11, జులై 2024, గురువారం

బతుకు గంప

 ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళ పరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి... పద్మ... హరిత... ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులూ లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్లు వూహించుకున్నవి వాళ్ల సొంతం కాలేదని వాళ్ల జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడూ సుఖమన్న మాట, ఆనందమన్న

మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో వున్నట్లు కనిపించింది.. అంటుంది కథకురాలు. 

మూలింటి చంద్రకళ రచన “బతుకు గంప” కథ వినండీ.. ఈ కథ ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల  విద్యార్ధులకు 10 తరగతి తెలుగువాచకం లో 2 వ పాఠం గా వుంది.. కథ వినండీ. కథ నేను పాఠ్య పుస్తకం నుండే సేకరించాను. ఈ కథ వినిపించడం పట్ల అభ్యంతరం వుంటే.. వీడియో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. కామెంట్‌లు లేవు: