బ్లాగర్లకు ప్రతీ వ్యాఖ్యను చదివి అనుమతించడం కష్టం అయినా, ప్రయత్నించి చూడండి.

Jai Gottimukkala చెప్పారు...

I just noticed you have enabled moderation. This is the best way to reduce junk.

పల్లా కొండల రావు చెప్పారు...

ఇలాంటి మకిల మనసులు, కుల పిచ్చ గాళ్లు సమాజం లో ఉన్నదానికి ప్రతిబింబంగానే సోషల్ నెట్వర్కులలోనూ ఉంటారు.

మొదట నా వ్రాతలను అభిమానిస్తూ కామెంటే ఓ కులదురభిమాని నేను ఫలానా కులం కాబట్టి అని తెలుసుకుని దూరంగా ఉంటున్నాడు.

కమ్యూనిస్టులమని ప్రగల్భాలు పలికే కొందరు ప్రబుద్ధుల బుద్ధులు కూడా కులం ఆధారంగా కామెంటిన సందర్భాలున్నాయి. ఇంటిపేరునిబట్టి కులం ప్రకటించిన వెకిలి చేష్టలూ వింత పోకడలూ ఉన్నాయి. ఒకే ఇంటి పేరుతో మా ఊరులోనే రెండు కులాలవాళ్లున్నారు. సమాజం లో మార్పు ద్వారానే ఈ పిచివాళ్లలో మార్పు వస్తుంది. అందాకా భరించాల్సిందే.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jai Gottimukkala మీరు గమనించారు కదా ! నేను మొదటినుండి కామెంట్ మోడరేషన్ పెట్టె ఉంచాను .
open id ఆప్షన్ కూడా ఉంది . నాకు ఒకోసారి తెగ చిరాకు పుడుతూ ఉంటుంది .. అజ్ఞాత లు నాకు కామెంట్ పెట్టడానికి అప్పటికప్పుడు ID క్రియేట్ చేసుకుని వస్తారు. ఈ మధ్య నాకు విషెస్ చెప్పడానికి కూడా XYZ పేరుతొ ID క్రియేట్ చేసుకుని వచ్చారు . అది చూసి గూగుల్ తో తల బద్దలు కొట్టుకోవడం ఎలాగబ్బా.. అని ఆలోచించాను. :)

థాంక్ యూ ! జై ! పాపులర్ బ్లాగ్ !? మెడ మీద కట్టి పెట్టినట్టు ఉంది రాస్తావా..చస్తావా.అని :)

జయ చెప్పారు...

నా మొహానికి ఫేస్ బుక్ లేదండి:)

ranivani చెప్పారు...

కష్టేఫలే మాష్టారు,జయగారు చెప్పినదానికే నేనూ డిటో డిటో.

అజ్ఞాత చెప్పారు...

"జయ గారు.. ఇప్పుడు మీ మాటే నా మాట కూడానూ ! అన్నట్టు.. మీరు FB లో కనబడలేదేమిటబబ్బా! నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి.. :)"

మేమెంత చెప్పినా మీరు వినరండి, మళ్ళీ అక్కడికే వెళిపోతారు, నాకు తెల్సు :)


శశి కళ చెప్పారు...

hm.... anthe

Sharma చెప్పారు...

ఫేస్ బుక్ లో బుక్కయ్యామంటే అంతే మరి . ఇప్పటికెన్నో మార్లు , ఎంతో మంది అది ఫేస్ బుక్ కాదు , ఫేక్ బుక్ అని నొక్కి, తిట్టి మరీ చెప్తున్నా , మళ్ళీ అటువంటి దానితో ఎక్కువ టచ్ మంచిది కాదేమో మరి . కొంచెం ఆలోచించండి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొండలరావు గారు .. ఇక్కడ ఇలా ఎన్ని సార్లు మనమందరం చెప్పుకున్నా.. మారదు లోకం .. మారదు స్వార్ధం .. అని పాడుకోవాల్సిందే! నిజమండీ, మీరు చెప్పినట్లే నా విషయంలోనూ జరిగింది. మా సామాజిక వర్గం ఏమిటో తెలిసాక నన్ను కొందరు దూరంగా నెట్టేశారు నిజం. మా సామాజిక వర్గం వాళ్ళు నన్ను తిడుతున్నారు .. అందరికి అని కావాలి నీకే ఏమి పట్టింపులు లేవని ఉదారవాదం చూపుతున్నావ్!మాలోను ఉండవద్దు పో.. అంటున్నారు :(
ఏమిటో.. నాకేమి అర్ధం కాదు మరి .

మీ వ్యాఖ్యకి ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.. అలాగా? అక్కడ మీరుంటే మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలండి . ఎలాగబ్బా!? :(

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగరాణి గారు .. నాకు మీపై కోపం వచ్చింది. నేను ఇక అక్కడ కనబడను పొండి. అలిగాను అంతే!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాస్టారూ .. వచ్చేసేనండీ! మా వనజ గారు దుడ్డు కర్ర తీసుకుని బాదినట్లు ఉన్నా బానే ఉంటుందని మీ కితాబులు అందుకోవద్దూ..చెప్పండి ! :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు పేస్ బుక్ లో బుక్ అవలేదండీ ! మార్పు కోసం అప్పుడప్పుడు అలా వెళ్లి వచ్చి .. ఎప్పుడు లాగానే అక్కడ ఉండేటప్పటికి .. మళ్ళీ ఇటు వచ్చేస్తాను అంతే! థాంక్ యూ సో మచ్ అండీ !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

మీరు నాలుగే చెప్పేరు . వర్గమని ఇంకోటి కూడా ఉంది . అది మరీ బురద . పొరపాటున (పండిత వర్గ మనే) అడుసు తొక్కి లెంపలేసుకొని కాళ్ళు కడుక్కో వలసి వచ్చింది నాకు . కులం , మతం, జాతి, వర్ణం, వర్గం - ఇవన్నీ అహంకారపు మూలాలు .

అజ్ఞాత చెప్పారు...

వస్తా వట్టిదే.. పోతా వట్టిదే .. ఆశ ఎందుకంటా ..
చేసిన ధర్మమూ.. చెడని పదార్ధము .. చేరును నీ వెంటా...

చేతిలో అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంటా..
ఆకాశంపై పోయేటప్పుడు .. ఎవరు రారు వెంటా..

ranivani చెప్పారు...

సారీ వనజగారు,fbలోgood morning,goodnightఅని పొడి పొడి మాటల కన్నా ,మీరెంతో కష్టపడి ,ఆలోచించి ,వ్రాసే మీ బ్లాగు చదవడమే బాగుంటుంది నాకు . మీఇంటికొచ్చి మీ గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడి మీ అలక తీర్చేస్తా లెండి .